కమల్, గౌతమి బ్రేకప్ పై స్పందించిన శృతి హాసన్ | Shruti Haasan repsond on Kamal Haasan-gautami breakup | Sakshi
Sakshi News home page

కమల్, గౌతమి బ్రేకప్ పై స్పందించిన శృతి హాసన్

Published Wed, Nov 2 2016 12:38 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

కమల్, గౌతమి బ్రేకప్ పై స్పందించిన శృతి హాసన్

కమల్, గౌతమి బ్రేకప్ పై స్పందించిన శృతి హాసన్

హైదరాబాద్: కమలహాసన్, గౌతమి వీడిపోవడంపై హీరోయిన్ శృతిహాసన్ స్పందించింది. ఇది కమల్, గౌతమి వ్యక్తిగత నిర్ణయమని వ్యాఖ్యానించింది. మరొకరి వ్యక్తిగత జీవితం, నిర్ణయాలపై తానెప్పుడు మాట్లాడనని స్పష్టం చేసింది. తనకు తన తల్లిదండ్రులు, చెల్లెలే ముఖ్యమని తెలిపింది. వివాదాలను తానెప్పుడు పట్టించుకోనని కుండబద్దలు కొట్టింది. శృతిహాసన్ తల్లి సారిక నుంచి విడిపోయిన తర్వాత గౌతమితో కమల్ అనుబంధం మొదలైంది.

తాను, కమల్ హాసన్ విడిపోతున్నామని నటి గౌతమి మంగళవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కమల్‌హాసన్ నటిస్తున్న సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కొనసాగడానికి తనకు అభ్యంతరం లేదని గౌతమి చెప్పారు. కమల్ నటన అంటే తనకెంతో ఇష్టమని, ఆయన ప్రతిభ మీద తనకు అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement