Office Boy
-
అప్పుడు ఆఫీసు బోయ్..ఇపుడు ఎవ్వరూ ఊహించని శిఖరాలకు!
ఎన్నిఅవరోధాలు, అడ్డంకులు ఎదురైనా దృఢ సంకల్పం,అచంచలమైన అంకితభావం ఉన్నవారు విజయం సాధిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తారు. అలా చిన్న ఉద్యోగంచేస్తూనే అతి పెద్ద లక్ష్యంపై గురిపెట్టి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు. తాజాగా దాదాసాహెబ్ భగత్ విజయ గాథ దీనికి ఉదాహరణ.గతంలో ఇన్ఫోసిస్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన భగత్ ఇప్పుడు తన సొంత స్టార్టప్‌లకు సీఈఓగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలందుకున్నారు. షెడ్ నుండి "మేడ్-ఇన్-ఇండియా" కాన్వా దాకా తన టాలెంట్‌తో రెండు కంపెనీలకూ సీఈఓ అయిన భగత్ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. దాదాసాహెబ్ భగత్ ఎవరు? మహారాష్ట్రలోని బీడ్‌కు చెందిన దాదాసాహెబ్ భగత్ 1994లో జన్మించారు. భగత్ ఉన్నత పాఠశాల పూర్తి చేసిన తర్వాత వృత్తిని కొనసాగించేందుకు తన గ్రామం నుండి పూణేకు వచ్చారు. ITI డిప్లొమా ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తర్వాత రూమ్ సర్వీస్ బాయ్‌గా నెలకు 9వేల రూపాయల ఉద్యోగంలో చేరారు. కానీ దాన్ని వదిలేసి ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌లో చేరారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. (R Thyagarajan Life Story: సర్వం ధారపోసిన ఈ బిజినెస్ టైకూన్ గురించి తెలుసా?) ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌లో అతిథులకు రూమ్ సర్వీస్, టీ ,వాటర్ అందించడం భగత్ డ్యూటీ. ఇక్కడే సాఫ్ట్వేర్ విలువను తెలుసుకుని పరిశ్రమపై ఆసక్తి పెంచుకున్నారు. కార్పొరేట్ ప్రపంచం పట్ల ఆకర్షితుడయ్యారు. యానిమేషన్ అండ్ డిజైన్‌ను చేయాలన్నపెద్దల సలహా మేరకు రాత్రి ఉద్యోగం, పగటిపూట యానిమేషన్లో చదువును కొనసాగించారు. కోర్సు పూర్తి చేసిన భగత్ ముంబైలో ఉద్యోగంలో చేరి, కొంతకాలం తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారు. అనుకోని ప్రమాదం, మంచానికే పరిమితం హైదరాబాద్‌లోని డిజైన్ అండ్ గ్రాఫిక్స్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే పైథాన్, C++ కోర్సులు చేశారు. విజువల్ ఎఫెక్ట్స్, టెంప్లేట్ల లైబ్రరీని సృష్టించడం దృష్టి పెట్టారు. ఈ డిజైన్ టెంప్లేట్లను ఆన్లైన్లో మార్కెట్ చేయడం ప్రారంభించాడు. అయితే దురదృష్టవశాత్తు, భగత్ కారు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినా కుంగి పోలేదు. ఉద్యోగం మానేసి ఫుల్‌టైమ్ స్టార్టప్‌ని ప్రారంభించారు. అలా 2015లో Ninthmotion ఆవిష్కృతమైంది. బీబీసీ స్టూడియోస్, 9XM మ్యూజిక్ ఛానెల్ వంటి ప్రసిద్ధ కంపెనీలతో సహాతన సేవల్ని అందిస్తూ, తక్కువ వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వేల మంది క్లయింట్లను సాధించారు. మలుపు తిప్పిన కోవిడ్-19 కాన్వా వంటి ఆన్లైన్ గ్రాఫిక్ డిజైనింగ్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలని భగత్ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా రెండో బిజినెస్ డూగ్రాఫిక్స్ అవతరించింది. ఈ ప్లాట్‌ఫారమ్ సాధారణడ్రాగ్-అండ్-డ్రాప్ ఇంటర్ ఫేస్‌ను కలిగి ఉంది. దీనిద్వారా యూజర్లు టెంప్లేట్లు, డిజైన్లను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. అయితే COVID-19 సంక్షోభం, లాక్డౌన్ కారణంగా పూణేలో వ్యాపారాన్ని వదులుకుని, బీడ్‌లోని తన గ్రామానికి మకాం మార్చవలసి వచ్చింది. ఇండియన్ 'కాన్వా' ప్రారంభం తన గ్రామంలో మంచి మౌలిక సదుపాయాలు లేనందున తాత్కాలిక ఏర్పాట్లు చేయడానికి, భగత్ మంచి 4G నెట్వర్క్ రిసెప్షన్‌తో పశువుల కొట్టంలో దుకాణాన్ని ఏర్పాటు చేశారు. భగత్ స్వయంగా యానిమేషన్ అండ్ డిజైన్‌లో శిక్షణ పొందిన కారణంగా కొంతమంది స్నేహితులకు శిక్షణ ఇచ్చి, వారితో కలిసి ఆ షెడ్లోనే పని ప్రారంభించారు. అలా గ్రామం నుండి చాలా మందికి తక్షణమే వెంటనే డూగ్రాఫిక్స్ శిక్షణ ఇవ్వడం, కార్యకలాపాలు మొదలు కావడం జరిగిపోయింది. కేవలం ఆరు నెలల్లో 10వేల క్రియాశీల వినియోగదారులను సాధించింది. వీరిలో మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగుళూరుతోపాటు, జపాన్, ఆస్ట్రేలియా యూకే నుంచి కూడా ఉన్నారు. విశేష సేవలందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాగే ప్రధాని మోదీ "ఆత్మనిర్భర్ భారత్" విజన్‌కు మద్దతుగా డూ గ్రాఫిక్స్, పూర్తిగా భారతీయ నిర్మిత సాఫ్ట్‌వేర్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద డిజైన్ పోర్టల్‌గా మార్చాలనేది భగత్ ఆశయం. -
ఏడో తరగతి కొలువుకు పీజీ అభ్యర్థుల ఎంపిక!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అది కేవలం ఓ సబార్డినేట్ పోస్టు.. సూటిగా చెప్పాలంటే ఆఫీస్ బాయ్ ఉద్యోగం. ఈ పోస్టుకు అర్హత ఏడో తరగతి పాస్ లేదా పదో తరగతి ఫెయిల్. పదో తరగతి పాస్ అయినా.. అంతకుమించి విద్యార్హతలు ఉన్నా.. వారు అనర్హులు. కానీ విచిత్రంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, పీహెచ్డీ చేసిన అభ్యర్థులే కావడం గమనార్హం. దరఖాస్తు చేసుకోవడమే కాదు, పరీక్ష రాసి పాసై ఎంపికయ్యారు. ఇక్కడే వివాదం చెలరేగుతోంది. ఈ ఏడాది జూన్ 23న కోర్టు సబార్డినేట్ పోస్టుల్లో గోల్మాల్ శీర్షికన ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం ప్రచురించడంతో ఈ వ్యవహారంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగింది? రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లోని దాదాపు 686 ఆఫీస్ సబార్డినేట్/అటెండర్ పోస్టుల భర్తీకి 2019 జూలైలో నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి జిల్లాలవారీగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో ఆదిలాబాద్‌లో 40, కరీంనగర్ 96, ఖమ్మం 78, మహబూబ్‌నగర్ 79, మెదక్ 86, నిజామాబాద్ 80, నల్లగొండ 64, రంగారెడ్డి 45, వరంగల్ 47, హైదరాబాద్‌లోని వివిధ కోర్టుల్లో 71 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఏడో తరగతి పాస్ లేదా పదో తరగతి ఫెయిల్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులని, ఉన్నత విద్యావంతులు ఈ ఉద్యోగానికి అర్హులు కారని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయి 2019 నవంబర్‌లో అభ్యర్థులంతా ఆన్లైన్లో పరీక్ష రాశారు. 2021 జూలైలో ఎంపికైన అభ్యర్థుల్లో 1:3 ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్, అనంతరం ఇంటర్వ్యూలకు పిలిచారు. ప్రైవేటులో ఉన్నతోద్యోగులే.. ఈ విషయంలో వరుస ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కరీంనగర్ జిల్లాలో ఎంపికైన 395 మందిలో 195 మంది ఓవర్ క్వాలిఫైడ్‌గా గుర్తించి వారిని పక్కనబెట్టారు. మిగిలిన వారికి 2022 ఫిబ్రవరిలో తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించి 93 మందితో తుది జాబితా ప్రకటించారు. ఈ జాబితాలోనూ ఓవర్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారని పదో తరగతి ఫెయిలైన అభ్యర్థులు ఆరోపించారు. ఇదే విషయాన్ని జూన్ 23న ‘సాక్షి’ కరీంనగర్ ఎడిషన్‌లో బయటపెట్టింది. దీనిపై స్పందించిన కరీంనగర్, రామగుండం కమిషనరేట్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల్లో చాలా మంది తాము అనర్హులమని అంగీకరించారు. ఇప్పటికే కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ దర్యాప్తులో ఓవర్ క్వాలిఫైడ్‌గా తేలిన వారి జాబితా సిద్ధమైంది. వారంతా వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉండటం గమనార్హం. ఎందుకు చిక్కడం లేదు..? ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు తమ నిజమైన అర్హతలు దాచి దరఖాస్తు చేస్తే.. మరికొందరు ఏకంగా కొన్ని స్కూళ్లలో చదవకపోయినా.. చదివినట్లు నకిలీ సర్టి ఫికెట్లు సృష్టించి ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అభ్య ర్థుల్లో 90% మంది తెలుగు మీడియం విద్యార్థులు. 2000 సంవత్సరం తరువాత చాలామటుకు ప్రైవేటు తెలుగు మీడియం స్కూళ్లు మూతబడ్డాయి. ఆ స్కూళ్ల రికార్డులు లభించకపోవడంతో ఎవరు ఏ స్కూలు విద్యార్థులో నిర్ధా రించడంలో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో ఎంపికైన చాలామందిలో ఓవర్‌క్వాలిఫైడ్ అభ్యర్థులున్నారని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు సిద్దిపేట జిల్లాలో ఇవే పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల్లో ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారని, వారికి టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఐడీలు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ విషయంలో హుస్నాబాద్ నుంచి ఎంపికైన అభ్యర్థి ఉన్నత విద్యావంతుడంటూ హుజూరాబాద్‌కు చెందిన కత్తి రమేశ్ అనే వ్యక్తి సాక్ష్యాధారాలతో హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ నడుస్తోంది. -
Crime News: బాత్రూంలో కెమెరాలు! మంచోడు అనుకుంటే..
బంజారాహిల్స్: మంచోడు అనుకుని ఓ ఆఫీస్ బాయ్‌తో స్నేహం చేస్తే.. తనపట్లే అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ యువతి షాక్‌కు గురైంది. తాను పని చేస్తున్న సమయంలో తనకు తెలియకుండా వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు తన నగ్న చిత్రాలను ఫొటోలు తీయడమే కాదు.. వాటితో పాటు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 92లోని ఓ బొటిక్‌లో హిమాయత్‌నగర్‌కు చెందిన యువతి పని చేసేది. ఆమె గత మార్చిలో అక్కడ ఉద్యోగం మానేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి అసభ్యకరమైన ఓ మెసేజ్ రావడంతో ఆమె డిలీట్ చేసింది. అయితే ఈ నెల 25న మళ్లీ ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. దానిని ఓపెన్ చేసి చూడగా అందులో ఉన్న ఫొటోలను చూసి షాక్‌కు గురైంది. తాను జూబ్లీహిల్స్ రోడ్ నెం. 92లో దుస్తుల షోరూంలో పని చేసినప్పుడు వాష్‌రూమ్‌లో తీసిన ఫొటోలుగా గుర్తించింది. అక్కడ పని చేస్తున్నప్పుడు మిథున్ దాస్ అనే వెస్ట్‌బెంగాల్‌కు చెందిన ఆఫీస్ బాయ్ ఆమెతో మాట్లాడేవాడు. మంచివాడిగా నటించడంతో అతనితో క్లోజ్‌గా ఉండేది ఆమె. తనతో ఉన్న చనువును ఆసరాగా చేసుకుని.. బాత్రూమ్లో కెమెరాలు పెట్టి ఈ ఫొటోలు తీసినట్లుగా నిర్ధారించుకుంది. తాను బాత్రూమ్కు వెళ్ళినప్పుడు తనకు తెలియకుండా మిథున్‌దాస్ ఈ ఫొటోలు తీశాడని వాటిని తిరిగి తనకు పంపించాడని ఆరోపిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
ఫలించిన కల.. ఆఫీస్‌బాయ్ నుంచి.. ఏపీపీ స్థాయికి
సాక్షి, రామగుండం(కరీంనగర్): అంతర్గాం మండలంలో మారుమూల గ్రామమైన రాయదండికి చెందిన యువకుడు పట్టుదలతో ముందుకెళ్లి అనుకున్నది సాధించాడు. ఆఫీస్‌బాయ్‌గా పనిచేసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. గ్రామానికి చెందిన అర్ధ చంద్రయ్య, వరలక్ష్మి దంపతుల రెండో కొడుకు కుమార్. అబాది రామగుండం జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి, గోదావరిఖనిలో ఇంటర్, డిగ్రీ చదివాడు. ఖర్చుల కోసం ప్రైవేటు పాఠశాలలో పార్ట్‌టైం ఉపాధ్యాయుడిగా, పేపర్ బాయ్‌గా, కార్యాలయాల్లో గుమాస్తాగా పనిచేశాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ సీటు సాధించాడు. 2004 నుంచి గోదావరిఖని, హైదరాబాద్‌లో సీనియర్ న్యాయవాదుల వద్ద శిక్షణ తీసుకున్నాడు. సహకరించిన అర్ధాంగి కుమార్‌కు పెద్దంపేటకు చెందిన తోట రాంచందర్, భాగ్య కూతురు రజితతో 2008లో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు. ఎంఎస్సీ పూర్తిచేసిన రజిత 2014లో వీఆర్ఏగా అదే గ్రామంలో ఉద్యోగం సాధించింది. అప్పటినుంచి కుమార్‌ను ప్రోత్సహిస్తోంది. ఆమె సహకారంతో 2021 అక్టోబర్‌లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవేశ పరీక్ష రాశాడు కుమార్. నవంబర్‌లో వెలువడిన ఫలితాల్లో అసిస్టెంట్ పీపీగా ఎంపికైనట్లు ఉత్తుర్వులు వెలువడ్డాయి. దీంతో అతడి కుటుంబంలో ఆనందం నెలకొంది. పట్టుదలతోనే ముందుకు.. ఏపీపీ ప్రవేశ పరీక్షకు ముందు అనేక జర్నల్స్ చదివా. విజయ శిఖరాలకు చేరినవారిని ఆదర్శంగా తీసుకున్నా. ప్రతిరోజూ 8 గంటలపాటు చదివా. న్యాయవాది వృత్తిలో కొనసాగాలనేది నా కల. పేదలకు సేవ చేయాలన్న తలంపుతోనే ఈ వృత్తిలోకి వచ్చా. – అర్ధ కుమార్ చదవండి: ‘రెండు గుంటలు’.. రెండు హత్యలు -
ఆఫీస్ బాయ్ టు సివిల్ ఇంజనీర్
-
ఆఫీస్ బాయ్‌కు రూ.కోట్లలో ఐటీ నోటీసులు
ముంబయి: ఓ కంపెనీలో ఆఫీసు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రవి జైశ్వాల్ (32) అనే వ్యక్తికి ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అది కూడా రూ.5.4కోట్లు ట్యాక్స్ పెండింగ్ ఉందంటూ. అంతేకాదు.. అతడి పేరిట నాలుగు కంపెనీలు ఉన్నట్లు కూడా ఐటీ అధికారులు పంపించిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు అందుకున్న రవి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఆ నోటీసులు తీసుకొని ఈ కేసుకు సంబంధించి విచారణ ప్రారంభిస్తున్న థానే ఎస్పీ మహేశ్ పాటిల్ వద్దకు వెళ్లి వివరాలు అందజేశాడు. ఆ సందర్భంలో వారిద్దరి మధ్య జరిగిన చర్చ ఆధారంగా అసలు విషయం బయటపడింది. అతడి ఆధార్, పాన్ కార్డులు ఉపయోగించుకొని ఓ వ్యక్తి నాలుగు కంపెనీలు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని భయందర్ అనే ప్రాంతంలోని మురికి వాడల్లోగల గణేశ్ దేవల్ నగర్ కు చెందిన వాడు రవి. అతడు గతంలో కాండివ్లిలో చార్టెడ్ ఎకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్ వద్ద 2008 ఆగస్టులో పనిలో చేరాడు. ఆ సమయంలో బ్యాంకు ఖాతాకోసం అంటూ తన పాన్, ఆధార్ కార్డులు తీసుకున్నాడు. కానీ, జీతభత్యం మాత్రం డబ్బు రూపంలో చేతికే ఇచ్చాడు. 2012లో రవి అక్కడ పని మానేసి వేరే సంస్థలో చేరాడు. అంతకుమించి అతడికి ఏమీ తెలియదు. అతడు ఇచ్చిన ప్రకారం విచారణ చేపట్టిన పోలీసులు శనివారం అగర్వాల్(42), అతడి భాగస్వామి రాజీవ్ గుప్తా(30)ను మరో ఇద్దరు ఉద్యోగులను అరెస్టు చేశారు. అనంతరం వారిని థానే కోర్టుకు తీసుకెళ్లి అనంతరం జైలు కస్టడీకి తరలించారు. -
మాజీ బాస్‌కు టోపీ.. రూ. 3 లక్షల షాపింగ్!
మాజీ బాస్ డెబిట్ కార్డు సమాచారం మొత్తాన్ని దొంగిలించి.. దాంతో ఏకంగా రూ. 3 లక్షల వరకు ఆన్లైన్ షాపింగ్ చేసిన ప్రబుద్ధుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అతడు కొన్నవాటిలో దాదాపు రూ. 1.50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో.. ఈ-కామర్స్ వెబ్సైట్లు కూడా అతడు ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ ఇవ్వకుండా ఆపేసి.. ఆ డబ్బును సదరు అకౌంటుకు తిప్పి పంపుతున్నాయి. తన ఖాతాలోంచి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు దాదాపు రూ. 3 లక్షల మేర ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు అకౌంటు బ్యాలెన్స్‌లో ఉందని శాంతినగర్ కాలనీలోని స్నిపర్ ఎలక్ట్రానిక్స్ అధినేత ఖాజా సల్మాన్ వాసిఫ్ పోలీసులకు ఈనెల 6వ తేదీన ఫిర్యాదుచేశారు. అయితే అసలు తాను ఆన్లైన్లో ఏమీ కొనలేదని, డెబిట్ కార్డు కూడా తన దగ్గరే ఉందని చెప్పారు. దాంతో సీసీఎస్‌లోని సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కామర్స్ వెబ్సైట్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం నిందితుడి మొబైల్ నెంబరు, అతడికి వస్తువులు డెలివరీ చేసిన చిరునామా పట్టుకున్నారు. అతడి మొబైల్ సిగ్నల్ శంకర్‌పల్లిలో ట్రేస్ అయింది. వాటి ద్వారా నిందితుడు శ్రీకాంత్ రెడ్డి (19)ని అరెస్టు చేశారు. శ్రీకాంత్ రెడ్డి స్నైపర్ ఎలక్ట్రానిక్స్‌లో ఆఫీస్ బోయ్‌గా పనిచేసేవాడు. యజమాని డెబిట్ కార్డు నెంబరు, సీవీవీ నెంబరు, ఎక్స్పైరీ డేట్ లాంటివాటిని జాగ్రత్తగా రాసుకుని, 2015 డిసెంబర్లో ఉద్యోగం మానేశాడు. తర్వాత ఫ్లిప్‌కార్ట్, ఎమెజాన్, మైంత్రా, జబాంగ్, జాపర్, షాప్‌క్లూస్ లాంటి ఈ కామర్స్ యాప్‌లను తన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఇక తన మాజీ బాస్ డెబిట్ కార్డుతో ఎడాపెడా కొనుగోళ్లు మొదలుపెట్టాడు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి తన పేరు, చిరునామా తప్పుగా ఇచ్చాడు. డెలివరీ బోయ్ కాల్ చేయగానే తానే స్వయంగా వెళ్లి వాటిని తీసుకునేవాడు. అయితే ఫోన్ నెంబరు మాత్రం అదే ఉండటంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు. -
ప్రేమించలేదని తుపాకీతో కాల్చేశాడు..
-
లంచావతారం
= పలమనేరు ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ దాడులు = లెక్కలోకి రాని రూ.1.15 లక్షలు సీజ్ = నలుగురు ఏజెంట్లు, ఇద్దరు ఆఫీస్ బాయ్‌లపై కేసులు పలమనేరు ఎంవీఐ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. కార్యాలయంలోని పలువురు ఏజెంట్లు, ఆఫీస్ సిబ్బంది నుంచి లెక్కలోకి రాని రూ.1.15,800ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎంవీఐ సమక్షంలోనే ఏజెంట్ల దందా జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు కాపుకాచి రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతి సిబ్బందిని పట్టుకున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం నిందితులపై తగు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. పలమనేరు,న్యూస్‌లైన్/గంగవరం, న్యూస్‌లైన్: పట్టణ సమీపం, గంగవరం మండల పరిధిలోని సాయినగర్ వద్ద ఉన్న పలమనేరు ఎంవీఐ (మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్) కార్యాలయం కొన్నాళ్లుగా అవినీతికి చిరునామాగా మా రి నట్ల్లు ఏసీబీ అధికారులకు సమాచారమందింది. కొన్ని రో జులుగా ఈ కార్యాలయంపై అధికారులు నిఘా ఉంచారు. బు ధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఏసీబీ సీఐలు పార్థసారథిరెడ్డి, రామకిషోర్, చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకాం త్‌రెడ్డి ఒక్కసారిగా కార్యాలయంలోకి ప్రవేశించి తలుపులు మూసేశారు. అక్కడి రికార్డులను పరిశీలించి మొత్తం పన్నులు, ఇతరత్రాలకు సంబంధించిన మొత్తాన్ని లెక్కకట్టారు. అనంతరం కార్యాలయం లోపలే ఉన్న పలువురు ఏజెంట్లు, ఆఫీస్ బాయ్‌లను తనిఖీ చేశారు. లెక్కలోకి రాని రూ.1,15,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏజెంట్లు గోకుల శ్రీనివాస్, పచ్చినూలు రాజు, మేకల రమేష్‌బాబు, షేక సల్మాన్‌ఖాన్, ఆఫీస్ బాయ్స్ సయ్యద్ షఫీ, షేక్ రియాజ్ బాషాలపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఎంవీఐ కార్యాలయంలోనే ఎంవీఐ సమక్షంలోనే ఏజెంట్ల దందా జరుగుతోందంటే ఈ అవినీతి అక్రమాల వెనుక అధికారుల హస్తం ఉందనే విషయాన్ని వారు గుర్తించారు. దీంతో ఎంవీఐ మధుసూదన్‌ను సైతం విచారించారు. పూర్తి స్థాయిలో దాడులకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు సీఐలు తెలిపారు. ఏసీబీ దాడులతో పలు కార్యాలయాల ఖాళీ పలమనేరు ఎంవీఐ కార్యాలయంలో ఏసీబీ సోదాలు సాగుతున్నాయనే సమాచారంతో పలమనేరు, గంగవరం మండలాల్లోని పలు కార్యాలయాలు బోసిపోయాయి. గత రెండు రోజులుగా ఏసీబీ అధికారులు పలమనేరులో తిరుగుతున్నారనే పుకార్లు వినిపించాయి. దాంతో పాటు బుధవారం ఉదయం సైతం పలమనేరు తహశీల్దార్ కార్యాలయం వద్ద కొందరు ఏసీబీ అధికారులు తిరిగారు. దీంతో పలమనేరు, గంగవరం కార్యాలయాల్లోని పలువురు అధికారులు చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించారు. కొందరైతే కార్యాలయాల బయటే గడిపారు. అనవసరంగా డబ్బులు పోయనే.... పలు ప్రాంతాలకు చెందినవారు లెసైన్సుల రెన్యూవల్స్, ట్యాక్సులు ఇతరత్రాల కోసం బుధవారం ఉదయం వేలాది రూపాయలు ఏజెంట్లకు అందజేశారు. అధికారులు దాడులు చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దీంతో అనవసరంగా తమ డబ్బులు పోయూయంటూ అంటూ వారు ఆందోళన చెందారు. ఏజెంట్లను నమ్మినందుకు తమకు తగినశాస్తి జరిగిందంటూ కొందరు వెనుదిరిగారు. అవినీతిపై సమాచారమందించండి... ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతి, అక్రమాలపై తమకు సమాచారమందించాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అధికారులెవరైనా లంచాల కోసం వేధిస్తున్నా, ఇత ర సమస్యలేమైనా ఉన్నా ప్రజలు తమ ఫోన్‌నెంబర్లు 944044 6120, 940446190. 9440446191,9440446193, 944044 6138, 9440808112లకు సమాచారం అందివ్వాలన్నారు.