ఆ ఫోటోలు పెట్టి బుక్కయ్యాడు | youth booked for posting objectionable photos on whatsapp | Sakshi
Sakshi News home page

ఆ ఫోటోలు పెట్టి బుక్కయ్యాడు

Published Sat, Oct 31 2015 5:26 PM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

ఆ ఫోటోలు  పెట్టి బుక్కయ్యాడు

ఆ ఫోటోలు పెట్టి బుక్కయ్యాడు

లక్నో: దేవుళ్ల బొమ్మలను  కాళ్ల మీద, వీపు మీద  టాటూలుగా వేయించుకొని మొన్న బెంగళూరులో  ఓ జంట  ఇబ్బందుల్లో పడితే,  యూపీకి చెందిన మరో  యువకుడు ఓ మతానికి చెందిన దేవుళ్లు, దేవతల ఫోటోలను అభ్యంతరకర రీతిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి  బుక్కయ్యాడు.   వాట్సప్‌లో అనుచిత ఫోటోలను పోస్ట్ చేసినందుకుగాను యువకుడి(20)పై కేసు నమోదైంది.

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెచ్ జిల్లా నాన్‌పారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.  జిల్లా ఎస్పీ సాలిగ్రామ్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం... కయస్తా తోలాకు చెందిన ఓ యువకుడు ఇటీవల తమ వర్గానికి చెందిన వ్యక్తులతో వాట్సప్ గ్రూప్‌ క్రియేట్ చేసుకున్నాడు. ఇందులో  ఓ మతానికి చెందిన దేవుళ్లు, దేవతల ఫోటోలను అభ్యంతరకర రీతిలో పోస్ట్ చేశాడు.

దీన్ని గమనించిన మరో వర్గానికి చెందిన వారు  అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న పెద్ద ఎత్తున నిరసనలకు  దిగారు.  ఈ నేపథ్యంలో పోలీసులు సదరు యువకుడిపై శనివారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగంచే ఎటువంటి చర్యలనైనా తాము సహించమని ఎస్పీ సాలిగ్రామ్ వర్మ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement