
గ్రహాంతర జీవాన్వేషణ కోసం 660 కోట్ల ప్రాజెక్టు
జుకర్‌బర్గ్, హాకింగ్, మిల్నర్‌ల యత్నం
లండన్: గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం ముగ్గురు కుబేరులు ఒక ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. భూమికి అతి సమీపంలో ఉన్న భూమిని పోలిన గ్రహం ప్రాక్జిమా బి నుంచి రేడియో సిగ్నల్స్‌ను వినడం దీని లక్ష్యం. ‘బ్రేక్‌త్రూ లిజన్’ పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నామని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, రష్యా వ్యాపారవేత్త యూరీ మిల్నర్, భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌లు ఓ ఆంగ్ల పత్రికకు చెప్పారు. దీని వ్యయం 10 కోట్ల డాలర్లు(రూ.660 కోట్లు). ప్రాక్జిమా బి భూమికి నాలుగు కాంతి సంవత్సరాల దూరం(25 లక్షల కోట్ల కి.మీ)లో ఉంది. అక్కడికి పంపే వ్యోమనౌకలు వచ్చే కొన్ని దశాబ్దాల్లోనే గమ్యం చేరుకునే అవకాశముంది.