రాజమౌళి ‘ఈగ’కు ఎన్ని శక్తులు ఉన్నాయో, అన్ని శక్తులూ ఉన్నాయి ఫొటోలోని ఈ చీమకు. కందిరీగ జాతికి చెందిన దీని పేరు ‘ట్రామాటోముటిల్లా బైఫర్కా’. మృదువైన వెంట్రుకల కారణంగా దీనిని బ్రెజిలియన్ వెల్వెట్ చీమ అని కూడా అంటారు. లక్షన్నర జాతుల చీమలు, కందిరీగలు, ఈగలు, తేనెటీగల కంటే కారునలుపులో ఉంటుందిది.
ఇది ప్రపంచంలోనే అత్యంత కారునలుపు చీమ, అత్యంత తీవ్రమైన నొప్పి పుట్టించే చీమ కూడా ఇదే! ఈ మధ్యనే దీని బాహ్య నిర్మాణాన్ని నిశితంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు మరిన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. ‘బీల్‌స్టెయిన్ జర్నల్ ఆఫ్ నానోటెక్నాలజీ’ అధ్యయనం ప్రకారం ఈ చీమకు మెలనిన్‌తోపాటు, సూపర్ డార్క్ కలరింగ్ ప్లేట్‌లెట్లు ఎక్కువ.
వీటి కారణంగానే దాని శరీరం ఉపరితలంపై పడిన కాంతితో 0.5 శాతం కంటే తక్కువ పరావర్తనం చెందుతుంది. ఈ చీమకు అతినీలలోహిత కాంతిని కూడా గ్రహించే శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
(చదవండి: బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వంటగది ఇంటీరియర్ డిజైన్..!)
Comments
Please login to add a commentAdd a comment