ఈ వింత జీవి పేరేంటో మీకు తెలుసా? | Watch Hillarious Video Unknown Alien Spawn Looking Like Bird | Sakshi
Sakshi News home page

ఈ వింత జీవి పేరేంటో మీకు తెలుసా?

Published Fri, Apr 24 2020 9:27 AM | Last Updated on Fri, Apr 24 2020 9:47 AM

Watch Hillarious Video Unknown Alien Spawn Looking Like Bird - Sakshi

సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే వీడియోలు అప్పుడప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. కొన్ని అర్థం కాని వింత జీవులను షేర్‌ చేసి అవేంటో కనుక్కోవాలంటూ క్యాప్షన్‌ జత చేస్తారు. తాజాగా ఒక వ్యక్తి షేర్‌ చేసిన వీడియో అచ్చం అలాగే ఉంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి తన చేతిలోకి ఒక వింత ఆకారం ఉన్న జీవిని తీసుకొని దానికి ట్యూబ్‌ ద్వారా ఆహారం అందిస్తున్నాడు. ఆ వింత జీవి తన పళ్లతో ఆహారాన్ని తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ఈ వింత జీవి ఏంటనేది ఎవరికి అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 32వేలమందికి పైగా వీక్షించారు. చూసిన ప్రతీ ఒక్కరు తమదైన శైలిలో కామెంట్లు షేర్‌ చేస్తున్నారు. 'బహుశా వేరే గ్రహం నుంచి ఊడిపడిందేమో అన్నట్లుగా ఉంది.. చూడడానికి పురుగులా ఉన్నా తింటున్న విధానం చూస్తే పక్షిపిల్లలా కనిపిస్తుంది' అంటూ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement