objectionable photos
-
బికినీలో ‘మేడమ్’ హల్చల్.. కంగుతిన్న పేరెంట్స్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోల కారణంగా ఆమె ఉద్యోగం ఊడింది. అందుకు కారణం.. ఆ ఫొటోలు అభ్యంతకరంగా ఉన్నాయని పేరెంట్స్ ఫిర్యాదు చేయడమే!. ఏడాది కాలంగా నడుస్తోంది ఈ కేసు.. కోల్‌కతాకు చెందిన ఓ ప్రముఖ కాలేజీలో సదరు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పని చేస్తోంది. అయితే ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తరచూ ఫొటోలు అప్లోడ్ చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలో ఓరోజు ఫ్లస్ టూ చదువుతున్న ఓ విద్యార్థి(18) ఆమె ఫొటోలను పదే పదే చూస్తూ ఉండిపోయాడట. అది రహస్యంగా గమనించిన అతని తండ్రి బీకే ముఖర్జీ.. కాలేజీ యాజమాన్యానికి ఓ లేఖ రాశాడు. సదరు మేడమ్‌గారు అలాంటి ఫొటోలు అప్లోడ్ చేయడం సిగ్గుచేటని.. ఆమె వల్ల తమ పిల్లలు పాడైపోతున్నారని, ఆమె బికినీలో ఫొటోలు అప్లోడ్ చేయడం విద్యార్థులను రెచ్చగొట్టడమే అవుతుందని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె ఫొటోలను సైతం ఎటాచ్ చేసి మరీ పంపించాడట. ఈ నేపథ్యంలో.. కిందటి ఏడాది అక్టోబర్‌లో మీటింగ్ పెట్టి మరీ ఆమెను తొలగించక తప్పలేదు కాలేజీ యాజమాన్యానికి. అయితే ఆమె తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసిందని.. అభ్యంతరకర ఫొటోల విషయంలో కాదని కాలేజీ యాజమాన్యం ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అయితే ఆ మరుసటిరోజే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇదిలా ఉంటే.. తన ఫోన్‌ను, సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి ఎవరో.. వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన క్యారెక్టర్‌ను దిగజార్చే క్రమంలోనే ఇదంతా జరుగుతోందని, ఇది ముమ్మాటికీ కాలేజీ యాజమాన్యం తనపై చేస్తున్న వేధింపుల కిందకే వస్తుందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. A student of St. Xavier’s Kolkata was recently caught looking at a pic of a Prof in her swimsuit (taken from her private IG). His father sent a letter to the uni condemning HER for his son’s leching. Prof was forced to resign in a strikingly humiliating manner. 2022… damn. pic.twitter.com/2RNLnXBd0p — Sukhnidh ⚆ _ ⚆ (@skhndh) August 8, 2022 ఈలోపు తనకు సదరు విద్యార్థి తండ్రి చేసిన ఫిర్యాదు కాపీ ఇవ్వాలంటూ యూనివర్సిటీకి సదరు ప్రొఫెసర్ లీగల్ నోటీసులు పంపింది. ఆ నోటీసులు ఈ ఏడాది మార్చ్ 28న యూనివర్సిటీ స్పందించింది. లీగల్ నోటీసులను దురద్దేశ పూర్వకంగా పంపారని, ఇది కాలేజీ ప్రతిష్టను దెబ్బ తీయడమే అవుతుందని బదులు ఇచ్చింది. అంతేకాదు భేషరతు క్షమాపణలు చెప్పాలని, నష్టపరిహారం కింద 99 కోట్ల రూపాయలు చెల్లించాలని సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు బదులు ఇచ్చింది యూనివర్సిటీ. దీంతో ప్రస్తుతం ఆమె హైకోర్టుకు వెళ్లనున్నారు. ఇదీ చదవండి: హాయ్.. నేను కలెక్టర్ టీనా దాబిని! -
Crime News: బాత్రూంలో కెమెరాలు! మంచోడు అనుకుంటే..
బంజారాహిల్స్: మంచోడు అనుకుని ఓ ఆఫీస్ బాయ్‌తో స్నేహం చేస్తే.. తనపట్లే అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ యువతి షాక్‌కు గురైంది. తాను పని చేస్తున్న సమయంలో తనకు తెలియకుండా వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు తన నగ్న చిత్రాలను ఫొటోలు తీయడమే కాదు.. వాటితో పాటు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 92లోని ఓ బొటిక్‌లో హిమాయత్‌నగర్‌కు చెందిన యువతి పని చేసేది. ఆమె గత మార్చిలో అక్కడ ఉద్యోగం మానేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి అసభ్యకరమైన ఓ మెసేజ్ రావడంతో ఆమె డిలీట్ చేసింది. అయితే ఈ నెల 25న మళ్లీ ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. దానిని ఓపెన్ చేసి చూడగా అందులో ఉన్న ఫొటోలను చూసి షాక్‌కు గురైంది. తాను జూబ్లీహిల్స్ రోడ్ నెం. 92లో దుస్తుల షోరూంలో పని చేసినప్పుడు వాష్‌రూమ్‌లో తీసిన ఫొటోలుగా గుర్తించింది. అక్కడ పని చేస్తున్నప్పుడు మిథున్ దాస్ అనే వెస్ట్‌బెంగాల్‌కు చెందిన ఆఫీస్ బాయ్ ఆమెతో మాట్లాడేవాడు. మంచివాడిగా నటించడంతో అతనితో క్లోజ్‌గా ఉండేది ఆమె. తనతో ఉన్న చనువును ఆసరాగా చేసుకుని.. బాత్రూమ్లో కెమెరాలు పెట్టి ఈ ఫొటోలు తీసినట్లుగా నిర్ధారించుకుంది. తాను బాత్రూమ్కు వెళ్ళినప్పుడు తనకు తెలియకుండా మిథున్‌దాస్ ఈ ఫొటోలు తీశాడని వాటిని తిరిగి తనకు పంపించాడని ఆరోపిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
జీతం అడిగితే.. అశ్లీల వీడియోలు
మీరట్ : యూపీలోని మీరట్‌లో స్కూల్ యాజమాన్యం వికృత చర్యలు ఆలస్యంగా వెలుగుచూశాయి. జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన మహిళా ఉపాధ్యాయులను వేధించడమే గాక టాయిలెట్స్‌లో రహస్యంగా స్పై కెమెరాలు ఏర్పాటు చేసి అశ్లీల వీడియోలు తీసినట్లు బయటపడింది. వివరాలు.. మీరట్‌లోని సర్ధార్ బజార్లో రిషబ్ అకాడమీ స్కూల్ నడుపుతున్నారు. లాక్డౌన్ ఉండడంతో పాఠశాలను మూసివేశారు. దీంతో ఆ స్కూల్లో పనిచేస్తున్న పలువురు మహిళా ఉపాధ్యాయులు తమకు అందాల్సిన జీతాలను ఇవ్వాలంటూ స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పాఠశాల సెక్రటరీగా ఉన్న రంజీత్ జైన్ అతని కొడుకు అభినవ్ జైన్లు జీతాలు ఇవ్వకుండా వేధించడమే గాక మహిళల టాయిలెట్ రూంలో రహస్యంగా స్పై కెమెరాలు అమర్చినట్లు తేలింది.(చదవండి : విషాదం: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య) జీతాలు అడగానికి వచ్చిన సదరు మహిళా ఉపాధ్యాయులకు వారి వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు తెలిసింది. దీంతో పాఠశాల గేటు ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు అక్కడినుంచి మీరట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రంజిత్, అభినవ్‌లపై ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా తండ్రీ, కొడుకులు తమకు తెలియకుండా తీసిన రహస్య వీడియోలను చూపించి చనువుగా ఉండాలంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ఒక మహిళ ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తాము వారికి లొంగకపోతే చేతబడి చేయించి మమ్మల్ని చంపేందుకు కూడా వెనకాడమని బెదిరించారంటూ మరికొందరు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. (చదవండి : ప్రణయ్‌ని చంపినట్లు చంపుతామని..) -
రాసలీలల వీడియోలు : ఆ ఎస్పీపై బదిలీ వేటు
దొడ్డబళ్లాపురం: పవిత్రమైన ప్రజా రక్షక వృత్తిలో ఉంటూ పరాయి మహిళతో రాసలీలల వీడియోలు బయటపడడంతో తీవ్ర విమర్శల పాలవుతున్న బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ భీమాశంకర్ గుళేద్ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతో ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా బదిలీ (వేకెన్సీ రిజర్వు) చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో టీపీ శివకుమార్‌ను రూరల్ ఎస్పీగా నియమించారు. మరోవైపు గుళేద్ వ్యవహారం సోమవారమూ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన దావణగెరెలో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక ఫోటో స్టూడియో నిర్వాహకురాలితో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలు ఆదివారం వెలుగు చూడడం తెలిసిందే. ఆ వీడియోలు ఒక ప్రైవేటు టీవీ న్యూస్చానెల్లో రెండు రోజులుగా ప్రసారమవుతున్నా ఇప్పటి వరకూ ఆ ఎస్పీ కాని, పోలీసు పెద్దలు కానీ నోరు మెదపలేదు. అయితే సోమవారం ఒత్తిడి పెరగడంతో ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి జి.పరమేశ్వర్, డీజీపీ నీలమణి రాజును పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. మహిళ, భర్త పరస్పర విమర్శలు వీడియోలో ఎస్పీతో ఉన్న మహిళ మాత్రం తన భర్త తనను వేధించేవాడని, అందుకే ఈ విధంగా రచ్చకీడుస్తున్నాడని,ఎస్పీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. ఈమె భర్త తనకు ఎస్పీ నుంచి, తన భార్య నుండి ప్రాణహాని ఉందని రక్షణ కావాలని కోరుతున్నాడు. ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని, తక్షణం ఆయనపై పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని, డిపార్ట్మెంట్లో ఉన్న మహిళా సిబ్బందికి ఒక భరోసా కల్పించాలని పలువురు సామాజిక కార్యకర్తలు డిమాండు చేస్తున్నారు. మరోవైపు దావణగెరెలో ఎస్పీకి సంబంధించి ఆసక్తికర విషయాలను ఒక్కొక్కరూ బయటపెడు తున్నారు. రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తే ఎస్పీ అనేకమంది అమాయకులను కేసుల్లో ఇరికించారని ఆరోపణలు వస్తున్నాయి. -
చెండాలమైన పనితో బుక్కైన ఎస్పీ
సాక్షి, బెంగళూరు: నగరంలో షాకింగ్ వ్యవహారం వెలుగు చూసింది. బెంగళూరుకు చెందిన ఓ ఐపీఎస్ అధికారి.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ టెక్కీ ఆరోపణలకు దిగాడు. అంతేకాదు సదరు అధికారితో తన భార్య అభ్యంతరకర స్థితిలో ఉన్న ఫోటోలు, వీడియోలను సైతం ఆ భర్త పోలీసులకు అందించటం గమనార్హం. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. దేవాంగెరె ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్(40)కు 2010లో వివాహమైంది. రెండేళ్లపాటు అమెరికాలో ఉండి.. తిరిగి ఆ జంట నగరానికి వచ్చేసింది. భార్య గ్రాఫిక్ డిజైనింగ్ స్టూడియో నిర్వహిస్తున్న క్రమంలో.. గతేడాది ఆమె స్టూడియోకి ఎస్పీ భీమశంకర్ గులేద్ ఓ ఫోటో షూట్ కోసం వచ్చారు. ఆమెతో చనువుగా మాట్లాడి పరిచయం పెంచుకున్నాడు. అదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తర్వాత ఇద్దరూ సిటీలో చక్కర్లు కొట్టడం, ఆ విషయం తనదాకా రావటంతో సదరు టెక్కీ భార్యను మందలించాడు. భర్తకు భయపడి కొన్నాళ్లు ఐపీఎస్ ఆఫీసర్‌ను కలవడం మానేసిన ఆమె, తర్వాత మళ్లీ కలవడం మొదలెట్టింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని భర్త... తన భార్య, ఐపీఎస్ ఆఫీసర్‌తో సన్నిహితంగా ఉన్న సమయంలో ఓ వీడియో తీశాడు. అంతేకాకుండా భార్య ఫోన్లో ఇద్దరు కలిసి ముద్దులు పెట్టుకుంటున్న వీడియోలను.. మొత్తం సాక్ష్యాలను సేకరించి ఫిర్యాదు చేశాడు. చంపుతానని బెదిరించాడు.. ఈ విషయంలో భీమశంకర్‌పై గతంలో చాలాసార్లు ఫిర్యాదులు చేశానని, కానీ, ఎవరూ పట్టించుకోలేదని సదరు టెక్కీ వాపోతున్నాడు. ‘భీమశంకర్ నన్ను చంపుతానని బెదిరించేవాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఎన్కౌంటర్లో చంపుతానన్నాడు. డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో... ఇప్పుడు మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేశా’ అని సదరు ఇంజనీర్ వెల్లడించాడు. ఈ వ్యవహారంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు.. న్యాయ నిపుణుల సలహా తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు చెబుతున్నారు. వాళ్లు మాత్రం మరోలా... అయితే అతని ఈ వ్యవహారంలో టెక్కీ భార్య వివరణ మాత్రం మరోలా ఉంది. భర్తతో తనతో గొడవ పడి, వేరుగా ఉంటున్నాడని, ఆ కారణంగానే లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని ఆమె అంటోంది. ఇక భీమశంకర్ వైఫ్ కూడా సంచలన ఆరోపణలు చేస్తోంది. భీమశంకర్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ ఆమె సైతం పోలీసులను ఆశ్రయించటం కొసమెరుపు. అయితే భీమశంకర్ మాత్రం తన భార్య మానసిక పరిస్థితి బాగోలేదని, ఆమెను ప్రలోభపెట్టి కేసు పెట్టించారంటూ చెబుతున్నాడు. ఈ వరుస ట్విస్ట్‌ల మూలంగా కేసు కోసం రాష్ట్ర హోం శాఖ స్వయంగా రంగంలోకి దిగింది. హోంమంత్రి పరమేశ్వర ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. -
ఆ ఫోటోలు పెట్టి బుక్కయ్యాడు
లక్నో: దేవుళ్ల బొమ్మలను కాళ్ల మీద, వీపు మీద టాటూలుగా వేయించుకొని మొన్న బెంగళూరులో ఓ జంట ఇబ్బందుల్లో పడితే, యూపీకి చెందిన మరో యువకుడు ఓ మతానికి చెందిన దేవుళ్లు, దేవతల ఫోటోలను అభ్యంతరకర రీతిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బుక్కయ్యాడు. వాట్సప్‌లో అనుచిత ఫోటోలను పోస్ట్ చేసినందుకుగాను యువకుడి(20)పై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెచ్ జిల్లా నాన్‌పారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ సాలిగ్రామ్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం... కయస్తా తోలాకు చెందిన ఓ యువకుడు ఇటీవల తమ వర్గానికి చెందిన వ్యక్తులతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాడు. ఇందులో ఓ మతానికి చెందిన దేవుళ్లు, దేవతల ఫోటోలను అభ్యంతరకర రీతిలో పోస్ట్ చేశాడు. దీన్ని గమనించిన మరో వర్గానికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు యువకుడిపై శనివారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగంచే ఎటువంటి చర్యలనైనా తాము సహించమని ఎస్పీ సాలిగ్రామ్ వర్మ ఈ సందర్భంగా హెచ్చరించారు.