Ant
-
'క్రమశిక్షణ' అంటే వెంటనే గుర్తుకొచ్చేది...!
‘‘ఆబ్రహ్మ పీపీలికాది పర్యంతం’’ అని సమస్తం అనే అర్థంలో ఉపయోగించటం చూస్తాం. చీమ అంటే అల్పజీవి అనే అర్థం ఇక్కడ. అంతేకాదు, చాలా చులకనగా చూడబడే జీవి, చిన్నప్రాణి. చీమ, దోమ అని కలిపి ఒకటిగా పరిగణించటం కూడా ఉంది. కానీ, మనిషి చీమ నుండి నేర్చుకో వలసినది చాలా ఉంది. అసలు చీమలు ఎన్ని రకాలో తెలుసా? ఎర్ర చీమలు, నల్లచీమలు, గండుచీమలు, బెదురు చీమలు, గబ్బుచీమలు, రెక్కలచీమలు... వీటి అన్నింటికీ సామాన్య లక్షణాలూ ఉన్నాయి, ప్రత్యేక లక్షణాలూ ఉన్నాయి. సామాన్య లక్షణాలు ఆదర్శప్రాయమైనవి, అనుసరణీయాలు.అవిశ్రాంతంగా పని చేయటం చీమల సహజగుణం. నిరంతరం ఆహారాన్వేషణ చీమల లక్షణం. తిన్నంత తిని మిగిలినది జాగ్రత్త చేస్తాయి. చీమల పుట్టలని తవ్వి చూస్తే ధాన్యాగారంలో ఉన్నంత ధాన్యం ఉంటుందని చెపుతారు. అంత ధాన్యం తానే తిందామని దాచి పెట్టిందా? తన కోసమో, తన వారి కోసమో అంటే భవిష్యత్తు కోసం భద్రం చేయటం అనే సహజ గుణం అది. అందుకే కొద్ది కొద్దిగా కూడ పెడితే చీమలాగా కూడపెట్టారని అంటారు. అందుకే చిన్న మొత్తాల పొదుపుకి ఆదర్శం చీమలే.చీమలకి ఉన్న ఘ్రాణశక్తి అమోఘం. బెల్లం ముక్క పెడితే ఎక్కడి నుండి వస్తాయో తెలియదు చీమలు కుప్పలు తెప్పలుగా వస్తాయి. ఎవరు చెప్పి ఉంటారు? అవి వాసనతో పసి గడతాయి. ఒక్కటి పసిగడితే చాలు. స్వార్థరహితంగా తన వారందరికీ తీపివార్తని అందిస్తుంది అది. ఇది కూడా అనుసరించ తగిన లక్షణమే కదా! ఏదైనా తీపి పలుకుని ఒక చీమ మోయ లేకపోయినా, ఒక చీమ చనిపోయినా దానిని తీసుకు వెళ్ళటానికి మిగిలినవి అన్నీ సహాయ పడతాయి. కలిసికట్టుగా ఉండటం చీమలని చూసి మనిషి నేర్చుకోవాలేమో!క్రమశిక్షణ అంటే వెంటనే గుర్తు వచ్చేది చీమలే. చీమలు రెండు అయినా నాలుగు అయినా, వందలూ వేలూ అయినా ఒక వరుసలో మాత్రమే వెళ్ళటం గమనించవచ్చు. పైగా ఒక దానితో మరొకటిపోటీ పడవు, దారి తప్పవు. చీమలు నడచిన దారి కాలిబాట లాగా స్పష్టంగా కనపడుతుంది. చీమల క్రమశిక్షణ నడక లోనే కాదు, నడత లోనూ కనపడుతుంది. చీమలదండులో ఒకటి మిగిలిన వాటికన్న పెద్దదిగా ఉంటుంది. అదే ఆ దండుకి నాయకుడు. చీమలదండు తమ నాయకుని మాటనిపాటిస్తుంది.చీమల గృహనిర్మాణశక్తి అద్భుతం. అంత చిన్నప్రాణులు భూమిని తొలిచి, దారి చేసుకుని, భూమి లోపల ఆశ్చర్యకరమైన నివాసస్థలాలని తయారు చేసుకుంటాయి. వాటి ప్రవేశం భూమి పైన ఉన్నా, వెళ్ళేది లోపలికి. రంధ్రంలోపలికినీళ్ళువెళ్ళటం సహజం. కానీ, చీమలు పెట్టిన పుట్ట ద్వారంలోకి నీటిచుక్క కూడా వెళ్ళదు. జాగ్రత్తగా చీమల పుట్టని అనుసరించి తవ్వుకుంటే వెడితే, లోపల ఎంతో శుచిగా, హాయిగా, చల్లగా ఉంటుందిట!గోడలు నున్నగా ఉంటాయి. అందుకేనేమోపాములు ఆ పుట్టలని తమ నివాసస్థానాలుగా చేసుకుంటాయి. ‘‘చీమలు పెట్టిన పుట్టలుపాముల కిరవైన యట్లు ..’’ అనే మాటలు వినే ఉంటాం.చీమలు తయారు చేసుకున్న నివాసాన్ని ఆక్రమించినపాములని అవకాశం చూసుకుని, అవే చీమలు పట్టి బాధిస్తాయి. చంపి వేయవచ్చు కూడా! చీమలు తలుచుకుంటే ఎంతటి పదార్థాన్ని అయినా గంటల్లో మాయం చేయగలవు. ఉదాహరణకి, మనిషిప్రాణంపోయిన తరువాత అట్లాగే ఉంచితే తెల్లవారే సరికి చీమలు ఎముకలని మాత్రమే మిగులుస్తాయి. వాటికి మనిషి మాంసం చాలా ఇష్టమట! బతికి ఉన్నా కదలిక లేకపోతే చాలు, వాటి పని అవి చేసుకుంటాయి. అందుకే మంచంలో ఉన్నవాళ్ళని, శవాలని జాగ్రత్తగా చూసుకోవాలని చెపుతారు. చీమతోపోలిస్తే సంతోషించాలి సుమా! – డా. ఎన్. అనంత లక్ష్మి -
జాక్ మాకు మరో భారీ షాక్..మంచులా కరిగిపోతున్న ఆస్తులు!
చైనా కుబేరుడు జాక్ మాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. జిన్‌పింగ్ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో అక్కడి సర్కారుకు టార్గెట్‌గా మారిపోయారు. ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలతో జాక్ మా పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుంది. తాజాగా, జాక్‌మా అధినేతగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాంట్ గ్రూప్‌కు డ్రాగన్ కంట్రీ 1 బిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. ఆ మొత్తాన్ని తప్పని సరిగా చెల్లించాల్సిందేనని హెచ్చరించింది. ఇంతకీ జిన్‌పింగ్ జాక్‌మాపై కక్ష పెంచుకోవడానికి అసలు కారణాలేంటీ? అలిబాబా సహ వ్యవస్థాపకుడు, యాంట్ గ్రూప్ అధినేత జాక్‌మాపై జిన్‌పింగ్ ఆంక్షలు విధించడంతో ఆయన జీవితం ఒక్కసారిగా తల్లకిందులైంది. కొన్ని నెలల పాటు అజ్ఞాతంలోనూ ఉండాల్సి వచ్చింది. అయితే, అంత అకస్మాత్తుగా ఆయన్ని ప్రభుత్వం టార్గెట్ చేయడానికి ఓ బలమైన కారణం ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే ఆయన పాలిట శాపమా ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అలాగే ఏదైనా ఒక్క పొరపాటు లేదా తప్పుడు నిర్ణయం కూడా మనిషిని ఉన్నత శిఖరాల నుంచి అగాధంలోకి నెట్టేస్తుంది. అపర కుబేరుడు జాక్ మా విషయంలోనూ ఇదే జరిగింది. అలీబాబా పోర్టల్‌తో ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ కోటాను కోట్లు వెనకేసుకున్న దశలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవాలనే బుద్ధి పుట్టింది. అదే ఆయన పాలిట శాపమైంది. జిన్‌పింగ్‌కు మింగుడు పడలేదు 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవడమే జాక్ మా కొంపముంచింది. చైనా ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే ట్రంప్‌తో భేటీ అయ్యారు. అంతేకాదు, అమెరికాలో 10లక్షల ఉద్యోగాలు సృష్టస్తామని హామీలిచ్చారు. అది సరిపోదున్నట్లు చైనాలో జరిగే ఓ బిజినెస్ సమ్మిట్‌లో దేశ ఆర్ధిక వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపారు. ఇదిగో ఈ తరహా ధోరణే చైనా పాలకులకు ఏమాత్రం మింగుడుపడలేదు. పైగా చైనాను కట్టడి చేసేలా అనేక చర్యలు తీసుకుంటున్న ట్రంప్‌ను కలవడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. అదిగో అప్పటి నుంచి జాక్‌మాను చైనా ప్రభుత్వం వేధిస్తూ వస్తుంది. రోజుకు 7వేల కోట్ల నష్టం యాంట్ ఐపీవోను అడ్డుకుంది.టెక్నాలజీ, స్థిరాస్థి, గేమింగ్, విద్య, క్రిప్టోకరెన్సీ ఇలా అన్నీ వ్యాపారాలను ఆంక్షలతో కుదేలయ్యేలా చేసింది. ఏడాది తిరిగే లోపు దాదాపు రూ.25లక్షల కోట్లు నష్టపోయారు. అంటే రోజుకు రూ.7వేల కోట్లన్న మాట. అందుకే చైనాలో ప్రభుత్వాన్ని ఎదిరించి మనుగడ సాధించడం కష్టం. ఈ విషయం తెలుసుకున్న జాక్‌మా జిన్ పిన్ ప్రభుత్వంతో రాజీ పడ్డారు. దేశాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సిందే కానీ చైనా ప్రభుత్వం జాక్‌ను కనికరించలేదు. సరికాదా కన్నెర్ర చేసింది. ఈ నేపథ్యంలో జాక్‌మాకు చైనా ప్రభుత్వం ఫైన్ విధించింది. జరిమానా విధించినా..భవిష్యత్‌లో జాక్ మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే వాదన వినిపిస్తుంది. చైనా టాప్ సెక్యూరిటీ రెగ్యులేటర్ పరిశ్రమలపై ఆంక్షల విధించే సమయం ముగియనుంది. కాబట్టే ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘలన పేరుతో జాక్ మాపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. మా’ 1 బిలియన్ డాలర్లు చెల్లించాలని షరతు పెట్టింది. ఊరట కలిగేనా 2020లో యాంట్పై అణిచివేత తర్వాత, దాని మాతృ సంస్థ అలీబాబా రికార్డు స్థాయిలో 2.8 బిలియన్ల యాంటీట్రస్ట్ పెనాల్టీని విధించిన డ్రాగన్ కంట్రీ అధికారులు. దీంతో పాటు రైడ్-హెయిలింగ్ కంపెనీ దీదీకి సైతం 1.2 బిలియన్ల జరిమానాను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయం జాక్‌మాకు ఊరట కల్పిస్తుందా? లేదంటే మరింత ఇబ్బందులు పెడుతుందా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. చదవండి : పాకిస్తాన్లో జాక్‌మా ప్రత్యక్షం.. రహస్య ప్రాంతంలో -
పిట్టంత పిపీలికం.. హమ్మింగ్ బర్డ్ సైజులో ఉండే చీమ శిలాజం గుర్తింపు
చీమ.. ఓ అల్పజీవి. కానీ.. ఒకప్పుడు పరిమాణంలో హమ్మింగ్ బర్డ్ అంత పెద్ద చీమలు పిపీలిక సామ్రాజ్యాన్ని ఏలాయట. ఇటీవల లభించిన చీమ శిలాజాన్ని బట్టి 47 మిలియన్ ఏళ్ల కిందట మహా భారీ చీమలు ఉండేవని శాస్త్రవేత్తలు తేల్చారు. చీమ జాతుల్లో ఏకంగా 30 ఏళ్లు జీవించేవి కూడా ఉండటం విశేషమే. కాగా.. చీమలు వేడి వాతావరణంలోనే జీవించడానికి ఇష్టపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వర్షాకాలం, శీతాకాలంలో చలికి తట్టుకోలేక మన ఇళ్లల్లోకి చొరబడి తలదాచుకుంటాయని.. వంటింట్లోని ఆహార పదార్థాలను దోచుకుపోతాయని వెల్లడించారు. సాక్షి, అమరావతి: అమెరికాలోని వయోమింగ్ రాష్ట్రంలో 47 మిలియన్ ఏళ్ల కిందట భారీ మాంసాహార చీమలు అక్కడి కాలనీలను పాలించినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హమ్మింగ్ బర్డ్ పరిమాణంలో ఉండే రాణి చీమ శిలాజాన్ని 2011లో కనుగొన్నారు. రెండు అంగుళాలకు పైగా సైజులో ఉన్న ఈ శిలాజాన్ని డెన్వర్ మ్యూజియం ఆఫ్ నేచర్ సైన్సెస్‌లో భద్రపరిచారు. అంతకు ముందు టైటానోమైర్మా జాతికి (2 అంగుళాల పొడవు, 16 సెంటీమీటర్ల రెక్కలు) చెందిన చీమ శిలాజాన్ని జర్మనీలో గుర్తించారు. చీమలు చల్లటి రక్తం (కోల్డ్ బ్లడెడ్) కలిగిన జాతికి చెందినవి. వాటి శరీర ఉష్ణోగ్రత పర్యావరణంలోని సూర్యరశి్మపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే.. అవి వెచ్చని వాతావరణంలో ఉండటానికే ఇష్టపడతాయి. గ్లోబల్ వారి్మంగ్ చీమ జాతిని భయపెడుతున్నా.. కొంచెం తేమ ఉన్న ప్రాంతాల్లోనూ ఇవి మనుగడ సాగించగలుతున్నాయి. అందుకే శీతాకాలంలో (డిసెంబర్–జనవరి మధ్య) బయట చీమలు కనిపించవు. ఆహార పదార్థాలు ఉండే ఇళ్లలోకి చొరబడి జీవనం సాగిస్తాయి. డైనోసార్లు అంతరించినా.. ఇవి బతికే ఉన్నాయ్ జీవుల్లో అత్యంత సంపన్నమైన (సోషల్ ఇంజనీరింగ్), శక్తివంతమైన సమూహాలలో చీమలకు ప్రత్యేక స్థానం ఉంది. భూగ్రహంపై డైనోసార్లు అంతరించిపోయినా.. వాటితో కలిసి జీవించిన చీమ జాతులు మాత్రం ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి. చీమలకు 130 మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మూడేళ్ల కిందట మయన్మార్‌లో 99 మిలియన్ సంవత్సరాల క్రితం ‘హెల్ యాంట్’ పేరుతో జీవించిన చీమ నమూనాను గుర్తించారు. ఇదే క్రమంలో భూమిపై చీమల సంఖ్యపై హాంకాంగ్ విశ్వవిద్యాలయం, జర్మనీలోని వుర్జ్బర్గ్లోని జూలియస్ మాక్సిమిలియన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో భూమిపై 20 క్వాడ్రిలియన్ (20 వేల ట్రిలియన్) చీమలు ఉన్నట్టు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించింది. వీటి సంఖ్య గతంలో కంటే రెండు నుంచి 20 రెట్లు పెరిగినట్టు పేర్కొంది. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి 2.5 మిలియన్ చీమల జనాభా ఉండటం గమనార్హం. వీటి బరువు 12 మిలియన్ టన్నులు ప్రపంచంలో సుమారు 12 వేల నుంచి 15 వేలకు పైగా రకాల చీమ జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అడవి పక్షులు, క్షీరదాల కంటే చీమల బరువు (చీమల బయోమాస్ 12 మిలియన్లు) ఎక్కువగా ఉంటుంది. ఇది మానవుల బయోమాస్‌లో దాదాపు 20 శాతం. బయోమాస్ అనేది జీవుల్లోని కర్బనాల మొత్తం బరువుగా కొలుస్తారు. చీమలు మొక్కల విత్తనాల పంపిణీలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ సంచార ప్రాంతాలతో పోలిస్తే అడవుల్లో, ఆశ్చర్యకరంగా శుష్క ప్రాంతాల్లో చీమలు సమృద్ధిగా పెరుగుతున్నాయి. 30 ఏళ్ల జీవన కాలం చీమలు కందిరీగల నుంచి ఉద్భవించినట్టు పలు పరిశోధనల్లో తేలింది. పరిమాణంలో 0.07–2 అంగుళాల మధ్యలో ఉండే చీమలు అంటార్కిటికా, ఐస్‌ల్యాండ్, గ్రీన్‌ల్యాండ్ మినహా ప్రపంచంలోని ప్రతిచోట కనిపిస్తున్నాయి. మగ కారి్మక చీమల జీవిత కాలం మూడేళ్లలోపు (కొన్ని కారి్మక చీమలు స్వల్పకాలమే జీవిస్తాయి) ఉంటుంది. చీమల్లో కూడా తేనెటీగల మాదిరిగానే రాణీ చీమ కాలనీ స్థాపకురాలు. రాణి ఫలదీకరణం చేసిన తర్వాత కాలక్రమేణా మిలియన్ల గుడ్లు పెట్టగలదు. అమెరికాలోని ఇడాహోలోని తన సహజ నిర్మాణంలో ఓ రాణి చీమ 30 ఏళ్లపాటు నివసించింది. క్వీన్ బ్లాక్ గార్డెన్ చీమలు ల్యాబ్ సెట్టింగ్‌లలో 28 సంవత్సరాల వరకు జీవించినట్టు గుర్తించారు. మారికోపా హార్వెస్టర్ చీమకు 12 తేనెటీగలు కలిసి కఠినంగా కుట్టగలిగే సామర్థ్యం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనదిగా భావిస్తారు. చీమల్లో ఆశ్చర్యకరంగా రెండు పొట్టలు ఉంటాయి. ఒకటి తన ఆహారం తీసుకోవడానికి, రెండోది ఇతర చీమలను పోషించడానికి (ట్రోఫాలాక్సిస్ ప్రక్రియ) ఉపయోగిస్తాయి. ఏడాదిలో 50 టన్నుల మట్టి తరలింపు చీమలు తమ శరీర బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలవని అంచనా. చీమల జట్టు ఒక సంవత్సర వ్యవధిలో 50 టన్నుల మట్టిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలిస్తుంది. ఇది ప్రకృతికి మేలు చేయడంలో వానపాముల కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగిఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చీమలకు ఊపిరితిత్తులు, సాధారణ శ్వాసకోశ వ్యవస్థ లేదు. శరీరంలోని రంధ్రాల వ్యవస్థను (స్పిరకిల్స్) శ్వాస పీల్చుకునేందుకు ఉపయోగిస్తాయి. అందుకే ఇవి నీటి అడుగులో 24 గంటల పాటు జీవించగలవు. ఇదే అతిపెద్ద చీమల కాలనీ ఐరోపా, జపాన్, అమెరికా అంతటా అతిపెద్ద చీమల కాలనీ వ్యాపించింది. తొలుత వీటిని మూడు ప్రత్యేక కాలనీలుగా భావించారు. ఇక్కడ అర్జెంటీనా చీమ జాతి ఒక్కటే ఉండటంతో మనుగడ కోసం ఒకదానితో మరొకటి పోరాడుకోవడానికి నిరాకరించడంతో కాలనీ చాలా పెద్దదిగా పెరిగినట్టు భావిస్తున్నారు. ఈ కాలనీ 3,750 మైళ్ల మేర విస్తరించి ఉందని.. అందులో 370 మిలియన్ చీమలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. -
Red Ant: చీమలు బాబోయ్.. చీమలు!..వేధిస్తున్న ఎర్ర రాకాసి చీమలు
సాక్షి, భువనేశ్వర్: ‘చీమలు బాబోయ్ చీమలు. భరించ లేకపోతున్నాం. ఊరు వదిలి వెళ్లిపోవాల్సిందే. మునుపెన్నడూ ఇటువంటి చీమల దండుని చూడనే లేదు’ ఇదీ.. పూరీ జిల్లా పిప్పిలి మండలం చంద్రాదెయిపూర్ పంచాయతీ బ్రాహ్మణ సాహి గ్రామస్తుల ఆర్తనాదం. ఈ గ్రామంలో చీమలు దండెత్తుతున్నాయి. అక్కడున్న వారిని కాటు కంటే ఘాటుగా కుడుతున్నాయి. చీమ కుట్టిన వారి బతుకు దుర్బరం అవుతుందనే భయాందోళనలతో గ్రామం మార్మోగుతోంది. గత 2 నెలలుగా ఈ వేధింపులు భరించలేక గ్రామం విడిచి పెట్టేందుకు మూటాముల్లె సర్దుకుంటున్నారు. దీని ప్రభావంతో గ్రామానికి చెందిన కుముద్ దాస్ కుటుంబం వేరే ఊరికి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ చీమలు మామూలు చీమలు కాదు. ఎర్రటి రాకాసి చీమలు. అసాధారణ పరిమాణంలో దండుగా చొరబడుతున్నాయి. సందు దొరికితే పుట్ట గట్టుకుని బస చేస్తున్నాయి. జోలికిపోతే కుట్టి గాయపరుస్తున్నాయి. ఈ చీమ కుడితే విపరీతమైన దురదతో దద్దర్లు పొక్కి క్రమంగా గాయమైపోతుంది. కుట్టిన చోటు వాచి, కదల్లేని విపరీత పరిస్థితులు ఆవహిస్తున్నాయి. గ్రామంలో ఇంటా బయట చీమల దండు హోరెత్తుతోంది. గ్రామ శివార్లు కాలువ ప్రాంతం నుంచి చీమల దండు ఆవిర్భవిస్తున్నట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. పొలాలు, రహదారులు, ఇల్లు, వాకిలి, లోపలా, బయట అన్ని చోట్లా గుట్టలుగా పేరుకు పోతున్నాయి. ఇళ్ల మట్టి గోడల్లో చిన్నపాటి సందు కుదిరతే పుట్టగట్టి బస ఏర్పరచుకుంటున్నాయి. గోడల మీద పాకే బల్లి, వాకిట్లో కప్పలు, పిల్లులు వంటి మూగ జీవులను సైతం బతకనీయడం లేదని గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. ఏం చేయాలో తోచని దయనీయ పరిస్థితుల్లో గ్రామం విడిచి పోయేందుకు గ్రామస్తులు నడుం బిగిస్తున్నారు. నిపుణుల అభయం.. గ్రామంలో తాండవిస్తున్న చిత్ర విచిత్ర విపత్కర పరిస్థితి నివారించేందుకు చంద్రాదెయిపూర్ పంచాయతీ సర్పంచ్ రంగంలోకి దిగారు. స్థానిక మండల అభివృద్ధి అధికారి(బీడీఓ)తో ప్రత్యక్షంగా సంప్రదింపులు జరిపారు. మండల అధికార యంత్రాంగం చొరవతో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఈ పరిస్థితిని పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో బెంబేలెత్తాల్సిన పరిస్థితి లేదని గ్రామస్తులకు ఈ బృందం భరోసా ఇచ్చారు. ఇంకా నివారణోపాయం స్పష్టం కానందున గ్రామస్తుల మాత్రం ఆందోళన వీడటం లేదు. చీమల జోలికి పోకుండా దూరంగా ఉండటం తాత్కాలిక ముప్పు నివారణోపాయంగా నిపుణుల బృందం పేర్కొన్నారు. -
ప్రాణం పోయినా సరే ‘తల’పెడితే.. తగ్గేదేలే!.. ఇతరులకు నో ఎంట్రీ!
చీమా.. చీమా.. ఏమిటలా కుట్టావ్ అంటే.. నా పుట్టలో వేలుపెడితే కుట్టనా? అంటుందట. కానీ ఈ చీమ కుట్టకున్నా.. తమ గూట్లో మాత్రం వేలు పెట్టనివ్వదు. తన తలను పణంగా పెట్టి మరీ గూడును కాపాడేస్తుంది. ప్రాణం పోయినా సరే.. తగ్గేదే లేదంటూ నిలబడుతుంది. ఏమిటీ.. ఓ చీమ గురించి ఇంత ఉపోద్ఘాతమేంటి అనిపిస్తోందా? దాని గురించి తెలిస్తే.. భలే ఉందిలే అనుకోకుండా ఉండలేరు. మరి ఆ చీమ ఏమిటి? దాని ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ గూటికి తగినట్టుగా తల.. సాధారణంగా ఇంటిని కాపాడటానికి గేట్లు, తలుపులు పెట్టుకుంటాం. అవసరమైతే తీసి, మళ్లీ వేసేస్తుంటాం. కానీ చెట్ల కాండంపై రంధ్రాల్లో జీవించే ‘డోర్ హెడ్’ చీమలు మాత్రం స్పెషల్. అవి తమ గూటిని కాపాడుకునేందుకు తలనే అడ్డుపెట్టి చేసే పోరు మరీ స్పెషల్.‘సెఫలోట్స్/సెరెబరా’ జాతికి చెందిన ఈ చీమల తలపై భాగం బల్లపరుపుగా, గుండ్రంగా ఉంటుంది. అంతేకాదు.. దాదాపుగా తమ గూడు రంధ్రానికి సరిపడే పరిమాణంలో ఉంటుంది. ఈ చీమలు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు.. గూటి లోపలికి వెళ్లి.. తమ తలను గూటి రంధ్రానికి అడ్డు పెట్టేస్తుంటాయి. అందుకే వీటిని ‘లివింగ్ డోర్స్’ అని కూడా పిలుస్తుంటారు. సాధారణంగా బీటిల్స్ (ఒకరకం చిన్నసైజు పురుగులు) చెట్ల కాండాలపై గుహల్లా రంధ్రాలు చేస్తుంటాయని.. వీటినే తమ గూడుగా చేసుకుని జీవిస్తుస్తున్న ఒకరకం చీమలు.. వాటిల్లోకి ప్రవేశించే రంధ్రాల వద్ద ‘డోర్‌హెడ్’ చీమలను కాపలాగా ఉంచుతాయని అమెరికాలోని లూయిస్విల్లే యూనివర్సిటీ పరిశోధకుడు స్టీవ్ యనోవిక్ తెలిపారు. ఈ చీమలపై ఆయన విస్తృత పరిశోధన చేశారు. ‘డోర్‌హెడ్’ చీమలు తమ చీమలనే లోనికి రానిస్తాయని.. చెట్లపై తిరిగే చిన్న పురుగులు, కీటకాలు వంటివి గూడులోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఈ తరహా ‘డోర్ హెడ్’ చీమలు ఉన్నాయన్నారు. చెట్ల కాండాల్లో బీటిల్స్ చేసే రంధ్రాలకు సమాన సైజులో ‘డోర్ హెడ్’ చీమల తల సైజు ఉండటం విశేషమని.. లక్షల ఏళ్ల పరిణామ క్రమంలో ఇలా అభివృద్ధి చెంది ఉంటాయని పేర్కొన్నారు. ప్రాణం పోయినా.. తగ్గేదే లే.. చీమల్లో చాలా రకాలు కుడతాయి. ఇందుకోసం వాటికి ప్రత్యేకంగా గొట్టంవంటి నిర్మాణం (స్టింగ్) ఉంటుంది. కానీ ‘డోర్ హెడ్’ చీమలకు స్టింగ్ ఉండదు. దాంతో కుట్టలేవు. కానీ శత్రు పురుగులు, కీటకాలు గూడులోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రాణాలనైనా పణంగా పెడతాయని.. పురుగులు ఈ చీమల తలపై గట్టిగా దాడి చేసినా, కుట్టినా వెనక్కితగ్గవని స్టీవ్ యనోవిక్ చెప్పారు. తాము పరిశీలించిన ‘డోర్ హెడ్’ చీమల్లో చాలా వాటికి తలపై గాయాల గుర్తులు ఉన్నాయని వివరించారు. చీమల గూడు నిరంతరం మూసేసి ఉండదని.. ఏదైనా ప్రమాదం వస్తున్న సంకేతాలు కనబడగానే ‘డోర్‌హెడ్’ చీమలు ద్వారానికి తలుపులా తమ తలను అడ్డుపెట్టేస్తాయని తెలిపారు. -
డైనోసార్లకు చుట్టాలు చీమలు..వాటర్ ప్రూఫ్ కూడా!
‘చీమంత బలం నీది .. నువ్వేం చేస్తావ్ రా నన్ను’ అంటూ చీమను తక్కువ చేసి మాట్లాడుతుంటారు కానీ చీమకున్నంత బలం, చీమకున్నంత ఓర్పు, నేర్పు, కలుపుగోలుతనం.. అబ్బో చాలా వాటిల్లో మనుషులను మించి ముందున్నాయి. వీటికి సంబంధించి అవాక్కయ్యే నిజాలు కూడా చాలానే ఉన్నాయి. ఆ ‘చాలా’ ఏంటో తెలుసుకుందామా! డైనోసార్లకు చుట్టాలు చీమలు నిజం. హార్వర్డ్, ఫ్లోరిడా స్టేట్ వర్సిటీల పరిశోధనలో ఇది తేలింది. 130 మిలియన్ సంవత్సరాల కిందటి నుంచే చీమలు ఉన్నాయంట. డైనోసార్లు అంతరించినా ఇవి మాత్రం గడ్డు పరిస్థితులను తట్టుకొని నిలబడ్డాయంట. చీమలు.. రైతులు ఏంటి.. నిజమా! అని అనుకొనే ఉంటారు. మనుషులు కాకుండా ఇంకే జీవులైనా ఇతర జీవులను పెంచి పోషిస్తున్నాయంటే అవి చీమలే. ఆహారం, ఇతర ఉత్పత్తుల కోసం ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లను మనుషులు పెంచుతున్నట్టే.. చీమలు కూడా కొన్ని రకాల నల్లులను పెంచి పోషిస్తాయి. ఇతర జీవుల నుంచి రక్షణ కల్పిస్తాయి. వానాకాలంలో ఇబ్బంది పడకుండా వాటి ఇళ్లల్లో చోటిస్తాయి. బదులుగా ఆ నల్లుల నుంచి తేనెను తీసుకుంటాయి. అలాగే ఆహారానికి, నివాసానికి కావాల్సిన మంచి ప్రాంతమెక్కడుందో తెలుసుకోవడానికి తమ తోటి చీమలందరి నుంచి సలహాలను తీసుకొని మరీ చీమలు ముందుకెళ్తాయి. పాఠాలు నేర్పించగలవు మనుషులు, జంతువుల్లా చీమలు కూడా తమ తోటి చీమలకు పాఠాలు చెప్పగలవు. నేర్పించగలవు. చాలా జంతువులు తమ తోటి జంతువులను అనుసరించి కావాల్సినవి నేర్చుకుంటుంటాయి. కానీ చీమలు కాస్త వేరు. కొన్ని రకాల రసాయనాలను బయటకు విడుదల చేసి పక్క చీమలకు కొన్ని రకాల విషయాలు నేర్పిస్తుంటాయి. ఉదాహరణకు కొత్త ప్రాంతానికి, ఇంటికి గనుక చీమలు వెళ్తే పక్క చీమలు ఆ ప్రాంతాన్ని గుర్తుంచుకోవడానికి వీలుగా రసాయనాలు వదులుతుంటాయి. ప్రతి కొంత దూరానికి ఇలా చేస్తుంటాయి. మిగతా చీమలు ఆ వాసన పసిగట్టి ముందుకెళ్తుంటాయి. చీమలు ఒకే వరుసలో వెళ్లడానికి ప్రధాన కారణమిదే. చీమలు పనికెక్కాయంటే పక్కా మరి. ఇవి వాటర్ ప్రూఫ్ చీమలు నీటిలో ఈదగలవు. అలాగని బటర్‌ఫ్లై స్టైల్లో ఈతకొడతాయని కాదు. వాటిస్థాయిలో నీటిపై తేలుతూ వెళ్తుంటాయి. ఒకవేళ నీటి అడుగుకు వెళ్లినా కూడా బతకగలవు. ఎలాగా..? అంటే వాటికి ఊపిరితిత్తులుండవు మరి. వాటి శరీరంపై ఉండే రంధ్రాలతో ఆక్సిజన్ పీల్చుకోవడం, కార్బన్‌డై ఆౖMð్సడ్‌ను వదలడం చేస్తుంటాయి. రంధ్రాలు చిన్న చిన్న గొట్టాలకు కలిపి ఉంటాయి. వీటి నుంచి శరీరంలోని ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. కాబట్టి చీమలు నీటి అడుగుకు వెళ్లినా 24 గంటల్లోపు నీళ్లు ఆవిరైతే అవి మళ్లీ బతికేయగలవు. కొన్ని శరీర భాగాలు పోయినా కొన్ని చీమలు జీవిస్తాయి. కొన్ని తిండి, నీళ్లు లేకున్నా వారాల తరబడి బతికేస్తాయి. చీమలకు చెవులు కూడా ఉండవు. అలాగని వినలేవని కాదు. వైబ్రేషన్స్ ద్వారా ఇవి వినగలుగుతాయి. రెండు పొట్టల జీవులు చీమలకు రెండు పొట్టలుంటాయి. అలాగని ఇవేం అత్యాశపరులేం కాదు. ఒక పొట్టలో తమకు కావాల్సిన ఆహారం పెట్టుకుంటాయి. మరో పొట్టలో వేరే చీమలకు కావాల్సిన ఆహారం నిల్వ చేసుకుంటాయి. కొన్ని చీమలు తమ గూడు వదిలి ఆహారం కోసం వెళ్లినప్పుడు తమ ప్రాంతానికి కాపలాగా ఉంటాయి. ఇలా బయటకు వెళ్లిన చీమలు కాపలాగా ఉండే చీమలకు ఆ రెండో పొట్టలో తిండి దాచుకొని తీసుకొస్తాయి. చాలా.. అంటే చాలానే.. ప్రపంచంలో చీమల జనాభా ఎంతనుకుంటున్నారు. చాలానే ఉంటుంది. చాలా అనే పదం వాడినా తక్కువేనేమో. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి మనిషికి సరాసరి 10 లక్షల చీమలున్నాయి. చీమల్లో దాదాపు 10 వేల రకాలు ఉన్నాయి. బలంలో బాహుబలులు చీమలు బలంలో బాహుబలులు. వీటి శరీర బరువుకు దాదాపు 10 నుంచి 50 రెట్ల వరకు బరువును మోసుకెళ్లగలవు. చీమల పరిమాణంతో, బలంతో పోల్చితే ప్రపంచంలో అత్యంత బలమైన జీవులివే. ఆసియా జాతికి చెందిన చీమలైతే తమ బరువుకు దాదాపు 100 రెట్లు బరువును తీసుకెళ్లగలవు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ రిపోర్టు ప్రకారం.. చీమలు చిన్నగా ఉంటాయి కాబట్టి వాటి కండరాల్లో విభజన ఎక్కువుంటుంది. దాని వల్ల మిగతా జీవులతో పోల్చితే ఎక్కువ బలాన్ని ప్రయోగించగలవు. -
Viral Video: అరే ఇటు చూడండ్రా.. నన్నే వదిలేసి వెళ్లిపోతారేంట్రా?
-
వైరల్: ‘వార్నీ ఎంత అన్యాయం.. చేతులతో ఎత్తి పైకి పంపిస్తే.. చేయిచ్చారు’
జీవితంలో నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. కొన్ని ఇతరులు చెప్పడం వల్ల తెలిస్తే మరికొన్ని సొంత అనుభవాల ద్వారానే బోధపడుతుంటాయి. కేవలం మనుషులతోనే కాదు, ప్రకృతి, జంతువుల ద్వారా కూడా బోలేడు విషయాలు నేర్చుకోవచ్చు.. తాజాగా అలాంటి ఓ వీడియోను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిన్న చీమలకు సంబంధించిన విషయం మావవ జీవితానికి ఎలా ముడిపడి ఉందనే విషయం ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. చదవండి: ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’ వీడియోలో మూడు చీమలు ఒక పెద్ద ఆకు మీదకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఈ మూడింటిలోఒక చీమ కింద నుంచి సాయం చేస్తుండగా మిగతా రెండు చీమలు ఆకు పైకి ఎక్కేస్తుంటాయి. రెండు చీమలు ఆకు ఎక్కిన తరువాత వీటికి సాయం చేసిన చీమను మాత్రం ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతాయి. దీనిని బెన్ ఫిలిప్స్ అనే వ్యక్తి ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేశారు. చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ ‘ఇది ఇప్పటివరకు చేసిన అత్యంత బాధాకరమైన సినిమా’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు 4 మిలియన్ల వ్యూవ్స్ సంపాదించింది. దీనిని చూసిన నెటిజన్లు చిన్న చీమల వీడియో వెనక పెద్ద జీవిత సత్యం దాగుందంటూ కామెంట్ చేస్తున్నారు. చివరికి మిగిలిన చీమ పట్ల జాలిపడుతూ, ప్రస్తుతం మనుషులు కూడా ఇలాగే తయారయ్యారని పేర్కొంటున్నారు. మరికొంత మంది‘వార్నీ ఎంత అన్యాయం.. చేతులతో ఎత్తి పైకి పంపిస్తే.. చేయిచ్చారే’ అంటూ ట్వీట్ చసస్తున్నారు. -
వైరల్: చలి చీమ చేతలకు పాము గిలగిల
బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమలచేత చిక్కిచావదె సుమతీ! ఆస్ట్రేలియాలో జరిగిన ఓ సంఘటనకు ఈ పద్యం సరిగ్గా సరిపోతుంది. ఓ పాము చిన్న చలి చీమ చేతలకు చిక్కి గిలగిల్లాడింది. సౌత్ ఆస్ట్రేలియాలోని వేయిట్ పింగా క్యాంప్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొద్దిరోజుల క్రితం సెత్ ఎమెరీ అనే వ్యక్తి కుమారులు సరదాగా బయటకు వెళ్లారు. ఓ చోట వాళ్లు ఓ పామును చూశారు. ఆ పాము ముందుకు వెళ్లలేక గిలగిల్లాడటం గమనించారు. ఎందుకా అని చూస్తే.. దాని తలపై ఓ చీమ కనపడింది. ఆ చీమ పాము తలను కొరుకుతూ.. విడవకుండా పట్టుకుంది. దీంతో పాము బాధతో అల్లాడుతూ.. మెలికెలు తిరగసాగింది. చీమనుంచి తప్పించుకోవటానికి తీవ్ర ప్రయత్నమే చేసింది. చదవండి, చదివించండి : బాస్‌ను చితక్కొట్టిన మహిళ, కారణం తెలిస్తే శభాష్ అనాల్సిందే! -
చీమల్ని చంపబోయి అగ్నికి ఆహుతైన యువతి!
సాక్షి, చెన్నై: చీమల్ని చంపేందుకు అగ్గితో చేసిన ప్రయత్నం ఓ యువతిని ఆహుతి చేసింది. ఆదివారం అమింజికరైలో ఈ ఘటన వెలుగు చూసింది. చెన్నై అమింజికరై పెరుమాల్ ఆలయం వీధికి చెందిన సత్యమూర్తికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె సంగీత(27) ఉన్నారు. షోళింగనల్లూరులోని ఓ సంస్థలో సంగీత ఐటీ ఇంజినీర్. వీరి నివాసం కూవం నదీ తీరంలో ఉంది. శనివారం చీమల్ని చంపేందుకు సంగీత చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. చీమలు ఉన్న చోట్ల కిరోసిన్ పోసి నిప్పుపెట్టింది. (42 ఏళ్ల క్రితం చెన్నైలో చోరీ.. లండన్‌లో దొరికాయి!) అదే సమయంలో తన చేతిలో ఉన్న బాటిల్ నుంచి కిరోసిన్‌ను మంటలపై పోసి ప్రమాదాన్ని ఆమె కొని తెచ్చుకుంది. చేతిలో ఉన్న కిరోసిన్ బాటిల్‌సహా మంటలు చుట్టుముట్టడంతో అగ్నికి ఆహుతి అవుతున్న సంగీతను రక్షించే ప్రయత్నంలో తల్లిదండ్రులు, సోదరుడు గాయపడ్డారు. ఇరుగు పొరుగు అతికష్టంపై కొన ఊపిరితో ఉన్న సంగీతను చికిత్స నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం సంగీత విగతజీవి గా మారింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. (పేద విద్యార్థి కల నెరవేర్చిన శివకార్తికేయన్) -
జాక్ మా వివాదాస్పద వ్యాఖ్యలు.. షాక్
సరిగ్గా రెండు రోజుల ముందు యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి చైనా అధికారులు షాకిచ్చారు. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ తొలుత లిస్టింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించగా.. తదుపరి హాంకాంగ్ మార్కెట్ సైతం ఇదే నిర్ణయాన్ని ప్రకటించింది. వెరసి 37 బిలియన్ డాలర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తాత్కాలికంగా చెక్ పడింది. గురువారం అటు హాంకాంగ్, ఇటు షాంఘైలలో ఒకేసారి లిస్టింగ్ చేసే యోచనలో యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు చేపట్టింది. అయితే మంగళవారం రాత్రి షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ ఇందుకు బ్రేక్ వేసింది. ఈ వార్తల ఫలితంగా మంగళవారం యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలో అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ షేరు దాదాపు 10 శాతం పతనంకావడం గమనార్హం! అన్లైన్ లెండింగ్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యాంట్ గ్రూప్ ప్రమోటర్ జాక్ మా చైనీస్ బ్యాంకులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రభావం చూపినట్లు యాంట్ గ్రూప్ తాజాగా అభిప్రాయపడింది. యాంట్ గ్రూప్‌లో ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు మూడో వంతు వాటా ఉంది. ఆన్లైన్లో మైక్రోరుణాలందించే యాంట్ గ్రూప్‌ను జాక్ మాకు చెందిన అలీబాబా గ్రూప్ ప్రమోట్ చేసింది. ఆన్లైన్ లెండింగ్పై సవరించిన ఫిన్‌టెక్ నిబంధనలు, లిస్టింగ్‌కు సంబంధించిన వివరాల వెల్లడిలో వైఫల్యం తదితర కారణాలతో యాంట్ గ్రూప్ లిస్టింగ్‌కు చైనీస్ నియంత్రణ సంస్థలు మోకాలడ్డినట్లు అక్కడి మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఫైనాన్షియల్ నియంత్రణ సంస్థల అధికారులు సోమవారం యాంట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ జింగ్‌తోపాటు.. సీఈవో సైమన్ హును ఆన్లైన్ లెండింగ్ బిజినెస్‌పై ప్రశ్నించినట్లు ఈ సందర్భంగా తెలియజేశాయి. చదవండి: యూఎస్ మార్కెట్లకు జో బైడెన్ జోష్ -
చీమంత పాఠం
