Monster Employment Index
-
దేశంలో 5జీ సేవలు, జాబ్ మార్కెట్లో సరికొత్త జోష్!
ముంబై: మాంద్యం, ద్రవ్యోల్బణ భయాలతో అంతర్జాతీయంగా రిక్రూట్మెంట్ మందగిస్తున్నప్పటికీ .. దేశీయంగా మాత్రం పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. చాలా నెలల పాటు అనిశ్చితిలో కొట్టుమిట్టాడిన జాబ్ మార్కెట్ ప్రస్తుతం స్థిరపడుతోంది. నియామకాలకు డిమాండ్ పుంజుకుంటోంది. తాము నిర్వహించే ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ (ఎంఈఐ)ప్రకారం నెలవారీగా జాబ్ పోస్టింగ్‌లు జులైలో ఒక్క శాతం పెరిగినట్లు కన్సల్టెన్సీ సంస్థ మాన్‌స్టర్‌డాట్‌కామ్ తెలిపింది. నామమాత్రం పెరుగుదలే అయినప్పటికీ ఉద్యోగాల మార్కెట్ కాస్త స్థిరపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా (బీఎఫ్ఎస్ఐ), కెమికల్స్/ప్లాస్టిక్/రబ్బర్, పెయింట్లు, ఎరువులు/క్రిమి సంహారకాలు మొదలైన పరిశ్రమల్లో నియామకాలపై ఆసక్తి నెలకొంది. ఇక పెరుగుతున్న డిజిటైజేషన్, 5జీ సర్వీసులను ప్రవేశపెట్టనుండటం వంటి అంశాల నేపథ్యంలో టెలికం రంగంలోనూ హైరింగ్ జోరు కనిపించింది. పండుగ సీజన్ వస్తుండటంతో రిటైల్ రంగంలోనూ నియామకాలకు డిమాండ్ నెలకొన్నట్లు సంస్థ సీఈవో శేఖర్ గరిశ తెలిపారు. చదవండి👉 5జీ మాయాజాలం: ఎయిర్టెల్ వర్సెస్ జియో..వెయ్యి నగరాల్లో! -
ఉద్యోగ నియామకాలు పెరిగాయ్, ఏ రంగంలో ఎంత పెరిగాయంటే!
ముంబై: దేశీయంగా జూన్‌లో నియామకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 3 శాతం పెరిగాయి. మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ ప్రకారం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), యాత్రలు, పర్యాటకం, రసాయన పరిశ్రమల్లో నియామకాల అధికమయ్యాయి. సుస్థిర ఆర్థిక రంగం, పర్యావరణ అనుకూల విభాగాలు, ఆతిథ్యంలోనూ ఈ జోరు సాగింది. మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ 271 నుంచి గత నెలలో 279కి ఎగసింది. మే నెలలో ఇండెక్స్ 284 పాయింట్లు నమోదు చేసింది. మీడియా, ఎంటర్టైన్మెంట్ 26 శాతం, ఇంజనీరింగ్, సిమెంట్, నిర్మాణం, ఐరన్/స్టీల్ రంగాలు 20 శాతం తిరోగమనం చెందాయి. -
ఏప్రిల్‌లో నియామకాల జోరు
ముంబై: వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడుతున్న నేపథ్యంలో నియామకాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో హైరింగ్ 15% పెరిగింది. మాన్స్టర్ ఇండియా తమ పోర్టల్‌లో నమోదయ్యే ఉద్యోగాల వివరాలను విశ్లేషించి, రూపొందించే మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ సూచీ (ఎంఈఐ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో (బీఎఫ్ఎస్ఐ) నియామకాలు అత్యధికంగా 54% వృద్ధి చెందాయి. కోవిడ్ మహమ్మారితో కుదేలైన రిటైల్ రంగంలో హైరింగ్ రెండంకెల స్థాయి వృద్ధితో గణనీయంగా కోలుకుంది. 47% పెరిగింది. అలాగే తయారీ రంగం, ట్రావెల్ .. టూరిజం, ఎగుమతులు.. దిగుమతులు మొదలైన విభాగాలు కూడా మెరుగుపడ్డాయి. రెండేళ్ల తర్వాత మళ్లీ రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించాయి. తయారీ రంగంలో నియామకాలు 35% మేర పెరిగాయి. ఆంక్షల సడలింపుతో రిటైల్‌కు ఊతం.. బీఎఫ్ఎస్ఐలో ఉద్యోగాల కల్పన యథాప్రకారంగానే కొనసాగుతుండగా, పలు భౌతిక స్టోర్స్ తిరిగి తెరుచుకోవడంతో రిటైల్ రంగంలోనూ నియామకాలు గణనీయంగా పెరిగాయి. ప్రథమ శ్రేణి నగరాల్లో హైరింగ్ జోరుగా ఉండగా, ద్వితీయ శ్రేణి మార్కెట్లో నియామకాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ముంబైలో హైరింగ్ డిమాండ్ అత్యధికంగా 29% స్థాయిలో నమోదైంది. కోయంబత్తూర్ (25% అప్), చెన్నై (21%), బెంగళూరు (20%), హైదరాబాద్ (20%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
పుంజుకున్న నియామకాలు
ముంబై: నియామకాలు జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో 3 శాతం పెరిగినట్టు మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్ తెలిపింది. హైదరాబాద్‌లో 6 శాతం అధికంగా పోస్టింగ్‌లు నమోదయ్యాయి. కరోనా మూడో విడత ముగిసిపోవడంతో దాదాపు అన్ని పరిశ్రమలు నియామకాల పరంగా వృద్ధి చూపించినట్టు తెలిపింది. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా నియామకాలు 7 శాతం పెరిగినట్టు వెల్లడించింది. బీపీవో/ఐటీఈఎస్ రంగంలో 11 శాతం అధిక నియామకాలు నమోదయ్యాయి. ఎన్నో రంగాల్లో డిజిటైజేషన్‌ను అనుసరించడం నిపుణులకు డిమాండ్‌ను పెంచినట్టు వివరించింది. మాన్స్టర్ ఇండియాలో నమోదయ్యే ఉద్యోగ పోస్టింగ్‌ల ఆధారంగా ఈ సంస్థ ప్రతి నెలా ‘మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్’ విడుదల చేస్తుంటుంది. రంగాల వారీగా చూస్తే.. ► షిప్పింగ్/మెరైన్ రంగంలో 9 శాతం, ఉత్పత్తి, తయారీలో 9 శాతం నియామకాలు పెరిగాయి. పీఎల్ఐ పథకం, పీఎం గతిశక్తి, మ్యారిటైమ్ విజన్ 2030 సానుకూలించాయి. ► అన్ని స్థాయిల్లోని నిపుణులకు డిమండ్ స్థిరంగా ఉంది. మాన్స్టర్ నివేదికను పరిశీలిస్తే అన్ని పట్టణాల్లోనూ నిపుణులకు డిమాండ్ పెరిగింది. ► ఉద్యోగాల పోస్టింగ్‌లలో ఢిల్లీ 13 శాతంతో ముందుంటే, ముంబై 8 శాతం, అహ్మదాబాద్ 7 శాతం, చెన్నై 7 శాతం, హైదరాబాద్ 6 శాతం, కోయింబత్తూరు 6 శాతం, బెంగళూరు, జైపూర్‌లో 6 శాతం చొప్పున అధిక పోస్టింగ్‌లు దాఖలయ్యాయి. ► లాక్డౌన్లు, ఆంక్షల భయంతో నియామకాలు జనవరిలో తగ్గగా.. ఫిబ్రవరిలో పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి. -
ఆ రంగాలలో ఉద్యోగులకు భారీ డిమాండ్..!
ముంబై: నియామకాలు 2021 డిసెంబర్ నెలలో అంతకుముందు నెలతో పోలిస్తే 2 శాతం పెరిగాయి. రిటైల్, ఆగ్రో ఆధారిత పరిశ్రమల్లో ఉద్యోగులకు పెరిగిన డిమాండ్ ఇందుకు తోడ్పడింది. ఈ వివరాలను ‘మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్’ నివేదిక ప్రకటించింది. ఈ రెండు పరిశ్రమల్లో నియామకాలు 2020 డిసెంబర్‌తో పోలిస్తే 12 శాతం పుంజుకున్నట్టు తెలిపింది. నెలవారీగా చూస్తే డిసెంబర్లో హెల్త్‌కేర్ రంగంలో 6 శాతం మేర నియామకాలు పెరిగాయి. కరోనా కేసులు పెరగడం ఈ రంగంలో నియామకాలకు తోడ్పడింది. అలాగే, హెచ్ఆర్, అడ్మిన్ విభాగాల్లో నియామకాలు కూడా 5 శాతం పెరిగాయి. ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాల్లో 4 శాతం వృద్ధి కనిపించింది. ఆరంభ స్థాయి, మధ్యస్థాయి ఉద్యోగాలకు డిమాండ్ డిసెంబర్లో 2 శాతం పెరిగింది. ఎఫ్ఎంసీజీ, ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ రంగంలో 7 శాతం, ప్రింటింగ్, ప్యాకేజింగ్‌లో 7 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో 5 శాతం చొప్పున నెలవారీగా ఉద్యోగుల నియామకం అధికంగా నమోదైంది. 2022పై అప్రమత్త ధోరణి అన్ని రంగాల్లోనూ భవిష్యత్తు రికవరీ పట్ల 2021 డిసెంబర్ గణాంకాలు ఆశలు కల్పించాయని మాన్స్టర్ డాట్ కామ్ సీఈవో శేఖర్ గరీశ తెలిపారు. అయితే, 2022లో ఉద్యోగ నియామకాలపై మహమ్మారి ప్రభావం దృష్ట్యా మాన్స్టర్ డాట్ కామ్ అప్రమత్త ధోరణితో ఉన్నట్టు చెప్పారు. ఇక 2021 డిసెంబర్లో రియల్ ఎస్టేట్ రంగంలోనూ నియామకాలు 6 శాతం పెరిగాయి. బయోటెక్నాలజీ, పార్మా రంగాల్లో 4 శాతం, ఐటీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లో 3 శాతం చొప్పున అధిక నియామకాలు జరిగాయి. ఈ రంగాల్లో క్షీణత టెలికం/ఐఎస్పీ రంగంలో 2021 డిసెంబర్లో 9 శాతం మేర నియామకాలు తక్కువగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, సిమెంట్, నిర్మాణం, ఐరన్/స్టీల్ రంగంలో 7 శాతం మేర నెలవారీగా తక్కువ నియామకాలు నమోదయ్యాయి. అలాగే, షిప్పింగ్, మెరైన్, లాజిస్టిక్స్, కొరియర్/ఫ్రైట్, ట్రాన్స్‌పోర్టేషన్, ట్రావెల్, టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో 1 శాతం చొప్పున క్షీణత కనిపించింది. హైదరాబాద్‌లో 4 శాతం వృద్ధి మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్ 13 పట్టణాల్లో నియామకాలను పరిగణనలోకి తీసుకోగా, ఇందులో 11 పట్టణాల్లో ఆశావహ పరిస్థితి కనిపించింది. హైదరాబాద్ మార్కెట్లో 4 శాతం, బెంగళూరులో 5 శాతం, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లోనూ 4 శాతం, పుణెలో 3 శాతం, కోల్‌కతాలో, చెన్నై, కోచి, జైపూర్ నగరాల్లో 3 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ఈ పట్టణాలు అన్నీ కూడా నవంబర్ నెలకు క్షీణత చూశాయి. -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాల కోసం ప్రకటనలు జూలైతో పోలిస్తే ఆగస్ట్‌లో ఒక శాతం పెరిగాయి. మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ ప్రకారం.. ‘గతేడాదితో పోలిస్తే క్రితం నెలలో ఉద్యోగ ప్రకటనలు 14 శాతం అధికమయ్యాయి. ఆన్లైన్ నియామకాలు జూలైతో పోలిస్తే ఆగస్ట్‌లో దుస్తులు, వస్త్రాలు, లెదర్, రత్నాలు, ఆభరణాల విభాగంలో 24 శాతం, మార్కెటింగ్, కమ్యూనికేషన్ 17, తయారీ 8, చమురు, సహజవాయువు, పెట్రోలియం, విద్యుత్ 6, నౌకాశ్రయం, సముద్ర సంబంధ 4, బీపీవో, ఐటీఈఎస్ విభాగాల్లో 3 శాతం పెరిగాయి. కస్టమర్ సర్వీస్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, టెలికం 2 శాతం, ఆతిథ్యం, యాత్రలు 1 శాతం అధికమయ్యాయి. ఆరోగ్యం, ఆర్థిక, అకౌం ట్స్ విభాగాల్లో ఎటువంటి వృద్ధి నమోదు కాలేదు. పండుగల సీజన్ సమీపిస్తుండడం ప్రకటనలు పెరగడానికి కారణం. వస్త్ర పరిశ్రమకూ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి కేబినెట్ ఆమోదంతో ఈ రంగం మరింతగా వృద్ధి చెందనుంది. రాబోయే నెలల్లోనూ.. ఇంజనీరింగ్, సిమెంట్, నిర్మాణం, ఉక్కు రంగాలు 7 శాతం, వ్యవసాయ సంబంధ 6, ఎఫ్ఎంసీజీ, ఆహారం, ప్యాకేజ్డ్ ఫుడ్ 5, రవాణా, కొరియర్ 4 శాతం తగ్గాయి. కోవిడ్–19 సెకండ్ వేవ్ నుండి భారత్ కోలుకోవడంతో ఈ ఏడాది ఆగస్ట్‌లో ఉద్యోగ నియామకాలలో సానుకూల, స్థిరమైన వృద్ధి ఉంది. నియామకాల విషయంలో మెట్రో నగరాల్లో మే నెల నుంచి స్థిరమైన పెరుగుదల కొనసాగుతోంది. ఇక నగరాల వారీగా చూస్తే నియామకాలు హైదరాబాద్, ముంబై, చెన్నైలో ఒక్కో నగరంలో 3 శాతం, కోయంబత్తూరులో 2 శాతం అధికమయ్యాయి. కొచ్చి, కోల్‌కతా 4 శాతం, చండీగఢ్, జైపూర్ 1 శాతం తగ్గాయి’ అని మాన్స్టర్.కామ్ వివరించింది. పండుగల సీజన్‌తోపాటు కాలానుగుణ డిమాండ్‌తో రాబోయే నెలల్లో నియామక కార్యకలాపాలు వృద్ధి చెందుతాయని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. -
జూలైలో జాబ్స్ పెరిగాయ్..రానున్న రోజుల్లో..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జూన్‌తో పోలిస్తే జూలైలో నియామకాలు 4 శాతం పెరిగాయని మాన్స్టర్.కామ్ వెల్లడించింది. మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ ప్రకారం.. గతేడాదితో పోలిస్తే జూలైలో జాబ్ పోస్టింగ్స్ 8 శాతం అధికమయ్యాయి. 2021 జూన్‌తో పోలిస్తే గత నెలలో ట్రావెల్, టూరిజం విభాగంలో 16 శాతం, షిప్పింగ్, మెరైన్ 14, ఆఫీస్ ఎక్విప్మెంట్, ఆటోమేషన్ 9, రియల్ ఎస్టేట్‌లో నియామకాలు 9 శాతం పెరిగాయి. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలో 8 శాతం, హైదరాబాద్, పుణే 7, చెన్నై 6, బెంగళూరులో 6 శాతం అధికమయ్యాయి. 0–3 ఏళ్ల అనుభవం కలిగిన ఎంట్రీ లెవెల్ ఉద్యోగ నియామకాలు 5 శాతం పెరిగాయి. మధ్యస్థ (4–6), మిడ్–సీనియర్ ప్రొఫెషనల్స్ (7–10) కోసం నియామకాలు 7 శాతం పెరిగితే, సీనియర్ ప్రొఫెషనల్స్ (11–15) కోసం 4 శాతం అధికం అయ్యాయి. టాప్ మేనేజ్మెంట్ కోసం నియామకాలు స్థిరంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో సానుకూల వాతావరణం ఉంటుందనడానికి ఈ గణాంకాలే ఉదాహరణ అని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రాచెల్ స్టెల్లా రాజ్ తెలిపారు. చదవండి : బంగారంలోనూ భారీగా తగ్గిన లావాదేవీలు -
4 శాతం పెరిగిన ఉద్యోగాలు: హైదరాబాద్‌లో ఎంతంటే?
సాక్షి, ముంబై: కరోనా రెండో విడత కారణంగా ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రభావం పడినప్పటికీ, జూన్ మాసంలో ఉద్యోగ నియామకాలు పెరిగినట్టు ‘మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్’ అనే నివేదిక తెలియజేసింది. మాన్స్టర్ డాట్ కామ్ ఈ నివేదికను విడుదల చేసింది. కరోనా రెండో దశ, లాక్డౌన్లు ఉన్నప్పటికీ గడిచిన ఆరు నెలల్లో అన్ని రంగాల్లోనూ ఉద్యోగాల్లో వృద్ధి నెలకొన్నట్టు తెలిపింది. 2021 మే నెలతో పోలిస్తే జూన్ నెలలో ఉద్యోగ నియామకాల్లో 4 శాతం వృద్ధి నమోదైనట్టు పేర్కొంది. అదే వార్షికంగా 2020 జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో ఉద్యోగ నియామకాలు 7 శాతం పెరిగినట్టు తెలిపింది. రానున్న రోజుల్లో ఆశావహ పరిస్థితులు ఉండొచ్చని అంచనా వేసింది. ఆన్లైన్లో ఉద్యోగ ప్రకటనలు, నియామకాల గణాంకాల ఆధారంగా మాన్స్టర్ సంస్థ ఈ నివేదికను రూపొందిస్తుంటుంది. రంగాల వారీగా.. మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్ 27 రంగాలకు సంబంధించిన గణాంకాలను ప్రతీ నెలా తన అంచనాల్లోకి తీసుకుంటుంది. జూన్‌లో అన్ని రంగాల్లోనూ ఉద్యోగ నియామకాలు మే నెలతో పోలిస్తే సానుకూలంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. దిగుమతులు, ఎగుమతుల రంగంలో 25 శాతం, తయారీ (14 శాతం), షిప్పింగ్, మెరైన్ (11 శాతం),హెల్త్‌కేర్, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ (10 శాతం) వృద్ధిని చూపించినట్టు వెల్లడించింది. బీఎఫ్ఎస్ఐ, టెలికం, రియల్ ఎస్టేట్, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లోనూ నియామకాలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొంది. పర్యాటకం, రవాణా రంగంలోనూ మే నెలతో పోలిస్తే 3 శాతం మేర నియామకాలు పెరిగినట్టు తెలిపింది. ఎఫ్ఎంసీజీ, ఆగ్రో పరిశ్రమలు, ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రింటింగ్ పరిశ్రమలు నియామకాల్లో ఒక శాతం వృద్ధిని చూపించాయి. వడోదరాలో 9 శాతం, పుణె, కోయింబత్తూర్, చండీగఢ్ తదితర నగరాల్లో నియామకాలు 6 శాతం మేర పుంజుకోగా, బెంగళూరులో 2 శాతం, హైదరాబాద్‌లో ఒక శాతం మేర పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. -
ఉద్యోగంలో సంతృప్తి.. కానీ, వేతనంపైనే..
ముంబై: వేతన జీవులు తాము చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, తాము పొందుతున్న వేతనం విషయంలో మాత్రం అంత సంతోషంగా లేరని ‘మాన్స్టర్ వేతన సూచీ’ నివేదిక పేర్కొంది. తాము చేస్తున్న ఉద్యోగం పట్ల 75 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నారు. కానీ, చెల్లింపుల పట్ల సంతోషం కనిష్ట స్థాయికి చేరిందని, 21.6 శాతం తగ్గిందని ఈ నివేదిక తెలిపింది. 2016 జనవరి నుంచి 2018 డిసెంబర్ వరకు మూడేళ్ల కాలంలో వేతన చెల్లింపుల డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఉద్యోగం పట్ల అంత సంతోషంగా ఉండడానికి, సహచర ఉద్యోగులు, ఉన్నతోద్యోగులతో వారికున్న మంచి సంబంధాలే కారణమట. నిర్మాణ రంగం, టెక్నికల్ కన్సల్టెన్సీ, హెల్త్‌కేర్ సర్వీసెస్, సామాజిక సేవ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సర్వీసెస్, న్యాయ, మార్కెట్ కన్సల్టెన్సీ రంగాల్లోని వారు తమ ఉద్యోగాల పట్ల ఎక్కువ సంతృప్తితో ఉన్నారు. -
ఆన్లైన్ నియామకాల వృద్ధి10%: మాన్స్టర్.కామ్
న్యూఢిల్లీ: దేశంలో ఆన్లైన్ నియామకాలు సెప్టెంబర్‌లో 10 శాతం మేర పెరిగాయి. ఈ వృద్ధికి బీపీవో, లాజిస్టిక్స్, కస్టమర్ సర్వీస్ వంటి వివిధ రంగాలు తోడ్పాటునందించాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్‌లో 10 శాతం వృద్ధి నమోదయ్యింది. లాజిస్టిక్స్ రంగంలోని ఆన్లైన్ నియామకాలు 32 శాతం మేర పెరిగాయి. ఇక కస్టమర్ సర్వీసెస్ రంగ నిపుణుల నియామకం 66 శాతం మేర ఎగసింది. ఇక నగరాల వారీగా చూస్తే.. ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో కన్నా జైపూర్, అహ్మదాబాద్ వంటి టైర్-2 పట్టణాల్లో ఆన్లైన్ నియామకాల జోరు కొనసాగుతోంది. ఆన్లైన్ నియామకాల వృద్ధి జైపూర్‌లో 30 శాతంగా, అహ్మదాబాద్‌లో 29 శాతంగా ఉంటే.. ఢిల్లీలో 26 శాతంగా, ముంబైలో 23 శాతంగా నమోదయ్యింది. ఇక పర్యాటక రంగంలో 2013 డిసెంబర్ నుంచి చూస్తే తొలిసారిగా ఆన్లైన్ నియామకాల వృద్ధి 8 శాతం మేర తగ్గింది.