ప్రధానికి నటి గౌతమి మరో లేఖ
తమిళ సినిమా(చెన్నై): జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సినీ నటి గౌతమి ప్రధాని మోదీకి ఆదివారం మరో లేఖ రాశారు. జయలలితకు అందించిన చికిత్సపై సందేహాలను తాను పేర్కొన్న విధంగానే చాలామంది ప్రశ్ని స్తున్నారని లేఖలో ఆమె పేర్కొన్నారు. దీనికి సమాధానం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. (జయలలితకీ, గౌతమికీ కనెక్షన్ ఏంటి?)
సమాధానాన్ని మోదీ నుంచి తాను సైతం ఆశిస్తున్నానని పేర్కొన్నారు. గౌతమి ఇటీవల మోదీకి లేఖ రాయడంతో ఆమెపై అన్నాడీఎంకే నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ తన భావాలను సమర్థించుకుంటూ గౌతమి మరో లేఖను ప్రధానికి రాశారు. (ఇరకాటంలో గౌతమి)