వైరల్‌: చలి చీమ చేతలకు పాము గిలగిల | Tiny Ant Attack On Deadly Brown Snake In Australia | Sakshi
Sakshi News home page

వైరల్‌: చలి చీమ చేతలకు పాము గిలగిల

Published Sat, Apr 17 2021 2:18 PM | Last Updated on Mon, Feb 21 2022 4:25 PM

Tiny Ant Attack On Deadly Brown Snake In Australia - Sakshi

వీడియో దృశ్యాలు

బలవంతుడ   నాకేమని 
పలువురతో నిగ్రహించి  పలుకుట  మేలా 
బలవంతమైన  సర్పము  
చలిచీమలచేత  చిక్కిచావదె  సుమతీ!

ఆస్ట్రేలియాలో జరిగిన ఓ సంఘటనకు ఈ పద్యం సరిగ్గా సరిపోతుంది. ఓ పాము చిన్న చలి చీమ చేతలకు చిక్కి గిలగిల్లాడింది. సౌత్‌ ఆస్ట్రేలియాలోని వేయిట్‌ పింగా క్యాంప్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొద్దిరోజుల క్రితం సెత్‌ ఎమెరీ అనే వ్యక్తి కుమారులు సరదాగా బయటకు వెళ్లారు.

ఓ చోట వాళ్లు ఓ పామును చూశారు. ఆ పాము ముందుకు వెళ్లలేక గిలగిల్లాడటం గమనించారు. ఎందుకా అని చూస్తే.. దాని తలపై ఓ చీమ కనపడింది. ఆ చీమ పాము తలను కొరుకుతూ.. విడవకుండా పట్టుకుంది. దీంతో పాము బాధతో అల్లాడుతూ.. మెలికెలు తిరగసాగింది. చీమనుంచి తప్పించుకోవటానికి తీవ్ర ప్రయత్నమే చేసింది.

చదవండి, చదివించండి : బాస్‌ను చితక్కొట్టిన మహిళ, కారణం తెలిస్తే శభాష్‌ అనాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement