వోయేజర్‌–1 పునరుత్థానం! | Voyager 1 shocks NASA by communicating with a radio system not used since 1981 | Sakshi
Sakshi News home page

వోయేజర్‌–1 పునరుత్థానం!

Published Mon, Nov 4 2024 4:52 AM | Last Updated on Mon, Nov 4 2024 4:52 AM

Voyager 1 shocks NASA by communicating with a radio system not used since 1981

43 ఏళ్ల తర్వాత నాసాకు సందేశం 

2,400 కోట్ల కి.మీ. దూరం నుంచి సంకేతాలు 

వోయేజర్‌–1 అంతరిక్ష నౌక గుర్తుందా? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1977 సెప్టెంబర్‌ 5న ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్‌. సాంకేతిక కారణాలతో 1981 నుంచి మూగబోయింది. రేడియో ట్రాన్స్‌మిట్టర్‌లో విద్యుత్‌ నిండుకోవడంతో సంకేతాలు పూర్తిగా నిలిచిపోయాయి. భూమి నుంచి ప్రస్తుతం ఏకంగా 2,400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఇంటర్‌స్టెల్లార్‌ స్పేస్‌లో ఉన్న వోయేజర్‌–1 రేడియో ట్రాన్స్‌మిట్టర్‌కు మళ్లీ జీవం పోసే పనిలో నాసా సైంటిస్టులు నిమగ్నమయ్యారు. 

ఆ దిశగా తాజాగా స్వల్ప పురోగతి సాధించారు. దాంతో ఈ వ్యోమనౌక 43 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ నాసాతో అనుసంధానమైంది. వోయేజర్‌–1ను క్రియాశీలకంగా మార్చడంలో భాగంగా దాని హీటర్లు పని చేసేలా డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ ద్వారా అక్టోబర్‌ 16న కమాండ్స్‌ పంపించారు. ఈ ప్రయత్నాలు ఫలించాయి. అక్టోబర్‌ 18న వోయేజర్‌–1 స్పందించింది. అది పంపిన సందేశం 23 గంటల తర్వాత భూమికి అందింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి ఈ సందేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు. 
                   
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement