లీమా: పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం హువాచో నగరం నుంచి రాజధాని లీమాకు బయలుదేరిన ఓ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 48 మంది దుర్మరణం చెందారు. ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో బస్సు కొండపై నుంచి పల్టీలు కొడుతూ దాదాపు 100 మీటర్లు కిందకు జారిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు 55 మంది ప్రయాణికులు ఉన్నారన్నారు. సముద్రతీరంలో ఉండటంతో పొగమంచు, అధిక తేమ కారణంగా ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment