విశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రభుత్వం
మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం జరిగిన విశ్వాసపరీక్షలో దేవేంద్ర ఫడ్నవిస్ సర్కారు నెగ్గింది. విడిగా ఓటింగ్ నిర్వహించాలని, మొత్తం సభ్యుల నుంచి ఓటింగ్ తీసుకోవాలని, విడివిడిగా లెక్కించాలంటూ శివసేన పట్టుబట్టింది. డివిజన్ చేయాల్సిందేనని భీష్మించుకుంది. అందుకు స్పీకర్ హరిభావు బాగ్డే నిరాకరించారు.
దాంతో శివసేన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెల్లోకి దూసుకెళ్లారు. అయితే ఆ సమయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మద్దతుగా నిలిచింది. దాంతో మూజువాణీ ఓటుతో విశ్వాస పరీక్షలో ఫడ్నవిస్ సర్కారు సులభంగా గట్టెక్కేసింది.