ultra
-
12 రోజులు.. 5000 కిలోమీటర్లు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ సైక్లింగ్ పోటీల్లో అత్యంత కఠినమైన రేస్ ఎక్రాస్ అమెరికా (వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ) సైక్లింగ్ ఈవెంట్. దీనికి అర్హత సాధించానని హైదరాబాద్ బండ్లగూడకు చెందిన రవీందర్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 10 నుంచి సైక్లింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయన్నారు. భారత్ నుంచి తొలిసారి ఈ పోటీల్లో పాల్గొంటున్న తొలి వ్యక్తి తానేనని, 12 రోజులు, 12 నగరాల మీదుగా 5 వేల కిలో మీటర్ల నిరంతరాయంగా సైక్లింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.ఈస్ట్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రారంభమై న్యూజెర్సీలో ముగుస్తుందన్నారు. ప్రపంచంలో 60 ఏళ్ల పైబడిన వారు ఇద్దరు, 50 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసులో 5 గరు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి ప్లస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో ఈ సైక్లింగ్ ఉంటుందన్నారు. పేద పిల్లలకు ఫండ్ రైజింగ్‌లో భాగంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారని, గతంలో 29 మంది సైక్లిస్టులు రూ.100 కోట్ల ఫండ్ రైజ్ చేశారని గుర్తుచేశారు.గతంలో రేస్ ఎక్రాస్ ఇండియా, రేస్ ఎక్రాస్ ఆసియా పోటీల్లో విజేతగా నిలిచానని తెలిపారు. రేస్ ఎక్రాస్ అమెరికా ఈట్లోనూ 50 ఏళ్ల కేటగిరిలో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ముందస్తు ట్రయల్స్‌లో భాగంగా ప్రస్తుతం అమెరికాలో సైక్లింగ్ చేయనున్న రూట్లో ట్రయల్ వేస్తున్నారు.ఇవి చదవండి: Singer Smita: ఓల్డ్ స్కూల్ బృందావనం! నగరంలో కొత్త కాన్సెప్ట్.. -
అల్ట్రా స్టైలిష్ లుక్స్‌లో దసరా బ్యూటీ (ఫొటోలు)
-
ఈ ఫుడ్స్ తింటే అంతే..షాకింగ్ స్టడీ! టాక్స్ విధించండి బాబోయ్!
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ప్రమాదకరమన్న తాజా సంచలన నివేదికల నేపథ్యంలో అటువంటి ఆహారాలపై పన్ను విధించాలంటూ మహారాష్ట్రలోని స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, మనస్తత్వ వేత్తలతోకూడిన సంఘాలు కేంద్ర వినియోగ దారుల వ్యవహారాల మంత్రి, ఆహార మంత్రికి విన్నవించాయి. అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు , కొవ్వుతో కూడిన అధిక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై పన్ను విధించాలని కోరుతూ ఎర్లీ చైల్డ్‌హుడ్ అసోసియేషన్ (ECA) , అసోసియేషన్ ఫర్ ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (APER), కేంద్రమంత్రికి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశాయి. తద్వారా పాఠశాలల్లో చాక్లెట్లు, కేకులు, కుకీలు , పుట్టినరోజులు మరియు ఈవెంట్ల వంటి ఇతర వస్తువుల వినియోగం, పంపణీ ఆగిపోతుందని నమ్ముతున్నారు. ఈ పదార్థాల స్థానంలో తాజాపండ్లను చేర్చుకోవాలని కూడా ప్రజల్ని, పాఠశాలల్ని కోరారు. వీరి డిమాండ్లు ♦ అన్ని ఫుడ్ చెయిన్స్, రెస్టారెంట్లు మెనూలు, ప్యాకేజింగ్ , ప్రతీ బాక్సుపైనా ఉప్పు-చక్కెర-కొవ్వు శాతం వివరాలను తప్పనిసరిగా ప్రింట్ చేయాలి. ఉప్పు-చక్కెర-కొవ్వుతో సహా వీటి స్థాయి ఎక్కువుంటే ఎరుపు రంగు, మధ్యస్థానికి గుర్తుగా కాషాయం, తక్కువగా ఉంటే ఆకుపచ్చ రంగుల లేబులింగ్ ఉండాలి. ♦ బ్రాండ్ పేరు లేదా రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌తో రెస్టారెంట్లు విక్రయించే బర్గర్లు, పిజ్జాలు, టాకోలు, డోనట్స్, శాండ్విచ్లు, పాస్తా, బ్రెడ్ ఫిల్లింగ్‌లపై పరోక్ష కొవ్వు కంటెంట్ పన్ను 14.5 శాతం విధించాలి. ♦ చక్కెరపై ఆరోగ్య పన్నును ప్రవేశపెట్టాలి. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వినియోగం చాలా ప్రమాదకరమని, ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని సైంటిస్టులు ఇటీవల హెచ్చరించారు. వీటితో ప్రాణాలకే ప్రమాదం వస్తుందని ఇటీవల అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏకంగా 32 రకాల ప్రమాదకర వ్యాధులు వస్తాయని కూడా వెల్లడించారు. ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కోటి మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యాయంలో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలతో వస్తున్న ముప్పుపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటీష్ జర్నల్ ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో మానసిక, శ్వాసకోశ , హృదయ, జీర్ణకోశ సమస్యలు వస్తాయని, మొత్తం 32 ప్రమాదకర వ్యాధులు వస్తాయి. మరణాలు సంభవించిన కేసులు కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం ఉందని వారు నొక్కి చెప్పారు. అంతేకాదు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌తో 50 శాతం పెరుగుతుందని కూడా హెచ్చరించారు. డిప్రెషన్ 22 శాతం అధికంగా పెరిగే అవకాశం ఉందట. అల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌లో విటమిన్లు, పీచు తక్కువ, ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి, అందుకే కేన్సర్, గుండె వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, మానసిక అనారోగ్యం తోపాటు, మెటబాలిజంకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని ఈ స్టడీ పేర్కొంది. -
అందుకే కొనను: అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్ గుట్టు విప్పిన బిలియనీర్
అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్ గుట్టు విప్పారు ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోదా (Zerodha) సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath). భారతదేశ యంగెస్ట్ బిలియనీర్ అయిన ఆయన.. తన పాడ్‌కాస్ట్ 'WTF ఈజ్ విత్ నిఖిల్ కామత్' తాజా ఎపిసోడ్లో మాట్లాడుతూ తాను అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్ కొనడం ఆపేనట్లు చెప్పారు. హెర్మేస్, లూయిస్ విట్టన్ వంటి బ్రాండ్ల మార్కెటింగ్ వ్యూహాన్ని నిఖిల్ కామత్ తప్పుపట్టారు. అది ఒకరకంగా కస్టమర్లను కించపరచడమేనని వ్యాఖ్యానించారు. అల్ట్రా-లగ్జరీ బ్రాండ్లు కస్టమర్లకు ఉత్పత్తిని నేరుగా విక్రయించకుండా "సంబంధాన్ని పెంచుకునేలా" చేస్తాయన్నారు. అంతిమంగా కస్టమర్లకు ఉత్పత్తులు చేరేలోపు వారిని రకరకాల ఛట్రాల్లో ఇరికిస్తాయన్నారు. ఇదంతా తమ ఉత్పత్తులకు విలువను పెంచుకునే ఎత్తుగడలో భాగమేనన్నారు. “గత 3-4 సంవత్సరాలుగా నేను హెర్మేస్, లూయిస్ విట్టన్ వంటి అల్ట్రా-లగ్జరీ బ్రాండ్ల ఉత్పత్తులు కొనడం పూర్తిగా ఆపేశాను. ఎందుకంటే వారు కస్టమర్లతో ఆడుకుంటున్నారు. కస్టమర్లను ఊరించి ఫలితం పొందడమే వారి మార్కెటింగ్ వ్యూహం” అని కామత్ తన పోడ్కాస్ట్లో అన్నారు. తప్పుడు వ్యూహం! ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని అహంకారంతో కూడిన వ్యూహంగా నిఖిల్ కామత్ భావిస్తున్నారు. “వారు ఈ బ్యాగ్‌లు, వస్తువులను మిలియన్ల కొద్దీ తయారు చేయగలరు. కానీ అహంకారంతో కూడిన వ్యూహంతోనే ఇలా పరిమితంగా ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్నారు. కస్టమర్లు దీన్ని గమనించాలి” అన్నారు. హెర్మేస్ వంటి అల్ట్రా-లగ్జరీ బ్రాండ్లు వాటి ప్రత్యేకత, పరిమిత లభ్యతకు ప్రసిద్ధి చెందాయి. కస్టమర్లు హెర్మేస్ హ్యాండ్‌బ్యాగ్‌ను కొనుగోలు చేయాలంటే ముందుగా అనేక చిన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. -
ఇక గర్భిణులకు నిశ్చింత
సాక్షి, అమరావతి: నవ మాసాలు మోసి కన్న బిడ్డకు గ్రహణం మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉండటం, నయంకాని వ్యాధులుంటే ఆ తల్లి పడే బాధ వర్ణనాతీతం. ఇలా ఏ తల్లి క్షోభకు గురికాకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ సేవలను ఉచితంగా సీఎం జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించేందుకు టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్(టిఫా) స్కాన్ దోహదపడుతుంది. ఖరీదైన ఈ స్కాన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులకు ఉచితంగా చేస్తోంది. ఈ ఏడాది మే నుంచి ఆరోగ్యశ్రీ కింద గర్భిణులకు ఒక టిఫా, రెండు అ్రల్టాసౌండ్ స్కాన్లు/మూడు అల్ట్రా సౌండ్ స్కాన్ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. మేనరికం వివాహాలు చేసుకున్న వారికి, బ్యాడ్ అబ్్రస్టెటిక్ హిస్టరీ(గర్భం దాల్చిన రోజు నుంచే వివిధ సమస్యలుండటం), క్రోమోజోమ్స్, మానసిక లోపాలు(మెంటల్ డిజబిలిటీ), సింగిల్ జీన్ డిజార్డర్స్, 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన వారికి, ఇతర సమస్యలున్న గర్భిణులకు వైద్యుడి సూచన మేరకు టిఫా స్కాన్ చేస్తున్నారు. పైసమస్యలేవీ లేని గర్భిణులకు మూడు అ్రల్టాసోనోగ్రామ్ స్కాన్లు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 1500 మందికి పైగా గర్భిణులు ఉచిత టిఫా, అల్ట్రా సౌండ్ స్కానింగ్ సేవలు పొందారు. టిఫా స్కానింగ్‌కు ప్రైవేట్‌గా అయితే రూ.1,500 నుంచి రూ.2,500 వరకూ ఖర్చవుతుంది. గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లే వరకూ మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీ కింద ప్రసవించిన మహిళలకు విశ్రాంత సమయానికి భృతిగా రూ.5 వేల చొప్పున వైఎస్సార్ ఆసరా సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇక 108 అంబులెన్స్‌ల ద్వారా ఉచితంగా ఆస్పత్రులకు తరలించడం, ప్రసవానంతరం వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా వారిని ఇంటికి చేరుస్తుండటం తెలిసిందే. ముందే గుర్తిస్తే నయమయ్యే అవకాశం మేనరికం వివాహాలు, జన్యు సంబంధిత లోపాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం వంటి వివిధ కారణాలతో శిశువుల్లో లోపాలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలను ముందే గుర్తిస్తే అత్యధిక శాతం నయం చేయడానికి వీలుంటుంది. ఇలాంటి లోపాలను టిఫా స్కాన్‌తో గుర్తించే అవకాశముంటుంది. – డాక్టర్ అనిల్‌కుమార్, అదనపు సంచాలకులు, వైద్య, ఆరోగ్య శాఖ -
ప్రైవేట్ జెట్ ఉన్న ఈ టాప్ బిలియనీర్ల గురించి తెలుసా? (ఫొటోలు)
-
అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!
సాక్షి, ముంబై: ఖరీదైన యాపిల్ వాచ్ కొనుగోలు చేయలేని వారికి గిజ్మోర్ తీపి కబురు అందించింది. అచ్చం యాపిల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌వాచ్ ‘అల్ట్రా’ లా కనిపించే స్మార్ట్‌వాచ్‌ను భారతీయ బ్రాండ్ గిజ్మోర్ తీసుకొచ్చింది. అదీ కూడా కేవలం 1,999 రూపాయలకే. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 2023 నుండి అందుబాటులో ఉంటుంది. బ్లాక్, ఆరెంజ్, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. (ఇదీ చదవండి: ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ వచ్చేస్తోంది!150 కి.మీ. రేంజ్లో) బడ్జెట్ ధరలో గిజ్మోర్ తీసుకొచ్చిన కొత్త వాగ్ స్మార్ట్‌వాచ్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే స్మార్ట్‌వాచ్‌కు 10రోజుల బ్యాటరీ లైఫ్, 1.95-అంగుళాల HD డిస్ప్లే 320X385 పిక్సెల్స్, 91% బాడీ-టు-స్క్రీన్ రేషియో, మెరుగైన ఫారమ్ ఫ్యాక్టర్‌తో పెద్ద ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ప్లేను అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ షార్ట్‌కట్ మెనూ కోసం స్ప్లిట్-స్క్రీన్ వ్యూ కూడా ఉంది. పవర్ ఆన్ అండ్ ఆఫ్ కోసం 2 ప్రత్యేక బటన్స్, ఎపుడూ ఆన్‌లో ఉండే డిస్ప్లే స్క్రీన్ 600 నిట్స్ బ్రైట్నెస్ను కూడా అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ GPS ట్రాజెక్టరీ ఫీచర్‌ను హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవల్స్, పీరియడ్ ఎలర్ట్, స్లీప్ సైకిల్, meditation, sedentary and dehydration లాంటి రిమైండర్స్ కూడా ఇస్తుందట. యాపిల్ స్మార్ట్‌వాచ్ ‘అల్ట్రా’ ప్రారంభ ధర రూ. 89,900. (మళ్లీ ఉద్యోగాల కోత..12 నెలల్లో 1400మందిని తొలగించిన స్టార్టప్) -
మనాలి నుంచి లేహ్ వరకూ..చిరుతలా పరిగెత్తింది
అల్ట్రా రన్నర్ సూఫియా ఖాన్. లక్ష్యం 480 కిలోమీటర్లు. కాని మామూలు దారి కాదు. సముద్ర మట్టానికి 2000 మీటర్ల నుంచి 3000 మీటర్ల ఎత్తున. చలి, మంచు, పర్వతాల దారి. కాని 146 గంటల్లో సాధించింది. ఈ దారిలో పరిగెత్తిన మొదటి మహిళ ఆమె. ‘ప్రపంచం మొత్తం పరిగెత్తాలని ఉంది’ అంటోందామె. అందుకు లేసులు కూడా బిగిస్తోంది. సంప్రదాయ మారథాన్ గరిష్టంగా 42 కిలోమీటర్లు ఉంటుంది. దానికి మించిన మారథాన్‌ను ఆల్ట్రా మారథాన్ అంటారు. సూఫియా ఖాన్ ఆల్ట్రా రన్నర్. అంటే ఏకధాటిగా వందల కిలోమీటర్ల మారథాన్ చేసే రన్నర్ అన్నమాట. ప్రపంచంలో ఆమెలా పరిగెడుతున్నవారు... రికార్డ్స్ సృష్టిస్తున్నవారు బహుశా మరొకరు లేరు. ఎందుకంటే ఆమె కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిగెత్తి ఒక రికార్డు, గోల్డెన్ ట్రయాంగిల్ (జైపూర్, ఢిల్లీ, ఆగ్రా)లో పరిగెత్తి ఒక రికార్డు, తాజాగా మనాలి నుంచి లేహ్‌కు పరిగెత్తి ఒక రికార్డు నమోదు చేసింది. 35 ఏళ్ల వయసులో చిరుతలా పరిగెత్తే ఈమెను అందుకోవడం కష్టమేమి కాదు. కాకపోతే అందుకు మనమూ పరిగెత్తాల్సి ఉంటుంది. అజ్మీర్ అమ్మాయి అజ్మీర్‌లో పుట్టి పెరిగిన సూఫియాకు 16 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి ఆమెను పెంచింది. డిగ్రీ చేశాక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చూసుకోమ్మా అంది. కాని సూఫియాకు ఏవియేషన్ రంగంలో పని చేయాలనిపించి ఒక ప్రయివేట్ ఎయిర్‌లైన్స్‌లో గ్రౌండ్స్టాఫ్గా చేరింది. అక్కడ బండ చాకిరీ. సంవత్సరాలు గడిచిపోతుండేవి. దానికి తోడు ఆరోగ్యం, ఉత్సాహం సన్నగిల్లడం కూడా. ‘నన్ను నేను ఒకరోజు అద్దంలో చూసుకుంటే నా ఫిట్నెస్ అంతా పోయిందనిపించింది. డ్యూటీ చేస్తూనే ఆరోగ్యం కాపాడుకోవాలంటే రోజూ ఒక 15 నిమిషాలన్నా పరిగెత్తాలని అనుకున్నాను. అలా పరిగెత్తడం మొదలెట్టాను. అప్పటి వరకూ నాకు ఆటలంటే ఇష్టం లేదు. కాని పరిగెడుతుంటే నా శరీరం చిరుతలా మారేది. నాకు పరుగు సరిౖయెనది అని ఇంకా సాధన చేశాను’ అంటుంది సూఫియా. మారథాన్‌లో సూఫియా సందేశం కోసం పరుగు పరుగులో ఆనందం తెలిశాక రొడ్డకొట్టుడు ఉద్యోగాన్ని వదిలేసింది సూఫియా. ఒక సందేశం కోసం తన పరుగును దేశానికి చూపాలనుకుంది. ‘మానవత్వమే ముఖ్యం’ అనే సందేశంతో 2018లో మొదట ఇండియన్ గోల్డెన్ ట్రయాంగిల్ మధ్య పరిగెత్తింది. 720 కిలోమీటర్ల ఈ దూరాన్ని 16 రోజుల్లో ముగించి రికార్డు స్థాపించిందామె. దాంతో ఆమె పరుగు మీద అందరి దృష్టి పడింది. ఆ తర్వాత 2019లో అంతకు మించి సాహసం చేసింది సూఫియా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 4000 కిలోమీటర్ల దూరం– శ్రీనగర్‌తో మొదలయ్యి లూధియానా మీదుగా గజియాబాద్, కోట, ఇండోర్, ముంబై, బెలగామ్, బెంగళూరు, మదురైలను దాటి కన్యాకుమారి వరకూ ఆమె పరిగెత్తింది. ఏప్రిల్ చివరి వారంలో మొదలెట్టి రోజుకు 50 కిలోమీటర్ల లెక్కన పరిగెడుతూ దాదాపు 90 రోజులలో ఆమె ఈ పరుగును పూర్తి చేసి మరో రికార్డును స్థాపించింది. ఇప్పుడు ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో మనాలి, లేహ్‌ల మధ్య పరిగెత్తింది. ‘నీ హద్దుల్ని దాటు’ స్త్రీలకు అన్నీ హద్దులే. స్త్రీలు చేసే సాహసాలకు అన్నీ ఆటంకాలే. అందుకే సూఫియా ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో సెప్టెంబర్ 25, 2021 ఉదయం తన ‘హిమాలయన్ ఆల్ట్రా రన్ ఎక్స్‌పెడిషన్’ మనాలి నుంచి మొదలెట్టింది. 480 కిలోమీటర్ల దూరాన్ని అక్టోబర్ 1న లేహ్‌లో ముగించింది. ఇలా ముగించడం సామాన్యం కాదు. ఇలా ముగించిన మహిళ గతంలో లేదు. అందుకే సూఫియా సాహసం గొప్ప స్ఫూర్తిదాయకం అయ్యింది. మనాలి సముద్ర మట్టానికి 6,700 అడుగుల ఎత్తు ఉంటుంది. లేహ్ 11, 500 అడుగుల ఎత్తు. ఈ రెండు ఎత్తుల మధ్య పరిగెత్తాలి. చలి ఈ దారిలో ఒక్కోసారి మైనస్ 5 డిగ్రీలు ఉంటుంది. ఆక్సిజన్ గాలిలో అరవై శాతమే ఉంటుంది. పెద్ద సవాలు. ‘అయినా నేను పరిగెత్తాను. దీనికి ముందు ఒక పదిహేను రోజులు ఈ పర్వతాల్లో క్యాంప్ వేసి ఇక్కడి వాతావరణానికి నా శరీరం అలవాటు పడేలా చేసుకున్నాను.’ అంది సూఫియా. ప్రాణాపాయం లెక్కచేయక మనాలి, లేహ్‌ల మధ్య రోడ్లు బాగుండవు. ఆ దారిలో వాహనాల్లో వెళుతున్నవాళ్లే ఆక్సిజన్ చాలక ఒక్కోసారి మరణిస్తారు. ‘నాక్కూడా ఆ దారిలో ఉండే గ్రామీణులు, ఆర్మీ వాళ్లు చాలా జాగ్రత్తలు, ప్రాణాపాయ పరిస్థితులు చెప్పారు. ప్రాణాయామం, యోగా వల్ల నా లంగ్స్‌ను గట్టి పరుచుకోవడం వల్ల నేను ధైర్యం చేశాను. కాని ఆ ధైర్యం చేయడం వల్ల ఎన్నో మనోహర దృశ్యాలు చూశాను. లడాఖ్ లోయ ముఖద్వారం ‘సర్చూ’, సింధూ నది ప్రవాహం, తంగ్లంగ్ లా పాస్... ఇవన్నీ జీవితంలో ఒక్కసారైనా చూడాలి’ అందామె. సూఫియాకు సపోర్ట్ టీమ్ ఉంటుంది. అది ఆమె వెంట ఉండి ఆ పరుగును, రాత్రి బసను ప్లాన్ చేస్తుంది. రెండుసార్లు గిన్నెస్‌బుక్‌లో ఎక్కిన సూఫియా తర్వాతి అంకం ‘ప్రపంచాన్ని పరుగుతో చుట్టి రావడమే’. ఆ రోజు కూడా బహుశా చూస్తాం. తథాస్తు. -
నేటి నుంచి ఢిల్లీలో అల్ట్రా క్లీన్ పెట్రోల్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అన్ని పెట్రోల్ బంకుల్లో అల్ట్రా క్లీన్ యూరో–6 గ్రేడ్ పెట్రోల్, డీజిల్‌ను ఆదివారం (ఏప్రిల్ 1) నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. దేశ రాజధానిలో పెరిగిన వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అల్ట్రా క్లీన్ పెట్రోల్‌ను సాధారణ ధరలకే విక్రయించనున్నారు. నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌తోపాటు ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి 13 పెద్ద నగరాల్లో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 2020 ఏప్రిల్ నుంచి అల్ట్రా క్లీన్ ఇంధనం అందుబాటులోకి రానుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ బీవీ రమ గోపాల్ మాట్లాడుతూ.. బీఎస్–6 (యూరో–6కు సరిసమానమైన) పెట్రోల్‌ను రాష్ట్రంలోని 391 బంకుల్లో విక్రయించనున్నట్లు వెల్లడించారు. అల్ట్రా క్లీన్ కోసం సాధారణ పెట్రోల్ కంటే 50 పైసలు ఎక్కువగా కంపెనీలు ఖర్చు చేయాల్సి వస్తోందని, వినియోగదారులపై ఇప్పటికిప్పుడు ఆ భారం మోపే ఉద్దేశం లేదని చెప్పారు. ఢిల్లీలో ఏడాదికి 9.6 లక్షల టన్నుల పెట్రోల్, 12.65 లక్షల టన్నుల డీజిల్ వినియోగమవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర, హర్యానాలోని పానిపట్, మధ్యప్రదేశ్‌లోని బినా, పంజాబ్‌లోని భటిండా రిఫైనరీలు ఇప్పటికే యూరో–6 పెట్రోల్ ఉత్పత్తిని ప్రారంభించాయి. -
అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై గూఢచర్యం
కాకినాడ సిటీ: జిల్లాలోని అన్ని అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై రహస్య గూఢచర్య కార్యకలాపాలు నిర్వహించి పిండలింగ నిర్ధారణ వెల్లడిచేసిన సెంటర్లపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై కలెక్టరేట్ కోర్టుహాలులో శుక్రవారం రాత్రి జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఆరు అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లకు అనుమతులు, 19 సెంటర్లకు లైసెన్స్ రెన్యూవల్, 10 సెంటర్లకు అడ్రసు మార్పు అనుమతులు రాటిఫికేషన్లు జారీ చేశారు. జిల్లాలో రిజిస్టర్ అయిన 328 అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై రహస్య నిఘా ఉంచి డెకోయ్, స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. స్కానింగ్ చేసే ముందు గర్భిణి అనుమతి సంతకాన్ని తప్పనిసరిగా సేకరించాలన్నారు. ఈ అనుమతి పత్రాలు కేంద్రం రిజిష్ట్రేషన్ లైసెన్స్, స్కానర్ వివరాలు, పరీక్షలు నిర్వహించే వైద్యులు, నిపుణుల వివరాలు విధిగా ఆన్లైన్లో పరిశీలనకు అందుబాటులో ఉండాలన్నారు. ఆర్డీఓలు, ప్రోగ్రామ్ అధికారులు తమ పరిధిలో అల్ట్రాసౌండ్ స్కానర్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు ముమ్మరంగా నిర్వహించాలని ఆదేశించారు. 6వ అదనపు జిల్లా జడ్జి ఎం.శ్రీనివాసాచారి, ఐటీడీఏ పీఓ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, డీఎంహెచ్ఓ కె.చంద్రయ్య, ఆర్డీఓలు రఘుబాబు, విశ్వేశ్వరరావు, గణేష్‌కుమార్ పాల్గొన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి పటిష్ట ప్రణాళిక జిల్లాలో ఆరు నెలల నుంచి 15 నెలలలోపు పిల్లలందరికీ మీజెల్స్, రూబెల్లా వైరస్ల నివారణ వ్యాక్సిన్ పంపిణీకి పటిష్ట ప్రణాలిక చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో ఐసీడీఎస్, విద్యా, వైద్య ఆరోగ్యశాఖాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆగష్టు నెలలో పిల్లలందరికీ నూరుశాతం వ్యాక్సిన్ పంపిణీకి ప్రత్యేక ఎంఆర్ కాంపెయిన్ నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు. సబ్కా సాత్–సబ్కా వికాస్‌కు సమగ్ర ఏర్పాట్లు: ఈనెల13న కాకినాడలో నిర్వహించే సబ్కా సాత్–సబ్కా వికాస్‌కు సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి స్ధానిక రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఈకార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమాలపై ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఆయా శాఖలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.