
అస్థిపంజరం.. 15 మీటర్లు!
కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని సొర్లగొంది సముద్రతీర ప్రాంతంలో 15 మీటర్ల పొడవైన భారీ తిమింగలం అస్థిపంజరం వెలుగు చూసింది. ఇటీవల ఇది లభ్యమైంది. సముద్రతీరంలో పీతలవేట సాగించే యానాదుల నుంచి సమాచారం తీసుకున్న స్థానిక కేజ్ కల్చరిస్ట్, ఔత్సాహిక యువ ఆక్వాశాస్త్రవేత్త తలశిల రఘుశేఖర్ తన బృందం సభ్యులతో అస్థిపంజరంలోని ఎముకలను సేకరించి పడవల ద్వారా నాగాయలంక కృష్ణానది ఒడ్డుకు చేర్చారు.
వాటిని కర్రల సాయంతో తిమింగలం ఆకారంలో పేర్చారు. రాజమహేంద్రవరం వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో ప్రభాకరరావు, స్వామినాథన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ కోర్డినేటర్ రామసుబ్రహ్మణ్యం శనివారం అస్థిపంజరాన్ని పరిశీలించారు. దీని పొడవే 15 మీటర్లు ఉన్నందున బతికి ఉన్నప్పుడు మరింత ఉండొచ్చని డీఎఫ్‌వో తెలిపారు. దీనిని మ్యూజియం లేదా మెరైన్ పార్క్‌కు తరలిస్తామని చెప్పారు. -నాగాయలంక