
క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోండి... ఆరోగ్యంగా జీవించండి అంటూ సినీనటి, లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి తాడిమల్ల నగరవాసుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఆదివారం బీచ్‌రోడ్డులో రోహిత్ మోమోరియల్ ట్రస్ట్, రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ సంయుక్తంగా నిర్వహించిన పింక్ సఖి శారీ వాక్‌లో ఆమె ప్రసంగించారు.

క్యాన్సర్ వస్తే జీవితం అక్కడితో ఆగిపోతుందనే అపోహ నుంచి ముందుగా బయటపడాలన్నారు. సరైన చికిత్స తీసుకుంటే ఎంతకాలమైనా జీవించవచ్చు అనడానికి ప్రతక్ష ఉదాహరణగా తానేనని పేర్కొన్నారు.

ఆరోగ్యం కాపాడుకోవడం ఎంత అవసరమో గుర్తించాలని ప్రజలకు సూచించారు. మీపై ఒక కుటుంబం ఆధారపడి ఉందనే విషయం మరువకూడదన్నారు.















