సంచలనం.. ఆ రోజు స్ట్రెచర్‌పై ఉంది ఏలియన్‌ | Alien carried away on a stretcher after Roswell spaceship crash' | Sakshi
Sakshi News home page

సంచలనం.. ఆ రోజు ఏలియన్‌ను స్ట్రెచర్‌పై..

Published Mon, Oct 9 2017 5:56 PM | Last Updated on Tue, Oct 10 2017 12:01 PM

Alien carried away on a stretcher after Roswell spaceship crash'

రోస్‌వెల్‌ ప్రమాదం సమయంలో స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లింది ఈ ఏలియన్‌నే..

మెక్సికో : సరిగ్గా 1947లో అమెరికా, మెక్సికోలోని పత్రికలన్నీ వేర్వేరు కథనాలతో నిండిపోయాయి. ప్రపంచ దృష్టి సైతం కూడా ఆ వైపుగా పడింది. ఏలియన్‌ల ప్రస్తావన కూడా అప్పటి నుంచే ఊపందుకొంది. ఎందుకంటే ఆ ఏడాదిలో మెక్సికోలోని రోస్‌వెల్‌ అనే ప్రాంతానికి సమీపంలోని 51 అనే ప్రాంతంలో ఓ భారీ పేలుడు సంభవించింది. భారీ బెలూన్‌ వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుందని అమెరికా బలగాలు చెప్పాయి. అయితే, కొందరు మాత్రం ఓ ప్లైయింగ్‌ సాసర్‌ పేలిపోయిందని, అది ఏలియన్‌ల అంతరిక్ష నౌక అని మరికొందరు చెప్పారు. మరోపక్క, రష్యా అణుబాంబు పరీక్ష వివరాలు తెలుసుకునేందుకు సీక్రెట్‌గా ఏర్పాటుచేసిన ప్రయోగంలో ఆ బెలూన్‌ పేలిపోయిందంటూ మరిన్న కథనాలు వినిపించాయి. దాని అనంతరం ఎన్నో పరిశోధనలు, ఎన్నో సైద్ధాంతిక గ్రంథాలు ఆఖరికి సినిమాలు, సీరియల్స్‌ కూడా వచ్చాయి.

అయితే, వాటన్నింటిని పటాపంచలు చేసేలా ఓ సంచలనాత్మక వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ పేలుడు సంభవించిన సమయంలో అక్కడికి చేరుకున్న యూఎస్‌ బలగాలు ఓ స్ట్రెచర్‌పై ఏలియన్‌ బాడీని తీసుకెళుతున్నట్లు అందులో ఉంది. యూఎఫ్‌ఓ స్పేస్‌ షిప్‌ అక్కడే కూలిపోయిందని దాంతో అందులోని ఏలియన్‌ గాయపడిందని, దానిని స్ట్రెచర్‌పై స్వయంగా తరలించారని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. తాజాగా యూట్యూబ్‌లో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. భిన్నకథనాలు పుట్టుకొచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మంది కచ్చితంగా ఆరోజు ప్లైయింగ్‌ సాసర్‌ పేలిపోయిందని, అందులో ఓ ఏలియన్‌ను కూడా తాము చూశామని చెప్పేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఏ చర్చకు దారి తీస్తుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement