ముంబై: వేతన జీవులు తాము చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, తాము పొందుతున్న వేతనం విషయంలో మాత్రం అంత సంతోషంగా లేరని ‘మాన్‌స్టర్ వేతన సూచీ’ నివేదిక పేర్కొంది. తాము చేస్తున్న ఉద్యోగం పట్ల 75 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నారు. కానీ, చెల్లింపుల పట్ల సంతోషం కనిష్ట స్థాయికి చేరిందని, 21.6 శాతం తగ్గిందని ఈ నివేదిక తెలిపింది. 2016 జనవరి నుంచి 2018 డిసెంబర్ వరకు మూడేళ్ల కాలంలో వేతన చెల్లింపుల డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఉద్యోగం పట్ల అంత సంతోషంగా ఉండడానికి, సహచర ఉద్యోగులు, ఉన్నతోద్యోగులతో వారికున్న మంచి సంబంధాలే కారణమట. నిర్మాణ రంగం, టెక్నికల్ కన్సల్టెన్సీ, హెల్త్‌కేర్ సర్వీసెస్, సామాజిక సేవ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సర్వీసెస్, న్యాయ, మార్కెట్ కన్సల్టెన్సీ రంగాల్లోని వారు తమ ఉద్యోగాల పట్ల ఎక్కువ సంతృప్తితో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment