తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో సంఘటనలు చోటుచేసుకున్నాయి. స్పీకర్ ధనపాల్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తర్వాత డీఎంకే సభ్యులు కొందరు ఆయనను తోసేసే ప్రయత్నం కూడా చేశారు.