మేము విడిపోవడానికి వారు కారణం కాదు | Kamal Haasan, Gautami end 13-year relationship | Sakshi
Sakshi News home page

మేము విడిపోవడానికి వారు కారణం కాదు

Published Thu, Nov 10 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

మేము విడిపోవడానికి వారు కారణం కాదు

మేము విడిపోవడానికి వారు కారణం కాదు

సీనియర్ నటి గౌతమి కమలహాసన్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో  సుమారు 14 ఏళ్లుగా సహజీవనం చేసిన వారు ఒకరికొకరు దూరం అవడానికి కారణం ఏమిటన్న విషయం గురించి పలువురు పలు రకాలుగా చెవులు కొరుక్కుంటున్నారు.మొత్తం మీద ఈ విషయం చాలా కలకలానికే దారి తీసింది.కొందరైతే కమలహాసన్,గౌతమిలు విడిపోవడానికి నటి శ్రుతీహాసన్,అక్షరహాసన్‌లే కారణం అనీ,గౌతమి వారి తండ్రితో సహజీవనం చేయడం వారికి ఇష్టం లేదనే ప్రచారం హల్‌చల్ చేస్తోంది.

ఇలాంటి ప్రచారం గౌతమి చెవిని తాకిందేమో ఇటీవల ఒక బేటీలో  తాము విడిపోవడానికి కమలహాసన్ కూతుళ్లు శ్రుతీహసన్,అక్షరహాసన్‌లు కారణం కాదనీ నటి గౌతమి పేర్కొన్నారు.తాను సమాజంలో ఒక సెలబ్రిటిగా జీవిస్తున్నాననీ.అందువల్ల తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని బహిరంగ పరచాల్సిన బాధ్యత తనపై ఉంటుందనీ అన్నారు.ఇంకా చెప్పాలంటే తన 16 ఏట నుంచే నటిగా రంగప్రవేశం చేశాననీ,సొంత ఆలోచనలు,స్వయం కృషితోనే తానీ స్థాయికి చేరుకున్నాననీ పేర్కొన్నారు.

జీవితంలో మార్పు అవసరం అనీ,అయితే అలాంటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుందనీ అన్నారు.తన కూతురు భవిష్యత్ తనకు చాలా ముఖ్యం అని అన్నారు.ఇది కూడా తాను కమలహాసన్‌కు దూరం అవడానికి కారణం అని పేర్కొన్నారు.కాగా నటి శ్రుతీహాసన్ కూడా ఇటీవల తన తండ్రి కమలహాసన్,గౌతమిలు విడిపోవడానికి తాను కారణం కాదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement