కర్ణాటకలో వింతజీవి.. కలకలం | Alien Attacks On Animals In Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో వింతజీవి.. కలకలం

Published Tue, Jun 5 2018 10:47 AM | Last Updated on Tue, Jun 5 2018 2:08 PM

Alien Attacks On Animals In Karnataka - Sakshi

భయాందోళనకు గురిచేస్తున్న వింత జంతువు

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో వింతజీవి సంచరిస్తోందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో జనసంచారం తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో వింతజీవి సంచరిస్తున్నట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వింతజీవి బారిన పడిన పశువులు రాత్రికి రాత్రే తీవ్ర గాయాలపాలవుతున్నాయి. అలా గాయాలపాలైన పశువులు రెండు మూడు రోజుల తరువాత మృత్యువాత పడుతున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి. వింత జంతువు గ్రహాంతర వాసి అయివుండొచ్చని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇదంతా ఉత్తిదేనని కొంత మంది కొట్టిపారేస్తున్నాయి. ఈ వీడియోలు పాతవని అంటున్నారు. కోతి ముఖానికి రంగులు వేసి వింతజీవిగా తయారు చేశారని అంటున్నారు. తాడుతో కోతిని కట్టేసి ఈ వీడియో తీసివుంటారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియో కర్ణాటకలోనే తీశారా, మరెక్కడైనా చిత్రీకరించారా అనేది స్పష్టం కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement