Hyderabad: Office Boy Arrested for Secretly Taking Videos of Female Employee in Wash Room - Sakshi
Sakshi News home page

మంచోడు అనుకుని స్నేహం చేస్తే.. బాత్‌రూంలో కెమెరాలు పెట్టి మరీ..

Published Fri, May 27 2022 8:36 AM | Last Updated on Fri, May 27 2022 9:30 AM

Office Boy Put Secret Cameras Banjarahills Case Filed - Sakshi

బంజారాహిల్స్‌:  మంచోడు అనుకుని ఓ ఆఫీస్‌ బాయ్‌తో స్నేహం చేస్తే.. తనపట్లే అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ యువతి షాక్‌కు గురైంది. తాను పని చేస్తున్న సమయంలో తనకు తెలియకుండా వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు తన నగ్న చిత్రాలను ఫొటోలు తీయడమే కాదు.. వాటితో పాటు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 92లోని ఓ బొటిక్‌లో హిమాయత్‌నగర్‌కు చెందిన యువతి పని చేసేది. ఆమె గత మార్చిలో అక్కడ ఉద్యోగం మానేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి అసభ్యకరమైన ఓ మెసేజ్‌ రావడంతో ఆమె డిలీట్‌ చేసింది. అయితే ఈ నెల 25న మళ్లీ ఆమెకు ఓ మెసేజ్‌ వచ్చింది. దానిని ఓపెన్‌ చేసి చూడగా అందులో ఉన్న ఫొటోలను చూసి షాక్‌కు గురైంది. తాను జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 92లో దుస్తుల షోరూంలో పని చేసినప్పుడు వాష్‌రూమ్‌లో తీసిన ఫొటోలుగా గుర్తించింది. 

అక్కడ పని చేస్తున్నప్పుడు మిథున్‌ దాస్‌ అనే వెస్ట్‌బెంగాల్‌కు చెందిన ఆఫీస్‌ బాయ్‌ ఆమెతో మాట్లాడేవాడు. మంచివాడిగా నటించడంతో అతనితో క్లోజ్‌గా ఉండేది ఆమె. తనతో ఉన్న చనువును ఆసరాగా చేసుకుని.. బాత్‌రూమ్‌లో కెమెరాలు పెట్టి ఈ ఫొటోలు తీసినట్లుగా నిర్ధారించుకుంది. తాను బాత్‌రూమ్‌కు వెళ్ళినప్పుడు తనకు తెలియకుండా మిథున్‌దాస్‌ ఈ ఫొటోలు తీశాడని వాటిని తిరిగి తనకు పంపించాడని ఆరోపిస్తూ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం  గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement