
నితీష్ కుమార్ బలపరీక్ష నేడే
పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర అసెంబ్లీ లో బుధవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. దీనికి సంబంధించి జేడీయూ , పార్టీ శాసన సభ్యులతో పాటు వ్యతిరేక ఎమ్మెల్యేలకూడా విప్ జారీ చేసింది.
గత ఫిబ్రవరిలో అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాల్సిన మాంఝీ అనూహ్యంగా రాజీనామా సమర్పించడంతో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నితష్ కుమార్ అసలు స్వరూపాన్ని బయటపెడతానంటూ మాంఝీ తన మద్దతు దారులతో కలిసి హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీని స్థాపించారు.
ఇది ఇలా ఉంటే పదిమంది ఎమ్మెల్యేలున్న మాంఝీ అసెంబ్లీని బాయ్ కాట్ చేయమని బీజేపీని కోరినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.