
సాక్షి, చెన్నై: ప్రముఖ నటి గౌతమి ఇంట్లో దుండగుడు చొరబడటం కలకలం రేపింది. చెన్నైలోని కొట్టివక్కమ్‌లో గౌతమి నివసిస్తున్న ఇంట్లోకి అనుమతి లేకుండా పాండియన్ (28) అనే వ్యక్తి ప్రవేశించి గలాటా సృష్టించాడు. ఇంట్లోని ఒక గోడ పక్కన దాక్కొని ఉన్న విషయాన్ని గౌతమి ఇంట్లో పనిచేసే సతీష్ గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గౌతమి ఇంటికి చేరుకున్న నీలంకరై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడినికొట్టివాక్కం కుప్పంకు చెందిన పాండియన్‌గా పోలీసులు గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, అనుమతి లేకుండా ప్రవేశించడంతో పాటు ఆందోళన కలిగించినందుకుగాను అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. అయితే గౌతమి ఇంట్లో పనిచేస్తున్న తన సోదరుడిని కలవడానికే పాండియన్ అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment