
రహస్య కెమెరాల విక్రయంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
సాక్షి, హైదరాబాద్: రహస్య కెమెరాల విక్రయంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రహస్య కెమెరాల విక్రయాన్ని సవాలు చేస్తూ హెవెన్ హోమ్స్ సొసైటీ పిటిషన్ వేసింది. రహస్య కెమెరాలను మార్కెట్, ఆన్‌లైన్‌లో నేరుగా విక్రయిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.
హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లో రహస్య కెమెరాలు పెడుతున్నారన్న పిటిషనర్.. వాష్‌రూమ్‌లు, ఎక్స్‌రే గదుల్లో కూడా రహస్య కెమెరాలు పెడుతున్నారని పిటిషనర్ తెలిపారు. రహస్య కెమెరాల విక్రయాలపై నియంత్రణ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు.
ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పిటిషనర్ చేర్చారు. కౌంటర్ దాఖలుకు కేంద్రం తరఫు న్యాయవాది సమయం కోరారు. వచ్చే నెల 28వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025.. మురిపించేనా.. మొండిచెయ్యేనా?