పుంజుకున్న నియామకాలు | Hiring activity witnesses 3 per cent uptick with end of third wave | Sakshi
Sakshi News home page

పుంజుకున్న నియామకాలు

Published Fri, Mar 11 2022 5:14 AM | Last Updated on Fri, Mar 11 2022 5:14 AM

Hiring activity witnesses 3 per cent uptick with end of third wave - Sakshi

ముంబై: నియామకాలు జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో 3 శాతం పెరిగినట్టు మాన్‌స్టర్‌ ఎంప్లాయిమెంట్‌ ఇండెక్స్‌ తెలిపింది. హైదరాబాద్‌లో 6 శాతం అధికంగా పోస్టింగ్‌లు నమోదయ్యాయి. కరోనా మూడో విడత ముగిసిపోవడంతో దాదాపు అన్ని పరిశ్రమలు నియామకాల పరంగా వృద్ధి చూపించినట్టు తెలిపింది. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా నియామకాలు 7 శాతం పెరిగినట్టు వెల్లడించింది. బీపీవో/ఐటీఈఎస్‌ రంగంలో 11 శాతం అధిక నియామకాలు నమోదయ్యాయి. ఎన్నో రంగాల్లో డిజిటైజేషన్‌ను అనుసరించడం నిపుణులకు డిమాండ్‌ను పెంచినట్టు వివరించింది. మాన్‌స్టర్‌ ఇండియాలో నమోదయ్యే ఉద్యోగ పోస్టింగ్‌ల ఆధారంగా ఈ సంస్థ ప్రతి నెలా ‘మాన్‌స్టర్‌ ఎంప్లాయిమెంట్‌ ఇండెక్స్‌’ విడుదల చేస్తుంటుంది.  

రంగాల వారీగా చూస్తే..
► షిప్పింగ్‌/మెరైన్‌ రంగంలో 9 శాతం, ఉత్పత్తి, తయారీలో 9 శాతం నియామకాలు పెరిగాయి. పీఎల్‌ఐ పథకం, పీఎం గతిశక్తి, మ్యారిటైమ్‌ విజన్‌ 2030 సానుకూలించాయి.
► అన్ని స్థాయిల్లోని నిపుణులకు డిమండ్‌ స్థిరంగా ఉంది. మాన్‌స్టర్‌ నివేదికను పరిశీలిస్తే అన్ని పట్టణాల్లోనూ నిపుణులకు డిమాండ్‌ పెరిగింది.
► ఉద్యోగాల పోస్టింగ్‌లలో ఢిల్లీ 13 శాతంతో ముందుంటే, ముంబై 8 శాతం, అహ్మదాబాద్‌ 7 శాతం, చెన్నై 7 శాతం, హైదరాబాద్‌ 6 శాతం, కోయింబత్తూరు 6 శాతం, బెంగళూరు, జైపూర్‌లో 6 శాతం చొప్పున అధిక పోస్టింగ్‌లు దాఖలయ్యాయి.   
► లాక్‌డౌన్లు, ఆంక్షల భయంతో నియామకాలు జనవరిలో తగ్గగా.. ఫిబ్రవరిలో పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement