సీక్రెట్ కెమెరా పెట్టి 150మంది మహిళలను.. | Bank employee installs secret cameras in women's changing rooms; gets suspended | Sakshi
Sakshi News home page

సీక్రెట్ కెమెరా పెట్టి 150మంది మహిళలను..

Published Fri, Jun 17 2016 10:53 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

సీక్రెట్ కెమెరా పెట్టి 150మంది మహిళలను..

సీక్రెట్ కెమెరా పెట్టి 150మంది మహిళలను..

లగ్జెంబర్గ్: మహిళలు ఉపయోగించుకునే గదిలో రహస్యంగా సీసీ టీవీ కెమెరాలు పెట్టిన ఓ బ్యాంకు ఉద్యోగిని సస్పెండ్ చేశారు. అతడిని పోలీసులకు అప్పగించి విచారణ పూర్తి చేయగా దోషిగా నిర్థారణ అయింది. దీంతో మూడేళ్ల జైలు శిక్ష విధించడంతోపాటు ఆ బ్యాంకు ఉద్యోగం కాస్త ఊడిపోయింది. ఈ సీక్రెట్ సీసీటీవీ బారిన ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 150మంది మహిళలు పడినట్లు ఆ బ్యాంకు ఉన్నత ఉద్యోగి తెలిపారు.

అయితే, ఆ ఫుటేజీని ఎవరూ చూడలేదని, నేరుగా దర్యాప్తు బృందానికి ఇచ్చామని చెప్పారు. లగ్జెంబర్గ్ లో యూరోపియన్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకులో దాదాపు 3000మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో మహిళలు కూడా చాలామంది ఉన్నారు. ఇందులోనే ఉద్యోగం చేస్తున్న ఓ 50 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి గుట్టుచప్పుడు కాకుండా మహిళలు వస్త్రాలు మార్చుకునే గదిలో టేబుల్ కింద సీసీటీవీ కెమెరాలు పెట్టాడు. ఈ విషయం బయటకు తెలియడంతో విచారణకు ఆదేశించగా అసలు విషయం బయటపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement