Alien creatures
-
ఏలియన్ అవశేషాల పరిశోధనలో సంచలన విషయాలు
మెక్సికో సిటీ: మెక్సికో పార్లమెంట్లో మానవేతర అవశేషాల(ఏలియన్)ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా వైద్యుల పరిశోధనలో వీటిపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏలియన్లు భూమిపై జీవించి ఉన్నవేనని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఓ ఆడ ఏలియన్ కడుపులో గుడ్లు కూడా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దాదాపు వెయ్యి ఏళ్ల క్రితంనాటి అవశేషాలుగా కార్బన్ డేటింగ్ విధానంలో కనుగొన్నారు. మెక్సికో శాస్త్రవేత్తలు గ్రహాంతర శవాలపై ప్రయోగశాలలో విస్తృతమైన అధ్యయనాలు నిర్వహించారు. సోమవారం నూర్ క్లినిక్‌లో నౌకాదళానికి చెందిన ఫోరెన్సిక్ వైద్యుడు జోస్ డి జీసస్ జల్సే బెనితేజ్ పరీక్షలు పూర్తి చేశారు. ఈ ఏలియన్ల పుర్రెలు అతికించినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని చెప్పారు. భూమిపై ఏ ఇతర జంతువుతో పోలి లేవని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒకదాని కడుపులో గుడ్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఆ రెండు అవశేషాలు ఒకే అస్థిపంజరానికి చెందినవని మెక్సికన్ జర్నలిస్ట్ ధీర్ఘకాల UFO ఔత్సాహికుడు జైమ్ మౌసన్ పేర్కొన్నారు. ఒక్కోదాని చేతికి మూడు వేళ్లు ఉన్నట్లు వెల్లడించారు. Mexico's Congress just unveiled two dead aliens estimated to be around 1,000 years old. What do you think? pic.twitter.com/Zr7z4FKenS — Kage Spatz (@KageSpatz) September 13, 2023 నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలోని శాస్త్రవేత్తలు ఆ అవశేషాలపై కార్బన్ డేటింగ్ విధానంలో పరిశోధనలు చేశారు. అవి 1000 ఏళ్లనాటివని తేలినట్లు తమ పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు. భూమిపై ఒకప్పుడు జీవం ఉన్న, జీవ సంబంధమైన, గర్భధారణ కలిగి ఉన్నాయని తమ పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఇదీ చదవండి: ఏలియన్ అవశేషాలు.. నాసా స్పందన ఇది -
వింత జీవి..ట్యూబ్ ద్వారా ఆహారం
-
ఈ వింత జీవి పేరేంటో మీకు తెలుసా?
సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలు అప్పుడప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. కొన్ని అర్థం కాని వింత జీవులను షేర్ చేసి అవేంటో కనుక్కోవాలంటూ క్యాప్షన్ జత చేస్తారు. తాజాగా ఒక వ్యక్తి షేర్ చేసిన వీడియో అచ్చం అలాగే ఉంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి తన చేతిలోకి ఒక వింత ఆకారం ఉన్న జీవిని తీసుకొని దానికి ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నాడు. ఆ వింత జీవి తన పళ్లతో ఆహారాన్ని తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ఈ వింత జీవి ఏంటనేది ఎవరికి అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 32వేలమందికి పైగా వీక్షించారు. చూసిన ప్రతీ ఒక్కరు తమదైన శైలిలో కామెంట్లు షేర్ చేస్తున్నారు. 'బహుశా వేరే గ్రహం నుంచి ఊడిపడిందేమో అన్నట్లుగా ఉంది.. చూడడానికి పురుగులా ఉన్నా తింటున్న విధానం చూస్తే పక్షిపిల్లలా కనిపిస్తుంది' అంటూ పేర్కొన్నారు. -
మన చుట్టే గ్రహాంతర వాసులు!
ఈ విశాల విశ్వంలో మనిషి లాంటి బుద్ధిజీవి ఒక్కరే ఉన్నారా? కాదంటున్నారు సిల్వానో కొలంబానో! మన చుట్టే గ్రహాంతర వాసులు ఉన్నారంటున్నారు.అదెలా... టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా.. వాళ్లు మన కళ్లు ఎలా కప్పగలిగారు? చాలా సింపుల్. వాళ్లు ఇప్పటివరకూ మనం ఊహించినట్టు... కథల్లో సినిమాల్లో చూపినట్లు చిత్రవిచిత్రమైన ఆకారాల్లో లేకపోవడమే అంటారు నాసా ఇంటెలిజెంట్ సిస్టమ్ డివిజన్లో పనిచేస్తున్న కొలంబానో! అర్థం కావడం లేదా? కొంచెం వివరంగా తెలుసుకుందాం. మనిషి వ్యవసాయం చేయటం మొదలుపెట్టి ఓ పది వేల ఏళ్లు అవుతోందని అంచనా. ఆ తరువాత గత 500 ఏళ్లలో సైన్స్ కూడా బాగా అభివృద్ధి చెందింది. గ్రహాలను చూడగలుగుతున్నాం. వాటితో మనకున్న దూరాలను లెక్కకట్టగలుగుతున్నాం. అవెలా ఉన్నాయో... వాటిల్లో ఏ రకమైన వనరులున్నాయో కూడా అంచనా వేయగలుగుతున్నాం. అయినప్పటికీ కథల్లో, సినిమాల్లో కూడా గ్రహాంతర వాసి అనగానే మన కళ్లముందు.. చారడేసి కళ్లేసుకుని.. పచ్చటి ఒళ్లుతో కాళ్లు చేతుల్లాంటి ఆకారాలు మాత్రమే మెదులుతాయి! సపోజ్.. ఫర్ సపోజ్... ఆ గ్రహాంతర జీవులు ఇలా ఉండకపోతే? కంటికి కనిపించని సైజులో, రీతిలో ఉండి ఉంటే? మనం అస్సలు చూడలేం. కొలంబానో చెబుతున్న లాజిక్ కూడా ఇదే. యూఎఫ్ఓలనూ పట్టించుకోలేదు.. గ్రహాంతర వాసుల అంతరిక్ష నౌకలుగా చెప్పుకునే యూఎఫ్‌వోల గురించి శాస్త్రవేత్తలు పెద్దగా పట్టించుకోకపోవడం.. చాలా సందర్భాల్లో వాటిని కొట్టిపారేయడం కూడా గ్రహాంతర జీవుల వెతుకులాటలో ఒక అవరోధంగా చూడాలని కొలంబానో అంటారు. సుదూర అంతరిక్షం నుంచి అందే కొన్ని రకాల రేడియో తరంగ సంకేతాలను ఉపయోగించుకుని శాస్త్రవేత్తలు ఈ విశ్వ నిర్మాణం.. పరిణామాల గురించి మరింత స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని కొలంబానో సూచించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. గ్రహాంతర వాసులను చూసే దృష్టి మారాలన్నమాట! మనచుట్టూ వాళ్లే! కొలంబానో చెప్పింది నిజం అని అనుకుంటే గ్రహాంతర జీవులు ఈ క్షణంలోనూ మన చుట్టూ తిరుగుతూ ఉండాలి. మనలాగే వాళ్లూ కర్బన ఆధారిత జీవాలై ఉంటారని.. మనిషి ఊహకు అందని టెక్నాలజీ, గ్రహాంతర ప్రయాణ సామర్థ్యాలు కలి గి ఉంటారని ఆయన అంచనా. దశాబ్దాలుగా మనిషి అంతరిక్షంలోకి కొన్ని సంకేతాలు, గుర్తులు పంపుతున్నా.. సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరస్ట్రియల్ ఇంటెలిజెన్స్ (సెటీ) పేరుతో రేడియో తరంగాలను ప్రసారం చేస్తున్నా.. ఇప్పటికీ ఎలాంటి ప్రత్యుత్తరంలేని నేపథ్యంలో కొలంబానో ఈ కొత్త ప్రతిపాదన చేస్తున్నారు. దీనిపై ఆయన రాసిన పరిశోధన వ్యాసంపై మార్చిలో చర్చ చేపట్టనున్నారు. గ్రహాంతర వాసులను వెతికే ప్రయత్నం చేస్తున్న శాస్త్రవేత్తలు మనం అభివృద్ధి చేసిన టెక్నాలజీలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని.. ఫలితంగా గ్రహాంతర జీవులు ఇతర రూపాల్లో సంకేతాలు పంపుతున్నా గుర్తించని పరిస్థితి ఏర్పడుతోందని కొలంబానో అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గ్రహాంతర జీవులు ఉన్నాయా?
-
గ్రహాంతర జీవాన్వేషణ కోసం 660 కోట్ల ప్రాజెక్టు
జుకర్‌బర్గ్, హాకింగ్, మిల్నర్ల యత్నం లండన్: గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం ముగ్గురు కుబేరులు ఒక ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. భూమికి అతి సమీపంలో ఉన్న భూమిని పోలిన గ్రహం ప్రాక్జిమా బి నుంచి రేడియో సిగ్నల్స్‌ను వినడం దీని లక్ష్యం. ‘బ్రేక్‌త్రూ లిజన్’ పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నామని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, రష్యా వ్యాపారవేత్త యూరీ మిల్నర్, భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌లు ఓ ఆంగ్ల పత్రికకు చెప్పారు. దీని వ్యయం 10 కోట్ల డాలర్లు(రూ.660 కోట్లు). ప్రాక్జిమా బి భూమికి నాలుగు కాంతి సంవత్సరాల దూరం(25 లక్షల కోట్ల కి.మీ)లో ఉంది. అక్కడికి పంపే వ్యోమనౌకలు వచ్చే కొన్ని దశాబ్దాల్లోనే గమ్యం చేరుకునే అవకాశముంది.