అది ఓ ఆదివారం. ఓ ధనవంతుడు తన ఇంటి బాల్కనీలో పడక్కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో ఆయన దృష్టి ఓ మూలగా వెళ్తున్న చీమ మీద పడింది. అది తనకన్నా అనేక రెట్లు పెద్దదయిన ఓ ఆకును తీసుకుపోతోంది. అదేమీ హడావుడి పడటంలేదు. ఎంతో జాగర్తగా నెమ్మదిగా సాగుతోంది. సరిగ్గా అప్పుడే దానికి నేల మీద ఓ తీపి పదార్థం కనిపించింది. దాన్ని ఆకు మీదకు తీసుకుని పోతోంది. మధ్యలో దానికి కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ అది వాటిని ఎంతో నేర్పుతో ఓర్పుతో అధిగమించి ముందుకు పోతోంది. ఈ చీమ పయనాన్ని ఆయన చాలాసేపే చూశాడు. ఓ చీమ పట్టుదల ప్రయాణం ఆయనను ఆలోచనలో పడేసింది. చీమ చతురత, తెలివితేటలు చూస్తే ఆయనకు చాలా ముచ్చటేసింది. దేవుడి సృష్టిని తలచుకుని అంతకు మించిన ఆశ్చర్యం కలిగింది. చీమకూ, మనిషికీ మధ్య ఒకటి రెండు పోలికలు లేకపోలేదు. చీమ చివరికి తన గమ్యస్థానానికి చేరుకుంది. అది మరొకటి కాదు. చీమలపుట్ట. అది చిన్నదే కానీ లోతైనదిలా కనిపించింది. చీమ తన దగ్గరున్న ఆకుతో సహా అందులోకి ప్రవేశించలేకపోయింది. చీమ మాత్రమే అందులోకి వెళ్ళే వీలుంది. ఓ గంట పాటు ఆకును తీసుకుని ప్రయాణించిన చీమ ఇప్పుడేం చేయాలి? ఆకును పుట్ట బయటే విడిచిపెట్టి అది మాత్రమే లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి. అటువంటప్పుడు చీమ ఇంతసేపూ చేసిన ప్రయాణం వృధానే కదా... అనిపిస్తుంది. ఇంతోటి దానికి అది ఇంతగా శ్రమించకుండా ఉండాల్సింది కదా అనిపిస్తుంది చూసేవారికి. ఈ నేపథ్యంలో చీమ నుంచి ఓ పాఠం నేర్చుకున్నాడా ధనవంతుడు... అనవసరంగా అవీ ఇవీ చేర్చుకుంటూ జీవితాన్ని లాగడం ఎందుకని తన డైరీలో రాసుకున్నాడు. మనిషి తన జీవిత ప్రయాణంలో ఎన్నో ప్రయత్నాలు చేసి కష్టించి శ్రమించి కావలసిన వసతులు సమకూర్చుకుం టాడు. ఓ పెద్ద భవనం కట్టుకుంటాడు. విలాసవంతమైన కారు కొంటాడు. ఆడంబ రమైన జీవితం సాగిస్తాడు. చివరికి అతను శ్మశానానికి పోయేటప్పుడు ఇంతకాలమూ అనుభవించిన వాటినన్నింటినీ విడిచిపెట్టి తాను మాత్రమే వెళ్ళక తప్పదు. – సాత్యకి యామిజాల -
డైమండ్ దొంగ.. వైరల్ వీడియో
-
చిన్న చీమ, పెద్ద డైమండ్.. వైరల్ వీడియో
బలవంతమైన సర్పము.. చలి చీమల చేత చిక్కి ..అనే సుమతీ పద్యం గుర్తుందా. చీమల బలం, నైపుణ్యం గురించి ఇంతకన్నా ఉదాహరణ బహుశా ఉండదేమో. క్రమశిక్షణలోగానీ, ఆహారాన్ని దాచుకునే విషయంలోగానీ చీమలను చూసి నేర్చుకోవాలంటారు పెద్దలు. ఎందుకంటే శరీర బరువు కంటే దాదాపు 10 రెట్లు బరువున్న వస్తువులను కూడా అవి అలవోకగా మోయ్యగలవట. ఇలా పుట్టల్లోకి లాక్కుపోతూ ఉండే దృశ్యాలను బాల్యంలో చాలామందిమి చూసే వుంటాం, కదా.. అయితే తాజాగా ఇలాంటి చీమ ఒకటి ఆభరణాల షాపులోకి దూరింది. అక్కడ ఉన్న తెల్లగా మెరిసిపోతున్న డైమండ్స్‌ను చూసి తినుబండారం అనుకుందో ఏమో తెలియదుగానీ...తన చిట్టి బుర్రకు పదును పెట్టింది. డైమండ్ వ్యాపారి తన పనిలో మునిగి ఉండగా.. అందులోంచి తనకు నచ్చిన వజ్రాన్ని అతి కష్టం మీద మోసుకు రావడం మొదలు పెట్టింది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న కెమెరా కంటికి చిక్కాయి.. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వజ్రం విలువ దాదాపు రూ.10 లక్షల రూపాయలట. ఆ వీడియో విశేషాలను మీరు కూడా వీక్షించండి. -
హలో..నేనండీ.. చిట్టిపొట్టి చీమను..
ఆ రాజుగారి ఏడుగురు కొడుకులు వేట కెళ్లిన కథలో.. పుట్టలో వేలు పెడితే నే కుట్టనా అన్న చీమను నేనే.. అంతేకాదు.. చిన్నప్పుడు మీ పుస్తకాల్లో కష్టజీవి, సంఘజీవి అంటూ పొగడ్తల వర్షం కురిపించిన చీమను కూడా నేనే.. మీకు తెలుసుగా.. మేము మా బరువు కంటే 100 రెట్లు ఎక్కువ బరువును మోయగలమని.. అయితే.. అలా మోసినప్పుడు మీరు ఎప్పుడైనా చూశారా? ఇదిగో ఇప్పుడు చూసేయండి. మావోడు ఇచ్చిన స్టిల్ చూస్తుంటే.. బాడీ బిల్డింగ్ పోటీలకు ప్రిపేర్ అవుతున్నట్లు కనిపిస్తోంది కదూ.. ఈ చిత్రాన్ని ఇండోనేసియాకు చెందిన మాక్రో ఫొటోగ్రాఫర్ ఎకో అడియాంటో తీశారు. ఆయన సూక్ష్మ చిత్రాలు తీయడంలో ప్రసిద్ధుడు. మా కండబలాన్ని ప్రదర్శిస్తూ.. మాకంటే ఎంతో బరువైన పండును నెత్తిన బాలెన్సింగ్ చేస్తూ.. తీసుకొస్తున్న చిత్రాలను ఆయన భలేగా తీశారు. ఎలాగూ వచ్చాను కాబట్టి.. మా గురించి ఓ నాలుగు ముక్కలు చెప్పి పోతాను. మా అంత బలం మనుషులకుంటే.. వారు ఏకంగా 4 వేల కిలోల బరువును ఎత్తేయగలరు. చీమలు మీకంటే ముందు నుంచే అంటే.. ఈ భూమ్మీద 13 కోట్ల ఏళ్ల నుంచీ ఉన్నాయి.. అంతేకాదు.. ఈ భూమ్మీద ఉన్న మొత్తం చీమల బరువు.. 700 కోట్ల మంది మనుషుల బరువుతో సమానం. అంటార్కిటికా.. గ్రీన్లాండ్.. కొన్ని సుదూర ద్వీపాల్లో తప్పిస్తే.. మేం అన్నిచోట్లా ఉన్నాం. మాకు రెండు పొట్టలు ఉంటాయి.. ఒకటి మేం తిన్నది జీర్ణం చేసుకోవడానికి.. మరొకటి ఆహారాన్ని నిల్వ చేయడానికి.. మాకు ఊపిరితిత్తులు ఉండవు. చిన్నచిన్న రంధ్రాల ద్వారా ఆక్సిజన్ మా శరీరంలోకి వెళ్తుంది. మాలో కొన్ని చీమల జాతులు కొన్నివారాల పాటు బతికితే.. మా రాణులు 30 ఏళ్ల వరకూ బతుకుతాయి. చెప్పింది చాలు.. చాలా పనుంది.. ఇక ఉంటా మరి.. -
అండమాన్‌లో బయటపడ్డ.. అరుదైన చీమలు
సాక్షి, న్యూఢిల్లీ : అండమాన్ దీవుల్లో చీమ జాతికి చెందిన అత్యంత అరుదైన రెండు రకాల చీమలను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అండమాన్ ద్వీప సముదాయంలోని హావ్లాక్ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (బెంగళూరు), జపాన్‌కు చెందిన ఒకినోవా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. కొత్తగా గుర్తించిన ఈ జీవులకు ప్రముఖ శాస్త్రవేత్తలైన కేఎస్, కృష్ణన్, జార్వాల పేర్లు వచ్చేలా.. టెట్రానియం క్రిష్ణాని, టెట్రానియం జార్వా అని నామకరణం చేశారు. అండమాన్ దీవుల్లోని మొక్కలు, అక్కడ పెరిగే ఆకుకూరల మీద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తొలిసారిగా చీమ జాతులకు చెందిన జీవులను గుర్తించారు. ఇవే కాకుండా ఇప్పటివరకే 50 రకాల చీమల జాతులను ఉనికిని గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందం సభ్యుడు గౌరవ్ అగ్వేకర్ చెప్పారు. భవిష్యత్తులో దేశంలోని అన్ని రకాల చీమ జాతుల సమాచారాన్ని నిక్షిప్తం చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. చీమ జాతుల్లో చాలావాటి గురించిన సమాచారం అందుబాటులో లేదన్నారు. వీటి గురించి సమాచారం నిక్షిప్తం చేస్తే భవిష్యత్‌లో పర్యావరణ, పరిణామ మార్పులకు సంబంధించిన పలు అంశాలకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. -
చీమకు కొండైనా బరువు కాదు!
ఒక ధనికుడికి ఆదివారం ఉదయం తీరిక దొరికింది. పైగది వసారాలో కూర్చొని సూర్యోదయాన్ని చూస్తూ తేనీరు సేవిస్తున్నాడు. వసారాలో ఒక చీమ ఈ వైపు నుంచి ఆ వైపుకు, తనకన్నా కొన్ని రెట్లు పెద్దదైన ఒక ఆకును మోసుకుని వెళ్లడం అతడి కంట పడింది. చీమ చాలా ప్రయాస పడుతోంది. ఆకును లాగలేకపోతోంది. మధ్యలో అడ్డంకులు, అవాంతరాలు వస్తున్నాయి. అయినా కూడా చీమ తన ప్రయత్నం మానలేదు! కొద్దికొద్దిగా ఆకును జరుపుకుంటూ వెళ్తోంది. ఒక చోట నేలపై చీమకు ఒక పగులు అడ్డొచ్చింది. పగులు మీదుగా ఆకును లాక్కుంటూ వెళ్తే కనుక చీమ ఆ పగులులో జారి పడిపోవడం ఖాయం. చీమనే చూస్తూ ఉన్నాడు ధనికుడు. చీమ ఆకును అక్కడే వదిలేసి వెళ్లిపోతుందా? ఆకును మళ్లీ వెనక్కు తోసుకుపోతుందా అని ఆలోచిస్తున్నాడు. చీమ ఆ పగులు దగ్గరే కొద్దిసేపు తచ్చట్లాడింది. తర్వాత ఆకును మెల్లగా పగులు పైకి చేర్చింది. ఆ తర్వాత ఆకు పైకి ఎక్కి, పగులుకు అటు వైపు దిగింది. తిరిగి ఆకును లాక్కుంటూ వెళ్లడం ప్రారంభించింది. ఇదంతా ధనికుడికి అబ్బురంగా అనిపించింది. ఆ చిన్న జీవి తెలివికి అతడు ముగ్ధుడయ్యాడు. దేవుని సృష్టిలో అల్పమైనదిగా కనిపించే చీమలో ఎంత ఆలోచన! ప్రయాణం మొదలు పెట్టక ముందే మనం గమ్యం గురించి దిగులు పెట్టుకుంటాం. ‘అవాంతరాలు వస్తేనో..’ అని, వస్తాయో రావో తెలియని సమస్యల్ని ఊహించుకుంటాం. బాధ్యతల్ని బరువుగా భావిస్తాం. కుటుంబం ఒక బరువు. ఉద్యోగం ఒక బరువు. ఆస్తుల్ని కాపాడుకోవడం ఒక బరువు. నిజానికి వీటిలో ఏదీ బరువు కాదు. ఎక్కడ వీటిని పోగొట్టుకుంటామోనన్న భయమే మనకు బరువుగా అనిపిస్తుంది. ప్రయాణం ప్రారంభం కావడానికి ముందే గమ్యం గురించి ఆలోచించదు కాబట్టే చీమకు కొండైనా బరువు కాదు. కొండ కదిలిందా లేదా అన్నదే ముఖ్యం. కొండ కదులుతుందా లేదా అన్నది ముఖ్యం కాదు. -
'చీమ కుట్టినట్లైనా లేదే!'
వేంపల్లె: రైతులు వరుస కరువులతో కొట్టుమిట్టాడుతుంటే సీఎం చంద్రబాబు నాయుడుకు చీమ కుట్టినట్లైనా లేదని కాంగ్రెస్ నేత ఎన్.తులసిరెడ్డి ధ్వజమెత్తారు. గోదావరి పుష్కరాల్లో నిండా మునిగి తేలుతూ ప్రచార ఆర్భాటానికే ఆసక్తి చూపుతున్న సీఎం చంద్రబాబు.. రైతుల కష్టాల గురించి పట్టించుకోకపోవడం తగదన్నారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పుష్కరాల కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని రైతులకు 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పంటల బీమా రూ.2,560 కోట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమన్నారు. 2012-13 రబీ సీజన్లో వైఎస్ఆర్ జిల్లాలో 70 వేల మంది శనగ, పొద్దుతిరుగుడు రైతులు బీమా ప్రీమియం చెల్లించారని.. రెండేళ్లుగా నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. సీఎం జపాన్, చైనా, సింగఫూర్ దేశాల్లో తిరుగుతూ రైతుల సమస్యలను గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతులను ఓదార్చి, వారి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్తాన్ని నిలదీసేందుకు ఈనెల 24న రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారన్నారు. అప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే ప్రత్యక్ష ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. పది రోజులుగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ప్రధాని నరేంద్రమోడి స్వచ్ఛ భారత్.. అంటుంటే, చంద్రబాబు చెత్తాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. -
గడుగ్గాయి
టీచర్: చీమలను చూసి ఏం నేర్చుకోవాలి రా? చింటు: తీపి తినడం, దాచుకోవడం త్యాగం నరేష్: ఒరే సోము, నీ బైకు ఎవరో ఎత్తుకెళ్లారంట... కంప్లయింట్ ఇవ్వలేదా? సోము: ఎలా వచ్చింది అలా పోతుంది. దానికెందుకురా కంప్లయింట్! చాలా బాగుంది లేడీ డాక్టర్: గట్టిగా మూడు సార్లు గాలిపీల్చి వదలండి. శంకర్రావు: వదిలానండి. లేడీ డాక్టర్: ఇపుడేమనిపిస్తోంది? శంకర్రావు: మీ సెంటు చాలా బాగుందనిపిస్తోందండీ భర్తకు వైద్యం భార్య: డాక్టరు గారూ, మా వారిని కొంచెం పరీక్షించండి డాక్టరు: ఏమైంది? భార్య: రాత్రిపూట నిద్రలో ఒకటే మాట్లాడుతున్నారు. డాక్టరు: దానికి చికిత్స ఎందుకమ్మా, పగటి పూట నువ్వు ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తే చాలు. పంచ్! నాగరాజు: పొద్దున ఒక యజమాని గాడిదను కొడుతుంటే ఆపా, దీన్నేమంటారో తెలుసా? గంగరాజు: సోదర ప్రేమ !! పెళ్లి మానే అవకాశం భక్తుడు: గురువు గారూ, నాకో ధర్మ సందేహం ఉంది. గురువు: అడుగు నాయనా? భక్తుడు: మనిషికి భవిష్యత్తు తెలిసిపోయే శక్తి వస్తే ఏం జరుగుతుంది? గురువు: ఇక పెళ్లిళ్లు జరగవు నాయనా, ఆశ్రమాలు కిటకిటలాడుతాయి. -
చీమల పుట్టలతో... పుడమికి చల్లదనం!
పిపీలికాల గురించి మీకేం తెలుసు? కష్టజీవులు.. క్రమశిక్షణతో కూడిన సంఘజీవులు.. వాటిని చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు.. ఇంకా? వాటిని డిస్ట్రబ్ చేస్తే మాత్రం చటుక్కున చిటుక్కుమనిపించి మంట పుట్టిస్తాయి. అప్పుడు మనకు చిరాకు పుట్టి చేతితో లేదా కాలితో నలిపేస్తాం కూడా. ఇంకా..? కొన్ని దేశాల్లో ఆహారంగా పనికొస్తాయి. మందుల తయారీకీ వాడతారట. అంతేనా? అయితే వీటి గురించి ఆశ్చర్యకరమైన ఓ కొత్త సంగతి గురించి తెలుసుకుందాం. అదేంటంటే.. చీమలు భూగోళానికి చల్లదనాన్ని కూడా ఇస్తాయట! భూతాపోన్నతి(గ్లోబల్ వార్మింగ్)ని తగ్గించేందుకు ఇవి పరోక్షంగా తమ వంతు సాయం చేస్తాయట. ఇవి కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను విచ్ఛిన్నం చేసి సున్నపురాయిగా స్రవిస్తాయట. ఈ ప్రక్రియలో వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ఈ సున్నపురాయిలో నిక్షిప్తం అయిపోతుందట. అందువల్ల వాతావరణంలో నుంచి కొంత కార్బన్డయాక్సైడ్ తగ్గి, తద్వారా భూతాపోన్నతీ తగ్గుతుందన్నమాట. అదేవిధంగా చీమలు మట్టి, ఇసుక రేణువులను నోటితో కరుచుకుని తెచ్చి గోడలకు అతికిస్తూ పుట్టలను పటిష్టంగా నిర్మిస్తాయన్నది తెలిసిందే. అయితే అవి ఇసుక రేణువులను నోటితో నాకి గోడకు అతికించేటప్పుడు కూడా వాటిలో మార్పులు జరిగి కార్బన్డయాక్సైడ్ నిక్షిప్తం అవుతుందట. మామూలు ఇసుక కన్నా.. బసాల్ట్ ఇసుక రేణువులు దొరికితే ఇవి 50-300 రెట్లు వేగంగా విచ్ఛిన్నం చేసేస్తాయట. కానీ ఇంత పెద్దభూగోళానికి చీమలు చేసే సాయం చాలా చిన్నదేనని, అయినా వీటి కృషిని తక్కువచేసి చూడరాదంటున్నారు ఈ సంగతిని కనిపెట్టిన అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుడు రోనాల్డ్ డార్న్. -
చీమ చేసే యాసిడ్ అటాక్..
ఇక్కడ యాసిడ్‌లాంటి దాన్ని చిమ్ముతోంది చీమలే! వీటిని వుడ్‌ల్యాండ్ చీమలంటారు. పక్షులు వంటివి తమను తినడానికి వచ్చినప్పుడు ఈ చీమలు ఆత్మరక్షణ కోసం పొట్టలో ఉండే యాసిడ్లాంటిదాన్ని వాటిపై చిమ్ముతూ భయపెడుతుంటాయి. ఈ యాసిడ్ వాసన వెనిగర్లాగ ఉంటుంది. మనుషులకు దీని వల్ల ఎలాంటి హానీ జరగకున్నా.. పక్షులు మాత్రం భయపడిపోతాయట. ఈ చీమలు బ్రిటన్‌తోపాటు ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. -
చీమ శ్రమైక జీవనంలో.. విలువైన పాఠాలెన్నో!
మనం జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవసరమైన పాఠాలను వివిధ వ్యక్తుల నుంచి నేర్చుకుంటాం. వీరే కాకుండా మన చుట్టూ ఉండే చిరుప్రాణులు సైతం ఎంతో విలువైన విషయాలను మనకు నేర్పుతాయి. మనలో తెలివితేటలు, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలే కానీ.. చిన్న జీవుల నుంచే పెద్ద పాఠాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు.. సుఖవంతమైన జీవనం గడపాలంటే.. ఏం చేయాలో చీమలను చూసి నేర్చుకోవచ్చంటే మీరు నమ్ముతారా? నమ్మితే నాలుగు విలువైన పాఠాలేంటో చూద్దాం.. పట్టిన పట్టు విడవొద్దు తాము వెళ్తున్న దారిలో ఏదైనా అడ్డంకి ఎదురైతే చీమలు ఏం చేస్తాయో తెలుసా? చీమల మార్గంలో మీ వేలును అడ్డంగా పెట్టండి. ఏం జరుగుతుందో నిశ్శబ్దంగా గమనించండి. ఊహించని అవాంతరం ఎదురైందని చీమలు వెనక్కి వెళ్లవు. వేలు పక్కనుంచే కొత్తదారిని ఏర్పరచుకుంటాయి. అవసరమైతే వేలుపైకి ఎగబాకి ముందుకు కదులుతాయి. దారి దొరికేదాకా ప్రయత్నిస్తూనే ఉంటాయి. నిరాశ చెంది ప్రయత్నం నుంచి విరమించుకోవు. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం ఉంది. మన జీవితంలోనూ ఎన్నో ఊహించని అడ్డంకులు, నివారించలేని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. అంతమాత్రాన లక్ష్యాన్ని వదిలేసి వెనక్కి పారిపోవాల్సిన అవసరం లేదు. గమ్యం చేరేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉండాలి. పట్టిన పట్టు విడవొద్దు(నెవర్ గివ్ అప్).. అంటూ బ్రిటీష్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ నుంచి వెలువడిన గొప్ప సూక్తికి స్ఫూర్తినిచ్చింది.. ఓ చిన్న చీమే. మంచి కాలం శాశ్వతం కాదు చీమల ఆహార సేకరణకు అత్యంత అనువైన కాలం.. వేసవి. వర్షాకాలం, శీతాకాలంలో భూఉపరితలంపై స్వేచ్ఛగా తిరగడం వీటికి వీలుకాదు. కాబట్టి సంవత్సరం మొత్తానికి సరిపడా ఆహారాన్ని వేసవిలోనే సేకరించుకొని, భద్రపరుచుకుంటాయి. ఈ కాలంలో ఆహార సేకరణలో తీరిక లేకుండా ఉంటాయి. మంచి కాలం(వేసవి) శాశ్వతం కాదని, శీతాకాలం రాక తప్పదని చీమలకు బాగా తెలుసు. అందుకే అవసరమైన తిండిని ఇప్పుడే సంపాదించుకుంటాయి. ప్రతికూల కాలంలో హాయిగా కడుపు నింపుకుంటాయి. మనం అప్రమత్తంగా ఉండాల్సింది ఇక్కడే. మన టైమ్ బాగున్నప్పుడు అదే మత్తులో ఏమరుపాటుగా ఉండొద్దు. ఎప్పుడూ మనకు మంచే జరుగుతుందనుకోవడం తెలివైన లక్షణం కాదు. విపత్కర పరిస్థితులు ఎదురుకాబోవని భావిస్తూ ధీమాగా తిరగడం సరికాదు. మీ చుట్టూ ఉండేవారితో మంచి సంబంధాలు ఏర్పరచుకోండి. వారితో మంచిగా ఉండండి. మంచి స్నేహితులను సంపాదించుకోండి. మంచి కాలం ఎప్పటికీ ఉండకపోవచ్చు. కానీ, మంచి మనుషులు మనతోనే ఉంటారు. చెడు కాలమూ ఇలాగే ఉండదు శీతాకాలంలో భరించలేనంత చలితో ఇబ్బందిపడే చీమలకు వెచ్చటి వేసవికాలందగ్గర్లోనే ఉందని తెలుసు. వేసవిలో తొలి సూర్యకిరణాలు భూమిపై ప్రసరించగానే.. చీమలు తమ నెలవుల్లోంచి వెలుపలికి వస్తాయి. కార్యాచరణను యథావిధిగా ప్రారంభిస్తాయి. ఆహారాన్వేషణకు బయలుదేరుతాయి. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు.. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు.. మనుషులు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతారు. తమ బతుకింతే అని చింతిస్తూ కూర్చుంటారు. ఇలాంటి సమయాల్లో చీమల సిద్ధాంతాన్ని గుర్తుకు తెచ్చుకోవడం మంచిది. పరిస్థితులెప్పటికీ ఇలాగే ఉండబోవని, మనదైన మంచికాలం దగ్గర్లోనే ఉందని తెలుసుకోవాలి. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం చాలా అవసరం. అంతా మంచే జరగబోతోందనే ఆశావాదాన్ని మనసులో నింపుకోవాలి. చెడు కాలం శాశ్వతం కాదన్న సత్యాన్ని స్మరించుకోవాలి. శక్తివంచన లేకుండా శ్రమించాలి చీమ తనకు చేతనైనంత తిండిని సేకరించుకుంటుంది. తన సాటి చీమ ఎంత తిండిని సంపాదించుకుంటోందనే విషయాన్ని మరో చీమ పట్టించుకోదు. తన కంటే ఎక్కువ సంపాదించుకున్న చీమలను చూసి అసూయ చెందదు. వాటిపై ద్వేషాన్ని పెంచుకోదు. ఒకవేళ తన దగ్గర వాటి కంటే తక్కువ ఆహారం ఉంటే చింతిస్తూ కూర్చొదు. తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. శక్తివంచన లేకుండా శ్రమించి, తనకు చేతనైనంత తిండిని సమకూర్చుకుంటుంది. ఇదొక గొప్ప పాఠం. మీరు చేయగలిగేంత శ్రమను 100 శాతం చేస్తే.. మీకు విజయం, సంతోషం బహుమతులుగా లభిస్తాయి. ఇక్కడితో అంతా ముగిసిపోలేదు.. చీమల నుంచి నేర్చుకోవాల్సిన మరో పాఠం మిగిలే ఉంది. ఒక చీమ తన బరువు కంటే 20 రెట్ల ఎక్కువ బరువును సులువుగా మోస్తుంది. ఈ విషయంలో చీమ శక్తి కంటే మన శక్తి తక్కువేం కాదు. మనం ఊహించుకొని భయపడుతున్న వాటి కంటే ఎన్నో రెట్ల ఎక్కువ బరువు బాధ్యతలను మన భుజాలపై తేలిగ్గా మోయవచ్చు. ఈసారి మోయలేనంత బరువులు మీ భుజాలపైకి చేరినప్పుడు.. కుంగిపోకండి. చిన్న చీమను గుర్తుకుతెచ్చుకోండి! ఆ బరువుబాధ్యతలు మిమ్మ ల్ని బాధించవు!! -కెరీర్స్ 360 సౌజన్యంతో