చంద్రుడిపై గ్రహాంతర వాసులు? | aliens found on lunar surface, video claims | Sakshi
Sakshi News home page

చంద్రుడిపై గ్రహాంతర వాసులు?

Published Thu, Aug 14 2014 9:45 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

చంద్రుడిపై గ్రహాంతర వాసులు?

చంద్రుడిపై గ్రహాంతర వాసులు?

ఈ ఫొటోను జాగ్రత్తగా గమనించండి. దీన్ని చంద్రగ్రహం మీద తీశారు. అమెరికా స్పేస్ సంస్థ నాసా ఈ చిత్రాన్ని విడుదల చేసింది. పరిశీలించి చూస్తే, ఓ మనిషి నీడ దీనిమీద కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చంద్రుడి మీద మనుషులు ఎవరూ లేరు. నాసా ప్రయోగించిన ఉపగ్రహంలోని కెమెరా మాత్రమే ఈ ఫొటోను తీసింది. అయినా.. మనిషి నీడ ఎలా కనిపించింది? అంటే గ్రహాంతర వాసులు ఉన్నట్లేనంటారా? ఇదే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతోంది.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను, ఫొటోను చూసినవాళ్లంతా ఇది గ్రహాంతర వాసి (ఏలియన్) ఫొటోనే అని బల్లగుద్ది వాదిస్తున్నారు. నాసా మాత్రం ఈ విషయాన్ని ఇంతవరకు నిర్ధారించలేదు. వావ్ఫర్రీల్ అనే యూజర్ పేరుతో పోస్టయిన ఈ వీడియోను నెల రోజులలోపే 20 లక్షల మంది చూశారు. గూగుల్ ఎర్త్ లాగే గూగుల్ మూన్ కూడా సిద్ధం చేయాలని తలపెట్టడంతో దానికోసమే ఈ ఫొటోలు తీసినట్లు సమాచారం. అందులో భాగంగా తీసిన ఓ ఫొటోలో ఈ మనిషి తరహా బొమ్మ కనపడి ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement