తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టు అయిన సినీ నటికస్తూరికి ఎగ్మూర్ కోర్టు బుధవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో శనివారం హైదరాబాద్‌లో అరెస్టయిన కస్తూరిని చైన్నె పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమెకు ఈనెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు.
ఈ పరిస్థితులలో తనకు బెయిల్‌మంజూరు చేయాలని కోరుతూ ఎగ్మూర్ కోర్టులో కస్తూరి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. తాను సింగిల్ మదర్ అని, తనకు స్పెషల్‌చైల్డ్ ఉందని, ఆమెను తానే చూసుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీంతో నిబంధనలతో కూడిన బెయిల్‌ను ఆమెకు మంజూరు చేస్తూ న్యాయమూర్తి దయాళన్ ఆదేశించారు.
ఈ కారణం వల్లే అరెస్ట్
నవంబరు 3న చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన కస్తూరి.. తెలుగువాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 300 ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగు వారు తమిళనాడుకి వచ్చారని, ఇప్పుడు వాళ్లు తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారని కస్తూరి చెప్పింది. అంతేకాదు, వేరేవాళ్ల భార్యపై మోజుపడొద్దని, బహుభార్యాతత్వం వద్దని బ్రాహ్మణులు చెప్తుంటే వారిని తమిళులు కాదని.. వారికి వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారని కస్తూరి కామెంట్ చేయడంతో వివాదస్పదం అయింది. ఈ క్రమంలో డిఎంకే పార్టీ నేతలపై కూడా ఆమె ఫైర్ అయింది. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment