posting
-
ఎంత విషాదం.. తొలి పోస్టింగ్‌కు వెళుతూ యువ ఐపీఎస్ దుర్మరణం
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాంగ్‌రూట్, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ యువ ఐపీఎస్ అధికారి మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ట్రైనింగ్ పూర్తి చేస్తుకున్న అతడు..తన తొలి పోస్టింగ్‌ను చేపట్టేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం మరింత దురదృష్టకరం. వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల హర్ష్ బర్దన్ క్ణాటక కేడర్‌కు చెందిన 2023 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. సోమవారం తన తొలి పోస్టింగ్ స్వీకరించేందుకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న పోలీస్ వాహనం టైరు పగిలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో హసన్-మైసూరు హైవేలోని కిట్టనే సరిహద్దు సమీపంలో వాహనం రోడ్డు పక్కన ఉన్న ఇంటిని ఢీకొట్టి అనంతరం చెట్టును డీకొట్టింది. ఈ ప్రమాదంలో బర్దన్ తలకు బలమైన గాయం తగలంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ యువ ఐపీఎస్ మరణించాడు. డ్రైవర్‌కు స్పల్ప గాయాలయ్యాయి.మరోవైపు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంఘటన స్థలంలో పోలీస్ వాహనం ధ్వంసమైనట్లు కనిపిస్తోంది. ఐపీఎస్ మృతిపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. అతని కుటుంబానికి సానుభూతి తెలిపారు. సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం లభించిన సమయంలో ఇలా జరగడం దురదృష్ణకరమని అన్నారు.‘హసన్-మైసూరు హైవేలోని కిట్టనే సరిహద్దు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి హర్ష్ బర్ధన్ మృతి చెందడం బాధాకరం. ఆయన ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళుతుండగా ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్ణకరం. ఎన్నో ఏళ్లు శ్రమించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుఉ ఇలా జరగకూడదు.హర్ష్ బర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’ అని కన్నడలో ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. -
AP: టూరిజం ఎండీగా ఆమ్రపాలి.. తెలంగాణ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు
సాక్షి,విజయవాడ: తెలంగాణ నుంచి ఇటీవలే వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఆదివారం(అక్టోబర్ 27) ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఆమ్రపాలి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిమోహన్, వైద్య ఆరోగ్య కమిషనర్‌గా వాకాటి కరుణ, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో ఐఏఎస్ అధికారి రొనాల్డ్‌రోస్‌కు ఇంకా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా, ఏపీకి కేటాయించిన తమను తెలంగాణలోనే కొనసాగించాలని ఐఏఎస్ అధికారులు పెట్టుకున్న అభ్యర్థనను కేంద్ర డీఓపీటీ శాఖ తిరస్కరించడంతో వీరు ఏపీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ చదవండి: దీపావళికి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఇదేనా -
గురుకులాల్లో చేరేదెందరు?
సాక్షి, హైదరాబాద్: గురుకుల సొసైటీల్లో కొత్తగా కొలువులు సాధించినవారిలో ఎంతమంది విధుల్లో చేరుతారనేది దానిపై సెపె్టంబర్ నెలాఖరు వరకు ఒక స్పష్టత రానుంది. ఒకట్రెండు కేటగిరీల్లో 500 పోస్టులు మినహా మిగిలిన కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైనవారికి ఆయా సొసైటీలు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీలు గత నెలాఖరులో 8,304 పోస్టులకుగాను ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవి అందుకున్న నాటినుంచి 60 రోజుల్లో వారికి నిర్దేశించిన చోట విధుల్లో చేరాలనేది నిబంధన. ఈ క్రమంలో కొత్తగా ఉద్యోగం సాధించిన వారంతా సెపె్టంబర్ నెలాఖరు కల్లా తప్పనిసరిగా విధుల్లో చేరాలి. లేకుంటే వారి నియామకం రద్దవుతుందని సొసైటీలు ఉత్తర్వుల్లో స్పష్టం చేశాయి. ఖాళీల లెక్క తేలేది వచ్చే నెలలోనే... గురుకుల కొలువుల్లో రెండు, మూడు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. రెండు, అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కూడా అన్ని కొలువులకు సంబంధించిన పోస్టింగ్ ఉత్తర్వులు అందుకున్నారు. అయితే తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) అధికారుల అంచనా ప్రకారం 1,550 ఉద్యోగాలు మిగిలిపోయే అ వకాశమున్నట్టు అభిప్రాయపడుతున్నారు. అక్టోబ ర్ మొదటివారం నాటికి ఈ లెక్కలు తేలే అవకాశం ఉంది. ఇలా మిగిలిపోయిన ఖాళీలను వచ్చే ఏడాది రూపొందించే జాబ్ కేలండర్లో చేర్చుతారనే అభిప్రాయం కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ కేలండర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో గురుకుల విద్యాసంస్థల్లో ఉ ద్యోగాల భర్తీకి సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు. ఖాళీల ఆధారంగా వచ్చే జాబ్ కేలండర్లో ప్రకటన ఇవ్వొచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
చినబాబు చెప్పారు చేయాల్సిందే
సాక్షి, అమరావతి : చేతికొచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని తాము చెప్పిన పని క చ్చితంగా చేసి తీరాల్సిందేని కూటమి నేతలు ఉన్నతాధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీఎండీ.. ‘చినబాబు’ చెప్పారని రాత్రికి రాత్రే రాజమహేంద్రవరం ఎస్ఈ పోస్టుకు సంబంధించిన ఆదేశాలను మార్చేయడం విద్యుత్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. కాకినాడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న గొర్లె ప్రసాద్‌ను రాజమహేంద్రవరం ఎస్ఈగా పదోన్నతిపై నియమిస్తూ డిస్కం సీఎండీ ఐ.పృధ్వీతేజ్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం సీఎంఓలోని ఓ ఉన్నతాధికారి ద్వారా మంత్రి లోకేశ్‌కు తెలియడంతో వెంటనే ఆ ఆదేశాలు రద్దు చేసి, తాను చెప్పిన అధికారిని ఆ పోస్టులో నియమించాలని చెప్పారు. ఈ మేరకు ఆ ఉన్నతాధికారి ఏపీఈపీడీసీఎల్ సీఎండీని ఫోన్లో దీనిపై హెచ్చరించారు. సీఎంఓ ఆగ్రహాం వ్యక్తం చేయడంతో ప్రసాద్‌ను కార్పొరేట్ కార్యాలయంలో జనరల్ మేనేజర్(ఆపరేషన్స్)గా పంపి, ఆ స్థానంలో ఉన్న కె.తిలక్ కుమార్‌ను రాజమహేంద్రవరం ఎస్ఈగా నియమిస్తూ అర్ధరాత్రి 11.30 గంటల తర్వాత ఆదేశాలు ఇచ్చారు. ఈ సంఘటన విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇందుకు కారణం ఏమంటే.. ఎన్నికల ముందు అవినీతి కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్యురాలిగా తిలక్ భార్య ఆయనకు చికిత్స అందించారని తెలిసింది. బాబు సూచనల మేరకు వైద్యం అందించినందుకే ఆమెకు నజరానాగా ఆమె భర్తకు ఎస్ఈ పోస్టును కట్టబెట్టారని సమాచారం. కాగా, ఇంధన శాఖలో ఇప్పటికే జేఎండీలు, ఎండీలు, డైరెక్టర్లు అంటూ పది మందికి పైగా ఉన్నతాధికారుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు. వారి స్థానంలో తమ వారిని నియమించేందుకు రూ.కోట్లల్లో బేరసారాలు సాగిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఈ పోస్టుకు రూ.50 లక్షల వరకు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టుకు రూ.10 లక్షలు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
గురుకుల టీచర్లకు త్వరలో పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల నుంచి దాదాపు నాలుగు నెలల క్రితం ఉద్యోగ నియామక ఉత్తర్వులు పొందిన సుమారు 8,500 మంది అభ్యర్థులకు అతిత్వరలో పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతు న్నారు. వచ్చే నెల మొదటి వారంలో వారంతా విధుల్లో చేరే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు లభించిన వారిలో ఎక్కువ మంది ఫిబ్రవరిలో నియామక పత్రాలు పొందగా... ఎమ్మె ల్సీ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో మరికొందరికి నియా మక పత్రాల పంపిణీ నిలిచిపోవడం తెలిసిందే. తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో పెండింగ్ అభ్యర్థులకు నియా మక పత్రాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రెండు, మూడు రోజుల్లో వారికి నియామక పత్రాలు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత సొసైటీ లు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నాయి. ఇప్పటికే బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి. సైదులు ధ్రువపత్రాల పరిశీలనకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 24 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కూడా ఆ సొసైటీ పరిధిలో ధ్రువపత్రాల పరిశీ లనకు శనివారం షెడ్యూల్ జారీ చేశారు. దీంతో మైనారిటీ, జనరల్, ఎస్సీ గురుకుల సొసైటీలు కూడా షెడ్యూల్ విడుదలకు సిద్ధమయ్యాయి. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక పోస్టింగ్‌లు ఇచ్చేందుకు గురుకుల సొసైటీలు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించాయి. పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించేందుకే ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూలై 7 నాటికి ఎస్సీ గురుకుల సొసైటీ పోస్టింగ్ ఆర్డర్లు విడుదల చేయనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి తెలిపారు. ఇతర గురుకుల సొసైటీలు సైతం అదే తరహా కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది. -
కౌంటింగ్ ముంగిట మరో కుట్ర
సాక్షి, అమరావతి: కీలకమైన ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసు శాఖ వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ఒత్తిడికి ఎన్నికల కమిషన్ (ఈసీ), రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గి వ్యవహరిస్తున్నారన్నది మరోసారి స్పష్టమైంది. అత్యంత వివాదాస్పద పోలీసు అధికారిగా గుర్తింపు పొందిన ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ) ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు హఠాత్తుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు.రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అదీ పంజాబ్ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన ఆయన పోలింగ్ ముగిసిన తరువాత వ్యక్తిగత పనులపై సెలవులో ఉన్నారు. సెలవులో ఉన్న దామోదర్‌ను హఠాత్తుగా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని.. కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలని ఉత్తర్వులు జారీచేయడం వెనుక ఏదో పెద్ద గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమవుతోంది. టీడీపీకి వీర విధేయుడు.. 2007 గ్రూప్–1 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ దామోదర్ అత్యంత వివాదాస్పద అధికారిగా గుర్తింపు పొందారు. ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరడంలో కీలకపాత్ర పోషించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారి మధ్య బంధుత్వం కూడా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు అండతో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారు. పశి్చమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీగా ఆయన వివాదాలకు కేంద్ర బిందువయ్యారు.ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక నాన్ కేడర్ ఎస్పీ అయినప్పటికీ దామోదర్‌ను 2019 సంవత్సరంలో ఎన్నికల కోసమని విజయనగరం జిల్లా ఎస్పీగా నియమించారు. వైఎస్సార్సీపీ పటిష్టంగా ఉన్న విజయనగరం జిల్లాలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే ఆయనకు ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. అనుకున్నట్లుగానే 2019 ఎన్నికల పోలింగ్ రోజున టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులతో బీభత్సం సృష్టించి కురుపాం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని బంధించాయి.దాదాపు నాలుగు గంటలపాటు టీడీపీ రౌడీమూకలు స్వైర విహారం చేసినా పోలీసులు, ఎస్పీగా ఉన్న దామోదర్ సైతం పట్టించుకోలేదు. సరికదా అదనపు బలగాలను కూడా అక్కడికి పంపించలేదు. అప్పట్లో విశాఖపట్నం డీఐజీ స్పందించి అదనపు బలగాలను కురుపాం పంపించడంతో నాలుగు గంటల తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదీ దామోదర్ అసమర్థ, నిర్లక్ష్యపూరిత ట్రాక్ రికార్డ్.అలాంటి అధికారికి కంట్రోల్ రూమ్ బాధ్యతలా?ఎన్నికల విధుల్లో ఉద్దేశపూర్వకంగా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఆర్ దామోదర్‌కు ప్రస్తుతం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించారు. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, ఈసీకి నోడల్ అధికారిగా ఉన్న అదనపు డీజీ (శాంతి, భద్రతలు) శంకబాత్ర బాగ్చీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, ఎక్కడైనా విధ్వంసకర సంఘటనలు జరిగితే వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం, అందుకోసం జిల్లా ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీచేయడం ఆయన బాధ్యత. అంటే.. డీజీపీ తరఫున జిల్లా ఎస్పీలకు ఆయనే ఆదేశాలు జారీచేస్తారు.2019 ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలను అడ్డుకోవడంలో విఫలమైన ఆయన ప్రస్తుతం కంట్రోల్ రూమ్ బాధ్యతలను ఎలా నిర్వహించగలరని డీజీపీ, అదనపు డీజీ భావించారో అర్థంకావడంలేదు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే దామోదర్‌కు ఈ బాధ్యతలు అప్పగించారా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇటీవల పోలింగ్ రోజున పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ గూండాలు విధ్వంసానికి పాల్పడ్డాయి.అదే రీతిలో కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జన్యానికి కుట్ర పన్నుతున్నాయని నిఘా వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయినాసరే.. టీడీపీకి అనుకూల అధికారిగా గుర్తింపు పొందిన దామోదర్‌కు కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసేందుకు.. టీడీపీ గూండా మూకలపై కఠిన చర్యలు తీసుకోకుండా ఎస్పీలను నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
భర్తీ ఎన్ని? మిగిలినవి ఎన్ని?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ గణాంకాలపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం కావడంతో పాటు ఇప్పటికే మెజార్టీ కేటగిరీల్లో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను సైతం పంపిణీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం పలువురు అభ్యర్థులు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోలేదు. ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటం.. దానికితోడు జూన్ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెండింగ్‌లో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడానికి అప్పటివరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఎంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్నారనే గణాంకాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. 9,231 కొలువులకు నోటిఫికేషన్లు.. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలు న్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగ ఖాళీలకు గురుకుల బోర్డు గతేడాది ఏప్రిల్ 5వ తేదీన ఏక కాలంలో నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ కేటగిరీల్లోని 350 ఉద్యోగాల భర్తీ పెండింగ్‌లో ఉండగా.. మిగతా 8,881 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అపాయింట్మెంట్ ఆర్డర్లు సైతం సిద్ధం చేసిన అధికారులు.. కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటంతో అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. దీంతో దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు. కొందరైతే మూడు, నాలుగు ఉద్యోగాలు కూడా సాధించడం గమనార్హం. అయితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అందులో ఉత్తమమైన కేటగిరీని ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టింగ్ వచ్చిన ప్రాంతం ఆధారంగా విధుల్లో చేరేందుకు అభ్యర్థి సిద్ధమవుతారు. ప్రస్తుతం చాలావరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిననప్పటికీ.. ఇంకా ఒక్క కేటగిరీలోనూ పోస్టింగులు ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ ముగిశాకే.. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈప్రక్రియ మొదలు కానుంది. దీంతో కౌన్సెలింగ్ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాతే ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరతారన్న అంశంపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల్లో భర్తీ అయిన కొలువులు ఎన్ని, మిగిలిన పోస్టులు ఎన్ని.. అనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చని గురుకుల అధికారులు చెపుతున్నారు. -
సార్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్!
సాక్షి, సిటీబ్యూరో: ‘సార్...ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. మా ప్రతిభ ఏంటో నిరూపిస్తాం’ అంటున్నారు పలువురు ఇన్స్పెక్టర్లు. ఈ క్రమంలోనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) పోస్టింగ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కార్పొరేట్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎలాగైతే రెజ్యూమ్‌లు సమర్పిస్తారో.. అచ్చం అలాగే పలువురు ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులు ఎస్హెచ్ఓ బాధ్యతల కోసం రాతపూర్వక దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అవినాశ్ మహంతి సైబరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే ఠాణాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలపై నిగ్గు తేలుస్తూ ఇప్పటికే పలువురు అధికారులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కమిషనరేట్‌లోని ప్రతిభావంతులలో ఆశలు చిగురించాయి. సమర్ధత, నిబద్ధతలకే ప్రాధాన్యం.. గతంలో ఇన్స్పెక్టర్లు ఎస్హెచ్ఓ పోస్టు పొందాలంటే మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను ఉన్నతాధికారులకు సమర్పిస్తే తప్ప.. పోస్టింగ్ వచ్చేంది కాదు. హై ప్రొఫైల్ పీఎస్ అయితే డిమాండ్ మారీ ఎక్కువగా ఉండేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతి అధికారులపై వేటు వేస్తున్నారు. సిఫారసు లేఖలతో వస్తే పోస్టింగ్ సంగతి దేవుడెరుగు.. కార్నర్ అయ్యే పరిస్థితి వచ్చింది. కొత్త పోలీసు బాస్‌ల రాకతో ప్రతిభ, సమర్ధత, విశ్వసనీయత, నిబద్ధతలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ పోస్టింగ్ ఇస్తున్నారు. ఇటీవల శివారు ప్రాంతాల్లోని ఠాణాలకే కాకుండా ప్రధాన నగరంలో డిమాండ్ ఉన్న స్టేషన్లకు సైతం కొత్త వారిని ఎస్‌హెచ్‌ఓలుగా నియమించడమే ఇందుకు ఉదాహరణ. ఈ ఠాణాలకు తొలిసారిగా ఎస్హెచ్ఓలు.. ఇన్స్పెక్టర్గా పదోన్నతి లభించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ కనీసం ఒక్కసారి కూడా ఎస్హెచ్ఓగా పోస్టింగ్ పొందని వారు చాలా మందే ఉన్నారు. పీఎస్‌లో రెండవ ప్రాధాన్య పోస్టు అయిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గానో, క్రైమ్ వింగ్, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), ఐటీ ఇతరత్రా విభాగాలలో ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజా పరిస్థితులలో వీరందరిలో ఆశలు చిగురించాయి. ఇప్పటివరకు 40–50 మంది ఇన్స్పెక్టర్లు ఎస్హెచ్ఓ పోస్టింగ్ కోసం రాతపూర్వక దరఖాస్తులు సమర్పించినట్లు తెలిసింది. ఇప్పటికే మాదాపూర్, మెకిలా, కేపీహెచ్‌బీ, సనత్‌నగర్, దుండిగల్, శంషాబాద్, జీడిమెట్ల ఠాణాలకు ఎస్హెచ్ఓ పోస్టింగ్ పొందిన ఇన్స్పెక్టర్లు తొలిసారి ఎస్‌హెచ్‌ఓలుగా నియమితులైనవాళ్లే. అలాగే ఆర్జీఐఏ, ఇతర కొన్ని పీఎస్‌లలో రెండవ సారి ఎస్‌హెచ్‌ఓలుగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు నియమితులయ్యారు. త్వరలోనే గచ్చిబౌలి , రాయదుర్గం, నార్సింగి వంటి హైప్రొఫైల్ ఠాణాలకు సైతం కొత్త అధికారులు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. -
తెలంగాణలో 9మంది ఐఏఎస్‌లకు పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం తొమ్మిది మంది ఐఏఎస్‌లకు వివిధ జిల్లాల్లో బాధ్యతలు కేటాయిస్తూ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి(సీఎస్) శాంతికుమారి ఉత్వర్వుల్లో సంతకం చేశారు. తాజా పోస్టింగ్‌లలో.. హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధిక గుప్తా, ములుగు అడిషనల్ కలెక్టర్‌గా పి శ్రీజా, జనగాం అడిషనల్ కలెక్టర్‌గా పింకేష్ కుమార్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా లెనిన్ వట్సల్ టోప్పో, భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్‌గా కదివరన్ ఐఏఎస్‌లను నియమించారు. అలాగే.. నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్, రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గా పి గౌతమి, మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్‌గా సురేంద్ర ప్రసాద్, వనపర్తి అడిషనల్ కలెక్టర్ గా సంచిత గంగువార్‌లను నియమిస్తూ పోస్టింగ్ ఉత్తర్వులు పంపించింది తెలంగాణ ప్రభుత్వం. -
ముడుపులు అందజేసి నచ్చిన చోట పోస్టింగ్..
వరంగల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో భారీగా బదిలీలు చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీఐజీ, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–1,గ్రేడ్–2 స్థాయిలో బది‘లీలలు’ జరిగాయి. పదేండ్లకు పైబడి ఒకే స్థానంలో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్లకు స్థానచలనం కల్పించేందుకు చేపట్టిన బదిలీల్లో భారీగా ముడుపులు చేతులు మారినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆశీర్వాదంతో నచ్చిన దగ్గర పోస్టింగ్ పొందినట్లు రిజిస్ట్రేషన్ శాఖలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీలు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డీఐజీ, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–1,గ్రేడ్–2 అధికారులను బదిలీ చేస్తూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ నవీన్ మిత్తల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ డీఐజీగా – ఎం.సుభాషిణి మహబూబాబాద్–తస్లీమా మహమ్మద్ జనగామ–టి.సంపత్‌కుమార్ వరంగల్ రూరల్–మసీయుద్దీన్ వరంగల్ ఫోర్ట్– ఏ.కార్తీక్ వరంగల్ ఆర్వో–ఎండీ.అమ్జద్ అలీ నర్సంపేట– రామ కిశోర్ రెడ్డి డీఐజీ కార్యాలయం–డి.సుజాత ఎట్టకేలకు కదిలారు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏండ్లుగా లాంగ్ స్టాండింగ్‌లో విధులు కొనసాగిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు ఎట్టకేలకు బుధవారం వెలువడిన బదిలీలతో కదిలారు. ఉమ్మడి వరంగల్ జిల్లా దాటని సబ్రిజిస్ట్రార్లు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లాంగ్‌స్టాండింగ్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–1,గ్రేడ్–2 అధికారులు మల్టీ జోన్–1లో భాగంగా రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఉన్నతాధికారుల అండతో ఉమ్మడి వరంగల్ జిల్లా దాటకుండా తాము ఎంచుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పోస్టింగ్ సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గ్రేడ్–1,గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు మ్యూచువల్‌ను తలపించాయి. వరంగల్ ఆర్వోలో విధులు నిర్వహిస్తున్న సంపత్‌కుమార్ జనగామ, జనగామలో విధులు నిర్వహిస్తున్న అమ్జద్అలీ వరంగల్ ఆర్వో, ములుగు సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా మహబూబాబాద్, వరంగల్ ఫోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్న మసీయుద్దీన్ వరంగల్ రూరల్, వరంగల్ రూరల్‌లో విధులు నిర్వహిస్తున్న సుజాత డీఐజీ కార్యాలయానికి , నర్సంపేటలో విధులు నిర్వహిస్తున్న కార్తీక్ వరంగల్ రూరల్‌కు కేటాయించారు. ఈ విధంగా ఏ అధికారి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా దాటలేదు. చక్రం తిప్పిన ఉద్యోగ సంఘాల నాయకులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రేడ్–1,గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో ఉద్యోగ సంఘాల నేతలు చక్రం తిప్పి ఉమ్మడి వరంగల్ దాటకుండా అడ్డుపడ్డారని తెలుస్తోందని పలువురు పేర్కొన్నారు. భారీగా బదీలీలు జరుగుతాయనే సమచారంతో లాంగ్ స్టాండింగ్ గ్రేడ్–1,గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లు లాంగ్ లీవ్ పెట్టి హైదరాబాద్‌కు మకాం మార్చి ఉన్నతాధికారుల అధికారుల ఆశీర్వాదం కోసం ఉద్యోగ సంఘాల నేతలతో జతకట్టారు. -
ట్వీట్లతో రెచ్చిపోండి.. యూజర్లకు మస్క్ బంపరాఫర్
‘ట్వీట్లతో రెచ్చిపోండి.. దీని వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురై లీగల్‌గా అయ్యే ఖర్చులు నేను చూసుకుంటా’ అంటున్నారు ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరూ ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఇలా తమ సోషల్ మీడియా ఖాతాల్లో పలు అంశాలపై వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆయా కంపెనీల యాజమాన్యాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొన్నిసార్లు ఆయా కంపెనీలు లీగల్‌గానూ ఉద్యోగులను ఇబ్బందులు పెడుతుంటాయి. అలాంటి వారికి అండగా నిలుస్తామని మస్క్ ప్రకటించారు. ఎక్స్ ప్లాట్ఫామ్లో ట్వీట్లు చేసే, లైక్ కొట్టే, కామెంట్లు చేసే ఉద్యోగులను వారి యాజమాన్యాలు, కంపెనీలు లీగల్‌గా వేధిస్తే దానికి ఎదుర్కొనేందుకు యూజర్లకు అండగా నిలుస్తామని, అందుకయ్యే మొత్తాన్ని భరిస్తామని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. ఇందుకు ఎటువంటి పరిమితి లేదని, అటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. దీనిపై అధిక సంఖ్యలో యూజర్లు ప్రతిస్పందించారు. మస్క్‌ను పొడగ్తలతో ముంచేస్తూ కామెంట్లు పెట్టారు. ట్విటర్ ఇటీవల దాని ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను తొలగించి దాని స్థానంలో ‘ఎక్స్’ను తీసుకొచ్చింది. ట్విటర్‌ను పూర్తిగా రీబ్రాండ్ చేసే ప్రయత్నంలో భాగంగా దాని అధినేత మస్క్ ఈ మార్పు చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న మంత్లీ యూజర్లు 540 మిలియన్లకు పైగా పెరిగారంటూ చూపించే గ్రాఫ్ షేర్ చేస్తూ "కొత్త గరిష్టానికి" చేరుకున్నట్లు ప్రకటించారు. Zuck × Musk fight: ‘జుక్ × మస్క్’ కుబేరుల కోట్లాట లైవ్.. ఆ ఆదాయంతో.. ఇలా మస్క్ ఓ వైపు కంపెనీలో సంస్థాగత మార్పులు చేసుకుంటూ పోతుంటే మరోవైపు దీనికి పోటీగా మెటా థ్రెడ్స్ యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాని నుంచి పోటీని ఎదుర్కొనేందుకు తమ యూజర్లకు మస్క్ ఈ ప్రకటించినట్లు తెలుస్తోంది. యాక్టివ్ యూజర్లు పెరిగినప్పటికీ ప్రకటనల ఆదాయంలో తగ్గుదల కారణంగా ప్రతికూల నగదు ప్రవాహం ఎదుర్కొంటున్నట్లు మస్క్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. If you were unfairly treated by your employer due to posting or liking something on this platform, we will fund your legal bill. No limit. Please let us know. — Elon Musk (@elonmusk) August 6, 2023 -
‘టీడీపీ కనిగిరి’ వాట్సప్ గ్రూప్‌లో అసభ్యకర పోస్టింగ్
కనిగిరి రూరల్: టీడీపీ కనిగిరి పేరుతో వాట్సప్ గ్రూప్‌లో తీవ్ర అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టడంపై కనిగిరిలో కలకలం రేపింది. ఈ గ్రూప్‌లో పట్టణానికి చెందిన ఓ యువకుడు, యువతి ఫొటో పెట్టి పక్కన పలువురు మహిళలతో పాటు, వైఎస్సార్ సీపీ మహిళా ప్రజాప్రతినిధుల తల ఫొటోను మార్ఫింగ్ చేసి చాలా అసభ్యకరంగా పోస్టింగ్ చేశారు. దీనిపై పట్టణంలో జోరుగా చర్చ సాగింది. అయితే ఈ గ్రూప్ డీపీ లోగోలో ఒకరి ఫొటోలు ఉండగా, గ్రూప్ అడ్మిన్లుగా వేరే వ్యక్తుల పేర్లు పెట్టారు. దీంతో ఆ గ్రూప్‌లో అడ్మిన్‌గా కనిపిస్తున్న వ్యక్తి (ఓ టీవీ రిపోర్టర్ కావడంతో) వెంటనే స్పందించాడు. తనకు ఈ గ్రూప్‌నకు ఎటువంటి సంబంధం లేదని, భాను అనే పేరుగల వారు తనను గ్రూప్‌లో యాడ్ చేసి అడ్మిన్ చేశారని, వారిపై తాను పోలీస్ కేసు పెడుతున్నట్లు గ్రూప్‌లో మెసేజ్ పెట్టాడు. సభ్యులంతా గ్రూప్‌లో నుంచి లెఫ్ట్ కావాలని ఆ పోస్ట్‌లో కోరాడు. ఈ ఘటనపై పోలీసులు రహస్య విచారణ చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై కనిగిరి ఎస్సై దాసరి ప్రసాద్‌ను వివరణ కోరగా ఈ ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామని చెప్పారు. -
షాకింగ్ ఘటన: చనిపోయిన ఉద్యోగికి పదోన్నత కల్పిస్తూ పోస్టింగ్!
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ఓ ఇంజనీర్‌కు ఏకంగా ఎనిమిదేళ్ల పాటు డబుల్ శాలరీ ఇచ్చిన అంశాన్ని ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే...తాజాగా చనిపోయిన మరో ఇంజనీర్‌కు ఏకంగా పదోన్నతి కల్పించడంతో పాటు పోస్టింగ్ కూడా ఇచ్చిన ఉదంతం వెలుగు చూసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ హెచ్ఆర్ విభాగంలోని అధికారుల తప్పిదాలకు సంస్థ ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రజల్లో అభాసుపాలవుతోంది. రెండేళ్ల క్రితమే చనిపోయిన మల్లయ్య.. పి.మల్లయ్య (ఐడీ నంబర్ 1077222) మొదట్లో మెట్రోజోన్ పరిధిలోని డీఈ కేబుల్ ఆఫీసులో సబ్ ఇంజనీర్‌గా పనిచేశారు. అటు నుంచి బంజారాహిల్స్‌కు సబ్‌ఇంజనీర్‌గా బదిలీపై వెళ్లారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన సుమారు రెండేళ్ల క్రితమే మృతి చెందారు. డిస్కం ఉన్నతాధికారులు చనిపోయిన మల్లయ్య స్థానంలో కారుణ్య నియామకం కింద ఆయన కుమార్తెకు సబ్ ఇంజనీర్‌గా ఉద్యోగం ఇప్పించారు. ప్రస్తుతం ఆమె సైబర్‌సిటీ సర్కిల్ ఆఫీసులోని కమర్షియల్ సబ్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. రెండు రోజుల క్రితం పదోన్నతి రెండు రోజుల క్రితం 49 మంది సబ్ ఇంజనీర్లకు డిస్కం ఏఈలుగా పదోన్నతులు కల్పించింది. వీరిలో ఆ మేరకు పదోన్నతులు పొందిన వారి పేర్లతో సహా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డిస్కం జారీ చేసిన ఈ జాబితాలో చనిపోయిన మల్లయ్య పేరు ఉండటమే కాకుండా ఆయనకు సబ్ ఇంజనీర్ నుంచి ఏఈగా పదోన్నతి కల్పించారు. ఏకంగా ఆయనకు వికారాబాద్‌లో పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. ఏఈల జాబితాలో చనిపోయిన మల్లయ్య పేరు ఉండటాన్ని చూసి తోటి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. అదేమిటని సంబంధిత సెక్షన్ అధికారులను, హెచ్ఆర్ డైరెక్టర్‌ను నిలదీశారు. దీంతో చేసిన తప్పిదాన్ని ఆ తర్వాత సరిదిద్దుకున్నారు. (చదవండి: ఖాతాలు, మనుషులే.. పారసైట్లు!) -
వైద్యులకు ఇష్టమైనచోట పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ అర్హతతో నియమితులయ్యే డాక్టర్లకు ఇష్టమైనచోట పోస్టింగ్ ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వారిచ్చే ప్రాధాన్యాల ప్రకారం సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రజారోగ్య సంచాలకుడి(డీహెచ్) పరిధిలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, తెలంగాణ వైద్యవిధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలో 211 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాటికి సంబంధించి రాష్ట్ర మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ఒకట్రెండు రోజుల్లో తుదిజాబితాను ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, వైద్య విద్యా సంచాలకుడు(డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డికి అందజేస్తారు. వారు విడివిడిగా ఆయా పోస్టులకు ప్రాధాన్యాల ప్రకారంకౌన్సెలింగ్ నిర్వహిస్తారు. త్వరలో కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు వెల్లడించారు. వీలున్నంత వరకు ఇష్టమైనచోటనే పోస్టింగ్ వచ్చేలా ప్రయత్నిస్తామని అధికారులు వెల్లడించారు. ఒకేచోటికి ఎక్కువమంది పోటీపడితే అప్పుడు వారి మార్కులు, వెయిటేజీ, భార్యాభర్తల అంశం, అనారోగ్యం వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటారు. అందుకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేయనున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని... గతంలో ఒకట్రెండు సందర్భాల్లో డీహెచ్, టీవీవీపీ, డీఎంఈ పరిధిలో ప్రాధాన్యాల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా పోస్టింగ్‌లు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. దీంతో అప్పుడు అనేక సమస్యలు వచ్చిపడ్డాయి. నాలుగేళ్ల క్రితం టీవీవీపీ పరిధిలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ సందర్భంగా భార్యాభర్తలు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టింగ్‌లు ఇచ్చారు. భార్యాభర్తలను విడదీసి ఎక్కడెక్కడో వేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో వందలాది మంది పోస్టుల్లో చేరనేలేదు. కొందరు చేరాక విధుల్లోకి రాకపోవడంతో అనేకమందిని తొలగించారు. డీహెచ్ పరిధిలోని డాక్టర్లకు గతంలో హడావుడిగా పోస్టింగ్‌లు ఇచ్చారు. దీంతో అనేకమంది తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వారికోసం ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఇప్పుడు బదిలీల ప్రక్రియ చేపట్టారు. అందుకోసం మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఈసారి జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్వీస్ రూల్స్, అనుభవం, ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్టు వెయిటేజీ అనుసరించి బోర్డు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎక్కువమంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారే ఎంపికయ్యారు. -
900 మంది పీజీ వైద్య విద్యార్థులకు పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: తప్పనిసరి ప్రభుత్వ సేవల నిమిత్తం 900 మంది పీజీ మెడికల్ పూర్తయిన విద్యార్థులను వివిధ ప్రభుత్వ బోధన ఆస్పత్రుల్లో భర్తీ చేయనున్నారు. ఏడాది కాలం వారు ఆయా బోధనాస్పత్రుల్లో సేవలందించాల్సి ఉంటుంది. మొత్తం 25 స్పెషలిస్టు విభాగాలకు చెందిన పీజీ డాక్టర్లను నియమిస్తారు. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో వైద్య విద్యా సంచాలకుల కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్ మెరిట్ ఆధారంగా ఉంటుంది. అంటే పీజీ ఫైనల్ పరీక్షలో సాధించిన మొత్తం మార్కులను పరిగణలోకి తీసుకుని పోస్టింగ్ ఇస్తారు. విద్యార్థులు తమ వెంట పీజీ పాసైన సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డు తదితర పత్రాలు తీసుకురావాలి. ఏడాది కాలంలో మొత్తం 20 రోజుల సెలవులకు అనుమతి ఉంటుంది. ఏడాది సర్వీస్‌కు రాని విద్యార్థులకు మెడికల్ కౌన్సిల్ శాశ్వత డిగ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వదు. పీజీ మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే సూపర్ స్పెషాలిటీ డిగ్రీలో చేరినట్లయితే, అలాంటివారు సూపర్ స్పెషాలిటీ డిగ్రీ పూర్తయిన తర్వాత తప్పనిసరి సర్వీస్ చేయాలి. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లుగా నియమితులైన వీరంతా వెంటనే కేటాయించిన పోస్టింగ్ ప్రాంతాల్లో రిపోర్ట్ చేయాలి. ఆయా ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు ఇవ్వాలి. -
డబుల్ ధమాకా ఆఫర్! 15 వేలు ఇస్తే ప్రమోషన్...కోరిన చోట పోస్టింగ్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘డియర్ బ్రదర్స్... మీ నోట్ ఫైల్ అయిపోయింది. మేడమ్ (రీజనల్ డైరెక్టర్) సంతకం కోసం పెండింగ్‌లో ఉన్న సంగతి మీకందరికీ తెలిసినదే. అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఏఎంఓ (అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్)ల ఫైల్ కూడా రెడీ అయిపోయింది. వారికి ఎస్‌ఆర్‌లు కాల్‌ఫర్ చేస్తున్నారు. వాళ్లది అయిన (ప్రమోషన్లు ఇచ్చిన) తర్వాత పెడితే బాగుంటుందని కొంతమంది బ్రదర్స్ కాల్ చేస్తున్నారు. మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. ఇప్పుడీ పదహారు (16 మంది ఎంపీహెచ్‌ఎస్‌లకు ప్రమోషన్)కూ కాల్‌ఫర్ చేయించేయాలా? ఏఎంఓలు అయిన తర్వాత ఐదు ఖాళీలైతే అప్పుడు పెట్టించుకుంటారా? పది మంది అలా అడుగుతున్నారు. పది మంది ఇలా చెబుతున్నారు. ఏదో ఒకటి డిసైడైతే బాగుంటుంది. ఏదో ఒకటి చెబితే ఈరోజు పెట్టించేయాలా (సంతకం)? ఆపాలా? అనేది నేను డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు చెప్పేదాని కోసమే వెయింటింగ్ ఇక్కడ...’ ఇదీ విశాఖలోని కేజీహెచ్‌లో పనిచేస్తున్న ఓ హెల్త్ విజిటర్ (హెచ్వీ) వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్లకు పంపిన వాయిస్ మెయిల్. వారికే కాదు విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లోని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు అదే తరహాలో సందేశం వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే రూ.15 వేలు ఫార్మాల్టీ ఇస్తే వారికి ప్రమోషన్‌తో పాటు కోరుకున్న చోట పోస్టింగ్ కూడా ఇప్పిస్తామని! ఈ డబుల్ ధమాకా ఆఫర్‌తో ఆకర్షితులైన చాలామంది ఆ శాఖ ఉద్యోగులు పైకం సమర్పించుకున్నారనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు, బదిలీలు పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదేపదే చెబుతున్నా దిగువస్థాయిలో మాత్రం ఆయన ఆశయానికి కొంతమంది గండికొడుతున్నారు. జోన్–1 పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఇటీవల ఏర్పాటైన పార్వతీపురం–మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు కూడా ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తర్వాత ప్రమోషన్ల ఫైళ్లు కూడా కదిలాయి. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఏఎన్ఎం)లుగా పనిచేస్తున్నవారికి మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ (ఎంపీహెచ్ఎస్)/హెల్త్ విజిటర్ (హెచ్వీ)లుగా ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంది. అలాగే, ఎంపీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్నవారికి మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఎంపీహెచ్‌ఈవో)లుగా ప్రమోషన్ ఇస్తారు. వారిలో ఎవరైనా బీఎస్సీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ–బీజడ్సీ) డిగ్రీ ఉన్నవారైతే అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ (ఏఎంవో)గా నియమించవచ్చు. ఈ ప్రమోషన్ల జాబితాలన్నింటికీ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఓ ఉద్యోగిని చక్రం... జాబితాలో పేరుంది. రూ.15 వేలే కదా ఫార్మాల్టీ ఇచ్చేస్తే ప్రమోషన్‌కు ప్రమోషన్... తర్వాత కోరుకున్న చోటుకు పోస్టింగ్ వస్తుందని చెబుతూ కొంతమంది ఉద్యోగులే వసూళ్లపర్వానికి తెరలేపారు. గతంలో విజయనగరం జిల్లా బొద్దాం పీహెచ్సీలో పనిచేసి ప్రస్తుతం కేజీహెచ్‌లో హెచ్వీ పోస్టులో ఉన్న ఓ ఉద్యోగిని చక్రం తిప్పుతోందని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని చెబితే ఆర్డీ సంతకం చేయించేస్తానంటూ రికార్డు చేసిన వాయిస్‌ను ఏకంగా వాట్సాప్‌లోనే పోస్టు చేయడం గమనార్హం. అంతేకాదు ఫార్మాల్టీలే ప్రసాదంగా భావించే ఆర్డీ కార్యాలయంలో ఓ ఉద్యోగి పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. జాబితాలు వాట్సాప్‌లో చక్కర్లు... జోన్–1లోని పీహెచ్‌సీల్లో పనిచేస్తున్నవారిలో 87 మంది ఎంపీహెచ్ఏ (ఫిమేల్)లకు ఎంపీహెచ్ఎస్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు జాబితా తయారైంది. వారిలో 45 మంది విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లో పనిచేస్తున్నవారు ఉన్నారు. అలాగే, 16 మంది ఎంపీహెచ్‌ఎస్‌లకు ఎంపీహెచ్‌ఈవో/ఏఎంవోలుగా పదోన్నతి ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ జాబితాలు ఇంకా ఆర్డీ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్డీ డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి సంతకం చేయకుండా ఉన్న జాబితాలు మాత్రం కార్యాలయం నుంచి బయటకు వచ్చేశాయి. ప్రమోషన్ కోసం చూస్తున్నవారి వాట్సాప్‌కు అవి చేరాయి. ఫార్మాల్టీలతో పబ్బం... ఫార్మాల్టీ ఇచ్చేస్తే ఎలాంటి పని అయినా అయిపోతుందని ఎర వేస్తూ వైద్యారోగ్య శాఖలో కొంతమంది తోటి ఉద్యోగులే పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కారణంగా కొంతమంది జూనియర్ అసిస్టెంట్లను కొత్త జిల్లాలైన పార్వతీపురం–మన్యం, అల్లూరి సీతారామరాజు (పాడేరు)కు పంపించారు. వారిలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు పాడేరు నుంచి మళ్లీ వెనక్కి తీసుకురావడానికి రూ.70 వేలు చొప్పున సమర్పించుకున్నారని ఆ శాఖ ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారు. అలాగే, విజయనగరం జిల్లాలో ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇస్తూ జాబితా సిద్ధమైంది. రేపో మాపో దానికి ఆమోదముద్ర పడనుంది. అందుకోసం వారు కూడా రూ.15 వేలు చొప్పున ఫార్మాల్టీ చెల్లించుకోవాల్సి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు ఫైనల్ చేయలేదు అందరి దగ్గరా ఎస్ఆర్ (సర్వీసు రిజిస్టర్)లు మాత్రమే కాల్‌ఫర్ చేశాం. వారి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు నా దృష్టికి రాలేదు. ఏఎన్ఎంలు కూడా ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. వసూళ్లు చేసినవారెవ్వరో నాకు చెబితే వారికి వార్నింగ్ ఇస్తా. – డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, ఆర్డీ, వైద్యారోగ్య శాఖ, విశాఖపట్నం (చదవండి: సర్వశ్రేయో నిధితో ఆలయాల అభివృద్ధి) -
పుంజుకున్న నియామకాలు
ముంబై: నియామకాలు జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో 3 శాతం పెరిగినట్టు మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్ తెలిపింది. హైదరాబాద్‌లో 6 శాతం అధికంగా పోస్టింగ్‌లు నమోదయ్యాయి. కరోనా మూడో విడత ముగిసిపోవడంతో దాదాపు అన్ని పరిశ్రమలు నియామకాల పరంగా వృద్ధి చూపించినట్టు తెలిపింది. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా నియామకాలు 7 శాతం పెరిగినట్టు వెల్లడించింది. బీపీవో/ఐటీఈఎస్ రంగంలో 11 శాతం అధిక నియామకాలు నమోదయ్యాయి. ఎన్నో రంగాల్లో డిజిటైజేషన్‌ను అనుసరించడం నిపుణులకు డిమాండ్‌ను పెంచినట్టు వివరించింది. మాన్స్టర్ ఇండియాలో నమోదయ్యే ఉద్యోగ పోస్టింగ్‌ల ఆధారంగా ఈ సంస్థ ప్రతి నెలా ‘మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్’ విడుదల చేస్తుంటుంది. రంగాల వారీగా చూస్తే.. ► షిప్పింగ్/మెరైన్ రంగంలో 9 శాతం, ఉత్పత్తి, తయారీలో 9 శాతం నియామకాలు పెరిగాయి. పీఎల్ఐ పథకం, పీఎం గతిశక్తి, మ్యారిటైమ్ విజన్ 2030 సానుకూలించాయి. ► అన్ని స్థాయిల్లోని నిపుణులకు డిమండ్ స్థిరంగా ఉంది. మాన్స్టర్ నివేదికను పరిశీలిస్తే అన్ని పట్టణాల్లోనూ నిపుణులకు డిమాండ్ పెరిగింది. ► ఉద్యోగాల పోస్టింగ్‌లలో ఢిల్లీ 13 శాతంతో ముందుంటే, ముంబై 8 శాతం, అహ్మదాబాద్ 7 శాతం, చెన్నై 7 శాతం, హైదరాబాద్ 6 శాతం, కోయింబత్తూరు 6 శాతం, బెంగళూరు, జైపూర్‌లో 6 శాతం చొప్పున అధిక పోస్టింగ్‌లు దాఖలయ్యాయి. ► లాక్డౌన్లు, ఆంక్షల భయంతో నియామకాలు జనవరిలో తగ్గగా.. ఫిబ్రవరిలో పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి. -
పోలీస్ పోస్టింగుల్లో అవినీతి పంట!
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతల విభాగంలో పోస్టింగులకు ఇష్టమొచ్చినట్టుగా సిఫారసు లేఖలిచ్చిన ఓ ఎమ్మెల్యే.. లక్షల రూపాయలు దండుకున్న వ్యవహారం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు.. ఒక పోస్టింగ్ కోసం ముగ్గురు అధికారుల నుంచి డబ్బులు తీసుకొని, మరో ఇతర అధికారికి పోస్టింగ్ కల్పించిన ఉదంతం సంచలనంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ ఎమ్మెల్యే వ్యవహారంపై ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. లక్షల్లో వసూలు..ఒకరికని చెప్పి మరొకరికి కొద్దిరోజుల క్రితం ‘సాక్షి’ప్రచురించిన పొలిటికల్ పోస్టింగ్ కథనాలు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఇంటెలిజెన్స్ విచారణలో బయటకొచ్చిన ఈ ఎమ్మెల్యే అవినీతి బాగోతాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టు కోసం మొదట ఓ సీఐతో రూ.15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా తన ప్రైవేట్ పీఏ ద్వారా రూ.10 లక్షలు తీసుకున్న ఎమ్మెల్యే మరో సీఐకి రూ.18 లక్షలకు సిఫారసు లేఖనిచ్చి పోస్టింగు ఇప్పించారు. దీంతో ముందు డబ్బులిచ్చిన అధికారి వెళ్లి ఆరాతీయగా ఎక్కడైనా చూద్దాంలే అంటూ దాటవేశారని, తన డబ్బులు తిరిగివ్వాలని అడుగుతున్నా నాలుగు నెలలుగా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని విచారణలో బయటపడింది. ఇదే నియోజకవర్గంలో మరో సీఐ పోస్టు కోసం ఒక అధికారి నుంచి రూ.10 లక్షలకు డీల్ చేసుకొని సిఫారసు లేఖ ఇచ్చారు. ఇదే సీఐ పోస్టింగ్ కోసం కరీంనగర్లో పనిచేస్తున్న మరో సీఐ నుంచి రూ.13 లక్షలకు ఒప్పందం చేసుకొని అడ్వాన్స్‌గా రూ.3 లక్షలు తీసుకొని మరో సిఫారసు లేఖనిచ్చారు. ఇది తెలిసిన తొలి ఇన్స్పెక్టర్ వెళ్లి ఎమ్మెల్యేను అడగ్గా.. రూ.15 లక్షలిస్తే పోస్టింగ్ ఆర్డర్స్ ఇప్పిస్తానని చెప్పడంతో ముందు ఇచ్చిన రూ.10 లక్షలు వెనక్కి రావేమో అని భయపడి మరో రూ.5 లక్షలు సమర్పించుకున్నట్టు తెలిసింది. ఇష్టారాజ్యంగా సిఫారసు లేఖలు నియోజకవర్గంలో భారీస్థాయిలో డిమాండ్ ఉన్న ఓ పోలీస్‌స్టేషన్‌లో పోస్టింగు కోసం ఓ ఎస్ఐకి రూ.11 లక్షలకు కమిట్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా ఓ మండల ఎంపీపీ భర్త ద్వారా రూ.4 లక్షలు అడ్వాన్స్ తీసుకొని పోస్టింగ్ కల్పించారు. పోస్టింగ్ వచ్చాక మిగతా మొత్తం చెల్లించారు. ఆరు నెలలు గడిచాయో లేదో.. సంబంధిత ఎస్ఐ తన మాట వినడం లేదని ఇంకో ఎస్ఐతో రూ.15 లక్షలకు బేరం కుదుర్చుకుని సిఫారసు లేఖ ఇచ్చాడు. ఇంతలోనే విషయం తెలిసి ప్రస్తుతం ఉన్న ఎస్ఐ వెళ్లి అడగడంతో.. ఇంకో రూ.4 లక్షలు ఇస్తే ఏడాది కంటిన్యూ చేస్తానని చెప్పడంతో సదరు ఎస్ఐ మరో రూ.4 లక్షలు ముట్టజెప్పుకోవాల్సి వచ్చింది. ♦ఇదే మండల ఠాణాకు పక్కనే ఉన్న మరో మండల ఠాణా కోసం కరీంనగర్ త్రీటౌన్‌లో ఓ ఎస్ఐ నుంచి రూ.10 లక్షలకు కమిటై రూ.3 లక్షల అడ్వాన్స్ తీసుకొని సిఫారసు లేఖ ఇచ్చారు. మళ్లీ మానకొండూర్‌లో పనిచేస్తున్న ఓ ఎస్ఐతో రూ.15 లక్షలకు ఒప్పందం కుదరడంతో అతడికి పోస్టింగ్ ఇప్పించే ప్రయత్నం చేశారు. ♦ఇక ఓ మంత్రి సన్నిహితుడి సోదరుడి పోస్టింగు కోసం రూ.15 లక్షలు తీసుకొని పోస్టింగ్ వచ్చేలా చూడగా, మరో స్టేషన్‌కు ఇంకో మంత్రి సిఫారసు చేసినా, సంబంధిత ఎస్ఐ నుంచి రూ.5 లక్షలు తీసుకొని పోస్టింగ్ ఇప్పించినట్టు ఇంటెలిజెన్స్ విచారణలో బయటపడింది. పొలిటికల్ పోస్టింగులపై ప్రభుత్వ పెద్దల ఆగ్రహం పొలిటికల్ పోస్టింగుల వ్యవహారంలో డబ్బులు తీసుకొని మోసం చేసిన ఘటనలు ప్రభుత్వ పెద్దలను ఆగ్రహానికి గురిచేసినట్టు తెలిసింది. çసదరు ఎమ్మెల్యేపై పోలీస్ ఉన్నతాధికారులతో పాటు మంత్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అధికారుల నుంచి డబ్బులు తీసుకొని తిరిగివ్వకుండా చేస్తున్న వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలకు ఇంటెలిజెన్స్ నివేదిక అందినట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. -
ప్రస్నార్ధకంగా తెలంగాణ వీఆర్వోల పరిస్థితి
-
కింగ్..ట్రాఫిక్ వింగ్
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ విభాగంలో పోస్టింగ్ అంటే ఒకప్పుడు పనిష్మెంట్గా భావించేవాళ్లు. ఉన్నతాధికారులు సైతం ఆరోపణలు వచ్చిన, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులను ఈ వింగ్కే పంపేవాళ్లు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సిటీ ట్రాఫిక్ విభాగంలో పోస్టింగ్స్ కోసం దరఖాస్తులు పెట్టుకునే, పైరవీలు చేయించుకునే పరిస్థితి వచ్చింది. ఈ మార్పునకు కారణం ఏమిటన్నది? ఉన్నతాధికారులకు అంతు చిక్కలేదు. పైకి కనిపించని ‘మర్మం’ ఏదైనా ఉందా? అని అనుమానించారు. దీంతో ఏకంగా ఈ వ్యవహారాన్ని నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్‌కు అప్పగించారు. లోతుగా విచారణ చేపట్టిన స్పెషల్ బ్రాంచ్ లా అండ్ ఆర్డర్లో పని ఒత్తిడి ఉండడం, ట్రాఫిక్ విభాగంలో ప్రోత్సాహకాలు ఇస్తుండడంతోనే సిబ్బంది ఇటువైపు మొగ్గు చూపుతున్నారని తేల్చింది. అప్పుడలా... హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల విభాగం పోలీస్స్టేషన్లు 60 ఉండగా, ట్రాఫిక్ ఠాణాలు 25 ఉన్నాయి. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ పీఎస్‌లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) పని చేయడానికి భారీ డిమాండ్ ఉండేది. ఎ–గ్రేడ్ ఠాణాల్లో పోస్టింగ్స్ కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచే పైరవీలు నడుస్తుండేవి. ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో పోస్టింగ్స్ అంశం దీనికి విరుద్ధంగా ఉండేది. అత్యంత అరుదైన సందర్భాల్లో మినహా ట్రాఫిక్ స్టేషన్‌కు ఎస్హెచ్ఓగా వెళ్లడానికి ఎవరూ సుముఖత చూపేవారు కాదు. ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా మార్చాలంటూ అధికారుల చుట్టూ తిరిగేవారు. దీంతో ప్రతిసారి బదిలీల సందర్భంలో ఉన్నతాధికారులు ఇన్స్పెక్టర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వచ్చేది. కొన్నాళ్లు ట్రాఫిక్‌లో పని చేయాలని, ఆపై మంచి పోస్టింగ్ ఇస్తామని చెప్పి బాధ్యతలు చేపట్టేలా చేసేవారు. ఇప్పుడిలా... గడిచిన కొన్నాళ్లుగా ట్రాఫిక్ విభాగానికీ కొద్దికొద్దిగా ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. కౌంటర్ ఇంటెలిజెన్స్(సీఐ) సెల్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) తదితర విభాగాల్లో ఇస్తున్నట్లు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రారంభమైంది. రాష్ట్ర నేర పరిశోధన విభాగంతో (సీఐడీ) పాటు ట్రాఫిక్ వింగ్‌కు ప్రోత్సాహకంగా జీతానికి 30శాతం అదనం ప్రకటించారు. దీంతో ఈ విభాగంలోకి వెళ్లడానికి అధికారులు ఉత్సాహం చూపారు. అయితే ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ట్రాఫిక్ విభాగానికి డిమాండ్ ఏర్పడింది. ఇటీవల ఎస్సై నుంచి ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందినవారు, ఇతర విభాగాలు/యూనిట్స్ నుంచి వచ్చి రిపోర్ట్ చేసిన ఇన్స్పెక్టర్లు తమకు ట్రాఫిక్ వింగ్లోనే పోస్టింగ్ కావాలని కోరుతున్నారు. ఈ రకంగా ఉన్నతాధికారులకు ఒకేసారి 25 దరఖాస్తులు వచ్చాయి. దీంతో అసలు ట్రాఫిక్ విభాగం మీద ఇంత ‘ప్రేమ’ ఎందుకు పుట్టుకొచ్చింది? పైకి కనిపించని ‘ప్రత్యేక కారణాలు’ ఏమైనా ఉన్నాయా? అనేది తేల్చాల్సిందిగా ఉన్నతాధికారులు ఎస్బీని రంగంలోకి దింపారు. డిమాండే కానీ... అనూహ్యంగా వచ్చిన డిమాండ్‌కు కారణాలు గుర్తించడానికి ఎస్బీ సిబ్బంది విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో నిశితంగా పరిశీలించిన నేపథ్యంలో ‘ప్రత్యేక కారణాలు’ లేవని తేల్చారు. కేవలం లా అండ్ ఆర్డర్ వింగ్‌లో పని ఒత్తిడి, ఇతర అంశాలను అధికారులు తట్టుకోలేకపోతున్నారని.. దీనికి తోడు ట్రాఫిక్ వింగ్‌లో 30 శాతం అదనంగా రావడం వీరిని ఆకర్షిస్తోందంటూ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ అదనపు ప్రోత్సాహకం కేవలం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వరకే వర్తిస్తోంది. దీంతో ఆ కేడర్ వరకే డిమాండ్ ఉంటోందని అధికారులు చెబుతున్నారు. ఏసీపీ ఆపై స్థాయి అధికారులు ఈ ప్రోత్సాహకం పరిధిలోకి రాకపోవడంతో అక్కడ కథ షరామామూలే అని తెలిపారు. కేవలం హైదరాబాద్‌లోనే పోస్టింగ్ కావాలనుకున్నోళ్లు, తాత్కాలిక ప్రాతిపదికనో మాత్రమే ఈ స్థాయిల్లో ట్రాఫిక్ వింగ్‌పై ఆసక్తి చూపుతున్నారని తేలింది. -
ఉద్యోగుల జేబులు నింపిన ప్రక్షాళన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూ రికార్డుల ప్రక్షాళన రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. జిల్లాలో ఎక్కవ సంఖ్యలో భూ వివాదాలు ఉండటం, అధికారులు, సిబ్బంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం, కొన్నిసార్లు పొరపాటుగా పడటం తదితర లోటుపాట్లను అధికారులు అవకాశంగా మల్చుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా భూ ప్రక్షాళన మొదలైనప్పటి నుంచే రెవెన్యూ అధికారులు రాబడి పది రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రతి పనిలో అధికారులు డబ్బులు ఆశించడం సంప్రదాయంగా మారింది. ఆమ్యామ్యాలు ఇవ్వంది పని జరగడం గగణమే. చేయి తడపకుంటే నెలల తరబడి బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. ఇదంతా ఎందుకుని భావించే కొందరు.. ఎంతోకొంత డబ్బు ఇచ్చి పనులు చక్కబెట్టుకుంటున్నారు. నగరంలో జిల్లా ఒక వైపు కలిసి ఉండటంతోపాటు శివారు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పల్లెలు.. పట్టణాల్లా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత భూముల ధరలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. నగదు చేతిలో పెట్టుకోకుండా దాదాపు అందరూ వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో రియల్ భూం ఊపందుకుంది. మారుమూల మండల కేంద్రాల్లోనూ ఎకరా భూమి ధర రూ.కోటి వరకు పలుకుతోంది. కొనుగోలుదారుల డిమాండ్‌తో పల్లె పల్లెనా రియల్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో భూములు చేతులు మారుతుండటంతో రెవెన్యూ ఉద్యోగులకు కాసుల పంట పండుతోంది. ‘నాలా’.. కల్పతరువు వ్యవసాయ భూములు రియల్ వెంచర్లుగా మారుతున్నాయి. అంతకంటే ముందు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు భారీ ఎత్తున డబ్బులు ముడుతున్నాయి. నాలా సర్టిఫికెట్ జారీ చేయడంలో తహసీల్దార్, ఆర్డీఓలది కీలక పాత్ర. దీన్ని అడ్డంపెట్టుకుని అధికారులు పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు. లేదంటే పలు సాకులతో తీవ్ర జాప్యం చేస్తున్నారు. కేశంపేట తహసీల్దార్ కూడా నాలా వ్యవహారంలో భారీగా డబ్బు వెనకేశారని తెలుస్తోంది. ఇందుకు అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు సహకరించినట్లు సమాచారం. ఇద్దరి మధ్యన లోపాయికారీ ఒప్పందం ఉండటంతో ‘నాలా’ని దందాగా మార్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టుకు భలే డిమాండ్ జిల్లా రెవెన్యూ శాఖలో పోస్టింగ్ పొందడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పలు రకాలుగా డబ్బు దండుకునే అవకాశం ఉండటంతో జిల్లాలో పనిచేసేందుకు ఉద్యోగులు పోటీ పడుతున్నారు. ఉన్నత స్థాయిలో పైరవీలు చేయించుకోవడం, లేదంటే డబ్బు ముట్టజెప్పి నచ్చిన మండలంలో పోస్టింగ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్ల పరిధిలో తనకు కావాల్సిన మండలం కోసం ఒక తహసీల్దార్ సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇదే కోవలో ఏసీబీ కేసులో చిక్కుకున్న తహసీల్దార్ లావణ్య కూడా ప్రయత్నించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. మెదక్ జిల్లా కొండాపూర్ మండలం నుంచి జిల్లాలో పోస్టింగ్ కోసం భారీగానే ఖర్చు చేసినట్లు వినికిడి. ఇంకొన్ని మండలాల్లో పనిచేస్తున్న స్థానాన్ని కాపాడుకునేందుకూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలను అనుకూలంగా వ్యవహరించడంతోపాటు ఉన్నతస్థాయి అధికారులకూ అడపాదడపా మర్యాదలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
సీఈవోలు, డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖలో పాతికేళ్లకుపైగా ఎంపీడీవోలుగా పనిచేస్తూ పదోన్నతులు, పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నవారి నిరీక్షణ ఫలించింది. మూడు నెలల క్రితం వంద మందికిపైగా ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించినా ఎన్నికల కోడ్ కారణంగా వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఈ పదోన్నతుల ద్వారా జిల్లాల్లో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి తదితర విభాగాల్లో పీఆర్ శాఖకు సంబంధించిన అధికారులే వివిధ విధులు నిర్వహించనున్నారు.‡రెండున్నర దశాబ్దాలకుపైగా ఎదురుచూపుల తర్వాత 95 మందికి డిప్యూటీ సీఈవో, డీఆర్డీఏ, గ్రామీణాభివృద్ధి, అకౌంట్స్ ఆఫీసర్లు తదితర పోస్టుల్లో బదిలీ, పోస్టింగ్, డిప్యూటేషన్లపై నియమిస్తూ గురువారం పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీచేశారు సీఈవో, డిప్యూటీ సీఈవో, ఇతర పదవులకు... ఆదిలాబాద్ మండల ప్రజాపరిషత్(ఎంపీపీ)లో పనిచేస్తున్న జి.జితేందర్‌రెడ్డిని రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా; మంచిర్యాల ఎంపీపీలో పనిచేస్తున్న కె.నరేందర్‌ను ఆదిలాబాద్ జడ్పీ సీఈవోగా బదిలీ చేశారు. పీజే వెస్లీని డిప్యూటేషన్‌పై టీఎస్ఐఆర్డీలోని ఈటీసీ ప్రిన్సిపాల్‌గా; కె.అనిల్‌కుమార్‌ను టీఎస్ఐఆర్డీ ఏవోగా, ఎం.ఉమారాణిని స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా; కె.సునీతను ఎస్ఈసీ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించారు. ఎస్.దిలీప్‌కుమార్‌ను డైరెక్టర్ ఎస్బీఎంగా డిప్యూటేషన్‌పై పంపించారు. డిప్యూటీ సీఈవోలుగా నియమితులైన వారిలో ఎం.లక్ష్మీబాయి (మెదక్–పోస్టింగ్), ఎం.పద్మజ(మహబూబ్‌నగర్–పో), సి.శ్రీకాంత్‌రెడ్డి (రంగారెడ్డి –పో), డి.పురుషోత్తం (ఖమ్మం–పో), ఎల్.విజయలక్ష్మీ (నల్లగొండ–పో), బి. గౌతంరెడ్డి (కరీంనగర్–పో), గోవింద్(నిజామాబాద్–పో), ఎ.రాజారావు (వరంగల్–పో), సన్యాసయ్య(ఆదిలాబాద్–పో) ఉన్నారు. డిప్యూటేషన్‌పై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులుగా నియమితులైనవారిలో మర్రి వెంకట శైలేష్ (ఆసిఫాబాద్), జె.సుమతి (భూపాలపల్లి).సీహెచ్ శ్రీనివాసరావు(సంగారెడ్డి), పి.బలరామారావు(మహబూబాబాద్) ఉన్నారు. ఈ.అనిల్‌కుమార్‌ను టీఎస్ఐఆర్డీ జాయింట్ డైరెక్టర్‌గా; ఎం.నవీన్‌కుమార్, టి.శ్రీనాథ్రావులు సెర్ప్ డైరెక్టర్లుగా; జి.వెంకటసూర్యారావు, ఎస్.వెంకటేశ్వర్, బి.రాఘవేందర్రావు, ఎన్.శోభారాణిలు ఈటీసీ ఫ్యాకల్టీలుగా నియమితులయ్యారు. సీఎం, మంత్రికి కృతజ్ఞతలు... ఇరవై ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించడంతోపాటు పీఆర్, గ్రామీణాభివృద్ధిశాఖలోనే పోస్టింగ్‌లు ఇచ్చిన సీఎం కేసీఆర్, పీఆర్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పీఆర్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్‌లకు తెలంగాణ ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు బి.రాఘవేందర్రావు, ప్రధానకార్యదర్శి ఎం.శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ శేషాద్రి కృతజ్ఞతలు తెలిపారు. పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇవ్వడంతో తమకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. -
మళ్లీ వచ్చిన ట్యాంపర్ వీరుడు..!
సాక్షి, విశాఖపట్నం: ట్యాంపర్ వీరుడు మళ్లీ వచ్చారు.. ఎన్నిసార్లు వద్దు పొమ్మంటున్నా.. మళ్లీ ఇక్కడే పోస్టింగ్ కోసం పావులు కదుపుతూనే ఉన్నాడు. రాజకీయంగానే కాదు.. ప్రభుత్వ స్థాయిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని మళ్లీ మళ్లీ పోస్టింగ్ పొందుతున్నాడు. ఈసారి జిల్లాకు కేటాయించడం కాదు.. ఏకంగా పోస్టింగ్‌తోనే వచ్చాడు. కానీ ససేమిరా అతడ్ని విధుల్లో తీసుకునే ప్రసక్తే లేదని జిల్లా ఉన్నతాధికారులు తెగేసి చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖ భూకుంభకోణం పేరు చెప్పగానే గుర్తొకొచ్చే మొట్టమొదటి పేరు బీటీవీ రామారావు. ఈయన చేసిన అక్రమాలు అన్నీఇన్నీ కావు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల అండదండలతో భీమిలి, విశాఖ రూరల్ మండలాల్లో రికార్డులను ట్యాంపర్ చేసి వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములు లిటిగేషన్లో పడేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన చేతివాటం కారణంగా వందలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైపోయాయి. సిట్, నాన్ సిట్‌కు అందిన అత్యధిక ఫిర్యాదుల్లో ఈయన పాల్పడిన అవినీతి, అక్రమాలు దాదాపు రుజువయ్యాయి కూడా. అంతే కాదు భూవివాదాల్లో అత్యధిక షోకాజ్ నోటీసులందుకున్న అధికారి కూడా రామారావే. సిట్ సిఫార్సు మేరకు ఈయనపై అనేక కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో బీటీవీ రామారావు చేసిన అక్రమాలకు ఆయనను సర్వీస్ నుంచి తొలగించినా తప్పులేదని సిట్ అధికారులు సిఫార్సు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తులు, లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసుల్లో అరెస్ట్ కూడా అయ్యారు. ‘ఈ అధికారి మాకొద్దంటూ’ గతేడాదే అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఇంతటి వివాదాస్పద అధికారి మాకొద్దు బాబోయ్ అంటున్నా పదే పదే జిల్లాకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఈయనపై సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత ఇప్పటికే రెండుసార్లు జిల్లాకు కేటాయించారు. రెండు సార్లు కూడా జేసీలు, అప్పటి కలెక్టర్ విధుల్లో చేర్చుకోకుండా తిప్పి పంపారు. ఆయన హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర నివేదికతో ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఈసారి పోస్టింగ్‌తోనే.. విశాఖ జిల్లాలోనే పోస్టింగ్ పొందాలని పట్టువదలని విక్రమార్కుడిలా బీటీవీ రామారావు ప్రయత్నిస్తూనే ఉన్నారు. జిల్లాకు కేటాయిస్తుంటే పోస్టింగ్ ఇవ్వకుండా తిప్పిపంపుతున్నారని గ్రహించిన రామారావు రాజకీయంగా ప్రభుత్వ పెద్దల ద్వారా సీసీఎల్‌ఏపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈసారి జిల్లాకు కేటాయించడమే కాదు.. ఏ పోస్టులో అతడ్ని నియమించాలో ఆదేశాలు వచ్చాయంటే ఏ స్థాయిలో రామారావుకు ప్రభుత్వ పెద్దల అండ ఉందో అర్థమవుతోంది. సాధారణంగా తహసీల్దార్లను సీసీఎల్ఏ కమిషనర్ జిల్లాకు అలాట్ చేస్తారు. అలా అలాట్ అయిన వారికి ఎక్కడ పోస్టింగ్‌లు ఇవ్వాలో జాయింట్ కలెక్టర్, కలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అలాంటిది రెండుసార్లు తిరస్కరించిన రామారావుకు ఏకంగా జిల్లా పరిపాలనాధికారి కార్యాలయంలో పోస్టింగ్ ఇవ్వాలని సీసీఎల్ఏ నుంచే ఆదేశాలు రావడంతో విస్తుపోవడం ఉన్నతాధికారుల వంతైంది. అయితే ఆయనను తిప్పిపంపడమే తప్ప విధుల్లో తీసుకునే ప్రసక్తే లేదని జిల్లా ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ సారి రామారావు విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
నాన్నొక చోట.. అమ్మొక చోట!
దివ్యాంగులైన నగేశ్ (బ్లైండ్) నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య కె.మంజుల (బ్లైండ్) కూడా దివ్యాంగురాలే. ఆమె రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఓ పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్నారు. వీరికిద్దరు పిల్లలు. సెలవుల్లో మాత్రమే వీరికి పిల్లల్ని కలుసుకునే వీలు కలుగుతోంది. మిగతా రోజుల్లో తండ్రి దగ్గరో.. తల్లి దగ్గరో పిల్లలు ఉండాల్సిందే. మహేశ్ అనే మరో టీచర్దీ ఇదే పరిస్థితి. ఆయన జోగులాంబ గద్వాల జిల్లాలోని నుసానూర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తుండగా.. ఆయన భార్య మంచిర్యాల జిల్లా చెన్నూరు ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఒకేచోట నివాసముంటూ రోజూ విధులకు హాజరవడం వీలుపడదు. దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగుల సాధారణ బదిలీలను ఎట్టకేలకు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంతర్ జిల్లా బదిలీలను మాత్రం అటకెక్కించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత జూన్ నెలాఖరులో సాధారణ బదిలీల ప్రక్రియకు తెరలేపిన ప్రభుత్వం.. జూలై మూడో వారంతో ముగించింది. ఈ క్రమంలో సాగానికిపైగా ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. కానీ ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంతర్ జిల్లా ఉద్యోగుల బదిలీలను ఎటూ తేల్చకుండానే సాధారణ బదిలీలపై నిషేధం విధించింది. దీంతో వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న దంపతులకు తీవ్ర నిరాశే మిగిలింది. దీంతో వారి పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. భార్య, భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైన సందర్భంలో వారు ఒకేచోట నివాసముండే అవకాశం కల్పించేలా నిర్ణీత దూరంలో పోస్టింగ్ ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ ఇటీవల జరిగిన బదిలీల్లో అంతర్ జిల్లా స్పౌజ్ బదిలీలకు మోక్షం దక్కలేదు. ప్రస్తుతం ఇలా ఇబ్బందులు పడుతున్న వారిలో ఉపాధ్యాయులే అధికంగా ఉన్నారు. చివరగా 2012లో.. అంతర్ జిల్లా స్పౌజ్ బదిలీలు చివరగా 2012లో జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియ నిర్వహించినప్పటికీ.. సీనియార్టీకి ప్రాధాన్యత ఇవ్వడంతో చాలామంది ఉద్యోగులకు అవకాశం దక్కలేదు. ఆ తర్వాత రెండు సార్లు సాధారణ బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో ఒకేచోట ఎక్కువ కాలం పనిచేస్తున్న ఆయా కేటగిరీలోని ఉద్యోగులకు బదిలీ అనివార్యమైంది. కొందరు ఉద్యోగులు మరింత దూరప్రాంతాలకు బదిలీ అయ్యారు. దీంతో అంతర్ జిల్లా బదిలీలు కోరుకునే వారికి ఇబ్బందులు తీవ్రమయ్యాయి. ఇటీవల సాధారణ బదిలీల సమయంలో అంతర్ జిల్లా స్పౌజ్ బదిలీలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తర్వాత ఆ ఊసెత్తలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో.. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. రెండేళ్ల క్రితం 21 కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటికీ.. ఉమ్మడి జిల్లాలో పనిచేసే ఉద్యోగులనే అర్డర్ టు సర్వ్ పద్ధతిలో కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో మూడేళ్లపాటు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకే బదిలీ అవకాశం కల్పించడంతో చాలా మందికి అవకాశం దక్కలేదు. అర్డర్ టు సర్వ్ పద్ధతిలో పంపించడంతో పాత పోస్టింగ్‌నే పరిగణిస్తారని ఉద్యోగులంతా భావించినప్పటికీ.. పనిచేస్తున్న చోటునే ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం షాకిచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టు సర్వ్ పేరిట ప్రభుత్వం చేసిన బదిలీలతో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సుదూర ప్రాంతాలకు వెళ్లారు. భార్య, భర్తలు వేర్వేరు చోటకు బదిలీ కావడంతో నివాసాన్ని సైతం మార్చుకున్నారు. అలాంటి వారికి అంతర్ జిల్లా స్పౌజ్ బదిలీల ప్రక్రియ ఊరట ఇస్తుందని భావించినా.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. -
వామ్మో.. మాకొద్దీ పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో వరుసగా జరుగుతున్న ఇన్స్పెక్టర్ల సస్పెన్షన్ ఘటనలు డిపార్టుమెంట్లో దిగువ శ్రేణి అధికారులను కలవరానికి గురిచేస్తున్నాయి. శాంతి భద్రతల విభాగంలో పోస్టింగ్ అంటే భారీ స్థాయిలో లాబీయింగ్ చేస్తే గానీ దక్కని పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పోస్టు అంటేనే హడలిపోతున్నారు. హైదరాబాద్ జోన్లో తాజాగా ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ల సస్పెన్షన్‌తో ఒక్కసారిగా అధికారులు యూటర్న్ తీసుకుంటున్నారు. వామ్మో.. మాకొద్దు ఈ పోస్టింగ్ అంటూ లూప్‌లైన్ కోసం ఐజీల వద్ద దరఖాస్తు చేసుకుంటున్నారు. సిటీలో అయితే ఓకే.. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో పెద్దగా పైరవీలు అవసరం లేకుండా పనితీరుతో పోస్టింగ్ పొందవచ్చు. కానీ జిల్లాల్లో అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫార్సు ఉంటేనే పోస్టింగ్స్ ఇస్తారు. దీంతో నాలుగేళ్లుగా చాలా మంది ఇన్స్పెక్టర్లు పక్క పక్క ఉన్న సర్కిళ్లలోనే పనిచేస్తూ వచ్చారు. కానీ ఆరు నెలల నుంచి హైదరాబాద్, వరంగల్ జోన్ల పరిధిలో అక్రమాలకు పాల్పడుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్లపై ఇంటెలిజెన్స్ బృందాలు నివేదికలు ఇస్తుండటంతో వారిలో వణుకు మొదలైంది. ఇటీవల హుజూర్నగర్, తాండూర్ సీఐలను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎక్కడెక్కడ ఎంత వసూలు చేశారన్న దానిపై ఆధారాలతో చార్జ్మెమోలో ప్రస్తావిస్తున్నారు. దీంతో మరికొంత మంది సర్కిల్ ఇన్స్పెక్టర్ల జాతకాలు బయటపడే ప్రమాదం ఉండటంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. దీని లో భాగంగా తాము జిల్లాల్లో దీర్ఘకాలంగా పని చేస్తున్నామని, తమను డెప్యుటేషన్ విభాగాల్లోకి గానీ, హైదరాబాద్ జోన్లో సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ చేయాలని దరఖాస్తులు పెట్టు కుంటున్నారు. దీంతో లక్షలు ఖర్చు చేసి తెచ్చుకున్న పోస్టింగ్స్ వదులుకునేందుకు 40 మంది సిద్ధంగా ఉన్నారని తెలిసింది. నార్త్‌జోన్ నుంచి 16 మంది ఇన్స్పెక్టర్లు తమను లూప్‌లైన్ అయినా ఇంటెలిజెన్స్, సీఐడీ, ట్రాఫిక్, సీసీఎస్ లేదా విజిలెన్స్‌లకు పంపా లని వేడుకుంటున్నారు. హైదరాబాద్ జోన్‌లోని 24 మంది ఇన్స్పెక్టర్లు ఏకంగా తమకు ఏదైనా కమిషనరేట్‌లో సీసీఎస్‌లకు పంపాలని కోరుతున్నారు. గందరగోళ పరిస్థితిలో.. ఎమ్మెల్యే సిఫార్సు ద్వారా పోస్టింగ్ తెచ్చుకున్న అధికారి.. ఆయన మనుషులకు సహకరించకపోతే బదిలీ చేయిస్తాడన్న భయం, ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే ఎస్పీ /కమిషనర్ ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న ఆందోళనతో ఇద్దరి మధ్య విధులు ఎలా నిర్వర్తిం చాలో తెలియక కొంత మంది ఇన్స్పెక్టర్లు గందరగోళంలో పడుతున్నారు. ఇటీవల జరిగిన ఘటనల్లో ఇలాంటి వ్యవహారాలు బయటపడ్డాయి. అయితే ఇక్కడ అధికారులు కూడా అక్రమార్కులతో చేతులు కలపడంతో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావా ల్సి వచ్చింది. మరికొంత మంది ఎమ్మెల్యేలకు సూటిగా విషయం చెప్పి ఎస్పీ/కమిషనర్ ద్వారా చెప్పించాలని సున్నితంగా తిరస్కరిస్తుండటంతో సమస్య ఏర్పడుతోంది. దీంతో మరో ఇన్స్పెక్టర్ కోసం సంబంధిత ఎమ్మెల్యే ప్రయత్నాలు చేయడంతో అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ఏం చేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
నచ్చలేదని నొచ్చుకున్నారు..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి వైద్యులు చుక్కలు చూపిస్తున్నారు. తమకు ఇష్టమైన చోట పోస్టింగ్ ఇవ్వకపోవడంతో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్నే వదులుకోవడం వైద్య విధాన పరిషత్‌లో సంచలనం కలిగించింది. ఇష్టారాజ్యంగా పోస్టింగులు ఇవ్వడంతో తమకు ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదని దాదాపు 200 మంది కొలువులను వదులుకోవడం చర్చనీయాంశంమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి వైద్యులకు ఇష్టమైన చోట పోస్టింగ్ ఇవ్వా లని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఇష్టం వచ్చినట్లు ఎవరికి పోస్టింగులు ఇవ్వలేదని, గడువులోగా విధుల్లో చేరని వారం తా ఉద్యోగం కోల్పోయినట్లేనని వైద్య విధాన పరిషత్ స్పష్టం చేసింది. ఇటీవల తయారు చేసిన జాబితాలోని మిగిలిన వారితో ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు యోచిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కీలకమైన కంటి వెలుగు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు అధికారులకు ఇబ్బందికరంగా మారాయి. 700 మందే చేరిన వైనం.. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా వైద్య ఆరోగ్య శాఖలో 911 మంది స్పెషలిస్ట్ వైద్యులను ఇటీవల నియమించారు. జూలై 6న ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చారు. పోస్టులు దక్కించుకున్న వారిలో 146 మంది మహిళా వైద్యులున్నారు. కొందరి వైద్యులకు వారి సొంత జిల్లాలు, సొంతూళ్లకు సమీప ఆస్పత్రుల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చారు. మరికొందరికి సుదూర జిల్లాలు, ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో సమస్య మొదలైంది. పైరవీలు చేయించుకున్న వారికి మంచి పోస్టింగులు దక్కాయని, మిగిలిన వారికి అన్యాయం జరిగిందని కొందరు విమర్శిస్తున్నారు. దీంతో తాము కావాలను కున్న చోటు దక్కలేదని 200 మంది స్పెషలిస్టు వైద్యు లు విధుల్లో చేరేందుకు నిరాకరించారు. జూలై 29నే ఉద్యోగంలో చేరే గడువు ముగిసింది. మరోవైపు చేరిన 700 మందిలో దాదాపు సగం మంది తమకు కేటాయించిన ఆస్పత్రుల్లో విధులకు హాజరుకావడం లేదని సమాచారం. వైద్యులకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి, ఆప్షన్లు ఇచ్చి పోస్టింగ్ కేటాయించి ఉంటే బాగుండేదన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలి.. ఇష్టారాజ్యంగా పోస్టింగ్‌లు ఇవ్వడంతో దాదాపు 200 మంది స్పెషలిస్టు వైద్యులు ఉద్యోగంలో చేరలేదు. వైద్యులకు నచ్చిన చోట పోస్టింగ్‌లు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి వైద్యులకు ఇష్టమైన చోట పోస్టింగులు ఇవ్వాలి. – డాక్టర్ ప్రవీణ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు జాబితాలోని ఇతరులకు ఇస్తాం.. చాలామంది స్పెషలిస్టు వైద్యులు విధుల్లో చేరలేదు. విధుల్లో చేరని వారంతా ఉద్యోగం కోల్పోయినట్లే. ప్రస్తుతం ఏం చేయాలన్న దాని పై ప్రభుత్వంతో చర్చిస్తాం. అవసరమైతే ఇటీవల తయారు చేసిన జాబితాలో మిగిలిన వారికి పోస్టింగ్ ఇస్తాం. – డాక్టర్ శివప్రసాద్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ -
కొంపముంచిన వాట్సప్ పోస్టింగ్
తూర్పుగోదావరి ,కాజులూరు (రామచంద్రపురం): దొంగిలించబడిన పాప తమ వద్ద ఉందని, తల్లిదండ్రులకు తెలిసేలా ఈ విషయాన్ని పది మందికీ పంపాలంటూ వచ్చిన ఓ పోస్టింగ్‌ను ఇతరులకు పంపడమే ఆమె నేరమైంది. ఆకతాయిలు వక్రీకరించి ఇతరులకు పోస్టింగ్ పెట్టడంతో లేని పాపను తీసుకు రమ్మంటూ ఇప్పుడు అధికారులు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటోంది. వివరాల్లోనికి వెళితే గొల్లపాలెం అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తున్న టి. వరలక్ష్మికి కొన్నిరోజుల క్రితం ఆమె సెల్ ఫోన్‌కు ఒక వాట్సప్ పోస్టింగ్ వచ్చింది. ఐదు నెలల వయసున్న పసిపాపను ఎవరో దొంగిలించి ముష్టి చేస్తుండగా, తాము పట్టుకున్నామని, పాప తమ వద్ద ఉందని, ఈ విషయం పాప తల్లిదండ్రులకు చేరేలా పది మందికీ పోస్టు చెయ్యాలంటూ కింద రెండు సెల్‌ఫోన్ నెంబర్లు ఇస్తూ వాట్సప్ పోస్టింగ్ వచ్చింది. ఆమె ఆ పోస్టింగ్‌ను తన సెల్ఫోన్లో ఉన్న కొందరికి పంపింది. ఆపై ఎవరో ఆకతాయిలు ముష్టిచేస్తున్న వారి నుంచి పట్టుకున్న పాప గొల్లపాలెం అంగన్వాడీ టీచరు వరలక్ష్మి వద్ద ఉందంటూ పోస్టింగ్‌కు జతచేస్తూ ఇతరులకు పంపించారు. ఆకతాయిలు పెట్టిన పోస్టింగ్ ఒక సెల్ ఫోన్ నుంచి మరో సెల్‌ఫోన్‌కు వెళుతూ చివరకు జిల్లా అధికారులకు కూడా చేరింది. ఆ పాపను స్వాధీనం చేసుకొమ్మని కలెక్టరేట్ నుంచి కాజులూరు తహసీల్దార్‌కు, ఐసీడీఎస్ నుంచి అంగన్వాడీ సిబ్బందికి ఆదేశాలు అందాయి. దీంతో రెవెన్యూ అధికారులు పాపను అప్పగించాలని అంగన్వాడీ టీచరు వరలక్ష్మిని డిమాండ్ చేస్తున్నారు. ఎవరో వాట్సప్ మెజేస్ పెడితే మానవతా దృక్పథంతో తిరిగి ఇతరుకు వాట్సప్ చేశానని లేని పాపను తీసుకు రమ్మంటే ఎలా తీసుకురాగలనని వరలక్ష్మి లబోదిబోమంటోంది. జరిగిన ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరలక్ష్మికి వచ్చిన వాట్సప్ పోస్టింగ్‌లోని నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని గొల్లపాలెం ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. -
పోలీసు బదిలీ(ల)లు!
సాక్షి, గుంటూరు: పోస్టింగ్‌ల కోసం పోలీసు అధికారుల పైరవీలు ఊపందుకున్నాయి. నచ్చిన పోస్టింగ్ ఇప్పించే అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అధికార పార్టీ ముఖ్యనేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యనేతలతో సన్నిహితంగా ఉండే ద్వితీయ శ్రేణి నేతలతో బేరాలు సైతం కుదుర్చుకుంటున్నారు. పోస్టును బట్టి ధర నిర్ణయిస్తున్నారు. డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణతో పోలీసు శాఖలో బదిలీల హడావుడి ఊపందుకుంది. పోస్టింగ్ పడాలంటే ముఖ్యనేతల సిఫార్సు ఉండాలనేది బహిరంగ రహస్యమే. నీతి, నిజాయితీ, అవార్డులు, రివార్డులతో సంబంధం లేకుండా పోస్టింగ్‌లు కేటాయిస్తున్న పరిస్థితి. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రాధాన్యత గల పోస్టింగ్‌లు .. నిజాయతీగా పని చేసే ఆరికి లూప్‌లైన్ పోస్టింగ్‌లు కేటాయిస్తున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో.. రాజధాని ప్రకటన నుంచి గుంటూరు జిల్లాలో పోలీసుల పోస్టింగ్‌లకు ప్రాధాన్యత పెరిగిపోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత సంప్రదాయాన్ని తుంగలో తొక్కి సిఫార్సులు ఉన్నవారికే పోస్టింగ్‌లు దక్కేలా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తోంది. గతంలో సీఐల బదిలీలు చేపట్టాలంటే రేంజ్ పరిధిలోని ఎస్పీలతో సమావేశం నిర్వహించి పని తీరు ఆధారంగా పోస్టింగ్‌లు కేటాయించే వారు. ప్రస్తుతం రాత్రికి రాత్రే రెండు, మూడు పోస్టింగ్‌లు చొప్పున వేసేస్తూ ఎస్పీలు ఇచ్చిన నివేదికలు పక్కన పడేసి అధికార పార్టీ నేతల సిఫార్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికలు ముందస్తుగా వస్తాయనే ఊహాగానాల నేపథ్యంలో ఈ సారి జరిగే తమకు అనుకూలమైన వారికి ఇష్టమొచ్చిన ప్రాంతాల్లోకి బదిలీ చేయించుకునేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాము చెప్పినట్లు వినే అధికారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. నిజాయతీకి దక్కని గౌరవం పోలీసు అధికారుల్లో నిజాయతీగా పని చేసే అనేక మందికి నాలుగేళ్లుగా ఒక్క లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ కూడా దక్కని పరిస్థితి ఉండగా, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొనే పోలీసు అధికారులకు మాత్రం వరుస పోస్టింగ్‌లు ఇస్తూ ప్రాధాన్యత గల స్టేషన్లు అప్పగించారు. ముఖ్యంగా గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు బదిలీ అవుతారంటూ అధికార పార్టీ నేతలు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఎస్పీ బదిలీతో రూరల్ జిల్లా పరిధిలో పలువురు సీఐలను సైతం మార్చేందుకు అధికార పార్టీ నేతలు ఉన్నతాధికారులకు జాబితా పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రశాంతత నెలకొనాలంటే సిఫార్సులను పక్కన బెట్టి సమర్థత గల పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు కేటాయించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. పోస్టును బట్టి ధర పోలీసు స్టేషన్లను ప్రాధాన్యతను బట్టి ఏ,బీ,సీ గ్రేడ్లుగా విభజించినట్లే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ ఉండే ద్వితీయ శ్రేణి నేతలు సైతం పోస్టింగ్‌ను బట్టి ధర నిర్ణయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్యనేతలతో సరైన సంబంధాలులేని పోలీసు అధికారులు ద్వితీయ శ్రేణి నేతలకు ముడుపులు ఇచ్చి అయినా పోస్టింగ్ దక్కించుకోవాలని బేరసారాలు కొనసాగిస్తున్నారు. -
ఉద్యోగుల బదిలీలకు కొత్త చిక్కులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. బదిలీల దరఖాస్తులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్డర్ టు సర్వ్ కింద చేసిన తాత్కాలిక కేటాయింపులను క్రమబద్ధీకరించకుండా బదిలీలకు అవకాశమిస్తే పాత జిల్లా కేంద్రాల్లోని వారు బదిలీలపై వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త జిల్లాలకు ఆర్డర్ టు సర్వ్ కింద వెళ్లిన ఉద్యోగులు పాత జిల్లాల పరిధిలోకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి నెలకొంది. అలాంటివారికి ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారన్నదే ప్రధాన సమస్య. అసలు బదిలీలను ఎవరు చేయాలన్నదీ సమస్యగానే మారింది. బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో పాత జిల్లాల ప్రకారం బదిలీలు చేస్తారని పేర్కొన్నారే తప్ప పాత జిల్లా కలెక్టర్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించలేదు. అలాంటప్పుడు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పాత జిల్లాల కలెక్టర్లు ఏ అధికారంతో బదిలీ చేస్తారని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అవేమీ సమస్యలు కాబోవని మరికొన్ని సంఘాల నేతలు చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా పేర్కొంటున్న అంశాలు.. ► కొత్త జిల్లాల్లో కేడర్ స్ట్రెంత్ నిర్ణయించలేదు. ఆర్డర్ టు సర్వ్‌పై వెళ్లిన వారిని అక్కడ క్రమబద్ధీకరించలేదు. అలాంటప్పుడు బదిలీలపై కొత్త జిల్లాల్లో ఉద్యోగులను ఏ పోస్టుల్లోకి పంపిస్తారు? ► ఆర్డర్ టు సర్వ్ కింద వెళ్లినవారికి పనిచేస్తున్న చోట రెండేళ్ల సర్వీసు లేకపోయినా బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు వారు దరఖాస్తు చేసుకొని పాత జిల్లాలకు వెళ్లే వీలుంది. కానీ పాత ఆదిలాబాద్ వంటి జిల్లాలకు చెందిన, ఆర్డర్ టు సర్వ్‌పై ఆసిఫాబాద్‌కు వెళ్లిన ఉద్యోగులు ఇప్పుడు బదిలీపై ఆదిలాబాద్ వచ్చేందుకు ఇష్టపడతారు. అదే ఆదిలాబాద్‌లో ఉన్న వారు మాత్రం ఆసిఫాబాద్ వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి లేదు. ► పునర్విభజనతో జిల్లాల పరిధులు మారాయి. ఒక జిల్లాలోని ఉద్యోగులు మరో జిల్లా పరిధిలోకి వచ్చారు. ఇప్పుడు వారిని పాత జిల్లా కలెక్టర్లు ఎలా బదిలీ చేస్తారన్నది ప్రశ్న. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ ప్రాంతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వచ్చింది. వారిప్పుడు భూపాలపల్లి జిల్లా పరిధిలోనే ఉంటామనే అవకాశముంది. ► రాష్ట్రంలో 2013 తర్వాత ఉద్యోగుల బదిలీలు లేవు. దీంతో ప్రస్తుత నిబంధన ప్రకారం పనిచేసే చోట రెండేళ్ల సర్వీసున్న ప్రతివారూ బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశముంది. కానీ 40 శాతం మందినే బదిలీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా 60 శాతం మందికి బదిలీకి అర్హత ఉన్నా పాత స్థానాల్లోనే ఉండక తప్పదు. వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ► త్వరలో పంచాయతీ ఎన్నికలున్నందున ఇప్పుడు బదిలీలు చేస్తే ఎన్నికల నిర్వహణ కొత్తవారికి సమస్యగా ఉంటుందేమోనంటున్నారు. రెవెన్యూ రికార్డుల సవరణకూ ఇదే ఇబ్బంది ఎదురు కావచ్చు. ► బదిలీ స్టేషన్‌కు టౌన్, విలేజ్ అని బదిలీ ఉత్తర్వుల్లో వివరణ ఇచ్చారు. దాని ప్రకారం జీహెచ్ఎంసీ ఒక యూనిట్ అవుతోంది. జోన్, మల్టీ జోన్ పోస్టుల్లోని ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వారు జీహెచ్ఎంసీకి వచ్చే వీలుంది. కానీ జీహెచ్ఎంసీ పరిధిలోని కార్యాలయాల్లో పని చేస్తున్న వారు మాత్రం ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు -
పనివ్వకుండా జీతమిస్తున్నారు
సాక్షి,సిటీబ్యూరో: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ తీరు మారడం లేదు. పరిపాలనా పరమైన వ్యవహారాల్లో సైతం నిర్లక్ష్యం వీడటం లేదు. ఒక వైపు ఖాళీలు వెక్కిరిస్తున్నా... కీలక పోస్టులు కూడా భర్తీకి నోచుకోవడం లేదు. కింది స్థాయిలో కనీసం పదోన్నతులు ప్రక్రియ ఉసే లేకుండా పోగా, గెజిటెడ్ స్థాయిలో మాత్రం నామమాత్రంగా పదోన్నతులు కల్పిస్తున్నా.. పోస్టింగ్‌లు మాత్రం కేటాయించడం లేదు. ఫలితంగా వారిని నెలల తరబడి ఖాళీగానే కూర్చో బెట్టి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖకు పూర్తి స్థాయి పరిపాలనాదీశుడు లేక ఇంచార్జీలతో కొనసాగడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలో ఇద్దరు జిల్లా రిజిస్ట్రార్లకు డీఐజీలు గా, ఐదుగురు గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పిస్తూ గతేడాది 31న ఆదేశాలు జారీ అయ్యాయి. అందులో హైదరాబాద్ సౌత్ జిల్లా రిజిస్ట్రార్, మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్లు డీఐజీలు గా పదోన్నతులు లభించడంతో వెంటనే రిలీవ్ అయి ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. అదేవిధంగా జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతుల పొందిన ఐదుగురు గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్లు సైతం రిలీవ్ అయి సంబంధిత శాఖలో రిపోర్టు చేశారు. వారికి ఇప్పటి వరకు పోస్టింగ్ కేటాయించక పోవడం విస్మయానికి గురిచేస్తోంది. వెక్కిరిస్తున్న ఖాళీలు రిజిస్ట్రేషన్ శాఖలో రెండు డీఐజీ పోస్టులతోపాటు 12 రిజిస్ట్రార్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ డీఐజీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. జిల్లా రిజిస్ట్రార్ నుంచి డీఐజీగా పదోన్నతుల పొందిన ఇద్దరికి ఆయా పోస్టుల్లో భర్తీ చేయవచ్చు. కానీ ఇప్పటి వరకు కేటాయించలేదు. మరోవైపు ఇతర డీఐజీలకు అదనపు బాధ్యతలు అప్పగించి కొనసాగిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ సౌత్, మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్లతో మరో పది డీఆర్ పోస్టులు ఖాళీగా ఇంచార్జిలతో కొనసాగుతున్నాయి. గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్ల నుంచి జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతులు పొందిన ఐదుగురితో ఖాళీగా గల డీఆర్ పోస్టింగ్‌లు భర్తీ చేయవచ్చు.. కానీ, ఇప్పటి వరకు ఆ దిశ చర్యలకు ఉపక్ర మించడంలేదు. ఎలాంటి సేవలు తీసుకోకుండానే జీతాలు ఇవ్వడం నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. ఇటీవల కమిషనరేట్‌లో జరిగిన సమావేశంలో ఇంచార్జి కమిషనర్ దృష్టికి పదోన్నతులు పొందిన వారు తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. నాలుగేళ్ల నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో నాలుగేళ్ల నుంచి సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు లేకుండా పోయా యి. సుమారు 50 వరకు గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నా ...వాటిని భర్తీ చేయడం లేదు. పదోన్నతుల జాబితాలో పెద్ద ఎత్తున సీనియర్ అసిస్టెంట్లు ఉన్నా ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. మొత్తంమీద రిజిస్ట్రేషన్ శాఖలో క్యాడర్ సంఖ్య 3,930 ఉండగా అందులో 590 పోస్టులు మినహా అన్ని పోస్టులు ఖాళీగా నే వెక్కిరిస్తున్నాయి. -
ఖద్దరు నీడన ఖాకీ
► పోలీసు శాఖలో బదిలీల మాయాజాలం ► రాజకీయ పలుకుబడి ఉంటే కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్ ► ఏళ్ల తరబడి జిల్లా సరిహద్దుల్లో మగ్గిపోతున్న కొందరు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీస్ శాఖలో అందరికీ సమన్యాయం జరగడం లేదు. రాజకీయ పలుకుబడి ఉంటే కోరుకున్న ప్రాంతంలో దర్జాగా బతకవచ్చు. ఎలాంటి పలుకుబడి లేకపోతే మారుమూల మండలాల్లో మగ్గిపోవాల్సిందే. రాజకీయ నాయకుల కన్నుసన్నల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం నడుస్తుండడం వల్లనే పోలీస్ సిబ్బంది దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. అనంతపురం సెంట్రల్(అనంతపురం): పోలీసు శాఖలో బదిలీల మాయాజాలం అంతా ఇంతా కాదు. రాజకీయ పలుకుబడి లేని చాలా మంది జిల్లా సరిహద్దు మండలాల్లో మగ్గిపోతున్నారు. ఇలాంటి వారి సంఖ్య దాదాపు రెండు వందలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయా పోలీసు స్టేషన్లో ఉన్నతాధికారులతో సఖ్యతగా లేరనే సాకుతో కొంతమందిని దూరప్రాంతాలకు బదిలీ చేశారు. మిగిలిన శాఖలతో పోలీస్ శాఖలో ఇలాంటి కక్ష సాధింపు బదిలీల మోతాడు ఎక్కువగానే ఉంటోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అయితే ఇలాంటి బదిలీలు మంచిగానే ఉన్నా.. సంవత్సరాల తరబడి సుదూర ప్రాంతాలకే వారిని పరిమితం చేయడం విమర్శలకు దారితీస్తోంది. నిబంధనలకు విరుద్ధంగానే.. బదిలీల నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్ల ఒకసారి ఉద్యోగిని మరో ప్రాంతానికి బదిలీ చేయాల్సి ఉంది. ఒకే ప్రాంతంలో మూడేళ్లు దాటిన ఉద్యోగికి, అతని ఇష్టపూర్వకంగానే మరో ప్రాంతానికి బదిలీ చేయవచ్చు. అయితే ఈ నిబంధనలు పోలీస్ శాఖ పరిగణలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా ఒకే ప్రాంతంలో ఆరేళ్లకు పైగా పనిచేస్తున్న పోలీస్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 200కు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది వయోభారంతో అనారోగ్య సమస్యల బారిన పడిన వారు ఉన్నారు. అంతేకాక ఉద్యోగ విరమణకు అత్యంత సమీపంలో ఉన్న వారు కూడా ఉన్నారు. శాసిస్తున్న రాజకీయం నేర నియంత్రణలో కీలకంగా వ్యవహరిస్తూ అంతర్గత అరాచక శక్తుల నుంచి దేశాన్ని కాపాడే కీలక బాధ్యత నెత్తిన వేసుకున్న పోలీస్ శాఖకు విధుల నిర్వహణలో స్వయం ప్రతిపత్తి ఉంది. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఈ పరిస్థితి పోలీస్ శాఖలో ఎక్కడా కనిపించడం లేదు. యావత్ పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయం శాసిస్తోంది. నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయాల్సిన దుస్థితి నేడు పోలీస్ శాఖకు పట్టింది. రాజకీయ నాయకులను ధిక్కరిస్తే తమను మారుమూల మండలాలకు బదిలీ చేస్తారన్న భయం చాలా మంది పోలీస్ సిబ్బందిని వెన్నాడుతోంది. దీంతో ఒకవిధమైన అభద్రతాభావంతో వారు పనిచేయాల్సి వస్తోంది. బదిలీల్లోనూ నేతల హవా పోలీస్ శాఖ బదిలీలను సైతం రాజకీయ నేతలు తమ గుప్పిట్లో ఉంచుకున్నారు. వారి సిఫారసు ఉంటే తాము కోరుకున్న చోటులో దర్జాగా బతికేయవచ్చునన్న ఊహ చాలా మంది పోలీస్ సిబ్బందిలోనూ వ్యక్తమవుతోంది. ఇందుకు అద్దం పడుతోంది ఇటీవల ముగిసిన పోలీసుల బదిలీల పర్వం. ఫలితంగా జిల్లాలోని పలు సబ్డివిజన్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇటీవల కొంతమంది ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకోగా స్వయానా ఓ డీఎస్పీ కలుగుజేసుకుని వాటిని నిలుపుదల చేయాలని ఎస్పీని కోరారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. సిఫార్సులను పరిగణలోకి తీసుకుని ఉన్నవారిని బదిలీ చేస్తే శాంతిభద్రతలను కాపాడటం చాలా కష్టమని ఎస్పీ ఎదుట సదరు డీఎస్పీ వాపోయినట్లు సమాచారం. కొత్త ఎస్పీపై ఆశలు నెలరోజుల క్రితం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జీవీజీ అశోక్‌కుమార్‌పై పలువురు పోలీసులు ఆశలు పెంచుకుంటున్నారు. తమ సమస్యలను అర్థం చేసుకుని బదిలీల్లో న్యాయం చేకూరుస్తారనే చాలామంది అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే తమ అనారోగ్య పరిస్థితులను విన్నవిస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి దరఖాస్తులు వెల్లువలా వచ్చి చేరుతున్నాయి. దృష్టి సారిస్తున్నాం (ఎస్పీ పేరుతో పీపీ ఉంటుంది) కొంతమంది ఐదేళ్లకు పైబడి ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. తొలి ప్రాధాన్యత కింద వారి సమస్యలను పరిగణలోకి తీసుకుంటాం. నిజంగా ఇబ్బందులు ఉన్న వారికి న్యాయం చేస్తా. ఇందు కోసం గ్రీవెన్స్ ఏర్పాటు చేయబోతున్నాం. అందులో వారి సమస్యను తెలుపుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది. – జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ -
పారదర్శకమా.. పర్సంటేజీలా..!
చైర్మన్ నవీన్ మొగ్గు ఎటువైపన్న దానిపైనే అందరి నిరీక్షణ చర్చనీయాంశమైన జెడ్పీ సీసీ పోస్టింగు సీటు కోసం ఎవరి పైరవీలు వారివి భానుగుడి (కాకినాడ) : జిల్లా పరిషత్‌లో ఏ ఫైలు కదలాలన్నా, బదిలీలు కావాల్సిన చోటుకి రావాలన్నా, పెన్షన్లు, పీఎఫ్ ఫైళ్లు, ఉపాధ్యాయులు డిప్యుటేషన్లు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, జెడ్పీ నుంచి విడుదలయ్యే కోట్ల రూపాయల నిధులు, వాటి పర్సంటేజీలు, జెడ్పీ ఆస్తులు, ఆదాయాలు వీటన్నింటిపై చక్రం తిప్పే సీటు జెడ్పీలో ఏదైనా ఉందంటే అది జెడ్పీ చైర్మన్ సీసీ పదవే. ప్రస్తుతం జెడ్పీ చైర్మన్‌గా జ్యోతుల నవీన్ ఎంపికైన తర్వాత ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న గత జెడ్పీ చైర్మన్ నామన సీసీ ప్రసాద్ మాతృస్థానానికి వెళ్లారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుత చైర్మన్ సీసీగా ఎవరిని ఎన్నుకుంటారన్న విషయంపైనే అందరి ఆసక్తి నెలకొంది. గతంలో వంగా గీతావిశ్వనాథ్ నుంచి సీసీగా అనేక పర్యాయాలు పనిచేసిన ప్రణాళికా విభాగానికి చెందిన హరికృష్ణ పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే నామనకు సీసీగా వ్యవహరించిన ప్రసాద్ సైతం తనకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జెడ్పీలో పనిచేసి ఆర్‌అండ్‌బీకి బదిలీపై వెళ్లిన సత్యనారాయణమూర్తి సైతం ఒకే సామాజిక వర్గ సమీకరణాలతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. సామాజిక వర్గమా.. అనుభవమా..! కీలకంగా మారిన ఈ పదవిని తన సామాజిక వర్గానికి చెందిన ఆయన వర్గీయులకే చైర్మన్ నవీన్ కట్టబెడతారో లేక పర్సంటేజీలలో అనుభవమున్న వ్యక్తులకు ఇచ్చి కలెక్షన్లకు తెరదించుతారోనని చర్చ మొదలైంది. నవీన్ సమావేశాల్లో ఆది నుంచీ రెండేళ్ల పాలనలో జెడ్పీటీసీ సభ్యుల గౌరవాన్ని పెంచుతానని, పర్సంటేజీల పాలనకు స్వస్తి పలికి నీతి నిజాయతీలతో పీఠానికి గౌరవం తెస్తానని అంటున్నారు. ఆయన మాటలు కేవలం సమావేశాలకే పరిమితమా లేక కార్యరూపంలో పెడదారా అన్న సందేహం అందరిలో మొదలైంది. ఉద్యోగుల్లో ఉన్న యూనియన్ల దృష్ట్యా ఏ సంఘం వారికి ప్రాధాన్యం ఇస్తారో ఆయా సంఘాల సభ్యులంతా వేచి చూస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సందేహాలు నివృత్తి కానున్నాయి. రెండు రోజుల్లో సీసీ నియామకం జరుగుతుందని, పూర్తిస్థాయి పాలన కొనసాగుతుందని, జిల్లా పరిషత్‌లో గ్రీవెన్స్‌తో సహా పలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని చైర్మన్ నవీన్ ప్రకటించారు. -
రక్షకులకే శిక్ష!
ఇరగవరం ఎస్సైకి బదిలీ బహుమానం కుక్కునూరులో పోస్టింగ్ తణుకు ఎమ్మెల్యే అవమానించినా ఆదుకోని పోలీసుబాస్‌లు మాట నెగ్గించుకున్న ఎమ్మెల్యే ఎస్పీ బదిలీలోనూ ఇదే వైఖరి జిల్లాలో పోలీస్ ఉద్యోగం బలిపీఠంగా మారింది. అధికారపార్టీ ఆగడాలకు ఏమాత్రం అడ్డుచెప్పినా.. రక్షకులే బలికావాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా జరిగిన ఘటనలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఫలితంగా పోలీసుశాఖలోనూ, ప్రజల్లోనూ అధికారపార్టీ తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికార పార్టీకి ఎదురువెళ్తే ఏమవుతుందో ఇప్పుడు పోలీసులకూ తెలిసివస్తోంది. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట విననందుకు నిర్బంధానికి గురైన పోలీసు అధికారికి బదిలీ బహుమానంగా దక్కింది. అదీ జిల్లాకు సుదూరంగా ఉన్న ముంపు మండలమైన కుక్కునూరుకు.. పోలీసులపై దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే మాట నెగ్గించుకుని ఎస్సైని బదిలీ చేయించడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే.. గత ఏడాది అక్టోబర్‌లో కేవీవీ శ్రీనివాస్ ఇరగవరం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఈఏడాది మేలో ఇరగవరం మండలం రేలంగి శివారు అంతెనవారి పేటలో ఈస్టర్ రోజున దళితుల మధ్య గొడవ జరిగింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఇరు వర్గాలలో చెరో ఆరుగురిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. అయితే తెలుగుదేశం వారిపై కేసు పెట్టవద్దంటూ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇరగవరం ఎస్సై శ్రీనివాస్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. ఆఖరికి ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికీ తీసుకువెళ్లారు. అయితే దాడి జరిగిన విషయం నిర్ధారణ కావడంతో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. దీంతో మే 16న ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎస్సై శ్రీనివాస్, రైటర్ ప్రదీప్‌కుమార్‌ను తన కార్యాలయానికి పిలిపించుకుని ’నా మాట వినకుండా కేసులు నమోదు చేస్తారా మీకు ఎంత దమ్ము ఉందిరా’ అంటూ బూతులు తిట్టారు. ఆఫీసులో కింద నేలపై వారిని కూర్చోబెట్టి, తానూ వారి ఎదురుగా కూర్చున్నారు. తనకు సమాధానం చెప్పేవరకూ బయటకు వెళ్లనీయబోనంటూ నిర్బంధించారు. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో అప్పటి ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయించారు. ఎస్పీని టార్గెట్ చేసిన ఎమ్మెల్యేలు దీంతో జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎస్పీని టార్గెట్ చేశారు. ఆ నెల 21న ఏలూరులో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్‌పై జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. వెంటనే ఆయనను బదిలీ చేయించాల్సిందేనని, అంతవరకూ తమకు గన్మెన్లూ వద్దని, వెనక్కి పంపించేస్తామని కొంతమంది గన్మెన్లను వెనక్కి పంపారు. ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత కొద్ది రోజులకే ఎస్పీ భాస్కర్ భూషణ్‌ను జిల్లా నుంచి బదిలీ చేశారు. ఇప్పుడు తాజాగా ఎస్సై ఆ తర్వాత ఎస్సైనీ బదిలీ చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పట్టుపట్టడంతో ఇప్పుడు తాజాగా బాధితుడైన ఎస్సైనీ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి పరిపాలనా కారణాలు చూపి బదిలీ చేయడంపై పోలీసు శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే పద్ధతి కొనసాగితే పోలీసుల మనోధైర్యం దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎవరికో అన్న‘వరం’
సత్తెన్న సన్నిధిలో రాజకీయం - ఖాళీ అయిన ఈవో పోస్టుపై రత్నగిరిపై తమ్ముళ్ల పోరు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అన్నవరం సత్యదేవుని కొండపై రాజకీయ పాచికలు అడుకుంటున్నారు. ఖాళీ అయిన ఈఓ పోస్టు కోసం అధికార పార్టీలో రెండు గ్రూపులు సిగపట్లు పడుతుండటంతో రత్నగిరిపై రాజకీయం రాజుకుంది. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న అన్నవరం సత్యదేవుని వార్షిక ఆదాయం రూ.120 కోట్లు. ఏటా 80 లక్షల మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా వస్తుంటారు. స్వామి సన్నిధిలో జరిగే వ్రతాలు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. అటువంటి సత్యదేవుని కొండపై పట్టు కోసం నేతలు హోరాహోరీగా తలపడుతూ రాజకీయం చేస్తున్నారు. సత్యదేవుని ఆలయ కార్యనిర్వాహణాధికారి కాకర్ల నాగేశ్వరరావు విజయనగరం జిల్లా జేసీ–2గా గురువారం బదిలీ కావడంతో పోరు తీవ్రమైంది. నాగేశ్వరర రావు స్థానంలో కొత్త ఈవో కోసం రెండు గ్రూపులు రెండు పేర్లను తెరమీదకు తేవడంతో కొండపై రాజకీయం రసకందాయంగా మారింది. అర్హతలేకున్నా అందలాలెక్కించడం, ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేయడం, లక్షల రూపాయలు చేతులు మారితేనే కానీ పోస్టింగుల రాని పరిస్థితులు దేవాదాయశాఖలో ఇటీవల శృతిమించి పోయిన వ్యవహారాలపై ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించిన సంగతి పాఠకులకు విదితమే. గ్రేడ్–1, గ్రేడ్–2 ఈఓ పోస్టింగులకే రూ.20 నుంచి రూ.30 లక్షలు ముట్టజెప్పితే ఇక అన్నవరం సత్యదేవుని ఈఓ పోస్టింగ్ అంటే మాటలా అంటున్నారు. ఆ పోస్టింగ్‌కు ఎంత పలుకుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రయత్నాల్లో ముగ్గురు... అన్నవరం ఈఓ పోస్టింగ్ కోసం ముగ్గురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ఈవో మంచెనపల్లి రఘునా«థ్, ద్వారకా తిరుమల ఈవో వేండ్ర త్రినా«ధరావు, రాజమహేంద్రవరం ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరు మినహా ఇద్దరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం నాగేశ్వరరావు అన్నవరం ఈవోగా వచ్చే సమయంలో రఘునా«థ్ కూడా ఇక్కడకు రావడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. అప్పట్లో జిల్లాకు చెందిన ఓ మంత్రి సోదరుడు ఈయన్ని తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా చివరకు దేవాదాయశాఖకు సంబధంలేని రెవెన్యూ శాఖ నుంచి స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ స్థాయి అధికారి అయిన నాగేశ్వరరావుకు పోస్టింగ్ దక్కింది. ఈ పోస్టింగ్ కోసం అప్పట్లో మంత్రి వర్గీయులు ఒక ఈవో నుంచి తీసుకున్న రూ.20 లక్షలు సంబంధిత వ్యక్తికి ఇప్పటి వరకూ తిరిగి ఇవ్వకపోవడంతో వివాదంగా మారింది. ఆ సొమ్ములు ఎలానూ ఇవ్వలేదు కనీసం ఇప్పుడైనా ఆ పోస్టింగ్ అవకాశం దక్కేలా చూడాలని సంబంధిత వ్యక్తి ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఏసీబికి చిక్కడంతో... ఇక్కడకు వస్తారని ప్రచారం జరుగుతున్న రఘునా«థ్ 2006 నుంచి 2008 వరకు అన్నవరం ఈవోగా పని చేశారు. ఆ సమయంలోనే ఆదాయానికి మించిన ఆస్తులున్నాయంటూ అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేయడంతో సస్పెండయ్యారు. ఆ కారణంగానే రెండేళ్ల కిందట తిరిగి అన్నవరం ఈవోగా రావాలనే ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఆ ఏసీబీ కేసులో క్లీన్చిట్ రావడంతో ఇప్పుడు ఇక్కడకు రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోను రఘునా«థ్‌ను తీసుకువచ్చి తీరతామని మంత్రి అనుచరులు చాలా నమ్మకంగా చెబుతున్నారని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. రఘునా«థ్ వస్తే కొండపై తమకు ఇబ్బందులు తప్పవని ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఓ ఇంజినీరింగ్ అధికారి, మరో ఏసీ ఇక్కడి పోస్టింగ్ కోసం ఆసక్తి కనబరుస్తున్న ద్వారకా తిరుమల ఈవో వేండ్ర త్రినాథరావు లైన్లో పెడుతున్నారు. త్రినా«థరావు జిల్లాలో డిప్యుటీ కమిషనర్‌గా పనిచేసినప్పుడు కొండపై అన్నీ తామే అన్నట్టు చక్రం తిప్పిన ఆ ఇద్దరు రాజకీయంగా పావులు కదుపుతున్నారు. ఆయన ఈవోగా రావడం ఖాయమని ఇప్పటికే విస్తృత ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. ఇందుకు మంత్రి వర్గీయులతో పొసగని మెట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సులతో ఉన్నత స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని నమ్మకమైన వర్గాల ద్వారా తెలిసింది. ఈవో నాగేశ్వరరావు ముక్కుసూటిగా పోయే విధానంనచ్చని వారు ఇప్పుడు కొండపై తమ మాట వినే వారిని తెచ్చుకునే పనిలో ఉన్నారు. ఇలా రెండు గ్రూపులు చెరొకరి కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండగా రాజకీయ సిఫార్సులతో సంబంధం లేకుండా రాజమహేంద్రవరం ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ వైపు దేవాదాయశాఖ కమిషనరేట్ వర్గాలు మొగ్గు చూపుతున్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో కొండపై మంత్రి, ఎమ్మెల్యేలలో ఎవరి మాట చెల్లుబాటవుతుందో ఎవరు పట్టు సాధిస్తారోననే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
36 మంది డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: ఎంతో కాలంగా పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న 36 మంది డిప్యూటీ కలెక్టర్లకు ఎట్టకేలకు పోస్టింగ్ లభించింది. రెవెన్యూశాఖతో పాటు పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, క్రీడలు, గిరిజన, వికలాంగుల, మైనార్టీ సంక్షేమం.. తదితర శాఖలలో ఖాళీగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ హోదా పోస్టుల్లో వారిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, బదిలీ అయిన ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లను తదుపరి పోస్టింగ్‌ల నిమిత్తం ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్‌మీనా ఆదేశించారు. -
పోస్టింగ్‌ల కోసం పోటాపోటీ
హైదరాబాద్ ఆర్డీవో స్థానంపై కన్ను.. నాలుగు మండలాలకు భలే గిరాకీ సిటీ బ్యూరో: జిల్లా రెవెన్యూ శాఖలో పోస్టింగ్‌ల కోసం జోరుగా పైరవీలు సాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎనిమిది మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా, పన్నెండు మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతులు లభించాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) పోస్టుతో సహా, పదోన్నతులతో ఖాళీ అవుతున్న నాలుగు మండల తహశీల్దార్ల పోస్టుల కోసం తీవ్ర స్థాయిలో లాబీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం. మూడు యూఎల్ఎసీ తహశీల్దార్ల స్థానాలు కూడా ఖాళీ అవుతున్నా పెద్దగా డిమాండ్ లేకుండా పోయింది. కీలకమైన స్థానాల్లో పోస్టింగ్ కోసం పెద్ద మొత్తంలో ముడుపులు సమర్పించేందుకు సైతం అధికారులు సిద్దమవుత్నున్నారు. జిల్లాలో సుమారు 12 మంది డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతి లభించగా అందులో నలుగురు వివిధ ఆరోపణలతో డిఫర్ అయ్యారు. ఒకరికి మాత్రం రూల్ 16( హెచ్) ప్రకారం రిలాక్సేషన్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో మిగిలిన వారికి కొత్త పోస్టింగ్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ సంఘాల నాయకులు పైరవీల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఆర్డీవో పోస్టుకు పోటా పోటీ హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి పోస్టు కోసం తాజాగా పదోన్నతి పొందిన ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు తీవ్రంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. అందులో సంఘం బాధ్యుడితో పాటు మరొకరు ఉన్నత స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు కలెక్టరేట్లో ఖాళీగా ఉన్న యూఎల్సీ విభాగం డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు సైతం మరో ముగ్గురు పోటీ పడుతున్నారు. మొత్తం మీద తాజాగా పదోన్నతి పొందినవారిలో ఇద్దరికి మాత్రమే జిల్లాలో పోస్టింగ్ లభించే అవకాశాలు ఉండటంతో మిగిలిన ఆరుగురు బయటకు వెళ్లాల్సిందే లాబీయింగ్.. జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో కీల మండలమైన షేక్పేట్పై అందరి దృష్టి పడింది. ప్రభుత్వ, అసైన్డ్, మిగులు, శిఖం భూములు అధికంగా ఉన్నందున షేక్‌పేట తహశీల్దార్ పోస్టుకు అధిక డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం అక్కడి తహశీల్దారు చంద్రకళకు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించడంతో ఆ స్థానం ఖాళీ అవుతోంది. ఆ పోస్టు దక్కించుకునేందుకు ఇటీవల పదోన్నతులు పొందిన కొత్తవారితో పాటు పాత యూఎల్సీ, కలెక్టరేట్లో పనిచేస్తున్న తహశీల్దార్లు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తోంది. మరోవైపు సైదాబాద్, నాంపల్లి, హిమాయత్ నగర్ మండల తహాశీల్దార్ల పోస్టులకు సైతం తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. -
సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ ..నటి అరెస్ట్
-
తహశీల్దార్లకు పోస్టింగ్
అనంతపురం అర్బన్ : జిల్లాలో ఏడుగురు తహశీల్దార్లకు పోస్టింగ్ ఇస్తూ కలెక్టర్ కోనశశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్లమాడ తహశీల్దారు నాగరాజును ఎన్పీకుంట తహశీల్దారుగా డ్వామా సూపరింటెండెంట్ శివయ్యను కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయ ఏఓగా అమరాపురం తహశీల్దారు శ్రీధర్‌బాబును ధర్మవరం ఆర్డీఓ కార్యాలయ ఏఓగా అక్కడే ఉన్న ఏఓ మాధవరెడ్డిని అమరాపురం తహశీల్దారుగా గుడిబండ తహశీల్దారు మహబూబ్‌బాషాను ధర్మవరం తహశీల్దారుగా డ్వామా సూపరింటెండెంట్ అన్వర్హుసేన్కు గుడిబండ తహశీల్దారుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
16 మంది డీఎస్పీలకు పోస్టింగ్స్
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం బదిలీ అయి పోస్టింగ్స్ కోసం వేచిచూస్తున్న 16 మంది డీఎస్పీలకు పలు విభాగాల్లో పోస్టింగ్స్ కేటాయిస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు వెలువరించారు. -
మెచ్చిన వారికి.. నచ్చిన చోట
డీసీ నియామకంపై పైరవీలు రూ. కోట్లలో పలుకుతున్న పీఠం అధికార నేతల హస్తలాఘవం నిబంధనలన్నీ బుట్టదాఖలు ప్రజలంటే భయం లేదు. ఎందుకంటే ఓట్ల సమయంలో నోట్లు ఇచ్చి కొనుక్కోవచ్చుననే ధీమా. మళ్లీ ఎలాగోలా అధికారంలోకి వస్తామనే ధైర్యం. పోనీ దేవుడంటే భక్తి ఉందా అంటే... ఆ భగవంతుడికి భక్తితో భక్తులు ఇచ్చే కానుకల్లోనే వాటాలు పంచుకునే నీచ సంస్కృతి జిల్లాలో నడుస్తోంది. ఇదే అవకాశంగా నిబంధనలు బుట్టదాఖలు చేస్తూ పైరవీలకు పెద్దపీట వేసి పీఠాలను కొంతమంది చేజిక్కించుకుంటున్నారు.. సాక్షి ప్రతినిధి, కాకినాడ : అమాత్యుల అండదండలుంటే సీనియార్టీతో పనేముంది. ఉన్నతాధికారుల ఆశీస్సులుంటే కోరుకున్న పోస్టు కోరుకున్నచోటే వచ్చేస్తుంది. నిబంధనలకు పాతరేసి నచ్చిన వారికి మెచ్చిన పోస్టులు కట్టబెట్టడం పలు శాఖల్లో కొత్తేమీ కాదు. అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికేసిన అమలాపురం డీఎల్పీఓ శర్మను జిల్లా పంచాయతీ అధికారిగా నియమించి ప్రజాప్రతినిధులు చేతులు కాల్చుకున్నారు. ఏసీబీ కోర్టులో అతనిపై కేసు పెండింగ్‌లో ఉన్నా ముడుపులు మెక్కేసిన నేతలు అడ్డగోలుగా పోస్టింగ్ ఇప్పించేశారు. చివరకు అతని పనితీరు సక్రమంగా లేక కలెక్టర్ ఆగ్రహానికి గురై డీఎల్పీఓగా తిప్పి పంపించేశారు. అప్పుడు డీఎల్పీఓ శర్మ విషయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు తప్పుచేస్తే ఇప్పుడు కూడా అదే తప్పు దేవాదాయశాఖ డీసీ నియామకం విషయంలో చేశారంటున్నారు. కోట్ల ఆదాయం... అందకే... కాకినాడ కేంద్రంగా డిప్యుటీ కమిషనర్ పోస్టుకు దేవాదాయ శాఖలో ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది. వెయ్యికి పైబడి దేవాలయాలతో పాటు కోట్లాది రూపాయలు విలువైన సత్రాలు ఈ డీసీ పరిధిలో ఉన్నాయి. ఈ పోస్టు కోసం గతంలో జిల్లాలోనే కోటి రూపాయలు చేతులు మారిన సందర్భాలు కూడా లేకపోలేదు. అటువంటి డీసీ పోస్టు రెండు నెలల క్రితం చందు హనుమంతురావు పదవీ విరమణతో ఖాళీ అయింది. ఈ పోస్టులో డీసీని నియమించాలంటే ఆ క్యాడర్ ఉన్న ఆలయాలు జిల్లాలో లేవు. అలాగని డీసీ పోస్టును ఖాళీగా ఉంచడం కూడా కుదరదు. అందుకేనేమో రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న రమేష్‌బాబును డీసీగా పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్ఎసీ) నియమించారు. సీనియర్లున్నా... డీసీ పరిధిలో ఉన్న ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సీనియర్లయిన అసిస్టెంట్ కమిషనర్లు డజనకు పైబడే ఉన్నారు. వీరిలో ఎవరి పేరును పరిగణనలోకి తీసుకోకుండా సంబంధిత శాఖా మంత్రి, ఉన్నతాధికారుల అండదండలుండటంతోనే రమేష్‌బాబును అడ్డగోలుగా నియమించేశారనే విమర్శలున్నాయి. ఉదాహరణకు జిల్లాలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్లను పరిశీలిస్తే...పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆలయ ఈఓ ఆర్.పుష్పనాధం, మందపల్లి శనీశ్వరాలయ ఘో దేవుళ్లు, రాజమహేంద్రవరం హితకారిణి సమాజం ఈఓ పి.సుబ్రహ్మణ్యం, తలుపులమ్మ లోవ దేవస్థానం ఈఓ చంద్రశేఖర్...వీరు నలుగురు రమేష్‌బాబు కంటే సీనియర్లుగా ఉన్నారని దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రెండు జిల్లాలను కూడా చూసుకుంటే మరో పాతిక మందివరకు సీనియర్లున్నారు.అటువంటప్పుడు సీనియర్లను పక్కనపెట్టేసి రమేష్‌బాబును నియమించడంలో ఔచిత్యమేమిటో అర్థం కాక సంబంధిత శాఖలో తలలుపట్టుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 339 ప్రకారం చూసుకుంటే అసిస్టెంట్ కమిషనర్ నుంచి డిప్యుటీ కమిషనర్‌గా పదోన్నతి ఇవ్వాలంటే 13 జిల్లాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ల సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి. నిబంధనలూ బుట్టదాఖలే... సీనియారిటీ పక్కనబెట్టేయడం మాట అటుంచి గెజిటెడ్ పోస్టుల భర్తీలో సొంత జిల్లాల వారిని నియమించకూడదనే నిబంధనను కూడా బుట్టదాఖలు చేశారు. ఆమాత్యుని అండదండలుంటే చాలు నిబంధనలు వర్తించవా అని ఆ శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే డిప్యుటీ కమిషనర్ పోస్టు కోసం కోటి రూపాయలకుపైనే డీల్ కుదిరి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచనలమైంది. అప్పట్లో లోవ దేవస్థానం ఈఓ గాది సూరిబాబు రాజు ఈ పోస్టింగ్ కోసం ఒక మంత్రి సోదరుడు ద్వారా కోటికి బేరం కుదుర్చుకుని అరకోటి అడ్వాన్సుగా సమర్పించుకున్నాడు. అడ్వాన్సు తీసుకున్న ఆ అమాత్యుని ’తమ్ముడు’ ప్రయత్నించినా చివరకు విశాఖ కనక మహాలక్ష్మి ఈఓగా పనిచేస్తున్న భ్రమరాంబ (ప్రస్తుతం శ్రీకాళహస్తి ఈఓ)కు సీనియార్టీ ప్రాతిపదికన నియమించారు. అనంతరం ఆ తెలుగు తమ్ముడు తీసుకున్న అరకోటి అడ్వాన్సు తిరిగి ఇవ్వకపోవడం, అనారోగ్యం, మానసిక ఆందోళనతో ఈఓ సూరిబాబు రాజు మృతి చెందారు. అంతటి డిమాండ్ ఉన్న ఈ పోస్టుకు నిబంధనలు తుంగలోకి తొక్కి ఎఫ్ఏసీగా నియమించారంటే అసలు ఏమి జరగకుండా ఉండి ఉంటుందా అని ఆ శాఖలోనే పలువురు ప్రశ్నిస్తున్నారు. అమాత్యుడి ఆశీర్వాదం... ఈ పోస్టు భర్తీ చేసేటప్పుడు ఆ శాఖలో ఏసీలుగా పనిచేస్తున్న వారిలో సీనియర్లను పరిగణనలోకి తీసుకోవాలనేది నిబంధన. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా దేవాదాయశాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అండదండలు దండిగా ఉండటంతో సీనియార్టీని బుట్టదాఖలుచేసి రమేష్‌బాబును అడ్డగోలుగా అందలమెక్కించారనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇది జరిగి నెల రోజులు దాటిపోయింది. ఇన్ని రోజులుగా ఆ శాఖలో పెద్దగా చర్చకు రాని డీసీ నియామకంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దేవాలయాల హుండీల్లో పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఈ అంశం కూడా తెర మీదకు వచ్చింది. -
ముగిసిన వార్డెన్ల కౌన్సెలింగ్
– 19 మందికి పోస్టింగ్‌లు కర్నూలు(అర్బన్): సాంఘిక సంక్షేమశాఖలో నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న 19 మంది వసతి గృహ సంక్షేమాధికారులకు ఎట్టకేలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. శనివారం ఉదయం సంక్షేమభవన్‌లోని డీడీ చాంబర్లో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు. ప్రసాదరావు, బీసీ సంక్షేమాధికారి డి. హుసేన్‌సాహెబ్ ఆధ్వర్యంలో వసతి గృహ సంక్షేమాధికారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అంతుకు ముందు జరిగిన సమావేశంలో డీడీ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు తమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ప్రీ మెట్రిక్, కళాశాల వసతి గృహాలతో పాటు, బీసీ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న వసతి గృహాలకు పోస్టింగ్‌లు ఇస్తున్నామన్నారు. ఖాళీలన్నింటిని ముందుగానే తెలియజేశామని, సంబంధిత వార్డెన్లు తమకు ఇష్టమున్న హాస్టళ్లను ఎంపిక చేసుకొని ఇచ్చిన ప్రొఫార్మలో ఆప్షన్లు ఇవ్వాలన్నారు. ఇచ్చిన ఆప్షన్ల మేరకు ఉద్యోగంలో చేరిన తేదీ ఆధారంగా హాస్టళ్లను కేటాయిస్తామన్నారు. కౌన్సెలింగ్ నిర్వహించిన జాబితాను జిల్లా కలెక్టర్‌కు ఆమోదం కోసం పంపుతామన్నారు. తుది నిర్ణయం కలెక్టర్ తీసుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌డబ్ల్యూఓ ప్రకాష్‌రాజు, ఎస్సీ హెచ్‌డబ్ల్యూఓస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరామచంద్రుడు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జెడ్ దొరస్వామి, కే బాబు, కోశాధికారి రాముడు తదితరులు పాల్గొన్నారు. -
ఐబీ ఈఈకి మళ్లీ పోస్టింగ్
గోపాలరావుపై సస్పెన్షన్ ఎత్తివేత వరంగల్ : చిన్న నీటిపారుదల శాఖ ములుగు ఈఈ గోపాలరావుపై విధించిన సస్పెన్షన్ ను ప్రభుత్వం ఎత్తివేసింది. పెండింగ్ విచారణ పేరిట ఆయనకు మళ్లీ ములుగు ఈఈగా పోస్టింగ్ ఇచ్చారు. ఈనెల 30వ తేదీన గోపాలరావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాత్కాలికంగా సస్పెన్షన్ ఉత్తర్వులను నిలిపివేసింది. మిషన్ కాకతీయ కార్యక్రమంలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ మొదటి విడత పనుల్లో అక్రమాలకు బాధ్యులుగా నిర్ధారించి గోపాలరావుతో పాటు అప్పటి పరకాల డీఈఈ బి.వెంకటేశ్వర్లు (ఏటూరునాగారం డీఈఈగా పనిచేస్తున్నారు), ఏఈఈ శరత్‌బాబు, ఈ పనుల నాణ్యతను ధ్రువీకరించిన క్యూసీ డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈఈ తిరుపతిరావులను ఈనెల 1న ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందుతున్నందున తనకు సస్పెన్షన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈఈ గోపాలరావు పెట్టుకున్న వినతితో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా గోపాలరావుతో పాటు సస్పెన్షన్ కు గురైన మిగిలిన వారికి ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. రీ పోస్టింగ్ పొందిన గోపాలరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించినట్లు సర్కిల్ కార్యాలయవర్గాలు తెలిపాయి. -
పోస్టింగ్ ఇవ్వలేదని.. ట్రైనీ ఎస్సై ఆత్మహత్య
⇒ 2015 బ్యాచ్‌కు ఎంపికైన కిరణ్ ⇒ 18 నెలల పాటు శిక్షణ మధ్యలో గాయం కారణంగా 25 రోజులు విరామం ⇒ దాంతో తుది పరీక్షలు నిర్వహించని అధికారులు ⇒ ఆయనతో పాటు శిక్షణ తీసుకున్న మిగతా వారికి పోస్టింగ్ ⇒ ఆవేదనతో తన ఇంట్లో ఉరి వేసుకున్న కిరణ్ ⇒ డెరైక్టర్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ మిర్యాలగూడ: శిక్షణ పూర్తయినా తనకు పోస్టింగ్ ఇవ్వలేదని ఓ ట్రైనీ ఎస్సై మనస్తాపం చెందారు. శిక్షణ సమయంలో గాయమై విశ్రాంతి తీసుకున్న కారణంగా తనను పక్కన పెట్టవద్దంటూ అధికారుల చుట్టూ తిరిగారు. ఫలితం లేకపోవడంతో తీవ్రంగా ఆవేదనకు లోనై బలవన్మరణానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం ఈ ఘటన జరిగింది. మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీకి చెందిన తమ్మడబోయిన మణెమ్మ కుమారుడు కిరణ్ (28). ఆయన 2015లో ఎస్సై ఉద్యోగ అర్హత పరీక్షలో విజయం సాధించి, శిక్షణకు ఎంపికయ్యారు. దాదాపు 18 నెలలుగా హైదరాబాద్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. అయితే శిక్షణ సమయంలో బాత్రూంలో సింక్ పగిలి గుచ్చుకోవడంతో కాలికి గాయమైంది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా.. గాయం తగ్గకపోవడంతో స్వగ్రామం మిర్యాలగూడకు వెళ్లి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. గాయం మానిపోయాక వైద్యుల నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకొచ్చి.. పోలీస్ అకాడమీ డెరైక్టర్‌కు అందించి తిరిగి శిక్షణలో చేరారు. శిక్షణ పూర్తికాకపోవడంతో.. అయితే కిరణ్‌తోపాటు శిక్షణ పొందుతున్న అందరికీ తుది పరీక్షలు నిర్వహించి, పోస్టింగ్ ఇచ్చారు. కిరణ్‌కు మాత్రం శిక్షణలో 25 రోజుల విరామం రావడంతో తుది పరీక్షలు నిర్వహించలేదు. తుది పరీక్ష నిర్వహించి, పోస్టింగ్ ఇవ్వాలంటూ కిరణ్ కొంత కాలంగా ఉన్నతాధికారుల చుట్టూ తిరిగారు. కానీ మరో బ్యాచ్‌తో కలిపి పరీక్ష పెడతామని వారు స్పష్టం చేయడంతో తీవ్రంగా మనస్తాపానికి గురయ్యూరు. తిరిగి స్వగ్రామానికి వెళ్లినా ఆవేదనలో మునిగిపోయారు. బుధవారం రాత్రి తన గదిలోని ఫ్యాన్‌కు విద్యుత్ వైర్లతో ఉరి వేసుకున్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు తలుపుకొట్టినా స్పందన రాకపోవడంతో.. కిటికీ నుంచి చూసి, ఉరివేసుకున్నట్లుగా గుర్తించారు. కిరణ్‌కు ఏడాదిన్నర క్రితమే సూర్యాపేటకు చెందిన కల్యాణితో వివాహం జరిగింది. వీరికి ఐదు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే పోలీస్ అకాడమీ డెరైక్టర్ ఈష్‌కుమార్ వేధింపుల కారణంగానే కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చిన కిరణ్.. డెరైక్టర్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తరచూ ఆందోళన చెందేవాడని చెబుతున్నారు. పోలీసు అకాడమీ డెరైక్టర్ వేధింపుల కారణంగా కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆయన సోదరుడు అర్జున్ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. -
‘పనిష్మెంట్’ అధికారికి.. ప్రమోషనా?
ఇదేం పని మంత్రి గారూ! చీరాల ఆస్పత్రి సందర్శనలో సూపరింటెండెంట్ పనితీరుపై ఆగ్రహం ఆయన్ని తొలగించాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఆచరణలో రాజధాని జిల్లాకు డీసీహెచ్‌గా నియామకం మంత్రి తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు సాక్షి, గుంటూరు : ‘ఆస్పత్రి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు.. సూపరింటెండెంట్ అయ్యుండీ కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు.. ఆయనే ప్రైవేటు ప్రాక్టీసు చేసుకుంటున్నారు.. ప్రభుత్వ ఆస్పత్రిని ప్రైవేటుపరం చేస్తున్నారు.. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది.. ఇలాగైతే ఆస్పత్రిని మూసేయాల్సిందే..’ అంటూ ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చీరాల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్‌పై సాక్షాత్తూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు సమక్షంలోనే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన్ని ఇక్కడ నుంచి తొలగించాలంటూ మంత్రిని కోరారు. 20 రోజుల క్రితం మంత్రి కామినేని చీరాల ఏరియా ఆస్పత్రిని పరిశీలించేందుకు వెళ్లినప్పుడు ఆయన ఎదుట జరిగిన తతంగమిది. దీనిపై ఆరోజు తీవ్ర స్థాయిలో స్పందించిన మంత్రి సూపరింటెండెంట్‌ను తొలగించాలంటూ వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ మూడు రోజుల క్రితం గుంటూరు జిల్లా వైద్య విధాన పరిషత్ కో– ఆర్డినేటర్‌గా ఆయనకు పోస్టింగ్ ఇచ్చేశారు. మంత్రి ఆగ్రహానికి గురైన డాక్టర్ ప్రసన్నకుమార్‌కు పనిషె్మంట్ ఇస్తారని అందరూ భావిస్తే అందుకు భిన్నంగా ఆయనకు పదోన్నతి కల్పించి రాజధాని జిల్లాకు పంపడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ గుంటూరు జిల్లా కో–ఆర్డినేటర్(డీసీహెచ్)గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీదేవి పనితీరు సరిగా లేదంటూ డీఆర్సీ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తడంతో ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ పనిషె్మంట్ ఇచ్చారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. రెండు రోజుల క్రితం ఈ పోస్టులో చీరాల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ ప్రసన్నకుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అధికార ‡పార్టీ నేతలు డాక్టర్ శ్రీదేవి విషయంలో ఒకలా.. డాక్టర్ ప్రసన్నకుమార్ విషయంలో మరోలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఏరియా ఆస్పత్రికి సూపరింటెండెంట్‌గా పనికిరాని వ్యక్తిని రాజధాని జిల్లా అయిన గుంటూరులో వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండే ఆసుపత్రులన్నింటి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించే డీసీహెచ్ పోస్టు కేటాయించడం దారుణమని పేర్కొంటున్నారు. గుంటూరు జిల్లాలో తెనాలి జిల్లా ఆస్పత్రితోపాటు నర్సరావుపేట, బాపట్ల ఏరియా ఆస్పత్రులు, ఇటీవల కాలంలో కలిసిన క్లస్టర్లతో కలిపి 19కి చేరాయి. దీంతో గతంలో కంటే డీసీహెచ్కి బాధ్యతలు మరింత పెరిగాయి. ఇంతటి బాధ్యతాయుతమైన పోస్టులో ఆరోపణలపై తొలగించాలని ఆదేశించిన వ్యక్తిని నియమించడం చూస్తుంటే ఏ స్థాయిలో పైరవీలు నడిచాయో అర్థం చేసుకోవచ్చని ఆ శాఖలో చర్చ జరుగుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన బీజేపీ నేతల ఒత్తిడితోనే డాక్టర్ ప్రసన్నకుమార్‌కు పనిషె్మంట్ ఇవ్వకుండా పదోన్నతి కల్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఎంఈ పరిధిలోనూ అదే తీరు... కేవలం ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) కమిషనర్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులపైనే కాకుండా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలోని పలువురు వైద్యుల విషయంలోనూ ఇదే విధమైన ప్రేమ చూపుతున్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా అర్హత ఉన్నవారిని నియమించకుండా తమ సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావు ప్రిన్సిపాల్‌గా అనర్హుడని భారత వైద్య మండలి (ఎంసీఐ) తేల్చి చెప్పింది. అనుమతి లేకుండా ప్రైవేట్ ప్రాక్టీసు చేస్తున్నట్లు నిర్ధారించి ఇటీవల ఆయనకు మూడు ఇంక్రిమెంట్లు కూడా కట్ చేశారు. అయినా ఇప్పటికీ ఆయన్నే కొనసాగిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్ పోస్టు సైతం ఆ సామాజిక వర్గానికి చెందినవారికే ఇచ్చేశారు. మూడు ఇంక్రిమెంట్లు కట్ చేసి పనిషె్మంట్ ఇచ్చిన తరువాత కూడా సూపరింటెండెంట్‌గా నియామక ఉత్తర్వులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. -
ఆ కుర్చీకి యమక్రేజ్
తిరుపతిలో పోస్టల్ ఎస్పీ కుర్చీ కోసం పోటాపోటీ! తీవ్రంగా పోటీ పడుతున్న ముగ్గురు ఎస్పీలు తిరుపతిలోని తపాలాశాఖ సూపరింటెండెంట్ (పోస్టల్ ఎస్పీ) పోస్టుకు యమక్రేజ్ నెలకొంది. మొదలే ఆధ్యాత్మిక నగరం.. రాజకీయాలూ తక్కువే..అబ్బో..! ప్రశాంతంగా పనిచేసుకోవచ్చన్న ఉద్దేశంతో.. ఈ కుర్చీ దక్కించుకునేందుకు ముగ్గురు ఎస్పీలు తీవ్రంగా పోటీపడుతున్నట్టు సమాచారం. తిరుపతి అర్బన్ : తిరుపతి తపాలా డివిజన్‌కు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న టీఏ.వెంకటశర్మను వారం రోజుల క్రితం ఒంగోలుకు బదిలీ చేశారు. ప్రస్తుత ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈ కుర్చీ దక్కించుకునేందుకు ఇతర జిల్లాల్లోని సూపరింటెండెంట్లు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఎలాగైనా తిరుపతిలో పోస్టింగ్ వేయించుకునేందుకు విభిన్న లాబీయింగ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో అనంతపురం పోస్టల్ ఎస్పీ శ్రీనివాస్, కాకినాడ పోస్టల్ ఎస్పీ శ్రీకుమార్‌తో పాటు నాలుగేళ్ల క్రితం సస్పెండ్ అయి ప్రస్తుతం పోస్టింగ్ పొందిన మరో సూపరింటెండెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా రీజనల్ కేంద్రమైన కర్నూలు, ఉమ్మడి సర్కిల్ కేంద్రమైన హైదరాబాద్‌లో ముగ్గురు అధికారులు తమదైన ప్రయత్నాలను ప్రారంభించినట్టు సమాచారం. ఇటీవల హైదరాబాద్ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్‌గా పనిచేసి ఢిల్లీకి బదిలీ అయిన మరో ఉన్నతాధికారి సిఫార్సుతో తిరుపతి కుర్చీని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాక ఢిల్లీస్థాయి ఉన్నతాధికారి సహాయంతో ఇప్పటికే ఇద్దరు సూపరింటెండెంట్లు కేంద్ర సమాచారశాఖ కార్యదర్శిని సంప్రదించి తమ వినతులను అందజేసినట్టు సమాచారం. ఓ వైపు తపాలా శాఖలోని ఢిల్లీస్థాయి అత్యున్నతాధికారుల ప్రసన్నంతో పాటు మరోవైపు ఎవరి స్థాయిలో వారు ముడుపులు చెల్లించి తిరుపతిలో పోస్టింగ్ వేయించుకునేందుకు సన్నాహాలు ప్రారంభించినట్టు పోస్టల్ వర్గాల భోగట్టా. ఇందులో సుమారు రూ.25 లక్షల వరకైనా ముడుపులు చెల్లించి తిరుపతి ఎస్పీ కుర్చీని దక్కించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. దీంతోపాటు రెండు ప్రధాన పార్టీల మంత్రులతో కూడా సిఫార్సు చేయించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ముగ్గురూ పాతవారే తిరుపతి పోస్టల్ ఎస్పీ కుర్చీ కోసం పోటీపడుతున్న ముగ్గురు సూపరింటెండెంట్లు తిరుపతి డివిజన్ కార్యాలయానికి పాతవారే. ఇద్దరు ఏఎస్పీలుగా పనిచేసి పదోన్నతిపై అనంతపురం, కాకినాడకు వెళ్లగా మరో అధికారి తిరుపతిలోనే సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ ఫిర్యాదులపై సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత నాలుగేళ్ల నుంచి రెండు సార్లు ఇన్చార్జి సూపరింటెండెంట్లు, తాజాగా ఒంగోలుకు బదిలీ అయిన సూపరింటెండెంట్ రెండున్నరేళ్లు ఎస్పీగా పనిచేశారు. వారు ముగ్గురూ ఆయా కేంద్రాల్లో పనిచేస్తూ తిరుపతిపై కన్నేసి ఉంచారు. అయితే వారి నిరీక్షణ తాజా ఎస్పీ బదిలీతో కొంతమేరకు ఫలించినట్లవుతోంది. -
ఫేస్బుక్లో పోస్ట్ చేయకూడనివి తెలుసా..
సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్లో ఏవి పడితే అవి పోస్ట్ చేయకూడదని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అవి పోస్ట్ చేసిన వాళ్లకు ఇబ్బందులు తీసుకొస్తాయంట. అలా పోస్ట్ చేయకూడని కొన్ని అంశాల గురించి వారు ప్రత్యేకంగా చెప్పారు. అవేమిటో ఒకసారి పరిశీలిస్తే.. బ్యాంక్ వివరాలు.. డబ్బు పంపించేందుకు బ్యాంకు ఖాతా వివరాలు అవసరం ఉంటుంది. కొంతమంది విద్యార్థులు ఈ మధ్య ఆ వివరాలను ఫేస్ బుక్ లో చాటింగ్ సమయాల్లో పోస్ట్ చేస్తున్నారంట. అలాంటి తప్పు ఎప్పుడూ చేయొద్దని వారు ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు. విన్నింగ్ టికెట్స్ ఆస్ట్రేలియాలో ఓ మహిళ తను గెలిచిన లాటరీ టికెట్ అని సంతోషాన్ని ఆపుకోలేక ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. పెద్ద ఎత్తున పార్టీ కూడా చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ టికెట్ ను కొందరు వ్యక్తులు మార్ఫింగ్ చేసి ఆమెకు తెలిసిన వారిలో కొందరు ఆ నగదు కొట్టేశారు. ఇంటి చిరునామా కొంతమంది ఇంటి చిరునామాను కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారంట. దీనివల్ల దొంగలకు తలుపులు బార్లా తెరిచినట్లే అవుతుందని అలాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. పాస్ పోర్ట్ కూడా.. చాలామంది వ్యక్తులు తమ పాస్ట్ పోర్టు నెంబర్ కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నారని ఇది చాలా డేంజర్ అని అంటున్నారు. పిల్లల వివరాలు, ఫొటోలు చిన్నారుల వివరాలను కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం అంతమంచిది కాదని అంటున్నారు. పిల్లల ఫొటోలు పోస్ట్ చేసినప్పుడు వాటికి లైక్స్ రావడమేమోగానీ.. అందులో కొంతమంది నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తారంట. అది చూసి మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉందని.. అలాంటివి అస్సలు పోస్ట్ చేయకూడదని అంటున్నారు. బాస్‌కు ఫిర్యాదు ఒక ఉద్యోగి తన సంస్థకు, యజమానికి సంబంధించిన ఫిర్యాదులు ఎట్టి పరిస్థితుల్లో ఫేస్బుక్ లో పోస్ట్ చేయొద్దంట. అలా చేయడం వల్ల ఆ ఉద్యోగికి భవిష్యత్తులో కూడా సమస్యలు వస్తాయంట. అలాగే, ఫేస్ బుక్ ద్వారా ప్రైవేట్ సంభాషణ ఎప్పుడూ చేయొద్దంట. కాపీ అండ్ పేస్ట్ స్టేటస్ ఫేస్ బుక్‌లో కాపీ పేస్ట్ చేయొద్దని చెప్తున్నారు. అలా చేయడం వల్ల తమ కంటెంట్ దొంగిలించారని దానికి సంబంధించిన వ్యక్తులు కేసులు పెట్టే ప్రమాదం కూడా లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు. -
పంచాయతీ కార్యదర్శులకు స్థానచలనం
పదోన్నతులు పొందిన 34 మందికి పోస్టింగ్‌లు కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిచేసిన యంత్రాంగం రంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని అపార్డ్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ధర్మారెడ్డి, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, డీపీఓ అరుణతో కూడిన కమిటీ కార్యదర్శుల బదిలీల క్రతువు పూర్తి చేసింది. మూడేళ్ల పైబడిన 267 మందికి స్థానచలనం కలిగించాలని నిర్ణయించి.. జాబితా రూపొందించారు. దీంట్లో ఆరుగురు కౌన్సెలింగ్‌కు గైర్హాజరు కావడంతో 261 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. అలాగే నాలుగో గ్రేడ్ నుంచి మూడో గ్రేడ్‌కు పదోన్నతి పొందిన 34 మందికి నియామకపు ఉత్తర్వులిచ్చారు. -
బదిలీయా.. బహుమానమా?!
విజయనగరం కలెక్టర్ గిరీపై వుడా వీసీ ఆశలు మొదట లూప్‌లైనులోకి.. అక్కడి నుంచి ఆ పోస్టుకు! విశాఖపట్నం : ఎన్ఎండీసీ భూ వివాదం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం వుడా వైస్ చైర్మన్ టి.బాబూరావునాయుడుపై వ్యూహాత్మంగా వేటు వేస్తుందా?.. లేక చినబాబు ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేసినందుకు బహుమానంగా పదోన్నతి కల్పిస్తుందా??... వుడా, రెవెన్యూ అధికార వర్గాల్లో ఇప్పుడు ఇదే విషయమై జోరుగా చర్చ సాగుతోంది. ఎన్ఎండీసీ భూమిని వెనక్కి తీసుకుంటూ అడ్డగోలుగా ఉత్తర్వులు జారీ చేసి.. ఖనిజాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారుల నుంచి అవమానాలను సైతం ఎదుర్కొన్నందుకు ప్రతిఫలంగా బాబూరావునాయుడు చిరకాల కోరికను ప్రభుత్వ పెద్దలు నెరవేరుస్తారన్న అభిప్రాయమే గట్టిగా వినిపిస్తోంది. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా పని చేయాలన్నది ఆయన ఆశ అని.. ఇటీవల ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో ఆగిందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ జిల్లాకు కలెక్టర్‌గా నియమిస్తారన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో మంచి పోస్టింగ్ ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని, అందువల్ల కొన్నాళ్లు లూప్లైన్లో పెట్టే యోచనలోనే సర్కారు ఉందన్న వాదనలూ ఉన్నాయి. మొత్తంగా బాబూరావునాయుడును వుడా వీసీ పోస్టు నుంచి తప్పిస్తారన్న ప్రచారం మాత్రం జోరందుకుంది. -
మహిళలే ఎక్కువ 'ఆ పదాలు' వాడుతున్నారు!
లండన్ః సాంకేతిక విప్లవంలో భాగంగా స్మార్ట్ ఫోన్ల తయారీ భారీగా పెరిగిపోయింది. దీంతో పాటే ఇంటర్నెట్ సౌకర్యంకూడ అందుబాటులోకి రావడంతో సామాజిక మాధ్యమాల వాడకం కూడ ఎక్కువై పోయింది. తమ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించేందుకు, ప్రజలతో పంచుకునేందుకు ఆయుధంగా సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగించుకుంటున్నారు. అయితే ఆయా మాధ్యమాల్లో ఎక్కువగా సెక్స్ సంబంధిత పదాలను, బూతు పదాలను మగవారే ఎక్కువగా పోస్ట్ చేస్తారన్నఅభిప్రాయాన్ని పరిశోధకులు కొట్టి పారేశారు. బ్రిటిష్ ట్విట్టర్ యూజర్లపై పరిశోధనలు జరిపిన అధ్యయన కారులు ట్విట్టర్లో సెక్స్ పదాలను ఎక్కువగా మహిళలే పోస్టు చేస్తున్నట్లు కనుగొన్నారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్ యూజర్లపై బ్రిటిష్ థింక్ ట్యాంక్ బృందం అధ్యయనాలు నిర్వహించింది. ముఖ్యంగా ట్విట్టర్ లో స్త్రీలపై ద్వేషం, దుర్వినియోగం వంటి విషయాలను విశ్లేషించింది. మగవారితో పాటు మహిళలు కూడ అభ్యంతరకర, సెక్స్ సంబంధిత పదాలు వాడుతున్నారని, అందులో మహిళలే ఎక్కువగా సెక్స్ పదాలు పోస్ట్ చేస్తున్నారని బ్రిటిష్ థింక్ ట్యాంక్ బృందం తెలుసుకుంది. మూడు వారాలపాటు వినియోగదారులపై జరిపిన అధ్యయనాల ద్వారా ఈ సరికొత్త విషయాలను కనుగొన్నారు. ట్విట్టర్ లో పోస్టు చేసిన సుమారు 2,00,000 ట్వీట్స్ లో ఒకేరకమైన పదాలను దాదాపు ఒకే సమయంలో 80,000 వేల మంది వాడినట్లు పరిశోధకులు కనుగొన్నారు. మొత్తం 6500 ట్విట్టర్ వినియోగదారులు సెక్సియెస్ట్ ట్వీట్టే లక్ష్యంగా 10,000 వరకు ట్వీట్లు చేసినట్లు గుర్తించారు. సామాజిక నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ కూడ సెక్సియస్ట్ పదాల వాడకంతోపాటు, జాత్యాహంకరం, దుర్వినియోగం వంటి విమర్శలను ఎదుర్కొంది. ఇటీవల ఓ బికినీ ధరించిన మోడల్ శరీర భాగాలను ప్రదర్శించే ప్రకటనను చూపించి క్షమాపణలు చెప్పుకుంది. -
కొత్త ఇంజినీర్లు వచ్చేశారు..
మైనర్ ఇరిగేషన్ శాఖలో 19 మందికి పోస్టింగ్ బాధ్యతల స్వీకరణ మిషన్ కాకతీయ పనుల పర్యవేక్షణకు దోహదం వరంగల్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారా ఎంపికైన 124 మంది ఇంజినీర్లకు మైనర్ ఇరిగేషన్(చిన్న నీటిపారుదల) శాఖలో పోస్టింగ్‌లు ఇచ్చారు. కాగా, వీరిలో 19 మందిని జిల్లాకు కేటాయించారు. పోస్టింగ్ పొందిన వారంతా సోమవారం హన్మకొండలోని సర్కిల్ కార్యాలయంలో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. అనంతరం ఎస్ఈ శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ మైనర్ ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో ఇంజినీరింగ్ కేడర్‌లో 77 మంది ఉండాలి. 58 పోస్టుల్లో ఏఈలు విధులు నిర్వర్తిస్తుండగా, మరో 19 పోస్టుల్లో ఇప్పటిదాకా పదవీ విరమణ పొందిన అసిస్టెంట్ ఇంజినీర్ల సేవలను టెక్నికల్ కన్సల్టెంట్ల పేరిట ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వినియోగించుకునేవారు. తాజాగా 19 మంది ఇంజినీర్ల నియూమకంతో ఇంజినీరింగ్ కేడర్‌లో పూర్తిస్థారుు భర్తీలు జరిగినట్లవుతుంది. మిషన్ కాకతీయ పనుల దృష్ట్యా ఇప్పటిదాకా ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న టెక్నికల్ కన్సల్టెంట్ల సేవలనూ వినియోగించుకోనున్నారు. పోస్టింగ్ లేక ఖాళీగా.. ఎస్ఆర్ఎస్పీ డీఈఈలు మిషన్ కాకతీయ తొలి విడత పనుల సందర్భంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన డీఈఈలు పోస్టింగ్ లేక ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే ప్రాజెక్టు నుంచి వచ్చిన 24 మంది ఏఈఈలకు మాత్రం మండలాల్లో పోస్టింగ్ ఇచ్చారు. డీఈఈ పోస్టులు ఖాళీగా లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. రెగ్యులర్ డీఈఈల బదిలీ, పదవీ విరమణ జరిగితే తప్ప డిప్యూటేషన్‌పై వచ్చే వారికి పోస్టింగ్‌లు రావని పేర్కొంటున్నారు. వందలాది చెరువుల మరమ్మతుకు.. మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా ఒకేసారి వందలాది చెరువుల మరమ్మతులు చేపట్టడంతో పనుల పర్యవేక్షణకు తగిన సంఖ్యలో సిబ్బంది అందుబాటులో లేరు. ఒక్కో మండలంలో 15 నుంచి 30 చెరువులు మంజూరవడంతో ఇంజినీర్ల పర్యవేక్షణ లేక పనులు కుంటుపడుతున్నారుు. దీంతో మిషన్ కాకతీయ తొలివిడత పనుల సందర్భంగా గతేడాది ఎస్సారెస్పీ-1 నుంచి 27 మంది ఇంజినీర్లను మైనర్ ఇరిగేషన్ శాఖకు డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. వీరికి సహాయకులుగా ఉండేందుకు గృహ నిర్మాణ శాఖకు చెందిన 42 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను మైనర్ ఇరిగేషన్ విభాగానికి డిప్యూటేషన్‌పై కలెక్టర్ కేటాయించారు. మిషన్ కాకతీయ రెండో విడతలో టెండర్ల నిర్వహణలో జాప్యం జరగడంతో పనులు వేగవంతం చేసేందుకు 14 మంది కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించారు. అంతేకాకుండా మండలాల్లోని ఏఈలకు మూడు నెలల పాటు వాహన సౌకర్యం కల్పించారు. మిషన్ కాకతీయ పనులను వేగవంతం చేసేందుకే ఈ చర్యలు చేపట్టారు. -
మార్కెట్ ‘కార్యదర్శుల’ బదిలీలు
♦ ఇతర జిల్లాలకు పోస్టింగ్‌లు ♦ పలువురికి పదోన్నతులు.. ♦ కొత్త కార్యదర్శుల నియామకం తాండూరు: జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులకు స్థానచలనం కలిగింది. రెండు రోజుల క్రితం కార్యదర్శులను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో మార్కెట్ కమిటీలకు కొత్త పాలకమండళ్లు కొలువుదీరనున్న నేపథ్యంలో కార్యదర్శులు బదిలీ కావడం గమనార్హం. బదిలీ అయిన వారి స్థానంలో కొత్త కార్యదర్శుల నియామకం కూడా వెంటనే ఉన్నతాధికారులు పూర్తి చేశారు. దీర్ఘకాలికంగా ఒకేచోట పని చేయడంతో బదిలీ చేశారు. ఇక పలు మార్కెట్లలో ఖాళీగా పోస్టులను భర్తీ చేశారు. పలువురు కార్యదర్శులకు పదోన్నతులు కల్పించారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా పనిచేసిన వెంకట్‌రెడ్డిని కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు ఇటీవల బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇబ్రహీంపట్నం గ్రేడ్-2 కార్యదర్శి ఏ.చంద్రశేఖర్‌కు ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ తాండూరుకు బదిలీ చేశారు. ఇక తాండూరులో మూడోశ్రేణి కార్యదర్శిగా పని చేస్తున్న కే.సురేందర్‌రెడ్డికి రెండో శ్రేణి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ నల్గొండ జిల్లా చండూరు మార్కెట్ కమిటీకి బదిలీ చేశారు. రెండేళ్లుగా తాండూరులో ఖాళీగా ఉన్న సహాయ కార్యదర్శి పోస్టును అధికారులు భర్తీ చేశారు. నల్గొండ జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీలో సూపర్వైజర్గా కొనసాగుతున్న వహిద్‌ను పదోన్నతిపై తాండూరు సహాయ కార్యదర్శిగా నియామకం చేశారు. వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఏ.శ్రీనివాస్ మూడు నెలల క్రితం మెదక్ జిల్లా సిద్దిపేటకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా నారాయణపేట్ మార్కెట్ కమిటీ నుంచి ఎం.శ్రీనివాస్‌ను నియమించారు. మర్పల్లి కార్యదర్శి వీరభద్రయ్య ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో మెదక్ జిల్లా జహీరాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి నాగేశ్వర్రావును నియామకం చేశారు. మర్పల్లి ఇన్చార్జి కార్యదర్శిగా కొనసాగుతున్న శంకర్పల్లి మార్కెట్ కమిటీ కార్యదర్శి మల్లేశంను మెదక్ జిల్లా చేగుంటకు, శంకర్‌పల్లికి మెదక్ జిల్లా నర్సాపూర్ కార్యదర్శి వెంకటయ్య బదిలీ చేస్తూ మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తాండూరు ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా నియామకం అయిన ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ కార్యదర్శి ఏ.చంద్రశేఖర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన తాండూరు మార్కెట్ కమిటీని సందర్శించారు. స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. చండూరుకు బదిలీ అయిన సురేందర్‌రెడ్డి స్థానంలో మాత్రం అధికారులు ఎవరికీ పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. -
రామ హరే.. సరెండరే!
♦ అనుకున్నది చేయడమే ఆయన తత్వం ♦ ఉన్నతాధికారులకు మింగుడుపడని వైనం ♦ కొన్ని నెలలుగా ఖాళీగానే.. పోస్టింగ్ యత్నాలు విఫలం ♦ ఇదీ జిల్లాలోని ఓ తహసీల్దార్ కథ విధి నిర్వహణలో ఆయన శైలే వేరు.. అనుకున్నది చేస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాలకూ వెరవరు. ఈ క్రమంలో విధి నిర్వహణకు దూరమైనా పట్టువదలని విక్రమార్కుడిలా తిరిగి పోస్టింగ్‌కు ప్రయత్నిస్తారు. తాను చేస్తున్నదే నిజమని నమ్ముతారు. దీంతో ఉన్నతాధికారులు ఆయనను విధులకు దూరంగా ఉంచారు. కొన్ని నెలలుగా సెలవుల్లోనే కొనసాగుతున్నారు. ఇటీవల తిరిగి విధుల్లో చేరారు. తనకు పోస్టింగ్ ఇవ్వమని విన్నవించుకున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి తనకు పనయినా అప్పగించండి.. లేదా ప్రభుత్వానికైనా సరెండర్ చేయమని కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. అడిగిందే తడవుగా కలెక్టర్ ఆయనను సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది జిల్లాలోని ఓ తహసీల్దార్ వింత కథ. విచిత్ర మలుపులు తిరిగిన ఈ కథ ఏమిటో మీరే చదవండి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రామ హరిప్రసాద్.. గతంలో దోమ, ధారూర్, పెద్దేముల్ మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేశారు. పెద్దేముల్లో పనిచేస్తున్నప్పుడు ఓ కేసులో సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ విధుల్లో చేరిన హరిప్రసాద్‌ను ప్రభుత్వ భూముల పరిరక్షణ విభాగంలో తహసీల్దార్‌గా నియమించారు. కొంతకాలం సజావుగానే పనిచేసిన ఆయన ఉన్నతాధికారులకు కొరకరానికొయ్యగా మారారు. ఒక ఫైల్ విషయంలో సరిగా స్పందించలేదని భావించిన ఉన్నతాధికారులు ఆయనపై కన్నెర్ర జేశారు. ఈసారి ఆయనను కేఆర్సీలో తహసీల్దార్‌గా నియమించారు. దీంతో అసంతృప్తికి లోనైన హరిప్రసాద్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇటీవల మళ్లీ రిపోర్టు చేసిన ఆయన.. తాజాగా జరిగిన తహసీల్దార్ల బదిలీల్లో పోస్టింగ్ లభిస్తుందని ఆశించారు. అయితే, హరిప్రసాద్ వర్కింగ్ స్టైల్ తెలిసిన ఉన్నతాధికారులు పోస్టింగ్‌లలో ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆఖరికి నల్లగొండ జిల్లాకైనా పంపమని అభ్యర్థించారు. ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇక లాభంలేదని భావించిన హరిప్రసాద్ తనకు పనయినా అప్పగించండి.. ప్రభుత్వానికైనా సరెండర్ చేయమని వేడుకుంటూ కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. అతడు అడిగిన మరుక్షణమే సరెండర్ చేస్తూ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. సాధారణంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, క్రమశిక్షణారహిత్యానికి పాల్పడినట్లు గుర్తించిన సమయంలోనే ఉద్యోగులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తారు. ఈ తహసీల్దార్ మాత్రం తదుపరి పోస్టింగ్ కోసం ప్రభుత్వానికి అప్పగించమని లేఖ రాయడం జిల్లా యంత్రాంగాన్ని సైతం ఆశ్చర్యపరచింది. -
ఇక భార్యాభర్తలకు ఒకచోట పోస్టింగ్!
హైదరాబాద్ : రాష్ట్రంలో భార్య ఒకచోట.. భర్త ఒకచోట పని చేసే ఉద్యోగస్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుంది. ఉద్యోగులైన భార్యాభర్తల బదిలీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీఎన్జీవోల నుంచి విజ్ఞప్తుల మేరకు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలకు ఒకచోట పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సముఖత వ్యక్తం చేసింది. వాస్తవానికి వేర్వేరు చోట్ల పనిచేస్తున్న ఉద్యోగ దంపతుల వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. కాగా ఉద్యోగులైన భార్యాభర్తలకు సంబంధించి ఇద్దరూ ఒకే చోట పనిచేసేలా బదిలీ చేయాల్సిన క్రమంలో ఓ విధాన నిర్ణయాన్ని తీసుకోవాలని గతంలో కమలనాథన్ కమిటీ కూడా ప్రభుత్వానికి సూచనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో బదిలీల ప్ర్రక్రియ ప్రారంభం కానుంది. -
రెవెన్యూ ప్రక్షాళన
♦ పలు మండలాలకు కొత్త తహసీల్దార్లు ♦ జిల్లాకు కేటాయించిన 9 మందికి పోస్టింగ్‌లు ♦ ఈసీ గ్రీన్‌సిగ్నల్‌తో ఉత్తర్వులు జారీచేసిన కలెక్టర్ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తహసీల్దార్ల బదిలీలకు ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా 24 మందికి స్థానచలనం కలిగిస్తూ కలెక్టర్ రఘునందన్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల తహసీల్దార్లుగా పదోన్నతులు (ఇతర జిల్లాల నుంచి జిల్లాకు కేటాయించిన) పొందిన తొమ్మిది మందికి కొత్తగా పోస్టింగ్‌లు ఇవ్వగా.. పరిపాలనా సౌలభ్యంలో భాగంగా మరికొందరిని మార్చారు. ప్రస్తుతం ఓటర్ల నమోదు ముసాయిదా ప్రక్రియ జరుగుతుండడంతో ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమలులో ఉంది. ఈ నేపథ్యంలో బదిలీలకు అనుమతి కోరుతూ జాబితాను ఈసీకి పంపారు. ఈ మేరకు జాబితాకు ఈసీ క్లియరెన్స్ ఇవ్వడంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. సమర్థత, పనితీరు ప్రామాణికంగా పోస్టింగ్‌లు కట్టబెట్టిన కలెక్టర్.. ఫార్మా భూముల సేకరణ లో నిక్కచ్చిగా వ్యవహరించిన యాచారం తహసీల్దార్ వసంతకుమారిపై బదిలీ వేటు వేశారు. కుర్మిద్ద భూముల గుర్తింపు వ్యవహారం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆమె వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. అదేసమయంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను నిరోధించడంలో విఫలమయ్యారని భావించిన ఉన్నతాధికారులు.. శామీర్‌పేట తహసీల్దార్ దే వుజాకు స్థానచలనం కలిగించారు. పాత హోదాలోకి డిప్యూటీ తహసీల్దార్లు తహసీల్దార్ హోదాలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్లకు పాత హోదాను కట్టబెడుతూ బదిలీ చేశారు. డీటీ హోదాలో కలెక్టరేట్లో ‘డి’ సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జి.రాములును యాలాల మండల డిప్యూటీ తహసీల్దార్‌గా నియమించారు. అలాగే యాలాల తహసీల్దార్‌గా వ్యవహరిస్తున్న ఒగ్గు రాజును డీఆర్ఓకు రిపోర్టు చేయమని ఆదేశించారు. ఇక రాజేంద్రనగర్ డీఏఓగా పనిచేస్తున్న గౌరీవత్సలను అక్కడే డీటీ కేడర్‌లో పనిచేయాలని నిర్దేశించారు. కలెక్టరేట్లో పాలనాధికారిగా వ్యవహరిస్తున్న జనార్దన్ ను దేవాదాయశాఖకు రిలీవ్ చేశారు. ఇక చాలాకాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రాజేశ్వరిని రిపోర్టు చేయమని కలెక్టర్ ఆదేశించారు. -
డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు
ఏలూరు సిటీ :జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)-14 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో బాగంగా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు జిల్లా విద్యాధికారి డి.మధుసూదనరావు చెప్పారు. స్థానిక డీఈఓ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం లోగా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని కోరారు. జిల్లాలో ఖాళీల వివరాలు డీఈఓ వెబ్సైట్లో పొందుపరిచామని, ఖాళీగా ఉన్న ప్రతి స్థానానికి అభ్యర్థులు విధిగా ఆప్షన్లు ఇవ్వాలని, వెబ్ ఆప్షన్లు పెట్టుకోకుంటే ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. జిల్లాలో నోటిఫైడ్ పోస్టులు 519 ఉంటే వాటిలో 434 పోస్టులు భర్తీ చేస్తున్నామని, మరో 85 పోస్టులకు ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేక పోస్టులు బ్యాక్లాగ్లోకి వెళతాయన్నారు. పోస్టుల భర్తీ ఇలా.. డీఎస్సీలో నోటిఫైడ్ పోస్టులు డీఎస్సీ-14లో ప్రభుత్వం 519 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో సెకండరీ గ్రేడ్ తెలుగు పోస్టులు ఏజెన్సీలో 36, జనరల్ 305, మున్సిపాల్టీల్లో 85, మొత్తం 426 పోస్టులు ఉన్నాయి. ఎస్జీటీ ఉర్దూలో మున్సిపల్ యాజమాన్యంలో 7 పోస్టులు ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్ తెలుగు పోస్టుల్లో ప్లెయిన్ ఏరియాలో 20, మునిసిపాల్టీల్లో 7 పోస్టులు ప్రకటించారు. లాంగ్వేజ్ పండిట్ హిందీలో ఏజెన్సీలో 1 పోస్టు, ప్లెయిన్ ఏరియాలో 35, మునిసిపాల్టీల్లో 5 పోస్టులు ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్ సంస్కృతంలో ప్లెయిన్ ఏరియాలో 12, మునిసిపాల్టీల్లో 6 పోస్టులు ప్రకటించారు. భర్తీ చేసే పోస్టుల వివరాలు ప్రభుత్వం డీఎస్సీలో ఎంపిక చేసిన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఎస్జీటీ తెలుగులో 426 పోస్టులకు గానూ 359 భర్తీ చేస్తున్నారు. ఎస్జీటీ ఉర్దూలో 7 పోస్టులకు ఒక్క పోస్టు మాత్రమే భర్తీ చేశారు. ఎల్పీ తెలుగులో 27 పోస్టులూ భర్తీ చేస్తున్నారు. ఎల్పీ హిందీలో 41పోస్టులకు గానూ 40 పోస్టులు, ఎల్పీ సంస్కృతంలో 17 పోస్టులకు 6 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అభ్యర్థుల్లేని పోస్టులు ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో మెరిట్ కమ్ రోస్టర్, రిజర్వేషన్ల ఆధారంగా ఆయా కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థులు లేక 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఎస్జీటీ తెలుగులో 67 పోస్టులు, ఎస్జీటీ ఉర్దూలో మున్సిపాల్టీ యాజమాన్యంలో 6 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ హిందీలో ఒకటి, లాంగ్వేజ్ పండిట్ సంస్కృతంలో 11 పోస్టులు అభ్యర్థుల్లేక బ్యాక్లాగ్లోకి వెళ్లనున్నాయి. -
పోలీసు శాఖలో కోల్డ్ వార్!
♦ కుర్చీ కోసం పోటాపోటీగా పైరవీలు ♦ ఖద్దరు నేతలను ఆశ్రయిస్తున్న ఖాకీలు ♦ పై అధికారులను సైతం కదిలించే యత్నంలో ఓ సీఐ ♦ అక్రమార్జనకు అడ్డుగా నిలుస్తున్నారనే కారణం సాక్షి ప్రతినిధి, కడప: పోస్టింగ్‌ల కోసం కొందరు, అక్రమార్జనకు అడ్డుగా నిలుస్తున్నారని మరికొందరు పైరవీలకు తెరలేపారు. లక్ష్యసాధనలో అలక్ష్యం ప్రదర్శిస్తూ ఖద్దరు నేతలను ఆశ్రయిస్తున్నారు. కులం, తూకం, విధేయుతను బేరీజు వేసుకొని అధికార పక్షం సైతం పైరవీలకు ప్రాధాన్యత ఇస్తోంది. నిజాయితీ నిబద్ధతకు కాలం చెల్లిన తరుణంలో అధికారుల మధ్య తీవ్ర స్థాయిలో కోల్ద్వార్ నడుస్తోంది. కడప, రాజంపేట, ప్రొద్దుటూరు సబ్డివిజన్ల పరిధిలో ఆ పరిస్థితి మరింత అధికంగా ఉన్నట్లు సమాచారం.‘రక్తాన్నైనా చిందిస్తాం.. ప్రజల మాన, ప్రాణాలను రక్షిస్తాం’ అనే స్ఫూర్తి ఎక్కువ మంది పోలీసు అధికారుల్లో లోపించింది. అక్రమార్కులైనా ఆదాయం ఉంటే చెలిమికి ఓకే అని కొందరు, అధికార పార్టీ చల్లని చూపు ఉంటే చాలు అని ఇంకొందరు వ్యవహరిస్తున్నారు. ప్రజా శ్రేయస్సుకంటే ఆదాయం లభించే పోలీసుస్టేషన్ పోస్టింగ్ కోసం యాచిస్తున్నారు. ఆ మేరకే ఖాకీ చొక్కాలు ఖద్దరు నేతల పంచన చేరుతున్నారనే విమర్శలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో అక్రమ ఆదాయానికి అడ్డుగా నిలుస్తున్న పై అధికారులను సైతం సాగనంపేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. కొందరు ట్రిపుల్ స్టార్ అధికారులు ఈ దిశగా పావులు కదుపుతోన్నట్లు సమాచారం. డీఎస్పీని సాగనంపేందుకు యత్నం.. కడప, రాజంపేట, ప్రొద్దుటూరు సబ్ డివిజన్ల పరిధిలో పలు సర్కిల్ కార్యాలయాలకు యమగిరాకీ ఏర్పడింది. కడపలో పని చేసిన ఓ అధికారి తిరిగి కడపలోనే ఏదో సర్కిల్లో పోస్టింగ్ కోసం విశ్వయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మరో ట్రిపుల్ స్టార్ అధికారి తన పై అధికారి అడ్డుగా నిలుస్తున్నారని బదిలీ చేయించేందుకు హైదరాబాద్ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అందుకు ఏకైక కారణం ఆయన అక్రమార్జనకు అడ్డుగా నిలుస్తుండడమేనని తెలుస్తోంది. కాగా తమ పోస్టుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని పోస్టింగ్స్‌లో ఉన్న కొందరు అధికారులు సైతం రాజకీయ గాడ్ఫాదర్లను ఆశ్రయించినట్లు సమాచారం. ఉన్నతాధికారుల మెప్పుకంటే రాజకీయ నేతల మెప్పు కోసమే తాపత్రయ పడుతున్నట్లు సమాచారం. ఆ మేరకే ప్రొద్దుటూరు, రాజంపేట, కడప సబ్ డివిజన్ల పరిధిలో పోటీ అధికమైనట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులు సైతం కులం, వర్గం, తూకం, విధేయుతపై అంచనాకు వచ్చాకే పోస్టింగ్స్ కోసం ప్రతిష్టకు పోతున్నట్లు సమాచారం. అసాంఘిక శక్తులకు చేయూత! జిల్లాలో క్రికెట్ బెట్టింగ్స్, మట్కా కంపెనీలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు సబ్ డివిజన్ పరిధిలో ఈ వ్యవహారం అధికంగా ఉంది. తెరవెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా కొందరు పోలీసు అధికారులు, ట్రిపుల్ స్టార్ల ఐడీ పార్టీలు ఉన్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు అధికారులు స్వయంగా నిర్వాహకులను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు గ్యాంబ్లింగ్ నిర్వాహకులకు అధిక వడ్డీలకు పోలీసు అధికారులే డబ్బు అందిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు అప్పుదారుల నుంచి పూచీకత్తుగా ఆస్తులు వశపర్చుకుంటున్నట్లు సమాచారం. ఆదాయమే లక్ష్యంగా పని చేస్తున్న కొంత మంది కారణంగా మొత్తం వ్యవస్థకు మాయని మచ్చ ఏర్పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసు అధికారుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు సమాచారం. -
తహసీల్దార్ల బదిలీలకు రంగం సిద్ధం
నల్లగొండ : తహసీల్దార్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా సుమారు 15 మంది తహసీల్దార్లను బదిలీచేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వీరిలో రిక్వెస్టు కింద బదిలీ కావాలని కోరిన తహసీల్దార్లు ఐదుగురు ఉన్నారు. తహసీల్దార్ల బదిలీలు రెండేళ్లకోసారి చేయడం సర్వసాధారణం. మరో రెండు, మూడు మాసాలు గడిస్తే తహసీల్దార్ల బదిలీలు జరిగి రెండేళ్లు పూర్తవుతుంది. అయితే పలు చోట్ల తహసీల్దార్లపై వస్తున్న ఫిర్యాదుల మేరకు బదిలీ చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు గతంలో సరియైన పోస్టింగ్ లభించక ఇబ్బంది పడుతున్న వారిని కూడా బదిలీ జాబితాలో చేర్చారు. కొత్త ఓటర్ల జాబితా కసరత్తు జరుగుతు న్నందున ఈ సమయంలో తహసీల్దార్ల బదిలీలు జరగాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. దీంతో కలెక్టర్ ఎన్నికల కమిషన్ అనుమతి కోరుతూ గతంలో లేఖ రాశారు. రెండు, మూడు రోజుల క్రితం తహసీల్దార్ల బదిలీలకు ఈసీ పచ్చజెండా ఊపడంతో రెండు, మూడు రోజుల్లో ట్రాన్స్ఫర్ ప్రక్రియ పూర్తిచేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇదిలా ఉంటే.. గతంలో ఆప్షన్స్ తీసుకుని బదిలీల కోసం ఎదురుచూస్తున్న వీఆర్వోలను కూడా రెండు, మూడు రోజుల్లో బదిలీ చేయనున్నారు. ఉద్యోగ విరమణకు ఏడాది సర్వీసు ఉన్న వారిని మినహాయించి ఒకే చోట ఏడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వీఆర్వోలను సమీప మండలాలకు బదిలీ చేయనున్నారు. ఈ జాబితాలో 180 మంది వీఆర్వోలు ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా అప్పట్లో వారి నుంచి ఆప్షన్స్ తీసుకుని బదిలీ చేయకుండా అధికారులు పెండింగ్‌లో పెట్టారు. -
అన్నీ అమ్మకాలే..!
అంగన్వాడీల భర్తీలో భారీగా అవినీతి టీడీపీ నేతల జేబుల్లోకి రూ.10 కోట్లు పెత్తనమంతా టీడీపీ ఎమ్మెల్యేలదే వారి అవినీతి తెలిసినా చేష్టలుడిగిన యంత్రాంగం {పభుత్వానికి నివేదించిన ఇంటిలిజెన్స విశాఖపట్నం: ‘మేము స్థానికు లం.. మాకు అన్ని విద్యార్హతులున్నాయి. మా కెందుకు పో స్టింగ్‌లు ఇవ్వలేదు.. మేమేం పాపం చేసుకున్నాం.. మెరిట్ మాకు శాపమా? ఇంటర్వ్యూలకు ముందే అంగన్వాడీ పోస్టులను అమ్ముకున్నారని తెలిసింది. అలాంట ప్పుడు ఇంటర్వ్యూలెందుకు నిర్వహిం చారు. మమ్మల్ని ఎందుకు పిలిచారు’ అంటూ పలువురు బాధితులు ఆవేదన. ‘కమిటీల్లో మాకు ప్రాతినిధ్యం ఉన్నా ఏం చేయలేకపోయాం. కమిటీలకు ఆర్డీవోలే చైర్మన్లుగా వ్యవహరించినప్పటికీ పెత్తనమంతా ఎమ్మెల్యేలదే. తెరవెనుక ఈ పోస్టుల భర్తీ కోసం జరిగిన ఆర్థిక లావాదేవీల పై నో కామెంట్. మెరిట్ ఉన్న వాళ్లకు సైతం మేం న్యాయం చేయలేకపోయాం’బాధితులతో ఐసీడీఎస్ ఉన్నతాధికారి. ఇవిచాలు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల నియామకాల్లో అవినీతి ఏ స్థాయిలో జరిగిందనడానికి చెప్పడానికి. ఈ పోస్టుల మాటున అక్షరాల రూ. పది కోట్లు చేతులు మారినట్టు విశ్వసనీయ సమాచారం. అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల అమ్మకాల ద్వారానే సుమారు రూ.6 కోట్లు, మిగిలిన పోస్టుల ద్వారా మరో రూ.4 కోట్లు టీడీపీ ఎమ్మెల్యేలు దండుకున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలే ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. కొన్ని చోట్ల మెరిట్ ప్రకారం ఎంపిక చేసినప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వకుండా కలెక్టర్ పేరిట ఐసీడీఎస్ అధికారులను బెదిరించి మరీ నిలుపుదల చేయించారు. అనంతరం ఆ అభ్యర్థులు కూడా తమకు లక్షలు ముట్టజెప్పితోనే పోస్టింగు ఆర్డర్లు ఇప్పించారు. ఏజెన్సీతో సహా జిల్లాలోని 25 ప్రాజెక్టులపరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు 229, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 147,ఆయాలు 572, లింక్ వర్కర్స్ 830, కృషి వర్కర్స్ 49 కలిపి మొత్తం 1115 పోస్టులకు సెప్టెంబర్ 16న నోటిఫికేషన్ ఇస్తే మొత్తం 4,663 మంది దరఖాస్తు చేసుకున్నారు. నియామకాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో కమిటీల్లో ఎమ్మెల్యేలను తప్పించి ఆ బాధ్యతలను ఆర్డీవోలకు అప్పగించారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేల అవినీతికి అడ్డుకట్టపడలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు తాము సూచించిన వారికే పోస్టింగ్‌లు దగ్గేలా ఎక్కడికక్కడ చక్రం తిప్పగలిగారు. కార్యకర్తల నుంచి ఆయాల వరకు నూటికి 80 శాతం పోస్టింగ్‌లు వీరు సూచించిన వారికే దక్కడం ఇందుకు నిదర్శనం. జిల్లాలో మెజార్టీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షలు, ఆయా పోస్టులకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు, లింక్ వర్కర్స్, మినీ కార్యకర్తలు, క్రషి వర్కర్స్ నుంచి కూడా రూ.50వేల వరకు వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల కోసం కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తల్లోనే పోటీ ఏర్పడడంతో ఆయాప్రాంతాల్లో వేలం పాటలు కూడా పెట్టినట్టు వార్తలొచ్చాయి. విశాఖ దక్షిణ నియోజక వర్గంలో నేరెళ్ల కోనేరు కేంద్రంలో ఆయా పోస్టుకు జన్మభూమి కమిటీసిఫార్సు మేరకు ఓ తటస్థ అభ్యర్థి నుంచి పార్టీ నేతలు రూ.50 వేలు వసూలు చేశారు. కానీ పోస్టింగ్ దక్కకపోవడంతో ఇచ్చిన డబ్బుల కోసం ఆమె నేతల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తూనే ఉంది. నర్సీపట్నం డివిజన్లో మెరిట్ ప్రకారం ఎంపికైన ఆయాలకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఆపివేయించి ఆ తర్వాత వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. మరికొంత మంది నేటికీ పోస్టింగ్‌ల కోసం అధికారులు చుట్టూ తిరుగుతున్నట్టు తెలిసింది. -
ఆ ఫోటోలు పెట్టి బుక్కయ్యాడు
లక్నో: దేవుళ్ల బొమ్మలను కాళ్ల మీద, వీపు మీద టాటూలుగా వేయించుకొని మొన్న బెంగళూరులో ఓ జంట ఇబ్బందుల్లో పడితే, యూపీకి చెందిన మరో యువకుడు ఓ మతానికి చెందిన దేవుళ్లు, దేవతల ఫోటోలను అభ్యంతరకర రీతిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బుక్కయ్యాడు. వాట్సప్‌లో అనుచిత ఫోటోలను పోస్ట్ చేసినందుకుగాను యువకుడి(20)పై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెచ్ జిల్లా నాన్‌పారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ సాలిగ్రామ్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం... కయస్తా తోలాకు చెందిన ఓ యువకుడు ఇటీవల తమ వర్గానికి చెందిన వ్యక్తులతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాడు. ఇందులో ఓ మతానికి చెందిన దేవుళ్లు, దేవతల ఫోటోలను అభ్యంతరకర రీతిలో పోస్ట్ చేశాడు. దీన్ని గమనించిన మరో వర్గానికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు యువకుడిపై శనివారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగంచే ఎటువంటి చర్యలనైనా తాము సహించమని ఎస్పీ సాలిగ్రామ్ వర్మ ఈ సందర్భంగా హెచ్చరించారు. -
లోకేష్ మాట వినకపోతే వేటే..!
ఏపీ సీఎం తనయుడి కనుసన్నల్లో అధికారుల బదిలీలు నచ్చని వారిని అప్రాధాన్య శాఖలకు పంపిస్తున్న వైనం హైదరాబాద్: తమ కనుసన్నల్లో నడవక, చెప్పినట్టుగా చేయని అధికారులపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేస్తోంది. ఈ బదిలీలన్నీ సీఎం చంద్రబాబు కుమారుడి ఆదేశాల మేరకే జరుగుతున్నాయనే మాట అధికార యంత్రాం గంలో బలంగా వినిపిస్తోంది. ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలన్నదీ లోకేష్ నిర్ణయిస్తున్నట్టు సమాచారం. తమకిష్టమైన వారికి, ఇష్టమైన శాఖల్లో పోస్టింగ్లిప్పించుకొంటున్నాడు లోకేష్. మొన్న గిరిధర్‌పై, నిన్న రమణారెడ్డిపై... మాట వినలేదన్న కారణంగా మొన్న ఏపీ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా సమాచారశాఖ కమిషనర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రమణారెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసుకు చెందిన రమణారెడ్డి రాష్ట్ర విభజన అనంతరం సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కీలక పాత్ర పోషించారు. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం నుంచి మొన్నటి పుష్కరాల్లో ప్రచారం వరకూ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు ఏర్పాటు చేశారు. రమణారెడ్డి ప్రొటోకాల్ బాధ్యతలే నిర్వహిస్తుండగా పనితీరు గుర్తించి సమాచార శాఖ కమిషనర్ బాధ్యతల్నీ అదనంగా సీఎం అప్పగించారు. సీఎం పర్యటనలకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడంతోపాటు సీఎం కార్యాలయ సోకులకు కోట్ల రూపాయలు మంజూరు చేయడంలో రమణారెడ్డి ప్రభుత్వ పెద్దల మాటకు మరోమాట చెప్పకుండా పనిచేశారు. అయితే ఇటీవల ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా నిర్వహించడం తెలిసిందే. ఆ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు ఏపీ భవన్లో వసతి సౌకర్యం కల్పించారనే కారణంగా రమణారెడ్డిని మాతృసంస్థకు పంపించాలంటూ లోకేష్ ఆదేశించడంతో అది జరిగిపోయింది. ఈ పరిణామంపై పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకైనా ఏపీ భవన్లో వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రొటోకాల్ ప్రత్యేక అధికారికి ఉంటుందని, గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు సమన్యాయం పేరుతో ఢిల్లీలో ధర్నా చేసిన సమయంలో 90 మందికి వసతి కల్పించిందీ ఇదే రమణారెడ్డేనని వారు పేర్కొన్నారు. రమణారెడ్డిని ఇండియన్ రైల్వేస్‌కు తిరిగి పంపిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారమే ఆయన ఏపీ సర్వీసు నుంచి రిలీవ్ అయి వెళ్లిపోయారు. సోమవారం ఢిల్లీలో ఇండియన్ రైల్వే బోర్డుకు రిపోర్టు చేయనున్నారు. మరోవైపు ఢిల్లీలో పెట్రోలియంశాఖలో పనిచేస్తున్న ఎ.గిరిధర్‌ను కూడా సీఎం తన కార్యాలయానికి తీసుకొచ్చారు. ఏపీ మున్సిపల్ ముఖ్యకార్యదర్శిగా గిరిధర్ రాజధాని విషయంలో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయడానికి ఇష్టపడక సెలవుపై వెళ్లారు. ఇదే అదనుగా ఆయన్ను సచి వాలయంలో కాకుండా ఎలాంటి పనిలేని ఏపీపీఎస్సీ కార్యదర్శిగా నియమించడాన్నీ టీడీపీ నేతలు, ఉద్యోగులు తప్పుబడుతున్నారు. -
మైనింగ్ అధికారులకు పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జూన్‌లో రాష్ట్రానికి తాత్కాలికంగా కేటాయించిన రాష్ట్రస్థాయి అధికారులకు పోస్టింగ్ ఇస్తూ మైనింగ్ విభాగం డెరైక్టర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మైనింగ్ విభాగం నిజామాబాద్ డిప్యూటీ డెరైక్టర్‌గా బి.భగవంతరెడ్డి నియమితులయ్యారు. మహబూబ్‌నగర్ ఏడీ (విజిలెన్స్)గా జి.నరసింహాచారి, మెదక్ ఏడీగా ఎం.వెంకటేశ్వర్లు, హైదరాబాద్ ఏడీగా కె.రామచంద్రయ్య, సంగారెడ్డి విజిలెన్స్ ఏడీగా ఎస్.సాంబయ్య నియమితులయ్యారు. గతంలో ఈ స్థానాల్లో పనిచేసిన మైనింగ్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. -
బదిలీ వెనుక...కారణాలెన్నో..!
తీవ్ర మనస్తాపానికి గురైన నిర్మల బాధ్యతల నుంచి వెంటనే రిలీవ్ సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్మల బదిలీ వ్యవహారంపై అధికార వర్గాల్లో జోరుగా చర్చజరుగుతోంది. ఈమె బదిలీ వెనుక అనేక కారణాలున్నట్లు ఊహాగానాలు వినవస్తున్నాయి. కారణాలు ఏమైనా బదిలీ చేసిన తీరు, పోస్టింగ్ ఇవ్వకపోవటంపై ఆమె మనస్తానికి లోనయ్యారు. గురువారం రాత్రి వరకు తన చాంబర్లో అధికారులతో ప్రభుత్వ భూముల వేలం విషయమై ప్రభుత్వానికి అందించాల్సిన నివేదికపై చర్చిస్తున్నారు. అంతలోనే ఉన్నతాధికారి ఒకరు ఆమెకు ఫోన్ చేసి బదిలీపై సమాచారం అందించారు. దీంతో నిరాశకులోనైన ఆమె ఫైళ్లను అక్కడే వదిలేసి నేరుగా క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయినట్లు సమాచారం. సాధారణంగా ప్రతి రోజు ఇంటికి వెళ్లే సమయంలో పెండింగ్ ఫైళ్లను తన వెంట తీసుకెళ్లే వారని, గురువారం సిబ్బంది ఫైళ్లు తెచ్చి ఇచ్చినా..వద్దని వారించారు. ఈ తర్వాత తనకు సన్నిహితులైన ఒకరిద్దరు అధికారులకు బదిలీ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ను క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని, ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. ఇదిలా ఉండగా ... జిల్లాలో పరిపాలన గాడినపడుతున్న తరుణంలో కలెక్టర్‌ను బదిలీ చేయటం సరికాదని అధికార వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా ఒక ప్రాంతంలో జరిగిన ్ర కార్యక్ర మంలో కలెక్టర్ పాల్గొనకపోవటంపై ఉన్నతాధికారులతో సహా సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారులతో సత్సంబంధాలను కొనసాగించక పోవటం, జిల్లా స్థాయిలోనూ ఆమె వైఖరి పలువురికి మింగుడుపడకపోవడమే బదిలీకి కారణాలుగా పేర్కొంటున్నారు. అంతేగాకుండా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా హైదరాబాద్‌కు రావాలని పట్టుదలతో ఉండటం కూడా ఆమె బదిలీకి బలమైన కారణంగా చెప్పుకుంటున్నారు. -
104లో అక్రమ డిప్యూటేషన్లు రద్దు
- కలెక్టర్ ఆదేశాలతో తిరిగి కౌన్సెలింగ్ - 29 మందికి పోస్టింగులు.. - డీఎంహెచ్‌వోలో అక్రమాలపై ఏజేసీ విచారణ ఎప్పుడో..? ఖమ్మం వైరారోడ్ : 104లో క్రమ డిప్యూటేషన్లును జిల్లా కలెక్టర్ రద్దుచేశారు. తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించటంతో 104 నోడల్ అధికారిణి కోటిరత్నం ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చారు. 104లో గతంలో కొందరు అధికారులు అక్రమంగా డిప్యూటేషన్లు నిర్వహించి 29 మంది ఉద్యోగులకు కోరుకున్న చోట పో స్టింగ్‌లు ఇచ్చి, వారి వద్ద నుండి భారీగా ము డుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నారు. అయితే వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు లేకుండానే ఈ తతంగం అంతా నిర్వహించటంతో విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన విచారణకు ఆదేశించి, దిద్దుబాటు చ ర్యలు చేపట్టారు. తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించాలని నోడల్ అధికారిణిని ఆదేశిం చారు. ఆదివారం ఫార్మాసిస్ట్లు,ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డైవర్లు, స్టాఫ్‌నర్స్, తదితర ఉద్యోగులకు డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించి 29 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఏజేసీ విచారణ ఎప్పుడో ? డీఎంహెచ్‌లో గతంలో చోటు చేసుకున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్ గత నెల విచారణకు ఆదేశించారు. ఏజేసీ బాబూరావును విచారణ అధికారిగా నియమించారు. మే 16న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భానుప్రకాశ్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వెంకటేశ్వర్లును విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. భానుప్రకాశ్‌పై వైద్య ఆరోగ్య శాఖలో అక్రమ డిప్యూటేషన్ల వ్యవహరంలో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ యేడాది పల్స్ పోలియో నిర్వహణ కోసం రూ. 47 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను కూడా దుర్వినియోగం చేశారనే ఆరోపణ రావటంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వీరితో పాటు సర్వీస్ ఇంజనీర్ తిరపయ్య, డీఎంహెచ్ కార్యాలయంలో గతంలో సూపరిండెంట్‌గా పనిచే సిన ఇస్మాయిల్‌కు కూడా నోటీసులు పంపించారు. కానీ పని ఒత్తిడి మూలంగా ఏజేసీ విచారణ చేపట్టడం ఆలస్యమైందని విచారణను వాయిదా వేశారు. అరుుతే ఇంత వరకు డీఎంహెచ్ఓలో చోటు చేసుకున్న విచారణపై ఉన్నతాధికారులు నోరుమొపడం లేదు. దీంతో అక్రమాలు వెలుగుచూసే అవకాశం లేకుండా పోయింది. -
పలువురు ఐఎఫ్ఎస్లకు బదిలీలు, పోస్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన పలువురు ఐఎఫ్ఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మునీంద్రను అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(ఎన్విరాన్మెంట్)గా, బి. ఆనంద్ మోహన్‌ను ఖమ్మం కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌గా బదిలీ చేస్తూ పోస్టింగ్‌లు ఇచ్చారు. పీవీ రాజారావును వరంగల్ సోషల్ ఫారెస్ట్రీ సర్కిల్ కన్సర్వేటర్గా, బి. శ్రీనివాస్‌ను హైదరాబాద్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా, ఎస్. రమేశ్‌ను దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ జాయింట్ డెరైక్టర్‌గా నియమించారు. సంజీవ్‌కుమార్ గుప్తాను కవాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డెరైక్టర్‌గా, వినయ్ కుమార్‌ను అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డెరైక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. -
డీటీ..పోటీ!
ఫోకల్ పోస్టులకు భలే గిరాకీ డిప్యూటీ తహసీల్దార్లుగా 14 మందికి పదోన్నతి మంచి స్థానం కోసం పలువురి ప్రయత్నాలు తమకూ ప్రాధాన్యం ఇవ్వాలంటున్న ఎన్నికల డీటీలు హన్మకొండ అర్బన్ : జిల్లాలో ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్ పోస్టుల భర్తీ ఉన్నతాధికారులకు ప్రహసనంగా మారింది. ఇటీవల సీనియర్ అసిస్టెంట్ల నుంచి పదోన్నతి పొందిన 14 మంది పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. మరో వైపు 12 మంది ఎన్నికల డీటీలు తమకు ఎన్నికల సంఘం కొనసాగింపు లేనందున రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరువర్గాల్లో ఎక్కువ మంది తమకు ఫోకల్ పోస్టులు కావాలని తమ వంతు ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు అధికారులను నేరుగా కలిసి విన్నపాలు ఇవ్వగా.... మరికొందరు తెరవెనుక నుంచి ప్రయత్నిస్తున్నారు. అందరికీ పోస్టులు ఇవ్వాలంటే మొత్తం 26 డీటీ స్థానాలు అవసరం ఉంటుంది. ఈ విషయంలో ఏంచేయాలన్న దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నికల డీటీలకు వేతనాలు బంద్ జిల్లాలోని 12 నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్నికల డీటీలు ఎన్నికల సమయంలో విధుల్లో చేరారు. సహజంగా వీరికి ఎన్నికల సంఘం నిబంధనలు, నిర్ణయం ప్రకారం పోస్టింగ్‌లు ఇస్తారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం డీటీలను కొనసాగించే విషయంలో తదుపరి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో డిసెంబర్ నెల వరకే వీరికి వేతనాలు అందాయి. జనవరి సంబంధించిన వేతనం ఫిబ్రవరిలో రావాల్సి ఉండగా.... ఖజానా అధికారులు నిబంధనలు చూపి జీతాలు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టారు. దీంతో ఆ డీటీలంతా తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు. పనిలో పనిగా కలెక్టర్, జేసీలను కలిసి పరిస్థితిని వివరించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల సంఘం నుంచి తదుపరి సూచనలు వచ్చినా... రాకున్నా తమను ఎన్నికల విభాగం నుంచి రెగ్యులర్ విభాగానికి మార్చాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ఇతర పోస్టులు ఖాళీ ఉన్నా...్న అవసరం దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలప్రకారం విధులు నిర్వర్తించామని, ప్రస్తుతం అవకాశం ఉన్నందున తమను ఇతర పోస్టుల్లోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల డీటీల పరిస్థితి ఇలా ఉంటే... ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతి ఫైల్‌కు అధికారులు ఇటీవలే మోక్షం కల్పించారు. దీంతో 14మంది సీనియర్ అసిస్టెంట్లు డీటీలుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు వారు మంచి పోస్టుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో అధికారులపై ఒత్తిళ్లు పెరిగినట్లు సమాచారం. ప్రత్యేక కలెక్టర్ వద్ద కొత్త ఖాళీలు ప్రస్తుతం జిల్లాలో డీటీ పోస్టులో 14 ఖాళీలు ఉన్నాయి. వీటికితోడు ప్రభుత్వం నూతనంగా కంతనపల్లి ప్రాజెక్టు భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ కార్యాలయానికి 4 డీటీ, 4 సీనియర్ అసిస్టెంట్, ఒక లా అధికారితోపాటు ఇతర ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కేటారుుంచింది. ప్రత్యేక కలెక్టర్‌గా డేవిడ్‌ను ప్రభుత్వం నియమించినప్పటికీ... మిగతా పోస్టుల భర్తీ విషయంలో జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కంతనపల్లి ప్రత్యేక కలెక్టర్ కార్యాలయూన్ని మాత్రం చింతగట్టులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తే మరో నలుగురు డీటీలు, సీనియర్ అసిస్టెంట్లు, ఒక తహసీల్దార్ అక్కడ పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఉన్న మొత్తం ఖాళీలను కొత్తవారితో నింపితే.. కీలక పోస్టుల్లో పరిపాలనా సమస్యలు కూడా వస్తాయని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో అన్ని బేరీజు వేసుకుని ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లలో కూడా కొందరికి స్థానచలనం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. సమావేశమైన ఎన్నికల డీటీలు డిప్యూటీ తహసీల్దార్ల పోస్టింగ్‌ల విషయంలో ఏర్పడ్డ పోటీతో ఎన్నికల డీటీలు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నా రు. ఈ విషయంలో తమకు ప్రాధాన్యం ఇచ్చేలా ఉన్నతాధికారులకు సమస్యను వివరించాలని అభిప్రాయపడ్డారు. అందు కు సంఘం నాయకులు సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మొత్తంగా డీటీల పోస్టింగ్‌ల విషయం ప్రసుత్తం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. -
10 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్
జీఏడీ కార్యదర్శిగా అరుణ మార్కెటింగ్ డెరైక్టర్‌గా అనితా రాజేంద్ర భూ సేకరణ డెరైక్టర్‌గా మాణిక్‌రాజ్ నియామకం సాక్షి, హైదరాబాద్: పదిమంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాల్లో భాగంగా పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న పలువురికి కొత్తగా బాధ్యతలు అప్పగించారు. జీఏడీ కార్యదర్శిగా(సర్వీసెస్, హెచ్ఆర్ఎం) జి.డి.అరుణ నియమించడంతో పాటు జీఏడీ అదనపు బాధ్యతల నుంచి బి.వెంకటేశ్వరరావును రిలీవ్ చేశారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డెరైక్టర్‌గా అనితా రాజేంద్రకు పోస్టింగ్ ఇచ్చారు. మార్క్‌ఫెడ్ ఎండీగా ఇన్చార్జి బాధ్యతలను కూడా అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా సి. సుదర్శన్‌రెడ్డి, ఫిషరీస్ డెరైక్టర్‌గా టి.విజయ్‌కుమార్, యూత్సర్వీసెస్ డెరైక్టర్‌గా మహ్మద్ అబ్దుల్‌అజీమ్ నియమితులయ్యారు. నీటిపారుదల, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ శాఖ పరిహారం, పునరావాసం, భూ సేకరణ డెరైక్టర్‌గా కె.మాణిక్‌రాజ్ నియమితులయ్యారు. అంతకుముందు ఈ పోస్టులో జి. వెంకటరామ్రెడ్డిని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేశారు. రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డెరైక్టర్‌గా డా.ఎం.వి.రెడ్డి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డిప్యూటీ కార్యదర్శిగా భారతీ లక్పతి నాయక్‌కు బాధ్యతలు అప్పగించారు. మహబూబ్‌నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పి.వెంకటరామిరెడ్డి నియమితులు కాగా, అంతకుముందు బి. విజేంద్రకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. -
సాంబశివరావు తదుపరి పోస్టింగ్ ఏమిటి?
ఆది నుంచి అక్రమాలే ఎజెండా.. ఇన్వర్టర్ల కుంభకోణం మచ్చ ఉద్యోగ నియామకాల్లో అదేదారి వివాదాల నడుమ పదోన్నతులు వరంగల్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్య, ఆరోగ్య శాఖ అక్రమాలకు కేంద్ర బిందువుగా వ్యవహరించిన సాంబశివరావు తదుపరి పోస్టింగ్ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. సాంబశివరావు వరంగల్ జిల్లా వైద్యాధికారిగా పని చేస్తూ.. వేగంగా వైద్య, ఆరోగ్య శాఖ డెరైక్టరు పోస్టు దక్కించుకున్నారు. అవినీతి, అక్రమాల ఆరోపణలతో ప్రభుత్వం సాంబశివరావును ఆ పోస్టు నుంచి తప్పించింది. ఇప్పుడు సాంబశివరావు మళ్లీ ఇదే పోస్టులోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య సహకారంతో ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టింగ్ పొందుతారని సాంబశివరావు అనుచరులు చెబుతున్నారు. ఈ రెండింట్లో ఏది జరిగినా జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా దయనీయంగా చేరుకుంటుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆది నుంచి అదేతీరు.. సాంబశివరావు 2011 డిసెంబరు నుంచి జూలై 2014 వరకు జిల్లా వైద్య అధికారిగా పనిచేశారు. ఆయన పని చేసిన కాలంలో అవినీతి, అక్రమాల ఆరోపణలు భారీగా వచ్చాయి. ముఖ్యంగా ఇన్వర్టర్ల కొనుగోలు విషయంలో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ఏటా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ) అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తుంది. జిల్లాలో 62 పీహెచ్‌సీలు ఉన్నారుు. 2012 డిసెంబరులో ప్రతీ పీహెచ్‌సీకి రెండు చొప్పున ఇన్వర్టర్లు కొనుగోలు చేశారు. ఒక్కో ఇన్వర్టర్లుకు రూ.40 వేలు చెల్లించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ పి.సాంబశివరావు ఉన్నప్పుడే ఇన్వర్టర్ల కొనుగోలు విషయంలో అవినీతి ఆరోపణలు వచ్చారుు. ఎస్సీ, ఎస్టీ జిల్లా అసోసియేషన్‌తోపాటు పలువురు వ్యక్తులు ఈ అంశంపై 2013లో ఫిర్యాదులు చేశారు. 2013 జులైలో అప్పటి ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి జిల్లాకు వచ్చి దీనిపై విచారణకు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డెరైక్టర్ మాణిక్యరావును విచారణ అధికారిగా నియమించారు. ఇందుకు సంబంధించిన విచారణ పూర్తయ్యిందని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నివేదికలో ఏముందనే విషయాలను ఇప్పటికీ వెల్లడించలేదు. మరికొన్ని.. సాంబశివరావుపై ఆరోపణలకు సంబంధించి ఏకంగా వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదులు వెళ్లాయి. 2012, 2014 మేడారం జాతరలో వైద్య శాఖ నిర్వహించిన క్యాంపుల పేరిట భారీగా నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు జాతరల్లోనూ రూ.కోటి చొప్పున వైద్య శాఖ తరుఫున ఖర్చు చేశారు. ఎలాంటి టెండర్లు లేకుండా మందులు, అత్యవసర వస్తువుల కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సాధారణ నిధుల విషయంలోనూ ఇలాగే జరిగినట్లు ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగంతోపాటు పోస్టింగ్‌ల విషయంలోనూ అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫార్మసిస్టు, ఎస్పీహెచ్వో పోస్టింగ్‌లు, డిప్యూటేషన్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. ఈ అంశాలపై అప్పటి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినా తుది నివేదిక పరిస్థితి ఏమిటనేది వెల్లడికాలేదు. రాజకీయ అండదండలతో సాంబశివరావు ఏకంగావైద్య, ఆరోగ్య శాఖ ఉన్నత పదవికి దక్కించుకున్నారు. ఉన్నతమైన పోస్టులో ఉండి కూడా వ్యవహారశైలి మార్చుకోకపోవడంతో కొద్ది కాలంలోనే ఈ పోస్టు నుంచి వైదొలిగారు. -
ఆంధ్ర పొమ్మంది... తెలంగాణ వద్దంటోంది
పోస్టింగ్‌లు లేవు... జీతాలు రావడం లేదంటూ ఇంజినీర్ల ఆవేదన గాంధీనగర్ : ‘రాష్ర్ట విభజన పుణ్యమాని పోస్టింగ్‌లు లేవు. రెండు నెలలుగా జీతాలూ లేవు. మమ్మల్ని ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు’ అని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కె.ఎల్.రావు భవన్లో ఆంధ్ర స్థానికత కలిగి స్థానికేతర కోటాలో తెలంగాణకు కేటాయించిన నీటిపారుదల శాఖ ఇంజినీర్ల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నీటిపారుదల ఇంజినీర్ల(తెలంగాణకు బదలాయించిన) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత నీటిపారుదల శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న 299 మంది ఇంజినీర్లను ఆంధ్రప్రభుత్వం గత నవంబర్‌లో తెలంగాణకు బదలాయించిందని, వీరిలో 175 మంది ఆంధ్ర స్థానికత కలిగిన వారున్నారని చెప్పారు. వీరికి తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వబోమని స్పష్టం చేసిందన్నారు. ఇరు రాష్ట్రాల మంత్రులు సమస్యను పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఈనెల 27న హైదరాబాద్‌లోని ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇంజినీర్లు టి. సుధాకర్‌బాబు, పి. శ్రీనివాసరావు, లక్ష్మీసాయి, చలం, జగదీష్ పాల్గొన్నారు. -
ఒత్తిళ్లతో మారిపోతున్న పోస్టింగులు!
నలుగురు ఐఏఎస్‌ల బదిలీల్లో మార్పులు చేసిన ప్రభుత్వం జిల్లా మంత్రులు, సీనియర్ అధికారుల సిఫారసులతో నియామకాలు హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల పోస్టింగ్‌లలో ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గుతోంది. బదిలీ చేసి 24 గంటలు కూడా కాకముందే.. పోస్టింగ్‌లను మార్చేస్తోంది. ఆదివారం బదిలీ చేసిన 24 మంది ఐఏఎస్ అధికారుల్లో నలుగురి పోస్టింగ్‌లు మారిపోయాయి. జిల్లా మంత్రుల ఒత్తిళ్లతో ప్రభుత్వం పోస్టింగ్‌లను రద్దు చేస్తుండగా.. పలువురు ఐఏఎస్‌లు.. నేతలు, ఉన్నతాధికారుల అండతో కావాల్సిన పోస్టుల్లోకి మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అపార్డ్ కమిషనర్‌గా పనిచేసిన ప్రియదర్శినిని ప్రభుత్వం గతంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఆదివారం నాటి బదిలీల్లో ఆమెకు ఆదిలాబాద్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఆ జిల్లా మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రస్తుత కలెక్టర్ జగన్మోహన్ను అక్కడే కొనసాగించాలని కోరడంతో... బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రియదర్శినిని సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్-2గా హరి చందన దాసరికి పోస్టింగ్ ఇచ్చారు. ఆమె సోమవారమే విధుల్లో చేరారు కూడా. కానీ ఆ స్థానంలో ఆమ్రపాలికి పోస్టింగ్ ఇస్తూ... హరిచందనను జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమించారు. గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా పనిచేసిన దృష్ట్యా జిల్లాపై తనకు అవగాహన ఉందంటూ ఆమ్రపాలి పలువురు మంత్రులను కలిసి వివరించారని, రంగారెడ్డి జేసీగా పోస్టింగ్ పొందారని ప్రచారం జరుగుతోంది. జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్‌గా నియమితులైన పౌసమి బసును 24 గంటల్లో మార్చేశారు. ఆమెను కరీంనగర్ జిల్లా జేసీగా పంపారు. అలాగే, ఐఏఎస్ అధికారి రజత్‌కుమార్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సిఫారసుతోనే మారినట్లు ప్రచారం జరుగుతోంది. -
తెలంగాణలో 36 మంది ఐపీఎస్‌లకు పోస్టింగ్
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు టీపీ దాస్ శాంతిభద్రతల అదనపు డీజీగా సుదీప్ లక్తాకియా హైదరాబాద్: తెలంగాణలో 36 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు సమావేశమై సాయంత్రం నుంచి రాత్రి వరకు సుదీర్ఘ కసరత్తు చేశారు. అనంతరం రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. -
24 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు
-
‘గ్రేటర్’ టీమ్ రెడీ
‘గ్రేటర్ టీమ్’ వచ్చేసింది. మహానగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు పనిమంతులను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆశలు, ఆశయాలు నెరవేరేలా... యువ ఐఏఎస్ అధికారులను తగినంతమందిని నియమించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పలు కీలక పోస్టుల్లో ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వగా వారిలో కొందరు విధుల్లో చేరారు. ‘గ్రేటర్’ టీమ్ వచ్చేసింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కంకణబద్ధమైన ప్రభుత్వం, ఆదిశగా తగినంత మంది ఐఏఎస్ అధికారులను కేటాయించింది. గ్రేటర్లో కీలకబాధ్యతలు నిర్వహించే జీహెచ్ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాలకు అధికారులను నియమించింది. వీరిలో యువతకు ప్రాధాన్యతనిస్తూనే, అనుభవజ్ఞుల సేవలను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కంప్యూటర్ రంగంలో పరిజ్ఞానమున్నవారితోపాటు ..నగర రూపురేఖలు మార్చడంలో ముఖ్యశాఖలైన పట్టణాభివృద్ధి, రెవెన్యూ విభాగాల్లో సమర్థవంతంగా పనిచేయగలరనుకున్న వారిని నియమించారు. హైదరాబాద్ ముఖచిత్రాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడమేకాకుండా, సమస్యల్లేని షహర్గా, ఆకాశహర్మ్యాలతో అద్భుత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం వీరి సేవలను వినియోగించుకోనుంది. జీహెచ్ఎంసీకి ఐదుగురు ఐఏఎస్‌లను కేటాయించడంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను, చీఫ్ రేషనింగ్ అధికారిని నియమించింది. భూముల క్రమబద్ధీకరణ, పేదలకు ఆహారభద్రత, పెన్షన్లు, నగర సుందరీకరణ తదితర పనులను సవాల్‌గా తీసుకొని కొత్త అధికారులు పనిచేయాల్సి ఉంది. నగరంలో చేసే ఏపని అయినా రాష్ట్రంలోనే కాక ఇతర ప్రాంతాల్లోనూ ప్రతిబింబించే అవకాశం ఉండటంతో కొత్త అధికారులు పనితీరు నిరూపించుకోవాల్సి ఉంది. జీహెచ్ఎంసీకి సంబంధించినంతవరకు విశ్వనగరంగా అభివృద్ధి, స్మార్ట్‌సిటీలో భాగంగా ఈ-ఆఫీస్ అమలు వంటివి కీలకం. దీంతోపాటు హరితహారం, క్లీన్ సిటీలకు ప్రాధాన్యతనిస్తున్నారు. వీరిలో ఈ రంగాల్లో తగిన అనుభవమున్నవారు ఉన్నారు. జీహెచ్ంఎసీకి ఒక ఐఎఫ్ఎస్ అధికారి కూడా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా, జీహెచ్ఎంసీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ఇద్దరు స్పెషల్ కమిషనర్లు ఎ.బాబు, ప్రద్యుమ్నల స్థానంలో ఇద్దరు స్పెషల్ కమిషనర్లను జీహెచ్ఎంసీకి బదిలీ చేశారు. మిగతా ముగ్గురు ఐఏఎస్‌లను ప్రధాన కార్యాలయంలో ఉంచుతారా, లేక వారి సేవలు జోన్లలో వినియోగించుకుంటారా అనేది కమిషనర్ సోమేశ్‌కుమార్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. జీహెచ్ఎంసీలోని ఐదు జోన్లకుగాను సెంట్రల్, వెస్ట్, నార్త్జోన్ల కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, అందరూ విధుల్లో చేరాక వారికప్పగించాల్సిన బాధ్యతలపై నిర్ణయం తీసుకుంటామని స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. ఇదిలా ఉండగా, స్పెషల్ కమిషనర్‌గా నవీన్‌మిట్టల్, అడిషనల్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సోమవారమే విధుల్లో చేరారు. మిగతా ముగ్గురు రావాల్సి ఉంది. ఇంతకు ముందు కూడా నవీన్ మిట్టల్ జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్‌గా పనిచేశారు. నవీన్‌మిట్టల్, (స్పెషల్ కమిషనర్, జీహెచ్ఎంసీ) నవీన్‌మిట్టల్ స్వరాష్ట్రం పంజాబ్. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చేసిన ఆయన 1996 బ్యాచ్‌కు చెందిన వారు. విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్‌గా, హైదరాబాద్, కృష్ణా జిల్లాల కలెక్టర్‌గా కూడా పనిచేశారు. గతంలో వరంగల్ సబ్‌కలెక్టర్‌గా, ఆదిలాబాద్ గిరిజనాభివృద్ధిసంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా, తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా, వాణిజ్యపన్నుల విభాగం డిప్యూటీ కమిషనర్‌గా కూడా పనిచేసిన ఆయనకు నగరంలోని వివిధ అంశాలపై మంచి అవగాహన ఉంది. పట్టణాభివృద్ధి, రెవెన్యూ విభాగాలపై తగిన పట్టు ఉంది. అంతే కాకుండా స్వీపింగ్ కార్మికుల ఏ నెల జీతం ఆనెల వారి బ్యాంకు ఖాతాల్లోనే పడేలా అవసరమైన చర్యలు చేపట్టారు. ఒకేరోజు ఏకకాలంలోనిర్వహించిన తనిఖీలతో బోగస్ స్వీపింగ్ యూనిట్ల అవినీతిని బట్టబయలు చేశారు. ఇంకా, ఆరోగ్యం-పారిశుధ్యం విభాగంలో పలు సంస్కరణలు తెచ్చి కార్మికులకు అన్యాయం జరుగకుండా అడ్డుకున్నారు. 12 మంది సభ్యులతో ఉన్న స్వీపింగ్ యూనిట్లలోని సభ్యుల సంఖ్యను 7కు తగ్గించడంలో ఇతరత్రా అంశాల్లో ఎంతో శ్రద్ధ చూపారు. -
24 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు
అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌లతోపాటు ఇప్పటికే తెలంగాణలో పనిచేస్తున్న వారికి కూడా పోస్టింగ్‌లు ఖరారు చేసింది. మొత్తం 24 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇందులో ఏడు జిల్లాలకు కొత్తగా కలెక్టర్లను నియమించారు. అందులో ఐదు జిల్లాలకు మహిళా ఐఏఎస్‌లే కలెక్టర్లుగా నియమితులయ్యారు. అలాగే ఐదుగురు ఐఏఎస్‌లను జీహెచ్ఎంసీకి కేటాయించడం గమనార్హం. మున్సిపల్ పరిపాలనశాఖలో ఉన్న శైలేంద్ర కుమార్ జోషీని భారీ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అలాగే విద్యాశాఖలో వికాస్‌రాజు ఆంధ్రకు వెళ్లడంతో ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ ఆచార్యను ప్రభుత్వం నియమించింది. ఆంధ్ర నుంచి వచ్చిన నవీన్ మిట్టల్‌ను జీహెచ్ఎంసీ ప్రత్యేక కమిషనర్‌గా నియమించారు. -
ఎస్పీ రాజకుమారి రిలీవ్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా గ్రామీణ ఎస్పీ బి.రాజకుమారిని రిలీవ్ చేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమెను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించారు. ఈ క్రమంలోనే రాజకుమారి బదిలీ అనివార్యమైంది. నెలరోజుల క్రితమే ఆమెను బదిలీ చేసినప్పటికీ, ఆమె స్థానే ఇన్చార్జిగా నియమించిన సుమతి పదవీ బాధ్యతలు స్వీకరించలేదు. దీంతో బాధ్యతల నుంచి రిలీవ్ కాలేదు. ఈ క్రమంలో తాజాగా అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు ప్రక్రియ పూర్తికావడంతో తెలంగాణ ప్రభుత్వం రాజకుమారిని బదిలీ చేసింది. తదుపరి పోస్టింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2012 ఏప్రిల్ 16న రంగారెడ్డి ఎస్పీగా పోస్టింగ్ తీసుకున్న రాజకుమారి.. జిల్లా ప్రజల మన్ననలు పొందారు. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. -
పలువురు డీఎస్పీల బదిలీ
సాక్షి ప్రతినిధి ఖమ్మం : జిల్లా నుంచి పదిహేను రోజుల క్రితం బదిలీ అయిన డీఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. గతంలో బదిలీ అయిన ఐదుగురు డీఎస్పీలతో పాటు తాజాగా మరో ఇద్దరు బదిలీ అయ్యారు. గతంలో బదిలీ అయిన వారిలో ఇద్దరికి మాత్రం జిల్లాలోనే పోస్టింగ్ లభించింది. ఖమ్మం డీఎస్పీగా పని చేసి బదిలీ అయిన బాలకిషన్‌రావుకు ఇంటిలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా నియమించారు. అయితే పోస్టింగ్ ఎక్కడో ప్రకటించలేదు. సత్తుపల్లి డీఎస్పీగా పని చేస్తూ బదిలీ అయిన అశోక్‌కుమార్‌ను ఖమ్మం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా, వైరా డీఎస్పీగా పని చేసిన సాయిశ్రీని ఖమ్మం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం డీఎస్పీగా బదిలీ చేశారు. మణుగూరులో డీఎస్పీగా పని చేసి న రవీందర్‌రావుకు వరంగల్ ఎస్బీ డీఎస్పీ గా పోస్టింగ్ ఇచ్చారు. ఖమ్మం ఎస్బీ డీఎస్పీ గా పని చేస్తున్న కే.వెంకట్రావ్‌ను హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశించారు. అలాగే ఖమ్మం ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్న కుమారస్వామిని వరంగల్ పీటీసీకి బదిలీ చేసి, ఆయన స్థానంలో సంజీవ్‌ను నియమించారు. -
42 సీఐల బదిలీ
పోలీసు శాఖ ఉత్తర్వులు వెల్లడించిన డీఐజీ మల్లారెడ్డి వెయిటింగ్లో తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లు వరంగల్ క్రైం :వరంగల్ రేంజ్ పరిధిలో మంగళవారం భారీగా ఇన్స్పెక్టర్ల(సీఐ) బదిలీలు జరిగారుు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఒకేసారి 101 మందిని బదిలీ చేస్తూ వరంగల్ రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారని డీఐజీ మల్లారెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లాలో 42 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యా రు. సీఐల బదిలీలకు సంబంధించి గత నెల 23న ‘సాక్షి’ కథనంలో ఇచ్చినట్లుగానే ఎక్కువ పోస్టింగ్‌లు ఖరారయ్యాయి. సాధారణ ఎన్నికల తర్వాత ఇన్స్పెక్టర్ల బదిలీలు జరగడం ఇదే మొదటిసారి. పోస్టింగ్‌ల విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలను ప్రాధాన్యం ఇచ్చినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 29 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీసు శాఖ అక్టోబర్ 17న ఉత్తర్వులు ఇచ్చింది. 24 గంటల్లోనే నిలిపివేసింది. మళ్లీ ఇప్పుడు బదిలీలు జరిగాయి. -
పోలీస్ అధికారులకు బదిలీ ఫీవర్
వరంగల్‌క్రైం : జిల్లా పోలీసు శాఖకు బదిలీ ఫీవర్ పట్టుకుంది. మితిమీరిన రాజకీయ జోక్యంతో తప్పుదోవపడుతోంది. పోలీస్ ఉన్నతాధికారులు బదిలీల జాబితా సిద్ధం చేయడం.. ఆ వెంటనే అధికార పార్టీ నేతలు కలుగజేసుకుని రద్దు చే రుుంచడం ఇటీవల మామూలైపోరుుంది. లక్షలు పోసి.. పోస్టింగ్ కొనుక్కుంటున్నప్పటికీ పోటీ తీవ్రస్థాయిలో ఉండడంతో సీటులో కూర్చున్నాక కూడా గ్యారంటీ లేకుండాపోతోంది. ప్రస్తుతం జరుగుతున్న పోలీసు శాఖలో పోస్టింగ్‌లు ప్రమాదకర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. లక్షల్లో డబ్బులు ముట్టజెప్పి పోస్టింగ్ తెచ్చుకోవడం.. ఆ తర్వాత జనాలను పీడించడం గత కొన్నేళ్లుగా జిల్లాలో జరుగుతూనే ఉంది. పోస్టింగ్‌లు.. వెనువెంటనే రద్దు.. ఇటీవల చేపట్టిన పోలీసు అధికారుల బదిలీల్లో ప్రతిష్టంభన నెలకొంది. అక్టోబర్ 17న వరంగల్ జిల్లాలో 14 మంది సీఐల బదిలీలు జరిగాయి. ఇందులో కొందరు లైఫ్‌లైన్ సర్వీస్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇది ప్రజాప్రతినిధులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో వారు రాజధానికి చేరుకుని ఏకంగా పోస్టింగ్‌లనే నిలిపి వేయించారు. కొందరు ప్రజాప్రతినిధులు మంచి స్థానాల్లో పోస్టింగ్‌లు ఇప్పిస్తామని పోలీసుల వద్ద లక్ష లాది రూపాయలు దండుకోవడమే ఇందుకు ఉదాహణ. ఆ తర్వాత నవంబర్ 17న జిల్లాలో 9 మంది డిఎస్పీలను బదిలీ చేశారు. ఒక్క జనగామ డీఎస్పీని మాత్రమే ముట్టుకోలేదు. ఎందుకంటే సదరు డీఎస్పీ రాష్ట్రంలోని కీలకమైన మంత్రికి క్లాస్మేట్ కావడమేనని పోలీసు వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మొదట 9 మంది డీఎస్పీలను బదిలీ చేసి ఆ తర్వాత పరకాల పోస్టింగ్‌ను నిలిపివేశారు. వెనువెంటనే గతంలో ఉన్న సంజీవరావునే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనేక మంది అధికారులు లక్షలాది రూపాయలు పోసి పోస్టింగ్‌లు కొనుక్కున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీస్‌శాఖలో డబ్బులు పెట్టుబడిగా పెట్టి పోస్టింగ్‌లు తెచ్చుకుని ఆ తర్వాత జనాలను పీడించి సంపాదించేకు సంస్కృతికి ఉద్యోగులు స్వస్తి పలుకాలని ప్రజలు కోరుతున్నారు. బ్యాంకు సొత్తు రికవరీతో ప్రతిష్ట పదిలం.. పోలీసింగ్‌లో దేశంలోనే ప్రత్యేకత కలిగిన వరంగల్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ భూపాలపల్లి, ఆజంనగర్ శాఖల్లో నవంబర్ 15న జరిగిన భారీ దోపిడీ మిస్టరీని త్వరగానే ఛేదిం చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడైన ఏపీజీవీబీ మెస్సేంజర్ వెలమ రాజేంద్రప్రసాద్ అలియూస్ రమేష్ కోసం వరంగల్ పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి దేశ వ్యాప్తంగా నిందితుల కోసం గాలించారు. ఎట్టకేలకు నిందితుడి కదలికలు గుర్తించి ఎనిమిది రోజుల్లో పట్టుకుని రూ.9.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందే అతడి భార్యను అదుపులోకి తీసుకుని దోపిడీ సొత్తులో 34 కిలోల బంగారం, రూ.2 లక్షలు రికవరీ చేశారు. బ్యాంకు దోపిడీ సొత్తును త్వరగా రికవరీ చేసి వరంగల్ పోలీసులు తమ సత్తాను మరోసారి చాటారు. -
ఖాకీల్లో ‘కుల'కలం
నిజాయతీ, క్రమశిక్షణ, కార్యదక్షత కలబోస్తే పోలీస్. అవార్డులు, రివార్డులు, ప్రమోషన్లు, పోస్టింగులు అన్నింటికీ ఇవే ప్రామాణికం. కానీ కొత్తగా ఈ అంశాల పక్కనే కులం వచ్చి చేరుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టింగ్‌ల్లో నేతల ప్రమేయం పెరిగిపోవడం, తాజాగా అయా నియోజకవర్గాల పోస్టింగ్‌ల విషయం ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టడంతో ఇది పలు మలుపు తిరిగి సామాజిక వర్గాల పోస్టింగ్‌లుగా మారుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజాయితీకి పెద్ద పీట వేయాల్సిన నేతలు, ప్రజాప్రతినిధులు వచ్చే అధికారి మన కులమా.. కాదా అని చూస్తుండడం, వారిపై ఎన్ని ఆరోపణలున్నా కులం ప్రతిపాదికన సిఫారసులు చేయడం వారికే చెల్లుతోంది. జిల్లాలో తాజాగా జరిగిన డీఎస్పీల బదిలీ నుంచి మొదలు పెడితే త్వరలో జరగనున్న ఎస్సైల బదిలీల వరకు ఎమ్మెల్యేలు వారి సామాజిక వర్గాల వారికే పెద్దపీట వేశారని తెలిసింది. అధికారుల పనితీరును పక్కన పెట్టి ఆయన మనవాడా.. కాదా అని చూస్తున్నారని, కులం కార్డుతోనే పోస్టింగ్‌ల కోసం ప్రతిపాదనలు చేస్తున్నారని ఇతర సామాజిక వర్గాలకు చెందిన పలువురు అధికారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో వారి సామాజిక వర్గానికి తప్ప మరో వర్గానికి చెందిన అధికారిని సిఫారసు చేయలేదని తెలిసింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వారి సామాజిక వర్గాలకు చెందిన వారిని డీఎస్పీలుగా నియమించుకున్నారు. రెండు వారాల క్రితం ఓ ఎస్సై ఓ ఎమ్మెల్యే వద్దకు వెళ్లి తనకు ఆయన నియోజకవర్గంలో పోస్టింగ్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. దానికి ఆ ఎమ్మెల్యే ఎస్సైకి సంబంధం లేకుండా జరిగిన విషయంతో పాటు సామాజికవర్గం కనుక్కుని మరోచోట ప్రయత్నం చేయాలని సూచించిన ట్లు తెలిసింది. సామాజికవర్గం తక్కువ కావడం వల్ల తనకు అక్కడ పోస్టింగ్ దక్కే అవకాశం లేదని సదరు ఎస్సై సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఇలా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు కోరుకున్న చోట పోస్టింగ్‌కు అవకాశం కొట్టేయగా, మరికొందరు ఇబ్బం దులు పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో 68 పోలీస్ స్టేషన్లున్నాయి. వీటిలో సుమారు వంద మంది ఎస్సైలు పని చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 22న శిక్షణ పూర్తి చేసుకున్న 2012 బ్యాచ్‌కు చెందిన 37 మంది ప్రొబేషరీ ఎస్సైలతో పాటు 87 మందిని బదిలీ చేశారు. వీరిలో శిక్షణ ఎస్సైలు పలువురు కీలమైన పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. గత 11 నెలలుగా వీరు విధులు నిర్వహిస్తున్నారు. కొత్తగా పోస్టింగ్‌లు పొందిన పలువురు ఎస్సైలపై పలు ఆరోపణలున్నాయి. 87 మంది పోస్టింగ్‌ల్లో సుమారు ఎనిమిది మంది ఇతర విభాగాలకు బదిలీ చేసుకున్నారు. మరో ఇద్దరు వివిధ కారణాలతో సస్పెండయ్యారు. ఖాళీ అయిన పలు పోలీస్ స్టేషన్లలో వెంటనే ఇన్చార్జి ఎస్సైలను నియమించారు. ప్రస్తుతం ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్న వారే పూర్తిస్థాయి ఎస్సైలుగా పోస్టింగ్‌లు పొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని పలు పట్టణాల్లో, జిల్లా కేంద్రంలో పని చేస్తున్న ఎస్సైల్లో పలువురు రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. వీరికి కూడా పోస్టింగ్‌లు తప్పనిసరిగా మారింది. నేతల చుట్టూ ప్రదక్షిణలు మంచి అధికారులను ఎంపిక చేసుకుని నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించడంతో ఒక్కసారిగా ఆశావాహులు వారికి అనుకూలంగా ఉన్న నేతల వద్ద వాలిపోయారు. సామాజిక అంశాలను తెరపైకి తేస్తూ ఉన్నత స్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరు నేతలే తమ దేవుళ్లు అన్నట్టుగా వారి కరుణ కోసం పాడరాని పాట్లు పడుతున్నారు. సామాజిక వర్గాల వారీగా కూడా ఎమ్మెల్యే వద్ద క్యూ పెరిగిపోవడంతో ఇదే అదనుగా కొందరు నేతలు బేరసారాలకు దిగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈసారి కోరుకున్న స్థానం దక్కకపోతే మరో రెండేళ్ల పాటు ఎదురుచూడాల్సి వస్తుందని, అందువల్ల ఎంతైనా ఖర్చయినా పెట్టేందుకు కొందరు సిద్ధపడినట్లు పోలీస్ వర్గాలే చెప్పుకుంటున్నాయి. వివాదాస్పదమైన బదిలీలు వారం రోజుల క్రితం వరంగల్ రీజియన్ పరిధిలో 21 మంది సీఐల బదిలీ జరిగింది. ఈ బదిలీలపై పలు ఆరోపణలు రావడంతో పాటు సదరు సీఐలంటే ఇష్టంలేని కొందరు నేతలు రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పారు. దీంతో బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన కొన్ని గంటల్లోనే ఎక్కడివారేక్కడే ఉండాలని మౌఖికంగా అదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసిన తొలి బదిలీలు వివాదాస్పదంగా నిలిచిపోయాయి. జిల్లాలో గతంలో ఎస్సైల బదిలీలు కూడా చేసినట్టే చేసి నిలిపివేశారు. ఈసారి అలా కాకుండా ఆయా నియోజకవర్గాల నేతల నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే బదిలీ చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. మళ్లీ మళ్లీ ఇబ్బందులు రాకుండా బదిలీ చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చారని తెలిసింది. ఈసారి జరగనున్న బదిలీలు పక్కా రాజకీయ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఏ ఎస్సై ఏ మండలానికి వెళ్తుతున్నాడో ముందే ప్రచారంలో ఉంది. జిల్లాలో సీఐల పోస్టింగ్‌లు కూడా ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరో రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తుండడంతో ఈ నెలాఖరు వరకు ఎస్సైలను, సీఐలను పెద్ద ఎత్తున బదిలీలు చేయనున్నట్టు సమాచారం. -
ఉద్యోగం ఇచ్చారు.. పోస్టింగ్ ఆపారు..
అతడొక అభాగ్యుడు. ఆకలితో నకనకలాడుతున్నాడు. నోటి వద్దకు అన్నం ముద్ద వచ్చింది. ప్రాణం లేచొచ్చింది. ఆవురావురుమంటూ తినేందుకు నోరు తెరిచాడు... అంతలోనే ఆ ముద్ద వెనక్కి జరిగింది. అది ముందుకు రాదు.. వెనక్కు వెళ్లదు..! ఇక, ఆ అభాగ్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇలాంటి అభాగ్యులు మన జిల్లాలో 35మంది ఉన్నారు. వారి నోటి కాడి ముద్ద ఎలా దూరం దూరంగా జరిగిందో చదవండి. - ఖమ్మం జడ్పీసెంటర్ ఇదీ నేపథ్యం జిల్లావ్యాప్తంగా 83 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకిగాను ఏపీపీఎస్సీ ద్వారా గత ఏడాది డిసెంబర్ 31ననోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 23న పరీక్షలు జరిగారుు. మార్చి 24న ఫలితాలు వెలువడ్డాయి. అర్హులైన అభ్యర్థుల ధ్రువపత్రాలను జూన్ 9న జిల్లాపరిషత్ అధికారులు పరిశీలించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 83 పోస్టులను భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు వచ్చారుు. జూలై 11న 83 మంది అభ్యర్థులకు అధికారులు నియూమక పత్రాలు (అపాయింట్మెంట్ లెటర్లు) ఇచ్చారు. వీరిలో 35మందిని ఏడు (పోలవరం ముంపు) మండలాలకు కేటారుుంచారు. వీరిని మినహారుుం చి, మిగతా 48మందికి పోస్టింగ్ ఇచ్చారు. విభజనతో బ్రేక్ రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రాకు వెళ్లడంతో ఈ 35మంది పోస్టింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. వీరికి పోస్టింగ్ ఎలా ఇవ్వాలో స్పష్టత ఇవ్వాలంటూ అప్పటి కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి జవాబు రాలేదు. ఈ అభ్యర్థులు నాటి నుంచి.. అంటే, గత ఐదు నెలలుగా పోస్టింగ్ కోసం జిల్లాపరిషత్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారులను కలిసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని వీరు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయూంలో ఈ పరీక్షలు జరిగారు. 35 పోస్టులు ఏపీకి వెళ్లారుు. మిగిలిన 48 పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చారుు’’ అని, జిల్లాపరిషత్ అధికారులు చెబుతున్నారు. అపారుుంట్‌మెంట్ లెటర్లు అందుకున్న మిగిలిన 35మందికి పోస్టింగ్ కేటారుుంపు విషయమై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని వారు అంటున్నారు. జిల్లా పరిషత్‌లో నిరసన ఐదు నెలలుగా కాళ్లరిగేలా తిరుగుతున్నప్పటికీ తమను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఈ 35మంది అభ్యర్థులు గురువారం జిల్లాపరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమతోపాటు అపారుుంట్‌మెంట్ లెటర్లు తీసుకున్న 48మంది ఉద్యోగం చేస్తుండగా, తాము మాత్రం ఇలా చెప్పులరిగేలా తిరుగుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీరి వద్దకు డీపీవో రవీందర్, జిల్లాపరిషత్ ఏఓ వచ్చి సర్దిచెప్పేందుకు యత్నించారు. ‘‘35 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రభుత్వం నిర్ణయూనుసారం చర్యలు తీసుకుంటాం’’ అని, వారు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వైఖరి కారణంగానే తాము ఇబ్బందులు పడుతున్నామని అభ్యర్థులు అన్నారు. వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. -
పంచాయతీ కార్యదర్శుల నియామకానికి కౌన్సెలింగ్
జిల్లాలో 48 మందికి పోస్టింగ్‌లు ఖమ్మం జెడ్పీసెంటర్: పంచాయతీ కార్యదర్శులు 48 మందికి జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బాబురావు పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ ఏడాది మార్చి 23న ఏపీపీఎస్సీ నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షల్లో అర్హత సాధించి అపాయింట్మెంట్ పొందిన వారికి ఇప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 83 పోస్టులకు గాను 83 మంది అర్హత సాధించారు. వీరిలో ఒక అభ్యర్థి ఎంపికైన తర్వాత ఉద్యోగం వద్దని చెప్పడంతో 82 మంది మిగిలారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరగడంతో పోస్టింగ్‌లు నిలిపివేశారు. జిల్లాలో 7 మండలాలు ఆంధ్రలో వీలినం కావడంతో అక్కడ 35 పోస్టులను భర్తీ చేయడానికి వీలు లేకపోవడంతో చివరకు అధికారులు ప్రభుత్వనికి లేఖ రాశారు. దీంతో మిగిలిన మండలాల్లో 48 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో 82 మంది అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా 48 మందికి కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్‌లు ఇచ్చారు.