ఆ వీడియోలు తీయబోతే.. తిక్క కుదిరింది! | Spy Camera Explodes While a Man Trails To Record Upskirt Shots | Sakshi
Sakshi News home page

ఆ వీడియోలు తీయబోతే.. తిక్క కుదిరింది!

Published Fri, Jun 29 2018 11:27 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Spy Camera Explodes While a Man Trails To Record Upskirt Shots - Sakshi

స్కర్ట్‌ వేసుకున్న యువతి(ప్రతీకాత్మక చిత్రం)

వాషింగ్టన్‌ : మహిళలపై వేధింపులకు షాపింగ్‌ మాల్స్‌, బాత్రూముల్లో కెమెరాలు అమర్చి ఎంతోమంది ఆకతాయిలు అడ్డంగా బుక్కవుతూ ఉంటారు. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన కీచక తెలివితేటలను ప్రయోగించబోయి అడ్డంగా బుక్కయ్యాడు. అతడి వల్ల ఏ తప్పిదం జరగకపోవడంతో, మరోసారి పిచ్చి చేష్టలు చేయవద్దని పోలీసులు వార్నింగ్‌ ఇచ్చి పంపించివేశారు. 

విస్‌కాన్సిన్‌ రాష్ట్రం మాడిసన్‌ నగరానికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి మహిళల అశ్లీల వీడియోలు, ఫొటోలను తెలివిగా తీయాలనుకున్నాడు. షూకు కెమెరాను అమర్చి రద్దీ ప్రాంతాల్లో నడుస్తూ పొట్టి దుస్తులు వేసుకున్న మహిళలను కింది నుంచి వీడియోలు చిత్రీకరించాలన్నది అతడి దురాలోచన. ఇందుకోసం ఓ వీడియో కెమెరాను కొనుగోలు చేశాడు. మొదట అది పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు తన ఇంట్లో పరీక్షించాలనుకున్నాడు. కాలికి ఓ షూ కట్టుకుని, దానికి సీక్రెట్‌ కెమెరాను అమర్చి అటూఇటూ నడుస్తుండగా ఒక్కసారిగా ఆ పరికరం పేలిపోయిందని మాడిసన్‌ పోలీస్‌ చీఫ్‌ మైఖెల్‌ కోవల్‌ తెలిపారు. కెమెరా బ్యాటరీ కారణంగా పేలుడు సంభవించిందని, అయితే ఈ ఘటనలో ఆ వ్యక్తి కాలుకు గాయాలుకాగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. 

విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్‌కు వెళ్లి సీక్రెట్‌ కెమెరాతో అశ్లీల వీడియోలు తీయాలన్న ఆలోచనను మానుకోవాలని హెచ్చరించారు. గతంలో ఎలాంటి వీడియోలు తీయలేదని నిర్ధారించుకున్న తర్వాత మాడిసన్‌ పోలీసులు అతడిని ఇంటికి పంపించారు. నేరానికి పాల్పడ్లు తేలితే మాత్రం జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుందని, కఠిన చర్యలకు సిద్దం కావాల్సి ఉంటుందని ఆ వ్యక్తికి వార్నింగ్‌ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement