సాక్షి ప్రతినిధి ఖమ్మం : జిల్లా నుంచి పదిహేను రోజుల క్రితం బదిలీ అయిన డీఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. గతంలో బదిలీ అయిన ఐదుగురు డీఎస్పీలతో పాటు తాజాగా మరో ఇద్దరు బదిలీ అయ్యారు. గతంలో బదిలీ అయిన వారిలో ఇద్దరికి మాత్రం జిల్లాలోనే పోస్టింగ్ లభించింది. ఖమ్మం డీఎస్పీగా పని చేసి బదిలీ అయిన బాలకిషన్‌రావుకు ఇంటిలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా నియమించారు.
అయితే పోస్టింగ్ ఎక్కడో ప్రకటించలేదు. సత్తుపల్లి డీఎస్పీగా పని చేస్తూ బదిలీ అయిన అశోక్‌కుమార్‌ను ఖమ్మం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా, వైరా డీఎస్పీగా పని చేసిన సాయిశ్రీని ఖమ్మం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం డీఎస్పీగా బదిలీ చేశారు. మణుగూరులో డీఎస్పీగా పని చేసి న రవీందర్‌రావుకు వరంగల్ ఎస్‌బీ డీఎస్పీ గా పోస్టింగ్ ఇచ్చారు. ఖమ్మం ఎస్‌బీ డీఎస్పీ గా పని చేస్తున్న కే.వెంకట్రావ్‌ను హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశించారు. అలాగే ఖమ్మం ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్న కుమారస్వామిని వరంగల్ పీటీసీకి బదిలీ చేసి, ఆయన స్థానంలో సంజీవ్‌ను నియమించారు.
పలువురు డీఎస్పీల బదిలీ
Published Tue, Dec 9 2014 3:18 AM | Last Updated on Fri, May 25 2018 5:52 PM
Advertisement
Advertisement