విశ్వాపరీక్షలో ఓడిన సీఎం పళనిస్వామి | palani swamy loses in floor test of tamilnadu assembly | Sakshi
Sakshi News home page

విశ్వాపరీక్షలో ఓడిన సీఎం పళనిస్వామి

Published Sat, Feb 18 2017 11:48 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

విశ్వాపరీక్షలో ఓడిన సీఎం పళనిస్వామి

తమిళనాడు ముఖ్యమంత్రిగా రెండు రోజుల క్రితమే ప్రమాణస్వీకారం చేసిన ఎడప్పాడి కె. పళనిస్వామి విశ్వాసపరీక్షలో ఓడిపోయారు. శనివారం ఉదయం తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అందులో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. శనివారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీకి మొత్తం 230 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దాంతో ప్రభుత్వం నిలబడాలంటే 116 ఓట్లు కావల్సి వచ్చాయి. బహిరంగ పద్ధతిలో డివిజన్ ఓటింగ్ నిర్వహించారు. ఇందులో పళనిస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ... ఓట్లు, వ్యతిరేకంగా ... ఓట్లు వచ్చాయి. దాంతో రెండురోజుల వయసున్న పళనిస్వామి ప్రభుత్వం పడిపోయింది. 
 
బలపరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పన్నీర్ సెల్వం వర్గానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అలాగే రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గంతో పాటు డీఎంకే, కాంగ్రెస్, ముస్లింలీగ్ కూడా డిమాండ్ చేశాయి. అయితే పళనిస్వామి వర్గం మాత్రం బహిరంగ ఓటింగుకే పట్టుబట్టింది. స్పీకర్ ధనపాల్ తొలుత మూజువాణీ ఓటింగు చేపట్టి, తర్వాత డివిజన్ ఓటింగ్ చేపట్టారు. దాన్ని బహిరంగ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ తలుపులు మూసేశారు. 

Related News By Category

Related News By Tags

Advertisement