ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. వ్యవసాయం రంగం మొదలుకొని రక్షణ రంగం వరకు అన్ని సేవలకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా పెరు దేశ రాజధాని లీమాలో డ్రోన్ సాయంతో ఓ పావురం ప్రాణాలు కాపాడారు అక్కడి పోలీసులు. ఓ పావురం కాలుకు దారం చుట్టుకోవటంతో హైటెన్షన్ వైర్‌కు చిక్కుకొని కిందికి వేలాడుతూ.. ఎగరలేక విలవిలాడింది.
ఇది గమనించిన పోలీసులు ఆ పావురాన్ని రక్షించడానికి డ్రోన్‌ను ఉపయోగించారు. డ్రోన్‌కు కత్తి కట్టి కరెంట్ వైర్ల మధ్య దాన్ని ఆపరేట్ చేస్తూ నెమ్మదిగా పావురం కాలుకున్న దారాన్ని కట్‌చేశారు. దీంతో పావురం సురక్షితంగా కిందపడింది. అనంతరం దాని కాలుకు చుట్టుకొని ఉన్న మొత్తం దారాన్ని తొలగించి పంజరంలో వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment