ఎస్పీ రాజకుమారి రిలీవ్! | SP rajakumari Reliev! | Sakshi
Sakshi News home page

ఎస్పీ రాజకుమారి రిలీవ్!

Published Fri, Jan 9 2015 12:48 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

ఎస్పీ రాజకుమారి రిలీవ్! - Sakshi

ఎస్పీ రాజకుమారి రిలీవ్!

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా గ్రామీణ ఎస్పీ బి.రాజకుమారిని రిలీవ్ చేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమెను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించారు. ఈ క్రమంలోనే రాజకుమారి బదిలీ అనివార్యమైంది. నెలరోజుల క్రితమే ఆమెను బదిలీ చేసినప్పటికీ, ఆమె స్థానే ఇన్‌చార్జిగా నియమించిన సుమతి పదవీ బాధ్యతలు స్వీకరించలేదు. దీంతో బాధ్యతల నుంచి రిలీవ్ కాలేదు.

ఈ క్రమంలో తాజాగా అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు ప్రక్రియ పూర్తికావడంతో తెలంగాణ ప్రభుత్వం రాజకుమారిని బదిలీ చేసింది. తదుపరి పోస్టింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2012 ఏప్రిల్ 16న రంగారెడ్డి ఎస్పీగా పోస్టింగ్ తీసుకున్న రాజకుమారి.. జిల్లా ప్రజల మన్ననలు పొందారు. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement