booked
-
ఇదెక్కడి విడ్డూరం..! ఎద్దు మూత్రం పోసిందని కేసు పెట్టడమేంటి?
సాక్షి, ఖమ్మం: మనుషులే రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఓ ఎద్దు రోడ్డుపై మూత్రం పోసిందని అధికారులు కేసు పెట్టారు. యజమానికి కోర్టు రూ.100 ఫైన్ కూడా వేసింది. ఎద్దు ముత్రం పోస్తే ఫైన్ ఏంటని ఆలోచిస్తున్నారా? అవును నిజమే. ఈ విడ్డూరం భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే? సింగరేణి గనులకు పుట్టినిల్లు జిల్లాలోని ఇల్లందు పట్టణం. అక్కడే ఉండే సుందర్ లాల్ అనే ఓ రైతు తన ఎద్దుల బండిని కిరాయికి తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సింగరేణి జీఎం కార్యాలయానికి సమీపంలో నివస్తుండటంతో రోజూ ఆఫీసు ముందు నుంచి వెళ్తాడు. అయితే, ఒకరోజు జీఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రం పోసింది. దానిని గమనించిన అక్కడి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను అందించి ఎద్దుల యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు సుందర్ లాల్‌ను స్టేషన్‌కు పిలిపించారు. ఎన్నడూ పోలీస్ స్టేషన్ ముఖం చూడని సుందర్ లాల్ భయం భయంగానే వెళ్లి ఏం జరిగిందని ఆరా తీయగా.. అసలు విషయం చెప్పారు. నీ ఎద్దు జీఎం ఆఫీసు ముందు మూత్రం పోసింది. గతంలోనూ నీ ఎద్దు ఇలానే చేసిందటా అని వెల్లడించారు. దీంతో సుందర్ లాల్ అవక్కయ్యాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారించిన న్యాయమూర్తి సుందర్‌లాల్‌కు రూ.100 జరిమానా విధించారు. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ రూ.100 ఇచ్చి ఫైన్ చెల్లించడం గమనార్హం. . అసలు విషయం వేరే ఉందా? రైతు సుందర్ లాల్‌ను ఇబ్బంది పెట్టడానికి వెనుక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ భూమికి సంబంధించి సింగరేణి నుంచి తనకు పరిహారం ఇవ్వాలని సుందర్ లాల్ డిమాండ్ చేస్తున్నారు. తన భూమిని బలవంతంగా తీసుకున్నారని, చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నానని సుందర్‌లాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. సాధారణంగా ఎద్దులు మూత్రం చేస్తుండగా నడవవని, తాను మూత్ర విసర్జన చేయమని చెప్పలేదన్నారు. సింగరేణి వల్ల తనకు అన్యాయం జరిగిందనే బ్యానర్లను ఎద్దుల బండికి కట్టి నగరంలో తిరుగుతున్నాడు సుందర్ లాల్. తమ సంస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు వాపోయాడు. తనకు న్యాయం చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టొద్దని ఆయన కూతురు విజ్ఞప్తి చేసిన ఓ వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హైదరాబాద్ పోలీస్ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ! @CPHydCity @TelanganaDGP@shohumayunnagar @DCPCZHyd సాధారణ రైతు తన ఎడ్ల బండిని తోలుకుంటూ వెళ్తుంటే, ఎద్దు తమ ఆఫీస్ ముందు పాస్ పోసుకుందని, సింగరేణి యాజమాన్యం Brown మేనేజర్, ఆ రైతు మీద పోలీస్ కేసు నమోదు చేయించారట. తెలంగాణ (1/2) pic.twitter.com/pjlvgIHbuY — Vijay Gopal (@VijayGopal_) December 6, 2022 జీఎం ఏమన్నారంటే? సింగరేణి జీఎం ఎం షలీం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..‘2005లో జేకే-5 ఓపెన్ కాస్ట్ మైన్ కోసం భూములు తీసుకున్నాం. సుందర్ లాల్‌కు చెందిన కొంత భూమి అందులో ఉంది. పట్టాదారుకు భూసేకరణ అధికారులు నగదు చెల్లించారు. దీనిపై సుందర్ లాల్ కోర్టుల్లో కేసులు వేశారు. సుప్రీం కోర్టు సైతం ఆయన ఫిర్యాదును తోసిపుచ్చింది. అప్పటి నుంచి ఆఫీసు వద్ద ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. అధికారులు, పోలీసులు చెప్పినా వినకుండా అలానే ప్రవర్తిస్తున్నాడు.’ అని తెలిపారు జీఎం. మరోవైపు.. ఈ విషయం తెలిసిన జనాలు.. చేసే పనులు సరిగా చేయరు.. కానీ ఇలాంటి పనికి మాలిన విషయాల్లో అత్యుత్సాహం చూపడం ఏంటని చర్చించుకుంటున్నారు. #Telangana: Bull urinates at SCCL GM office, owner bookedhttps://t.co/16yO4iRn7n pic.twitter.com/NtR2fi4Are — TOI Hyderabad (@TOIHyderabad) December 6, 2022 ఇదీ చదవండి: సింగరేణి గనిలో కూలిన బండ -
‘తోపుడు బండిపై ఆస్పత్రికి’.. వార్త రాసిన జర్నలిస్టులపై ఐటీ చట్టం కింద కేసు!
భోపాల్: అనారోగ్యానికి గురైన ఓ వృద్ధుడిని కుటుంబ సభ్యులు తోపుడు బండిపై ఆసుపత్రికి తరలించారు. ఆ కుటుంబం పడిన బాధను వివరిస్తూ వార్త ఇచ్చారు స్థానిక జర్నలిస్టులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. ముగ్గురు స్థానిక జర్నలిస్టులపై చీటింగ్, వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టటం, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. వారు ఇచ్చిన వార్త పూర్తిగా తప్పు, ఎలాంటి ఆధారాలు లేవు. అయితే, వీడియోలోని కుటుంబం తాము పడిన ఇబ్బంది నిజమేనని, వార్తల్లో వచ్చిందంతా నిజమేనని పేర్కొనటం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్, భింద్ జిల్లాలోని లహర్ ప్రాంతం మార్పురా గ్రామంలో జరిగింది. జిల్లా కలెక్టర్ సతీశ్ కుమార్ ఏర్పాటు చేసిన రెవెన్యూ, ఆరోగ్య విభాగాల దర్యాప్తు బృందాలు.. బాధిత కుటుంబం అంబులెన్స్ కోసం ఎలాంటి ఫోన్‌కాల్ చేయలేదని నివేదించాయి. వృద్ధుడు జ్ఞానప్రసాద్ విశ్వకర్మను ముందుగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారని, గవర్నమెంట్ ఆసుపత్రికి కాదని పేర్కొన్నాయి. ఈ నివేదిక ఆధారంగా.. డాక్టర్ రాజీవ్ కౌరవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వార్త రాసిన కుంజ్‌బిహారీ కౌరవ్, అనిల్ శర్మ, ఎన్కే భతేలేపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అంబులెన్స్ రాకపోవటంతో తోపుడు బండిపై 5 కిలోమీటర్లు తాము ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవటంతో 5 కిలోమీటర్లు తోపుడు బండిపై తీసుకెళ్లినట్లు బాధితుడి కుమారుడు హరిక్రిష్ణ, కూతురు పుష్ప తెలిపారు. తమ కుటుంబం వివిధ ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందినట్లు దర్యాప్తు బృందాలు నివేదించటాన్ని తప్పుపట్టారు పుష్ప. తమకు పీఎం ఆవాస్ యోజన కింద ఒకే ఇన్స్టాల్మెంట్ వచ్చిందని, అధికారులు మా సోదరుడి ఇంటి ముందు నిలబెట్టి ఫోటోలు తీసుకెళ్లారని అధికారులపై విమర్శలు గుప్పించారు. ఇటీవల తమ గుడిసె వద్దకు వచ్చి తెల్లపేపర్‌పై సంతకాలు చేయించుకుని వెళ్లారన్నారు. అయితే, ఈ ఆరోపణలపై అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇదీ చదవండి: ‘ఈ జిమ్మిక్కులు ఏమిటి.. మోదీ జీ?’.. ట్రావెల్ బ్యాన్పై మనీశ్ సిసోడియా విమర్శలు -
నలుగురు బాలికల దారుణ హత్య : తల్లిపై కేసు
చండిగఢ్: హరియాణాలో అమానుషం చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిందో తల్లి. పోలీసుల సమాచారం ప్రకారం నలుగురు మైనర్ బాలికలను గొంతుకోసి మరీ దారుణంగా హతమార్చింది. వీరి వయసు ఒకటి నుంచి ఏడు సంవత్సరాల వయస్సు ఉంటుంది. అనంతరం ఆమెకూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నుహ్ జిల్లాలోని పిప్రోలి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. బాధిత బాలికల తండ్రి ఫిర్యాదు ఆధారంగా తల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న తల్లి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇంత దారుణానికి ఆమె ఎందుకు పాల్పడిందో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి సమర్జీత్ చెప్పారు. -
ప్రముఖ నటి ఇంట్లో అపరిచితుడి గలాటా
సాక్షి, చెన్నై: ప్రముఖ నటి గౌతమి ఇంట్లో దుండగుడు చొరబడటం కలకలం రేపింది. చెన్నైలోని కొట్టివక్కమ్‌లో గౌతమి నివసిస్తున్న ఇంట్లోకి అనుమతి లేకుండా పాండియన్ (28) అనే వ్యక్తి ప్రవేశించి గలాటా సృష్టించాడు. ఇంట్లోని ఒక గోడ పక్కన దాక్కొని ఉన్న విషయాన్ని గౌతమి ఇంట్లో పనిచేసే సతీష్ గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గౌతమి ఇంటికి చేరుకున్న నీలంకరై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడినికొట్టివాక్కం కుప్పంకు చెందిన పాండియన్‌గా పోలీసులు గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, అనుమతి లేకుండా ప్రవేశించడంతో పాటు ఆందోళన కలిగించినందుకుగాను అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. అయితే గౌతమి ఇంట్లో పనిచేస్తున్న తన సోదరుడిని కలవడానికే పాండియన్ అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. -
ఫ్లిప్‌కార్ట్ కో ఫౌండర్‌పై వరకట్న వేధింపుల కేసు
సాక్షి, బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్‌పై వరకట్నం వేదింపుల కేసు నమోదైంది. సచిన్ భార్య ప్రియా బన్సాల్ (35) బెంగళూరు కోరమంగళ పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఆస్తులను సచిన్‌కు బదిలీ చేయడానికి నిరాకరించడంతో అతని తల్లిదండ్రులు, సోదరుడు తనను మానసికంగా, శారీరకంగా వేధించారనేది ప్రధాన ఆరోపణ. భర్త సచిన్ బన్సాల్, మామ సత్య ప్రకాష్ అగర్వాల్, అత్త కిరణ్ బన్సాల్, సచిన్ సోదరుడు నితిన్ బన్సాల్ పై ఆమె ఫిర్యాదు నమోదు చేశారు. వృత్తిపరంగా దంత వైద్యురాలైన ప్రియ అందించిన సమాచారం ప్రకారం 2008లో ప్రియ, సచిన్‌ల వివాహమైంది. వివాహ సమాయంలో 50లక్షల రూపాయలను ఖర్చు చేసివివాహం చేయడంతోపాటు కట్నంగా రూ. 11 లక్షలు కట్నంగా ఇచ్చారు. గత కొంతకాలంగా ఆస్తులను తన పేరుతో మార్చాల్సిందిగా సచిన్ డిమాండ్ చేస్తున్నాడని, గత ఏడాది అక్టోబర్‌లో భర్త( సచిన్) తనపై శారీరకంగా దాడి చేశాడని, డబ్బు డిమాండ్ చేశాడని ప్రియ ఆరోపించారు. అలాగే ఢిల్లీ వెళ్లిన సందర్భంలో తన సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కూడా ఫిబ్రవరి 28 న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అసలు వివాహానికి ముందే కట్నం కోసం తనను వేధించారని ప్రియ ఆరోపించారు. దీంతో 498 ఎ (వరకట్న వేధింపులు), 34 (క్రిమినల్ ఉద్దేశం) వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నలుగురి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 29న సచిన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా దీనిపై నిర్ణయం గురువారం వెలువడనుందని సమాచారం. అయితే కొన్ని వారాల క్రితమే అత్త కిరణ్ బన్సాల్ కోడలు ప్రియపై కేసు నమోదు చేసినట్టు కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. కాగా 2018లో ప్రపంచ రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్లిప్‌కార్ట్‌లో మేజర్ వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ నుంచి నిష్క్రమించిన సచిన్ బన్సాల్ తన వాటాను విక్రయించడం ద్వారా ఒక బిలియన్ డాలర్లను సొంతం చేసుకున్నారు. అనంతరం 450 మిలియన్ డాలర్లు పెట్టుబడులతో అంకిత్ అగర్వాల్‌తో కలిసి నవీ టెక్నాలజీస్ పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించాడు. దీంతోపాటు ఓలాలో 100 మిలియన్ల డాలర్లు పెట్టుబడులు సహా , ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ అథెర్, ఇన్‌షార్ట్స్, గ్రే ఆరెంజ్, యునా అకాడమీ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. మరోవైపు ఈ ఆరోపణలపై సచిల్ బన్సాల్ స్పందించాల్సి వుంది. -
రెచ్చగొట్టే పాట : సింగర్ అరెస్టు
సాక్షి, లక్నో : దేశంలో అసహనం పెరిగిపోతోందని మూకదాడులను నిర్మూలంటూ పలువురు గాయకులు, నటులు, మేధావులతో కూడిన 49మంది దేశ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తోంటే..మరోవైపు గాయకుడు రెచ్చగొట్టే పాటను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి ఇరుక్కున్నాడు. ‘ జై శ్రీరామ్’ అని ఉచ్ఛరించేందుకు ఇష్టపడని వారిని కబరిస్తాన్(శ్మశానం) పంపాలనే ("జో నా బోలే జై శ్రీ రామ్, ఉస్కో భెజో కబ్రిస్తాన్") పాటను యూ ట్యూబ్‌లో షేర్ చేశాడు గాయకుడు వరుణ్ బహార్. అశ్లీల, అసభ్యకరమైన, రెచ్చగొట్టే పాటలతో తరచూ యూట్యూబ్ ఛానెల్లో హల్చల్ చేయడం వరుణ్‌కు అలవాటు. ఇప్పటికే వరుణ్‌పై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మంకపూర్‌లోని బండారా గ్రామం లో బహర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే కోర్టుముందు హాజరుపరుస్తామన్నారు. కాగా దేశంలో అసహనం, మూకదాడులను నిర్మూలించాలని కోరుతూ ప్రధాని మోదీకి 49 మంది సెలబ్రిటీలు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రముఖ సింగర్ శుభా ముద్గల్, నటి కొంకణా సేన్ శర్మ, దర్శకుడు శ్యామ్ బెనగల్, మణిరత్నం, క్రీడాకారుడు అనురాగ్ కశ్యప్ తదితరులు వీరిలో ఉన్నారు. -
మరో భారీ కుంభకోణం: వేలకోట్ల రూపాయలకు టోకరా
-
మరో భారీ కుంభకోణం: వేలకోట్ల రూపాయలకు టోకరా
సాక్షి,న్యూఢిల్లీ: మరో భారీ బ్యాంకింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వడోదరకు చెందిన విద్యుత్ కేబుల్స్, సామగ్రిని తయారు చేసే కంపెనీ వేలకోట్ల రూపాయల మేర బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టింది. 11 బ్యాంకుల కన్సార్టియాన్ని భారీ ఎత్తున మోసం చేసిన వ్యవహారంలో కేసు నమోదు చేశామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం ప్రకటించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా లోన్ డిఫాల్టర్ల లిస్ట్‌లోనూ, ఎక్స్పోర్ట్ క్రెడిట్ హామీ కార్పొరేషన్ హెచ్చరిక జాబితాలో ఉన్నప్పటికీ కంపెనీ, దాని డైరెక్టర్లు తప్పుడు పద్ధతుల్లో రుణాలు పొందారని ఆరోపించింది. వివిధ బ్యాంకుల నుంచి అక్రమ మార్గాల్లో డైమెండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డిపిఐఎల్) రూ. 2,654 కోట్ల రుణాలను తీసుకుందని సీబీఐ తెలిపింది. ఈ కుంభకోణానికి సంబంధించి కంపెనీపైనా, డైరెక్టర్లపైనా కేసు నమోదు చేసినట్లు చెప్పింది. కంపెనీ ప్రమోటర్ ఎస్ఎన్ భట్నాగర్, అతని కుమారులు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు అమిత్ భట్నాగర్, సుమిత్ భట్నాగర్లపై కేసు నమోదు చేశామని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా- రూ.670.51కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా- రూ.349 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు- 279.46 కోట్ల రూపాయలు రుణాలు పొందినట్టుగా సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అలాగే గుజరాత్ వడోదరాలోని కంపెనీ కార్యాలయంతో పాటు డైరెక్టర్ల నిసాసాల్లో సీబీఐ సోదాలు ప్రారంభించింది. కాగా సీబీఐ అందించిన సమాచారం ప్రకారం 2008 జూన్‌లో యాక్సిస్ బ్యాంకు నేతృత్వంలోని 11బ్యాంకుల కన్సార్టియం (పబ్లిక్, ప్రైవేట్) ద్వారా మోసపూరితంగా డిపిఐఎల్ రుణాలను పొందింది. నగదు క్రెడిట్ పరిమితులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్యాంకుగా ఉంది. ఈ మొత్తం 2016 జూన్ 29 నాటికి రూ .2,654.40 కోట్ల రూపాయలకు చేరింది. అయితే 2016-17లో ఎన్పీఏగా ప్రకటించడం గమనార్హం. -
వెంచర్లో పేలుళ్లు..ముగ్గురిపై కేసు నమోదు
శంషాబాద్: రాళ్లగూడ సమీపంలోని ఔటర్ సర్వీసు రహదారిలోని ఓ వెంచర్లో ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ (పేలుళ్లు) చేపడుతుండడంతో బుధవారం మధ్యా హ్నం ఎస్ఓటీ పోలీసులు దాడులు చేపట్టారు. పేలుళ్లకు పాల్పడుతున్న వెంకటేశ్వరావు(38), జంగయ్య (39)లను అరెస్ట్ చేసి వారి నుంచి 25 డిటోనేటర్లు, 16 జిలెటిన్ స్టిక్స్, కంప్రెషర్, విద్యుత్‌వైర్లు, కంప్రెషర్ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వెంచర్ యజమానిపై కూడా కేసు నమోదు చేశారు. నిందితులను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మమ్మల్నే ఫీజు అడుగుతారా..?
-
13 ఏళ్ల బాలుడిపై గుండాయాక్ట్
కాన్పూర్ : పదమూడేళ్ల కుర్రాడిపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హింసను ప్రేరేపిస్తున్నాడంటూ, చాలా కేసుల్లో ప్రమేయం ఉందంటూ పదమూడేళ్ల బాలుడిపై గూండా యాక్ట్ కింద కేసు నమోదుచేశారు. కన్పూర్ పట్టణ సమీపంలోని నవాబ్ జంగ్ పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ కేసులో అరెస్టు అయిన వారికి బెయిల్ అంత ఈజీగా బెయిల్ దొరకకు పోగా, ఆరునెలల వరకు జిల్లా నుంచి కూడా సదరు వ్యక్తులను బహిష్కరించే అధికారం పోలీసులకు ఉంటుంది. కౌలాలి గ్రామానికి చెందిన యోగేంద్రపాల్ తన కొడుకును అక్రమ కేసులో ఇరికించి గూండా యాక్ట్ ప్రయోగించారని స్థానిక కోర్టును ఆశ్రయించి సెప్టెంబర్ 11న బెయిల్ పొందాడు. తన కొడుకిపై గూండా యాక్ట్ కింద కేసు నమోదుచేయడం వల్ల సరిగా పాఠశాలకు పోవడం లేదని, నవాబ్‌జంగ్ పోలీసులు నమోదుచేసిన ఈ అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయన పట్టణ ఎస్పీ రాజేష్ కృష్ణన్ కోరారు. తొమ్మిదో తరగతి చదివే ఈ బాలుడు ట్రెరర్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడని, చాలా కేసుల్లో ఈ బాలుడికి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. బాలుడి వయసుకు సంబంధించిన సంబంధిత డాక్యుమెంట్లను సిటీ ఎస్పీకి తండ్రి యోగేంద్ర సమర్పించాడు. ఇది చాలా సీరియస్ విషయం, బాలుడిపై తప్పుడు కేసు బనాయించినట్లు తేలితే సంబంధిత స్టేషన్ పోలీసులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాజేష్ హెచ్చరించారు. పిల్లాడిపై విధించిన కేసుకు సంబంధించి పూర్తి నివేదికను కోరానని ఆయన తెలిపారు. మూడు రోజుల్లో నవాంబ్జంగ్ పోలీసులు ఈ నివేదికను అందించాలని ఆదేశించారు. -
విద్యుదాఘాతంతో వృద్ధురాలి మృతి
వెలవలి(రాజుపాళెం):మండల పరిధిలోని వెలవలి గ్రామానికి చెందిన చీమల జయమ్మ (64) అనే వృద్ధురాలు మంగళవారం విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్ఐ టి.సంజీవరెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. తన ఇంటి వద్ద ఉన్న నీటి కొళాయికి అమర్చిన విద్యుత్ మోటరు నుంచి నీరు రాకపోవడంతో ఇనుప పైపుతో నోటితో ఊదుతుండగా విద్యుదాఘాతానికి గురైంది. ఆమెను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కాపురానికి రమ్మన్న భర్తను..
ముజఫర్ నగర్ : కాపురానికి రమ్మని అడగడానికి వెళ్లిన భర్తను భార్య హత్య చేసిన ఉదంతం ముజఫర్ నగర్ లో చోటు చేసుకుంది. సోదరులతో కలిసి మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టడం ఆందోళన రేపింది. భార్యను ఇంటికి తెచ్చుకోవడానికి వెళ్లిన భర్త రాజీవ్ (26) ను సోదరులు, సత్పాల్, విక్రమ్ తో కలిసి గురువారం హత్య చేసింది. అనంతరం హిందున్ నదిలో పడేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం రాజీవ్, సర్వేష్ దంపతులు. వీరి మధ్య గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సర్వేష్ బుధాన ప్రాంతంలో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది. రెండు నెలలుగా తల్లిదండ్రుల దగ్గర ఉంటున్న భార్యను తిరిగి తీసుకురావడానికి అత్తారింటికి వెళ్లాడు రాజీవ్. దీంతో ఏమైందో ఏమో తెలియదుగానీ, సర్వేష్, తోబుట్టువులు, సత్పాల్, విక్రమంతో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం సమీపంలోని నదిలో పడేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. కాగా భర్త హత్య కేసులో ఇద్దరు సోదరులు పాటు, సర్వేష్ పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిపై విచారణ జరుగుతోందన్నారు. -
భర్త ఎదుటే భార్య పట్ల అసభ్య ప్రవర్తన
ముగ్గురిపై కేసు నమోదు, రిమాండ్ పరిగి : భార్యాభర్తలపై దాడి చేయడమే కాకుండా భర్త ఎదుటే భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ నగేష్ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. హైదరాబాద్ నగర శివారులోని బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందిన యాదగిరి తన భార్య, కుమార్తెతో కలిసి గురువారం రంగారెడ్డి జిల్లా పరిగిలో నివాసముండే తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. కార్యక్రమం పూర్తి అయ్యేసరికి రాత్రి అయ్యింది. దీంతో పది గంటల సమయంలో యాదగిరి కుటుంబం హైదరాబాద్‌కు బయలుదేనిందిజ అయితే అలసట అనిపించడంతో యాదగిరి కారును మండల పరిధిలోని రంగాపూర్‌లో రోడ్డు పక్కన ఆపాడు. ఈ సమయంలో రంగాపూర్‌కు చెందిన నర్సింహారెడ్డి, అరవింద్‌రెడ్డి, సంజీవరెడ్డిలు కారు వద్దకు వచ్చారు. ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. అలసటగా ఉండడంతో ఆపామని, తామిద్దరం భార్యాభర్తలమని చెప్పినా వారు వినిపించుకోలేదు. తాము పోలీసులమని, కారుకు సంబంధించిన కాగితాలు చూపాలని వారిపై దాడికి దిగారు. అంతటితో ఆగక.. యాదగిరి భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకున్న యాదగిరి కుటుంబం నేరుగా పరిగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శుక్రవారం నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులు ముగ్గురిని రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ నగేష్ తెలిపారు. -
మొబైల్లో గేమ్స్ ఆడుకొమ్మంటూ పిలిచి..
థానే: మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకొమ్మంటూ ఇద్దరు చిన్నారులను ఇంట్లోకి పిలిచిన ఓ వ్యక్తి వారిపై లైగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో చోటుచేసుకుంది. వేగిల్ ఎస్టేట్ ఏరియాలోని బందువుల ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి, చుట్టుపక్కల ఇళ్లలో ఉండే ఆరేళ్ల, తొమ్మిదేళ్ల బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు ఆదివారం స్థానిక పోలీసులు వెల్లడించారు. బాలికలతో పరిచయం పెంచుకున్న సదరు వ్యక్తి మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవాలంటూ ఇంట్లోకి పిలిచి వారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. లైంగిక దాడి విషయాన్ని బాలికలు వారి తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు బాలికలు వేరువేరు ఫ్యామిలీలకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై సెక్షన్ 376, బాలలపై హక్కుల చట్టాల కింద కేసునమోదు చేసినట్లు వెల్లడించారు. -
గుడ్లు, ఇంక్ వేసి 150మంది బుక్కయ్యారు
మీరట్: ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఫ్లెక్సీలపై అందరూ చూస్తుండగా కోడిగుడ్లు, ఇంకుతో దాడి చేశారనే ఆరోపణల కింద పోలీసులు 150మందిపై కేసులు నమోదుచేశారు. నాలుగు రోజుల కిందట ఇక్కడ కొందరు వ్యాపార వేత్తలు, బులియన్ ట్రేడర్లు ఆందోళనను నిర్వహిస్తూ మోదీ, జైట్లీ ఫ్లెక్సీలపై భారీ ఎత్తున కోడి గుడ్లు విసిరారు.. ఇంకు చల్లారు. దీంతో పోలీసులు వారిపై 147, 341, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
మధ్య ప్రదేశ్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
మధ్యప్రదేశ్ః నిర్భయ చట్టం అమల్లోకి వచ్చినా కామాంధుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో మరో దారుణం వెలుగు చూసింది. పదమూడేళ్ళ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. రెండు రోజుల్లో రెండు గ్రూపులు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. తోడుకోసం రమ్మని ఒకరు, లిఫ్ట్ ఇస్తామని మరొకరు నమ్మించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ ధార్ కోట్ వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసు వివరాలను పరిశీలిస్తే... నిందితులు బాధితురాలికి తెలిసున్నవారుగా తెలుస్తోందని, ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నామని... అతడి ఆధారంగా మిగిలినవారి ఆచూకీ తెలిసే అవకాశం ఉన్నట్లు ధార్ కోట్ పోలీసులు చెప్తున్నారు. మార్చి 7వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా దేవాలయానికి వెళ్ళిన బాలికను తమకు తోడుగా రమ్మంటూ నమ్మించి, ఒప్పించి ఇద్దరు యువకులు పారిశ్రామిక ప్రాంతంలోకి తీసుకెళ్ళారని, అనంతరం తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించినట్లు పోలీసులు చెప్తున్నారు. ఆకాష్ అలియాస్ గోలు, అతిని స్నేహితుడితో సహా ఆమెను మానభంగం చేయడంతోపాటు ఆరోజు అక్కడే బలవంతంగా ఉంచేసినట్లు కూడ బాధితురాలు తెలిపింది. అయితే మర్నాడు మార్చి 8వ తేదీన వారినుంచి తప్పించుకొని నగరంలోనే ఉన్న తన తాతగారింటికి వెళ్ళానని, అయితే వారికి జరిగిన విషయం చెప్పలేదని ఆమె తెలిపింది. అక్కడినుంచీ తిరిగి ఇంటికి బయల్దేరిన తనను తనకు తెలిసిన మరో ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి సంజయ్ కాలనీకి తీసుకువెళ్ళారని, అక్కడ ఆరుగురు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు చెప్పిన వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే బాధితురాలి తల్లిదండ్రులు ఆమె మార్చి 7న ఇంటినుంచి వెళ్ళి తిరిగి రాలేదంటూ ధార్ కోట్ వాలి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రెండురోజుల అనంతరం తనంతట తానుగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాలిక... తనపై జరిగిన ఆఘాయిత్యాలను పోలీసులకు వివరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను వైద్య పరీక్షలకు పంపించామని, నిందితులు సంతోష్ (24), సుభాష్ సింగ్ (20) ఆకాష్ అలియాస్ గోలు (19), భరత్ (18) తోపాటు మరో ముగ్గురిపై వివిధ సెక్షల్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ధార్ కోట్ వాలి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ అంజనా ధుర్వే తెలిపారు. -
ఐదో తరగతి విద్యార్థిపై అఘాయిత్యం
ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్లో ఘోరం చోటుచేసుకుంది. పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, ఓ ఉద్యోగి కలిసి ఐదోతరగతి విద్యార్థిపై అరాచకానికి పాల్పడ్డారు. ముజఫర్‌నగర్ పోలీసుల సమాచారం ప్రకారం స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిపై ముగ్గురు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ఓ ఉద్యోగి స్వలింగ సంభోగం జరిపారంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భారతీయ శిక్షాస్మృతి 377 ప్రకారం విద్యార్థిపై ప్రకృతి విరుద్ధ చర్య (అసహజ సెక్స్)కు పాల్పడిన నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తేజ్ బీర్ సింగ్ తెలిపారు. ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగిందని, సోమవారం విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. దీనిపై సెక్షన్ 377, 120బి తదితర సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అసహజ సెక్స్ కేసులో నిందితులైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ఉద్యోగి పరారీలో ఉన్నారని, వారిని త్వరలో పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని పోలీసు అధికారులు చెబుతున్నారు. -
యువతి కిడ్నాప్..ఎమ్మెల్యేపై కేసు నమోదు
పాట్నా: 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేశాడన్న ఆరోపణలతో గురువారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన బిహార్‌లోని సోన్కుక్రా గ్రామంలో చోటుచేసుకుంది. యువతి తండ్రి అభయ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. గురువారం ఉదయం బిక్రం నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్దార్థ్ తన కూతురుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అభయ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 363 కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని ఎస్పీ ద్రుతి సాయిలీ తెలిపారు. ఎమ్మెల్యే ఫోన్లో అందుబాటులో లేడని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
బాలికను బెదిరించి రెమో బుక్కయ్యాడు
పనాజి: 'అది అరబిక్ కడలందం' అంటూ తెలుగు సినీ సంగీత ప్రియులకు పరిచయమైన ప్రఖ్యాత పాప్ గాయకుడు రెమో ఫెర్నాండెజ్ (62) పై గోవాలో కేసు నమోదైంది. తన కొడుకుపై ఫిర్యాదు చేసిన ఓ బాలికను బెదిరించి అడ్డంగా బుక్కయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని కేసును ఉపహంహరించుకోవాలని రెమో బెదిరించాడని, భయపెట్టి, దుర్భాషలాడాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి జివ్బా దాల్వి తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం రెమోకు అరెస్ట్ వారెంట్ జారీ చేయనున్నామని తెలిపారు. డిశెంబర్ 2వ తేదీన రెమో కొడుకు జోనాద్ నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసి ఓ బాలికను గాయపరిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె గోవాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమయ్యాడంటూ జోనాద్ పై మపుసా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ప్రమాదం జరిగిన మరునాడు రెమో ఆ అమ్మాయిని బెదిరించినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ప్రస్తుతం యూరోప్ ట్రిప్ లో ఉన్న రెమో ఈ ఆరోపణలను ఖండించాడు. వాస్తవాలను పక్కదోవ పట్టించేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అతడు మండిపడ్డాడు. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు పేర్కొన్నాడు. -
ఆ ఫోటోలు పెట్టి బుక్కయ్యాడు
లక్నో: దేవుళ్ల బొమ్మలను కాళ్ల మీద, వీపు మీద టాటూలుగా వేయించుకొని మొన్న బెంగళూరులో ఓ జంట ఇబ్బందుల్లో పడితే, యూపీకి చెందిన మరో యువకుడు ఓ మతానికి చెందిన దేవుళ్లు, దేవతల ఫోటోలను అభ్యంతరకర రీతిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బుక్కయ్యాడు. వాట్సప్‌లో అనుచిత ఫోటోలను పోస్ట్ చేసినందుకుగాను యువకుడి(20)పై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెచ్ జిల్లా నాన్‌పారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ సాలిగ్రామ్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం... కయస్తా తోలాకు చెందిన ఓ యువకుడు ఇటీవల తమ వర్గానికి చెందిన వ్యక్తులతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాడు. ఇందులో ఓ మతానికి చెందిన దేవుళ్లు, దేవతల ఫోటోలను అభ్యంతరకర రీతిలో పోస్ట్ చేశాడు. దీన్ని గమనించిన మరో వర్గానికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు యువకుడిపై శనివారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగంచే ఎటువంటి చర్యలనైనా తాము సహించమని ఎస్పీ సాలిగ్రామ్ వర్మ ఈ సందర్భంగా హెచ్చరించారు. -
నకిలీ 'ఎంటెక్'తో ఉద్యోగం.. తెలుగు యువకుడిపై కేసు
కాన్పూర్: ఎంటెక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ గేట్లో మెరిట్ ర్యాంకు వచ్చిందని నమ్మబలికి ఓఎన్జీసీలో ఉద్యోగం కొట్టేయడానికి ప్రయత్నించిన ఓ తెలుగు యువకుడిపై డెహ్రాడూన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గేట్- 2015 కన్వీనర్, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ షౌనక్ ఛటర్జీ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన గుణతేజ సుదర్శన్ కొద్దిరోజుల కిందట డ్రెహ్రాడూన్లోని ఓఎన్జీసీలో ఇంజనీర్ ఉద్యోగానికిగానూ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. గేట్ ఎగ్జామ్‌లో 712 స్కోరుతో ఆలిండియా 206వ ర్యాంకు పొందానని, కెమికల్ ఇంజనీరింగ్‌లో టాప్ మార్కు తనదేనని నమ్మబలికాడు. అతని తీరును శంకించిన ఇంటర్వ్యూ అధికారులు.. సుదర్శన్ ఇచ్చిన గేట్ మార్కుల లిస్టుపై తమకు అనుమానం ఉదని, ఓ సారి పరిశీలించి చూడమని గత సోమవారం గేట్- 2015 కన్వీనర్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. గేట్ ఎంట్రెన్స్‌లో సుదర్శన్ అసలు పాస్ కానేలేదు! 100కు అతనికి వచ్చింది కేవలం 17.67 మార్కులే! ఓఎన్జీసీ అధికారుల ఫిర్యాదుతో సీన్లోకి ఎంటరైన డెహ్రాడూన్ పోలీసులు సుదర్శన్ దాఖలు చేసిన నకిలీ సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు.