జూలైలో జాబ్స్‌ పెరిగాయ్..రానున్న రోజుల్లో..! | 4 Per Cent In Hiring Across All Metros Report Monster Employment Index | Sakshi
Sakshi News home page

Monster Employment Index: జూలైలో జాబ్స్‌ పెరిగాయ్..రానున్న రోజుల్లో..!

Published Fri, Aug 27 2021 7:57 AM | Last Updated on Fri, Aug 27 2021 8:02 AM

4 Per Cent In Hiring Across All Metros Report Monster Employment Index - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా జూన్‌తో పోలిస్తే జూలైలో నియామకాలు 4 శాతం పెరిగాయని మాన్‌స్టర్‌.కామ్‌ వెల్లడించింది. మాన్‌స్టర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఇండెక్స్‌ ప్రకారం.. గతేడాదితో పోలిస్తే జూలైలో జాబ్‌ పోస్టింగ్స్‌ 8 శాతం అధికమయ్యాయి. 

2021 జూన్‌తో పోలిస్తే గత నెలలో  ట్రావెల్, టూరిజం విభాగంలో 16 శాతం, షిప్పింగ్, మెరైన్‌ 14, ఆఫీస్‌ ఎక్విప్‌మెంట్, ఆటోమేషన్‌ 9, రియల్‌ ఎస్టేట్‌లో నియామకాలు 9 శాతం పెరిగాయి. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలో 8 శాతం, హైదరాబాద్, పుణే 7, చెన్నై 6, బెంగళూరులో 6 శాతం అధికమయ్యాయి. 0–3 ఏళ్ల అనుభవం కలిగిన ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగ నియామకాలు 5 శాతం పెరిగాయి. మధ్యస్థ (4–6), మిడ్‌–సీనియర్‌ ప్రొఫెషనల్స్‌ (7–10) కోసం నియామకాలు 7 శాతం పెరిగితే, సీనియర్‌ ప్రొఫెషనల్స్‌ (11–15) కోసం 4 శాతం అధికం అయ్యాయి. టాప్‌ మేనేజ్‌మెంట్‌ కోసం నియామకాలు స్థిరంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో సానుకూల వాతావరణం ఉంటుందనడానికి ఈ గణాంకాలే ఉదాహరణ అని టాలెంట్‌ అక్విజిషన్‌ అనలిస్ట్‌ రాచెల్‌ స్టెల్లా రాజ్‌ తెలిపారు. 

చదవండి : బంగారంలోనూ భారీగా తగ్గిన లావాదేవీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement