ఏలియన్‌ అవశేషాల పరిశోధనలో సంచలన విషయాలు | Mexico Alien Bodies Analysed Eggs Found | Sakshi
Sakshi News home page

ఏలియన్‌ అవశేషాల పరిశోధనలో సంచలన విషయాలు

Published Wed, Sep 20 2023 8:04 PM | Last Updated on Wed, Sep 20 2023 9:12 PM

Mexico Alien Bodies Analysed Eggs Found  - Sakshi

మెక్సికో సిటీ: మెక్సికో పార్లమెంట్‌లో మానవేతర అవశేషాల(ఏలియన్)ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా వైద్యుల పరిశోధనలో వీటిపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏలియన్లు భూమిపై జీవించి ఉన్నవేనని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఓ ఆడ ఏలియన్ కడుపులో గుడ్లు కూడా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దాదాపు వెయ్యి ఏళ్ల క్రితంనాటి అవశేషాలుగా కార్బన్ డేటింగ్ విధానంలో కనుగొన్నారు. 

మెక్సికో శాస్త్రవేత్తలు గ్రహాంతర శవాలపై ప్రయోగశాలలో విస్తృతమైన అధ్యయనాలు నిర్వహించారు. సోమవారం నూర్ క్లినిక్‌లో నౌకాదళానికి చెందిన ఫోరెన్సిక్ వైద్యుడు జోస్ డి జీసస్ జల్సే బెనితేజ్ పరీక్షలు పూర్తి చేశారు. ఈ ఏలియన్ల పుర్రెలు అతికించినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని చెప్పారు. భూమిపై ఏ ఇతర జంతువుతో పోలి లేవని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒకదాని కడుపులో గుడ్లు ఉన్నట్లు కనుగొన్నారు.

 ఆ రెండు అవశేషాలు ఒకే అస్థిపంజరానికి చెందినవని మెక్సికన్ జర్నలిస్ట్ ధీర్ఘకాల UFO ఔత్సాహికుడు జైమ్ మౌసన్ పేర్కొన్నారు. ఒక్కోదాని చేతికి మూడు వేళ్లు ఉన్నట్లు వెల్లడించారు. 

నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలోని శాస్త్రవేత్తలు ఆ అవశేషాలపై కార్బన్ డేటింగ్ విధానంలో పరిశోధనలు చేశారు. అవి 1000 ఏళ్లనాటివని తేలినట్లు తమ పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు. భూమిపై ఒకప్పుడు జీవం ఉన్న, జీవ సంబంధమైన, గర్భధారణ కలిగి ఉన్నాయని తమ పరిశోధనలో తేలినట్లు  పరిశోధకులు తెలిపారు. 

ఇదీ చదవండి: ఏలియన్‌ అవశేషాలు.. నాసా స్పందన ఇది


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement