నాది ఆశావాద దృక్పథం: దేవెగౌడ | My optimistic attitude: Gowda | Sakshi
Sakshi News home page

నాది ఆశావాద దృక్పథం: దేవెగౌడ

Published Fri, Apr 15 2016 3:05 AM | Last Updated on Fri, Aug 17 2018 8:11 PM

My optimistic attitude: Gowda

బెంగళూరు:జేడీఎస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరాలనుకునే వారికి జ్ఞానోదయమయ్యే సమయం వస్తుందని జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలోని కేఈబీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్.డి.దేవేగౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.

‘జేడీఎస్ పార్టీని చాలా మంది విడిచి వెళ్లిపోతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో నేను ఆశావహ దృక్పథంతో ఉన్నాను. పార్టీని వీడాలనుకునే వారికి జ్ఞానోదయమయ్యే సమయం వస్తుంది’ అని దేవేగౌడ పేర్కొన్నారు. రానున్న శనివారం మైసూరులో జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు దేవేగౌడ ప్రకటించారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement