
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల పరిధిలో దారుణం జరిగింది. కుడకుడ రోడ్‌లో ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్ బాత్రూమ్‌లో ఓ రహస్య కెమెరా అమర్చినట్లు వెలుగులోకి వచ్చింది. స్విమ్మింగ్ పూల్‌కి వచ్చే యువతులు, మహిళల వీడియోస్‌ను సిబ్బంది రహస్యంగా రికార్డు చేస్తున్నారు.
బాత్రూమ్‌లో బట్టలు మార్చుకుంటూ ఉండగా ఓ యువతి వీడియో రికార్డు గమనించింది. మిగతా స్నేహితులతో కలిసి కెమెరాను తీసి చూడగా అప్పటికే 41 నిమిషాల వీడియో రికార్డయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. స్విమ్మింగ్ ఫూల్‌లో పనిచేసే మహేశ్‌ను నిందితుడిగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: ('లోన్ కట్టకపోతే.. న్యూడ్ ఫొటోలు ఇంట్లో వాళ్లకు పంపిస్తాం')
Comments
Please login to add a commentAdd a comment