ఇన్‌స్టా రీల్స్ చేస్తూ సూపర్ కారు కొనేశారు - ధర తెలిస్తే షాకవుతారు! | Instagram Influencer Buys Lamborghini Urus Performante | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టా రీల్స్ చేస్తూ సూపర్ కారు కొనేశారు - ధర తెలిస్తే షాకవుతారు!

Feb 17 2024 8:52 PM | Updated on Feb 17 2024 9:25 PM

Instagram Influencer Buys Lamborghini Urus Performante - Sakshi

ధర ఎక్కువైనప్పటికీ సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే కార్లలో ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్ లంబోర్ఘిని. అయితే ఖరీదైన ఈ బ్రాండ్ కారును ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

కీర్తి సింగ్ రహేజా ఆమె భర్త రోహిత్ రహేజా ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకుంటూ బాగా ఫేమస్ అయ్యారు. వీరు ఇప్పుడు సుమారు రూ.4.22 కోట్ల విలువైన వైలెట్ కలర్‌తో కూడిన వయోలా పాసిఫేలో లంబోర్ఘిని ఉరుస్ పర్ఫార్మంటే కొనుగోలు చేశారు. వీడియోలో వారు డీలర్‌షిప్‌కు చేరుకోవడం, ఆ కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం వంటివి చూడవచ్చు.

నిజానికి వయోలా పాసిఫేలో లంబోర్ఘిని ఉరుస్ పర్ఫార్మంటే కొనుగోలు చేసిన మొదటి కస్టమర్లు వీరే కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారును మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

ఇప్పటికే భారతదేశంలో కార్తీక్ ఆర్యన్, రోహిత్ శెట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, ఫహద్ ఫాసిల్, రణవీర్ సింగ్ వంటి ప్రముఖులు చాలామంది లంబోర్ఘిని ఉరస్ SUVలను కలిగి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే దేశీయ విఫణిలో లంబోర్ఘిని కార్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థమైపోతుంది.

లంబోర్ఘిని ఉరస్ పెర్ఫార్మంటే 4.0 లీటర్ వీ8 ఇంజన్‌తో 666 పీఎస్ పవర్, 850 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సుమారు 2000 కేజీల బరువున్న ఈ కారు కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవత్తమా అవుతుంది. ఈ SUV టాప్ స్పీడ్ గంటకు 303 కిమీ కావడం గమనార్హం.

ఇదీ చదవండి: టెక్నాలజీ ఉంది కదా అని ఎవరైనా ఇలా చేస్తారా! వీడియో చూడండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement