
నకిలీ పత్రాలను సృష్టించి తన భూమిని కబ్జా చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తున్నారు సినీ నటి గౌతమి. ఈ కేసులో తనకు న్యాయం దక్కేవరకు పోరాడుతానని ఆమె తెలిపారు. రామనాథపురం జిల్లాతో పాటు చెన్నై పరిసర ప్రాంతాల్లో నటి గౌతమికి సుమారు 150 ఎకరాల భూములు ఉన్నాయి. కారైక్కుడికి చెందిన సినీ ఫైనాన్సియర్ అళగప్పన్.. గౌతమికి చెందిన స్థలం అమ్మిపెడుతానని చెప్పి ముందుగా ఆ పత్రాలను పరిశీలించారు. ఆపై వాటికి నకిలీ పత్రాలను సృ ష్టించి తన సొంతానికి విక్రయించారు.
ఈ క్రమంలో గౌతమి నుంచి రూ. 3కోట్లు తీసుకుని మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రామనాథపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో గౌతమి ఫిర్యాదు చేశారు. సి.అళగప్పన్, ఆయన భార్య నాచ్చాళ్, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువు భాస్కర్, కారు డ్రైవర్ సతీష్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఏడాది నుంచి వారు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వారు మళ్లీ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే, వారికి బెయిల్ ఇవ్వకూడదని తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టుకు తెలుపుకున్నారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment