స్వప్నలిపి
అప్పుడప్పుడూ కలలో కొందరు అపరిచితులు కనిపిస్తారు. వారిని ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండరు. కానీ కల నుంచి బయటికి వచ్చిన తరువాత కూడా వారి ముఖాలు గుర్తుండిపోతాయి. ఇంతకీ ఎవరీ అపరిచితులు?
మనలోని భయాలు, విభిన్న భావోద్వేగాలే మానవరూపాలై కలలో కనిపిస్తాయి. కొన్నిసార్లు ఒక వ్యక్తి మనకు కలలో కనిపిస్తాడు. అతడు అదేపనిగా మీపై కేకలు వేస్తూనే ఉంటాడు... ఈ కల మర్మం ఏమిటంటే, ఒక విలువైన అవకాశం మీకు వచ్చినట్లే వచ్చి కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల దాన్ని వదులుకోవాల్సి రావడం.
కొన్నిసార్లు పై నుంచి కింది వరకు నల్లటి దుస్తులు వేసుకొని, చింతనిప్పుల్లా కనిపించే కళ్లతో ఒక వ్యక్తి కనిపిస్తాడు. మీ వైపు కోపంగా చూస్తుంటాడు. ‘నా మీద ఫలానా వాళ్లు ఫిర్యాదు చేస్తారేమో’ ‘నా మీద దాడి జరుగుతుందేమో’ అనేటటువంటి భయాలు మనసులో గూడు కట్టుకున్నప్పుడు ఎవరో భయపెడుతున్నట్లుగా ఈ కలలు వస్తాయి. కలలో కనిపించే అపరిచితుల గురించి స్థూలంగా చెప్పాలంటే, మన అంతః చేతనలోని రహస్య భావోద్వేగాలు, సకారణ, అకారణ భయాలు... సందర్భాన్ని బట్టి కలల్లో నిర్దిష్టమైన రూపాన్ని ధరిస్తాయి.
అపరిచితుల అడ్రస్ ఇదిగో!
Published Wed, Apr 15 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM
Advertisement
Advertisement