
ముంబై: ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ ‘లంబోర్గిని’ తాజాగా తన తొలి సూపర్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ ‘ఉరుస్’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.3 కోట్లు. కంపెనీ విక్రయాల్లో ఇండియా కీలకపాత్ర పోషిస్తోందని, తాజా మోడల్ ఆవిష్కరణతో అమ్మకాలు 2.5– 3 రెట్లు పెరగొచ్చని సంస్థ జనరల్ మేనేజర్ (ఆసియా–పసిఫిక్) ఆండ్రియా బల్ది తెలిపారు. ‘ఉరుస్ మాకు అతిముఖ్యమైన ప్రొడక్ట్. ఇది ఇండియాలో కంపెనీకి కొత్త కస్టమర్లను తీసుకురానుంది’ అని లంబోర్గిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment