
లిమా:నార్త్‌వెస్ట్ పెరూలోని లా లిబర్టడ్ ప్రాంతం ట్రూజిల్లో నగరంలోని ఓ రెస్టారెంట్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా 78 మంది గాయపడ్డారు.ఇనుముతో చేసిన భారీ పైకప్పు కూలిన ఈ ఘటనలో ఐదుగదురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచినట్లు రక్షణ మంత్రి తెలిపారు.
గాయపడ్డవారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.కింద పడ్డ పైకప్పు కింద ఎవరు చిక్కుకోలేదని తెలిపారు.ఈ ప్రమాదంతో షాపింగ్ మాల్ మొత్తం మూసేసినట్లు ట్రూజిల్లో నగర మేయర్ తెలిపారు. మిగిలిన షాపింగ్ మాల్స్‌లోనూ భద్రతా తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment