వాట్సప్‌కు హేటా్‌‌సఫ్ | whatsapp | Sakshi
Sakshi News home page

వాట్సప్‌కు హేటా్‌‌సఫ్

Published Sat, Nov 1 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

వాట్సప్‌కు హేటా్‌‌సఫ్

వాట్సప్‌కు హేటా్‌‌సఫ్

  • ఆకట్టుకుంటున్న మొబైల్ ఆప్స్
  •  మొగ్గుచూపుతున్న యువత
  •  భారీగా పెరిగిన ఆదరణ
  • వాట్సప్‌కు యువత హేట్సాప్ అంటోంది. ఇటీవల కాలంలో పుట్టుకొచ్చిన మొబైల్ ఆప్స్‌లో అత్యంత ఆదరణ పొందిన ఆప్స్ వాట్సప్. మొబైల్‌లో టాక్‌టైమ్ ఉన్నా లేకపోయినా ఇంటర్నెట్ డేటాకార్డు వేసుకుంటే ఎంత సేపైనా ఈయాప్స్ సహాయంతో మాట్లాడుకోవచ్చు. సందేశాలు పంపుకోవచ్చు. వీడియో చాట్ చేసుకోవచ్చు. గ్రూప్‌కట్టి ఒకరి భావాలను మరొకరు పంచుకోవచ్చు. వాట్సప్‌పై ప్రత్యేక కథనం మీ కోసం..
     
    యూనివర్సిటీక్యాంపస్:

    ప్రస్తుతం మొబైల్ ఫోన్ల ధరలు తగ్గిపోయాయి. కేవలం ఐదువేలకే అన్ని ప్యూచర్లు కలిగిన ఫోన్లను కొని అన్ని యాప్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఒక యాప్స్ కాకుండా హైక్, లైన్, లైబర్, చాట్ తదితర మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
     
    యువతకు ఎంతో ఉపయోగం

    నీకు హైక్‌లో అకౌంట్ ఉందా ? లేదా ... కనీసం వైబర్‌లో నైనా టచ్‌లో ఉంటావా ? వీలుంటే వాట్సప్‌లో ఫొటోలు షేర్ చేయవచ్చుకదా. ఫేస్‌బుక్ మెసెంజర్ ఉంటే సరదాగా మాట్లాడుకోవచ్చుకదా ఇలా ఉన్నాయి..  ప్రస్తుతం యువత మధ్య ఉన్న మాటలు. ఒకప్పుడు మెసేజ్ పంపాలంటే నెట్‌వర్క్ పరిధిలోని సెల్ నంబర్ నుంచి వేరేసెల్‌కు మాత్రమే సాధ్యమయ్యేది. కానీ అధునాతన ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. మెసెంజర్స్ ద్వారా మెసేజెస్ పంపడమే  కాకుండా వీడియో, ఫొటోలు షేర్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఉంటే చాలు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా వాట్సప్, వైబర్, లైన్, హైక్, చాట్, తదితర యాప్స్ ఉపయోగించుకోవచ్చు. చాటింగ్, షేరింగ్, కాలింగ్, వీడియో కాలింగ్ ఇవన్నీ చేసుకునే అవకాశం ఉండడంతో యువత వీటికి పడిపోయారు. గూగుల్స్ ప్లేలో రోజుకోకొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. యువత ఎక్కువగా వాడుతున్న యాప్స్ వాట్సప్, వైబర్, పేస్‌బుక్ మెసెంజర్ .
     
    ఫేస్‌బుక్ మెసెంజర్

    వాట్సప్, వైబర్‌ల తర్వాత ఎక్కువమంది ఆకర్షిస్తున్న యాప్ ఫేస్‌బుక్ మెసెంజర్. ఫేస్‌బుక్‌కు అడ్వాన్స్‌డ్ యాప్ ఇది. దీని ద్వారా చాటింగ్ చేసుకోవడంతో పాటు ఫొటోలు పంపుకోవచ్చు. గంటల తరబడి చాట్ చేసుకోవచ్చు.
     
    వైబర్

    వైబర్ యాప్ ద్వారా  ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఫోన్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటే ఎంతసేపైనా  మాట్లాడుకోవచ్చు.
     
    వాట్సప్ అంటే


    వాట్సప్ అంటే దీని ద్వారా ఫోన్ నంబర్ తెలిసిన వారు కూడా వాట్సప్‌లో ఉంటే ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. మెసెజ్‌లు పంపుకోవచ్చు. చాటింగ్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో సెల్పీ ఫొటోలపై యువతలో మోజు పెరిగింది. దీంతో యువత అనుక్షణం తామేం చేస్తున్నా సెల్ఫ్ ఫొటోలు తీసుకుని వాటిని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు. దీని ద్వారా కొంతమంది మిత్రులు కలసి గ్రూపులు కట్టి తమ భావాలను పంచుకుంటున్నారు.
     
    ఉపయోగకరంగా ఉంది
    నేను సంవత్సర కాలంగా వాట్సప్‌ను వాడుతున్నాను. ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంది. ఫొటోలను, మెసేజ్‌లను, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఏ మాత్రం  ఖర్చులేకుండా మెసెజెస్ పంపుకోవడానికి వీలవుతుంది.                                 
    - హేమంత్‌కుమార్, ఎస్వీయూ
     
    అందరూ వాడుతున్నారు

    నేను ఆరునెలలుగా  వాట్సప్‌ను వాడుతున్నాను. నా స్నేహితులు ఎక్కువమంది వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారు. అందువల్ల అందరూ కలసి  ఒక గ్రూప్‌క్రియేట్ చేసి అందరి భావనలను షేర్ చేసుకుంటున్నాం. మెసేజ్‌కాని, ఫొటోకాని షేర్ చేస్తే గ్రూప్‌లో అందరూ వాటిని చూ సుకోవచ్చు.                         
     - కల్పన, ఎస్వీయూ
     
    తగ్గిన ఖర్చు
    స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి వచ్చి న  హైక్, వాట్సప్, వైబర్, లన్, చాట్, ఫే స్‌బుక్ మెసెంజర్‌లు బాగున్నాయి. వీటి ద్వారా  మొబైల్  చార్జీలు తగ్గుతాయి. టాక్‌టైం లేక పోయినా డాటాకార్డు వేసుకుని అతి తక్కు వ ఖర్చుతో  మాట్లాడుకోవడానికి, సందేశాలు పంపుకోవడానికి  వీలుగా ఉంది.
     - శ్రావణ్, ఎస్వీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement