photo credit: AFP
లిమా: పెరూ రాజధాని లిమా ఎయిర్‌పోర్టులో గత ఏడాది దొరికిన ఏలియన్ మమ్మీల మిస్టరీ వీడింది. ఇవి ఏలియన్ మమ్మీలనేది పెద్ద జోక్ అని ఆర్కియాలజిస్టులు తేల్చారు. లిమా ఎయిర్‌పోర్టులో దొరికిన రెండు బొమ్మలు మనుషులు లేదా జంతువుల ఎముకల నుంచి తయారు చేసినవి అయి ఉండొచ్చని సైంటిస్టులు వెల్లడించారు.
‘అవి ఏలియన్ మమ్మీలు కానే కావు. జంతువుల ఎముకలను మోడ్రన్ గ్లూతో అతికించి తయారు చేసిన బొమ్మలు’అని పెరూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీగల్ మెడిసిన్‌లో పనిచేసే ఆర్కియాలజిస్ట్ ఒకరు తెలిపారు.
కాగా, గత ఏడాది అక్టోబర్‌లో లిమా ఎయిర్‌పోర్టులోని డీహెచ్‌ఎల్ కొరియర్ సంస్థకు చెందిన కార్డ్‌బోర్డు బాక్సులో ఏలియన్ మమ్మీలుగా తొలుత అందరూ భావించిన రెండు బొమ్మలు దొరికాయి. అప్పటి నుంచి ఏలియన్లు ఉన్నారని, అవి భూమి మీదకు వచ్చాయన్న పుకార్లు ఊపందుకున్నాయి. తాజాగా సైంటిస్టులు పరిశోధన చేసి క్లారిటీ ఇవ్వడంతో ఏలియన్ మమ్మీల గుట్టురట్టయింది.
Comments
Please login to add a commentAdd a comment