Secret cameras
-
రహస్య కెమెరాల విక్రయాలు.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్: రహస్య కెమెరాల విక్రయంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రహస్య కెమెరాల విక్రయాన్ని సవాలు చేస్తూ హెవెన్ హోమ్స్ సొసైటీ పిటిషన్ వేసింది. రహస్య కెమెరాలను మార్కెట్, ఆన్లైన్లో నేరుగా విక్రయిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లో రహస్య కెమెరాలు పెడుతున్నారన్న పిటిషనర్.. వాష్‌రూమ్‌లు, ఎక్స్‌రే గదుల్లో కూడా రహస్య కెమెరాలు పెడుతున్నారని పిటిషనర్ తెలిపారు. రహస్య కెమెరాల విక్రయాలపై నియంత్రణ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు.ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పిటిషనర్ చేర్చారు. కౌంటర్ దాఖలుకు కేంద్రం తరఫు న్యాయవాది సమయం కోరారు. వచ్చే నెల 28వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025.. మురిపించేనా.. మొండిచెయ్యేనా? -
వైద్యుడి రూపంలోని రాక్షసుడు
వాషింగ్టన్: చికిత్స కోసం వచ్చే రోగుల పట్ల అభిమానం, వాత్సల్యం ప్రదర్శిస్తూ సాంత్వన చేకూర్చాల్సిన వైద్యుడు రాక్షసంగా ప్రవర్తించాడు. తాను పనిచేసే ఆసుపత్రిలో రహస్యంగా కెమెరాలు అమర్చి మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలు, ఫొటోలు చిత్రీకరించాడు. కొందరు మహిళలకు మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నాక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను సైతం రికార్డు చేసి, తన కంప్యూటర్లో భద్రపర్చాడు. ఆఖరికి సొంత ఇంట్లో కూడా కెమెరా అమర్చి వీడియోలు చిత్రీకరించాడంటే అతడెంత ఉన్మాదో అర్థం చేసుకోవచ్చు. చివరికి పాపం పండడంతో కట్టుకున్న భార్యే అతడి బాగోతాన్ని పోలీసులకు తెలియజేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఆ దుర్మార్గుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అతడొక భారతీయ వైద్యుడు కావడం గమనార్హం. భారతీయుడైన ఒమెయిర్ ఎజాజ్(40) స్వదేశంలో వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత 2011లో వర్క్ వీసాపై అమెరికా చేరుకున్నాడు. తొలుత అలబామాలో నివసించాడు. 2018లో మిషిగాన్‌కు మకాం మార్చాడు. మొదట రెండు ఆసుపత్రుల్లో డాక్టర్‌గా పనిచేశాడు. తర్వాత ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని వేర్వేరు ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. డాక్టర్‌గా విధుల్లో చేరినప్పటి నుంచే తనలోని మరో కోణం బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు. బాత్రూ మ్లు, బట్టలు మార్చుకొనే గదులు, హాస్పి టల్లో మహిళా రోగులు ఉండే గదుల్లో రహస్యంగా కెమెరాలు అమర్చేవాడు. కెమె రాల్లోని దృశ్యాలను రికార్డు చేసి, ఎప్పటి కప్పుడు కంప్యూటర్లో భద్రపర్చేవాడు. మహిళలు, చిన్నారులే అతడి టార్గెట్. రెండేళ్ల పసిపాప వీడియోలు సైతం రికార్డు చేశాడు. అలాగే తనవద్దకు చికిత్స కోసం వచ్చే మహిళలపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ వ్యవహారమంతా చాలా ఏళ్లపాటు కొనసాగింది. ఇంట్లో కూడా రహస్యంగా కెమెరా ఏర్పాటు చేసినట్లు ఒమెయిర్ ఎజాజ్ భార్య కొన్ని రోజుల క్రితమే గుర్తించింది. అందులో రికార్డయిన దృశ్యాలను చూసి నిర్ఘాంతపోయింది. తన భర్త నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్ష్యాధారాలు కూడా అందజేసింది. దీంతో ఈ నెల 8వ తేదీన ఒమెయిర్ ఎజాజ్‌ను ఓక్లాండ్ కౌంటీ పోలీసులు అతడి ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంట్లో సోదా చేయగా పెద్ద సంఖ్యలో ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులు లభ్యమయ్యాయి. వాటిలో అభ్యంతరకరమైన వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక హార్డ్ డిస్క్‌లో 13 వేల వీడియోలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. -
ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిలకు తెలియకుండా.. ఫ్లాట్‌లో
జైపూర్: ఓ ఇంటి యజమాని పాడు పని చేశాడు. అమ్మాయిలకు రెంట్ ఇచ్చిన ఫ్లాట్‌లో వాళ్లకు తెలియకుండానే రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. బెడ్రూం, బాత్రూంలో స్పై కెమెరాలు పెట్టి తరచూ వాళ్ల అశ్లీల దృశ్యాలను వీక్షించాడు. ఫ్లాట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంట్ పోవడంతో అమ్మాయిలు ఎలక్ట్రిషన్‌ను పిలిపించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతను వైర్లు పరిశీలిస్తుండగా ఐదారు సీక్రెట్ కెమెరాలు కన్పించాయి. దీంతో కంగుతిన్న ముగ్గురు అమ్మాయిలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు యజమానిని ఏఫ్రిల్ 27న అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం నిందితుడికి మే 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. చదవండి: నడుస్తున్న ట్రక్కు నుంచి మేకల చోరీ.. ఆ తర్వాత కారుపై జంప్.. ధూమ్ సినిమాను తలపించిన దొంగతనం రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ఇంటి యజమాని పేరు రాజేంద్ర సోని. సీసీటీవీల వ్యాపారం చేస్తున్నాడు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎంటెక్ చేసిన ఇతడు ఐటీ నిపుణుడు. స్పై కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలో బాగా తెలుసు. అందుకే అమ్మాయిలు సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు డూప్లికేట్ కీ ఉపయోగించి ఫ్లాట్‌లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశాడు. ఉచిత వైఫై అందిస్తానని చెప్పి రూటర్ కూడా ఇన్స్టాల్ చేశాడు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. ఇలా సీక్రెట్‌గా వీడియోలూ చూడటం తన బలహీనత అని చెప్పుకొచ్చాడు యజమాని. చాలా కాలంగా ఇలా చేస్తున్నట్లు తెలిపాడు. కాగా.. ఈ ముగ్గురు అమ్మాయిలు 8 నెలల క్రితం ఈ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలను ఇన్ని రోజులు గమనించలేకపోయామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. పాపం ప్యాంటు ఊడి ఇబ్బందిగా.. -
Crime News: బాత్రూంలో కెమెరాలు! మంచోడు అనుకుంటే..
బంజారాహిల్స్: మంచోడు అనుకుని ఓ ఆఫీస్ బాయ్‌తో స్నేహం చేస్తే.. తనపట్లే అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ యువతి షాక్‌కు గురైంది. తాను పని చేస్తున్న సమయంలో తనకు తెలియకుండా వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు తన నగ్న చిత్రాలను ఫొటోలు తీయడమే కాదు.. వాటితో పాటు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 92లోని ఓ బొటిక్‌లో హిమాయత్‌నగర్‌కు చెందిన యువతి పని చేసేది. ఆమె గత మార్చిలో అక్కడ ఉద్యోగం మానేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆమెకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి అసభ్యకరమైన ఓ మెసేజ్ రావడంతో ఆమె డిలీట్ చేసింది. అయితే ఈ నెల 25న మళ్లీ ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. దానిని ఓపెన్ చేసి చూడగా అందులో ఉన్న ఫొటోలను చూసి షాక్‌కు గురైంది. తాను జూబ్లీహిల్స్ రోడ్ నెం. 92లో దుస్తుల షోరూంలో పని చేసినప్పుడు వాష్‌రూమ్‌లో తీసిన ఫొటోలుగా గుర్తించింది. అక్కడ పని చేస్తున్నప్పుడు మిథున్ దాస్ అనే వెస్ట్‌బెంగాల్‌కు చెందిన ఆఫీస్ బాయ్ ఆమెతో మాట్లాడేవాడు. మంచివాడిగా నటించడంతో అతనితో క్లోజ్‌గా ఉండేది ఆమె. తనతో ఉన్న చనువును ఆసరాగా చేసుకుని.. బాత్రూమ్లో కెమెరాలు పెట్టి ఈ ఫొటోలు తీసినట్లుగా నిర్ధారించుకుంది. తాను బాత్రూమ్కు వెళ్ళినప్పుడు తనకు తెలియకుండా మిథున్‌దాస్ ఈ ఫొటోలు తీశాడని వాటిని తిరిగి తనకు పంపించాడని ఆరోపిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
Suryapet: స్విమ్మింగ్ పూల్ బాత్రూమ్లో రహస్య కెమెరాలు.. 41 నిమిషాల..
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల పరిధిలో దారుణం జరిగింది. కుడకుడ రోడ్లో ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్ బాత్రూమ్లో ఓ రహస్య కెమెరా అమర్చినట్లు వెలుగులోకి వచ్చింది. స్విమ్మింగ్ పూల్‌కి వచ్చే యువతులు, మహిళల వీడియోస్‌ను సిబ్బంది రహస్యంగా రికార్డు చేస్తున్నారు. బాత్రూమ్లో బట్టలు మార్చుకుంటూ ఉండగా ఓ యువతి వీడియో రికార్డు గమనించింది. మిగతా స్నేహితులతో కలిసి కెమెరాను తీసి చూడగా అప్పటికే 41 నిమిషాల వీడియో రికార్డయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. స్విమ్మింగ్ ఫూల్లో పనిచేసే మహేశ్‌ను నిందితుడిగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ('లోన్ కట్టకపోతే.. న్యూడ్ ఫొటోలు ఇంట్లో వాళ్లకు పంపిస్తాం') -
హాస్టల్ అమ్మాయిలూ జరభద్రం!
సాక్షి, చెన్నై : హాస్టల్స్‌లో ఉండే అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు చెన్నై పోలీసులు. లేడిస్ హాస్టల్స్‌లో సీక్రెట్‌గా కెమెరాలు అమర్చి, వారి వీడియోస్‌ను రికార్డు చేస్తున్న యజమానిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదంబాక్కం తిల్లై నగర్లో సంజీవి అనే వ్యక్తి తన నివాసం రెండో అంతస్తులో లేడిస్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఇందులో పది మందికి పైగా అమ్మాయిలు అద్దెకు ఉంటున్నారు. ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఓ యువతికి తాము ఉంటున్న గదిలో రహస్య కెమెరాలు ఉన్నాయన్న అనుమానం వచ్చింది. ఆ కెమెరాలను ఎలా కనిపెట్టాలని గూగుల్ సెర్చ్ చేస్తే సాఫ్ట్వేర్ లభ్యమైంది. సాఫ్ట్‌వేర్‌ను తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న యువతి తన గదిలోని లైట్లు, స్విచ్ బోర్డులు, బాత్రూమ్ అంతా వెతికింది. దీంతో అసలు బండారం బయటపడింది. రూమ్‌లో చిన్నచిన్న కెమెరాలు ఆమె కంటపడ్డాయి. హాస్టల్ యువతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కెమెరాలను, కొన్ని అనుమానాస్పద పరికరాలు స్వాధీనం చేసుకుని హాస్టల్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారించారు. తన నివాసం నుండే వైఫై ఆన్ చేసి బ్లూటూత్ కెమెరాల్లో రికార్డైన అమ్మాయిల వీడియోలను తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నట్లు విచారణలో సంజీవి తెలిపాడు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉండటం గమనించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై గతంలో కూడా కేసులు ఉన్నట్టు గుర్తించారు. -
ఆ వీడియోలు తీయబోతే.. తిక్క కుదిరింది!
వాషింగ్టన్ : మహిళలపై వేధింపులకు షాపింగ్ మాల్స్, బాత్రూముల్లో కెమెరాలు అమర్చి ఎంతోమంది ఆకతాయిలు అడ్డంగా బుక్కవుతూ ఉంటారు. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన కీచక తెలివితేటలను ప్రయోగించబోయి అడ్డంగా బుక్కయ్యాడు. అతడి వల్ల ఏ తప్పిదం జరగకపోవడంతో, మరోసారి పిచ్చి చేష్టలు చేయవద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చి పంపించివేశారు. విస్కాన్సిన్ రాష్ట్రం మాడిసన్ నగరానికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి మహిళల అశ్లీల వీడియోలు, ఫొటోలను తెలివిగా తీయాలనుకున్నాడు. షూకు కెమెరాను అమర్చి రద్దీ ప్రాంతాల్లో నడుస్తూ పొట్టి దుస్తులు వేసుకున్న మహిళలను కింది నుంచి వీడియోలు చిత్రీకరించాలన్నది అతడి దురాలోచన. ఇందుకోసం ఓ వీడియో కెమెరాను కొనుగోలు చేశాడు. మొదట అది పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు తన ఇంట్లో పరీక్షించాలనుకున్నాడు. కాలికి ఓ షూ కట్టుకుని, దానికి సీక్రెట్ కెమెరాను అమర్చి అటూఇటూ నడుస్తుండగా ఒక్కసారిగా ఆ పరికరం పేలిపోయిందని మాడిసన్ పోలీస్ చీఫ్ మైఖెల్ కోవల్ తెలిపారు. కెమెరా బ్యాటరీ కారణంగా పేలుడు సంభవించిందని, అయితే ఈ ఘటనలో ఆ వ్యక్తి కాలుకు గాయాలుకాగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్‌కు వెళ్లి సీక్రెట్ కెమెరాతో అశ్లీల వీడియోలు తీయాలన్న ఆలోచనను మానుకోవాలని హెచ్చరించారు. గతంలో ఎలాంటి వీడియోలు తీయలేదని నిర్ధారించుకున్న తర్వాత మాడిసన్ పోలీసులు అతడిని ఇంటికి పంపించారు. నేరానికి పాల్పడ్లు తేలితే మాత్రం జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుందని, కఠిన చర్యలకు సిద్దం కావాల్సి ఉంటుందని ఆ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చారు. -
కామ స్వామి
భక్తులకు నీతిబోధలు చేస్తూ, మఠాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నడపడానికి బదులుగా అనైతిక కార్యకలాపాలు నెరుపుతున్న స్వామీజీ బండారం బట్టబయలైంది. అతని రాసలీలలు టీవీ చానెళ్లలో ప్రసారం కావడంతో అతని నీచకార్యాలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యలహంక: యలహంక సమీపంలోని హునసమారనహళ్లిలో జంగమ మఠం ఉంది. ఈ మఠం పీఠాధ్యక్షుడు దయానంద స్వామి రాసలీలలు జరుపుతున్న వీడియో చిత్రాలు బయటకు రావడంతో మఠం చుట్టుపక్కలనున్న గ్రామస్తులు ఆ ధార్మిక కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. స్వామీజి ముసుగులో దయానంద రాసలీలలు సాగిస్తున్నాడని, పీఠాధ్యక్షుడుగా అతణ్ని తొలగించి అరెస్టు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 13వ పీఠాధ్యక్షుడు పర్వతరాజ శివాచార్య స్వామీజీ నలుగురు పిల్లల్లో రెండవ కుమారుడు దయానంద 2011లో మఠాధిపతి అయ్యాడు. ఆ తరువాత తన పేరును (గురునంజేశ్వర శివాచార్యస్వామి)గా మార్చుకున్నాడు. ప్రస్తుతం మఠంలో తల్లి, అక్క కుటుంబ సభ్యులు ఆరుమందితో ఉన్నారు. మఠానికి చెందిన ఆస్తులు ఈయన చేతిలోనే ఉన్నాయి. కాగా, మఠాన్ని శృంగార కార్యకలాపాలకు కేంద్రంగా మార్చాడని కొందరు మఠం సభ్యులు, భక్తులు మండిపడ్డారు. ఆమె.. ఒక నటి! దయానంద మఠాధిపతి అయినప్పటి నుంచి గ్రామస్తులు, ట్రస్ట్ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఎన్నోసార్లు ధర్నాలు, పంచాయితీలు నడిచాయి. మూడు సంవత్సరాల క్రితం అతని కుటుంబ సభ్యులే పడకగదిలో రహస్య కెమెరా అమర్చి ఆయన అనైతిక కార్యకలాపాన్ని రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఒక చిన్న సినిమాలో హీరోయిన్గా నటించిన యువతితో ఆయన గడుపుతున్న వీడియో తాజాగా బయటకు రావడంతో కలకలం రేగింది. బుధవారం రాత్రి ఒక టీవీ చానెల్వీలో వీడియో ప్రసారమైంది. ఘటనపై చిక్కజాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఉదయం వరకు మఠంలోనే ఉన్న దయానంద.. రాసలీల దృశ్యాలు వెలుగుచూడగానే మరో ద్వారం గుండా పరారైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై ట్రస్ట్ న్యాయవాది ఉమేశ్ చిక్కజాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మఠంలో అశ్లీల కార్యక్రమాలు మఠం అశ్లీల కార్యకలాపాలకు నిలయంగా మారిపోయింది, భక్తులు ఆవేదన చెందుతున్నారు, పదవ తరగతి పాస్ కాని దయానంద కొంతమంది రాజకీయ నాయకులతో, గూండాలతో కలిసి మఠానికి సంబంధించిన ఆస్తులను స్వాహా చేస్తున్నారు, ప్రస్తుతం ఆస్తలు 220 ఎకరాలు మాత్రమే మిగిలాయి. శ్రీశైలం మఠం ఆదీనంలో ఈ మఠం ఉన్నందున ఆ మఠ పీఠాదిపతులు స్పందించి చర్యలు తీసుకోవాలి.– ట్రస్ట్ సభ్యుడు బసవరాజు యువతి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం వీడియోలోనున్న బాధిత యువతి ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇంతవరకు మాకు ఎటువంటి పిర్యాదు రాలేదు. ఆస్తులకు సంబంధించిన విషయాలను రెవిన్యూ అధికారులు చూస్తారు. ఫిర్యాదులు వస్తే నమోదు చేసి దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. – డీసీపీ గిరీష్ -
సీక్రెట్ కెమెరా పెట్టి 150మంది మహిళలను..
లగ్జెంబర్గ్: మహిళలు ఉపయోగించుకునే గదిలో రహస్యంగా సీసీ టీవీ కెమెరాలు పెట్టిన ఓ బ్యాంకు ఉద్యోగిని సస్పెండ్ చేశారు. అతడిని పోలీసులకు అప్పగించి విచారణ పూర్తి చేయగా దోషిగా నిర్థారణ అయింది. దీంతో మూడేళ్ల జైలు శిక్ష విధించడంతోపాటు ఆ బ్యాంకు ఉద్యోగం కాస్త ఊడిపోయింది. ఈ సీక్రెట్ సీసీటీవీ బారిన ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 150మంది మహిళలు పడినట్లు ఆ బ్యాంకు ఉన్నత ఉద్యోగి తెలిపారు. అయితే, ఆ ఫుటేజీని ఎవరూ చూడలేదని, నేరుగా దర్యాప్తు బృందానికి ఇచ్చామని చెప్పారు. లగ్జెంబర్గ్ లో యూరోపియన్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకులో దాదాపు 3000మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో మహిళలు కూడా చాలామంది ఉన్నారు. ఇందులోనే ఉద్యోగం చేస్తున్న ఓ 50 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి గుట్టుచప్పుడు కాకుండా మహిళలు వస్త్రాలు మార్చుకునే గదిలో టేబుల్ కింద సీసీటీవీ కెమెరాలు పెట్టాడు. ఈ విషయం బయటకు తెలియడంతో విచారణకు ఆదేశించగా అసలు విషయం బయటపడింది. -
కళ్యాణమండపం బాత్రూమ్లో స్పై కెమెరాలు
-
కళ్యాణమండపం బాత్రూమ్లో స్పై కెమెరాలు
అనంతపురం జిల్లాలో 'దృశ్యం' సీన్ మళ్లీ రిపీట్ అయ్యింది. కళ్యాణ మండపంలోని బాత్రూమ్లో రహస్య కెమరాలు ఉంచి... మహిళలు స్నానం చేసిన దృశ్యాలు చిత్రీకరించిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్‌లో జరిగింది. నెలన్నర క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామకృష్ణ అనే యువకుడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఒక యువతి వివాహం గత నెలలో గుంతకల్‌లో జరిగింది. ఆ శుభకార్యానికి హాజరైన పలువురు మహిళలు స్నానాలు చేసేటప్పుడు కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలున్నాయంటూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నెలన్నర క్రితం ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోని పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపంలో ఓ వివాహం జరిగింది. పాత గుంతకల్లులోని రెడ్డివీధికి చెందిన రామకృష్ణ ఆ ముందు రోజే కళ్యాణమండపంలోని మహిళల బాత్రూమ్లో స్పై కెమెరాలను అమర్చాడు. ఆ గదిలో పలువురు మహిళలు స్నానాలు చేసిన దృశ్యాలను సీడీ రూపంలో రికార్డు చేశారు. శుభలేఖపై ముద్రించిన నంబర్లకు కాయిన్ బాక్సు నుంచి ఫోన్ చేసి తనకు రూ.5 లక్షలు డబ్బు ఇవ్వాలని లేకుంటే ఆ దృశ్యాలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితులు ఈ విషయాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు గుంతకల్లు పోలీసులు గురువారం రాత్రి రామకృష్ణను అదుపులోకి తీసుకుని, స్పై కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణమండపం యజమానులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రామకృష్ణను రహస్య ప్రదేశంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
బయటకు వెళ్లే మహిళల్లారా జాగ్రత్త!
ఆధునిక పరిజ్ఞానం ఎంత అందుబాటులోకి వస్తే ప్రమాదకరమైన పరిస్థితులు కూడా అదే స్థాయిలో ఎందురవుతుంటాయి. అణువును కనిపెట్టిన తరువాత అణువిద్యుత్‌ను తయారు చేస్తున్నారు. అణుబాంబులను కూడా తయారు చేస్తున్నారు. మంచి అయినా, చెడు అయినా ఒక ఆధుని వస్తువుని మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అలాగే సిసి (క్లోజ్డ్ సర్యూట్) కెమెరాలు సక్రమమైన రీతిలో ఉపయోగిస్తే, అవి దొంగలను, నేరస్తులను పట్టిస్తాయి. కాని కొందరు వాటిని దుర్వినియోగం చేయడం వల్ల మహిళలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కెమెరాలు విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన తరువాత మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఎక్కడపడితే అక్కడ రహస్య కెమెరాలు అమరుస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాలలో పెడితే మంచిదే. కానీ కొంతమంది కామాంధులు బాత్రూముల్లో, ట్రయల్ రూముల్లో, షాపింగ్ మాల్స్‌లో, హాటళ్లలో ఇటువంటి కెమెరాలు పెట్టి యువతులు, మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. బెంగళూరులోని ఒక వస్త్ర దుకాణంలో యజమానులు నీచానికి ఒడిగట్టారు. ట్రయల్ రూములో కెమెరా అమర్చారు. ఈనెల 7న ఆ షాపుకు వెళ్లిన ఓ మహిళ ఆ విషయం కనుగొంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగప్రవేశం చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. అతి తక్కువ ధరకే సిసి కెమెరాలు అందుబాటులోకి రావడంతో చాలా మంది ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. మహిళలు దుస్తులు మార్చుకునేటప్పుడు, స్నానాలు చేసేటప్పుడు రహస్య కెమెరాల ద్వారా వీడియోలు తీస్తున్నారు. ఆ తరువాత వారికి వాటిని చూపించి బెదిరిస్తున్నారు. వారిని శారీరకంగా లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా యువతులను నానా రకాలుగా హింసిస్తున్నారు. వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇటువంటి వారి చేతిలో చిక్కుకున్న అనేక మంది యువతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. మహిళలు బయటకు వెళితే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్న నేపధ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. షాపింగ్ మాల్స్, హోటల్స్, టైలరింగ్ షాపులు, బ్యూటీపార్లర్లు.....కు వెళ్లినప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రయల్ రూమ్స్‌ను, బాత్రూములను జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే వాటిని వినియోగించుకోవాలి. రహస్య కెమెరాలు అమర్చినట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు తెలియజేయడం మంచిది.